thu cha thappakundaa ante emiti?

97 views
Skip to first unread message

Ranga Sai Mamidenna

unread,
Jun 24, 2009, 12:35:38 PM6/24/09
to telug...@googlegroups.com
వందే  మాతరం
74 సం వత్సరాల  వ్రుధ్ధుణ్ణి.  ఈమధ్యనే  ఈ  బ్లాగు లో  చేరాను  కానీ  ఏమీ అర్ధం  కావటం లేదు అంటే  నా  బ్లాగు  నంబరు  ఎంత  వగైరాలు తెలియవు.
ఇది  నా  మొదటి ఉత్తరం.  నా  బ్లాగు  నంబరు  నా  పెజీ  లాంటి  వివరాలు  ఎలా తెలుసుకోవాలి ?
మరొకటి  మనం  తు  చ   తప్పకుండా  అని అంటూంటాం  రాస్తుంటాం  కూడా  ఈ  తూ  చా  అంటే  ఏమిటి?
మా  వెం  రంగశాయి

--

Sirish Kumar Tummala

unread,
Jun 24, 2009, 1:13:51 PM6/24/09
to telug...@googlegroups.com
రంగశాయి గారూ,
నమస్కారం.
మీరు చేరిన ఈ వెబ్‌సైటును గూగుల్ గుంపు అంటారు. ఇది బ్లాగు కాదు. బ్లాగులకు సంబంధించిన వివిధ విషయాలపై సభ్యులు ఈ గుంపులో చర్చించుకుంటారు. బ్లాగు అనేది ఎవరికివారు స్వంతంగా ఏర్పరచుకుని, నిర్వహించుకునే వెబ్‌సైటు. మీరూ ఒక బ్లాగును తయారుచేసుకోవచ్చు. blogger.com, wordpress.com మొదలైన వెబ్‌సైట్లకు వెళ్ళి ఉచితంగా బ్లాగును సృష్టించుకోవచ్చు. మీరు పై వెబ్‌సైట్లకు వెళ్ళి పరిశీలిస్తే మీకు అవగతమౌతుంది. పెద్ద శ్రమలేకుండానే బ్లాగును తయారుచేసుకోవచ్చు. సృష్టిచుకున్నాక మీ బ్లాగు అడ్రసు ఇలా వస్తుంది - yourblog.blogspot.com / yourblog.wordpress.com

తు చ లకు సంబంధించి గతంలో ఈ గుంపులో చర్చ జరిగింది. ఆ చర్చను ఈ లింకులో చూడవచ్చు.

- తుమ్మల శిరీష్ కుమార్
-----------
నా బ్లాగు: http://chaduvari.blogspot.com
బ్లాగులన్నీ: http://koodali.org, http://jalleda.com


2009/6/24 Ranga Sai Mamidenna <mvran...@gmail.com>

Anil K. Golla

unread,
Jun 24, 2009, 12:54:38 PM6/24/09
to telug...@googlegroups.com
తెలుగు బ్లాగ్ గుంపు కి స్వాగతం రంగ సాయి గారు,

మీరు అడిగింది నేను అర్థం చేసుకోక లేక పోతున్నాను.  నా బ్లాగు నంబరు అంటే ఏంటి అంది.  కొంచం వివరంగా అడిగితే నేను సహాయం చేయగలను.

అనిల్ కుమార్ గొల్ల
http://www.googlekaburlu.com

2009/6/24 Ranga Sai Mamidenna <mvran...@gmail.com>
వందే  మాతరం

Ranga Sai Mamidenna

unread,
Jun 25, 2009, 8:42:31 AM6/25/09
to telug...@googlegroups.com
వందే  మాతరం
శిరీష్  కుమార్  గారికి  ఈ  74  సంల  వృద్ధుడి  ఆశీర్వచనములు.
మీరు  శ్రమ అనుకోకుండా  రాసినది చదివాను.  ధన్యవాదములు.  నాకు  కంప్యూటర్ల  గురించి  బాగా తెలియదు.  నేను ఎలాగ  ఈ  గుంపులో  చేరానో  కూడా సరిగ్గా  తెలియదంటే  మీరు నవ్వుకోవచ్చు.  నా  మనవడు   చేర్పించాడు.  ఇదే  కాక  వికిపెడియా లో  కూడా  చేర్పించాడు.  అంతా  అయోమయం గా ఉంది..  మీ  లాంటి  వాళ్ళ  సహాయం  తో  నేర్చు కోగాలననే  ధైర్యం  కలుగుతున్నాది.  మీ లాంటి వారి  తోడ్పాటుతో నేను  కూడా  ఒక  blog  ప్రారంభించి  మన సమాజం  లోని  దురాచారాలని విమర్శిస్తూ  రాయాలని  తద్వారా  కొందరయినా మారుతారేమోనన్న  ఆశ .
భవదీయుడు

మా  వెం  రంగశాయి
ఒరిస్సాలో  పుట్టి 60  ఏళ్ళు  అక్కడే  గడిపి (ప్రస్తుతం  దృష్టి మాంద్యం  కూడా తోడైన నాకు)   నా తెలుగులో  తప్పులని  క్షమించండి.

2009/6/24 Sirish Kumar Tummala <sirish...@gmail.com>



--
Maa  Ven  Rangasai

Ajit kumar

unread,
Jun 25, 2009, 10:35:19 AM6/25/09
to telug...@googlegroups.com
తు,చ అనే అక్షరాలకు ప్రత్యేక అర్ధం లేదు. ఈ అక్షరాలు సంస్కృత భాషలో శ్లోకాలు రాసేటప్పుడు గణాల అమరిక కోసం  వాడతారు. అందుకే తు,చ తప్పకుండా  చెప్పాడు అని మనం వాడుతుంటాం. 

Aasish Pappu

unread,
Jun 25, 2009, 10:51:04 AM6/25/09
to telug...@googlegroups.com
అందుకేనేమో వ్యాస భగవానుడిని ఒకసారి కాళిదాసు అతని మిత్రులు చకారకుక్షి అని హేళన చేస్తారు !



25 జూన్ 2009, 10:35 am న, Ajit kumar <vak...@gmail.com> ఇలా రాసారు :



--
Aasish Kumar Pappu

Katta Girija Ramana

unread,
Jun 25, 2009, 11:09:18 AM6/25/09
to telug...@googlegroups.com
కాలిదాస మహాకవి తు, చ అను అవ్యయాలను కూడా అర్థవంతంగా వాడినాడు.

2009/6/25 Katta Girija Ramana <girijara...@gmail.com>
తూ, చా అనునవి అవ్యయములు . వచనము, విభక్తి, లింగము లేనివి. వీటిని వేటితోనైనా కలిపి వాడవచ్చును . వీటికన్నా ముందు గల పదాలు ఏ అర్థాన్ని ఇస్తాయో  తూ, చా అనునవి కలిపినా అవే అర్థాన్ని ఇస్తాయి.  సంస్కృతము నుండి తెలుగు లోకి అనువదించేటప్పుడు కొందరు తూ,చా అనువానిని కూడా అనువదించడం చేసేవారు ( అంతే కాకుండా ఉన్నది ఉన్నట్లు ఒక బహశా నుండి మరో భాషలోకి మార్చితే దానిని చెప్పేటప్పుడు తూ,చా తప్పకుండా చెప్పినాడు అనడం పరిపాటి )

2009/6/25 Aasish Pappu <aas...@gmail.com>



--
మీ కట్టా గిరిజా రమణ



--
మీ కట్టా గిరిజా రమణ

Katta Girija Ramana

unread,
Jun 25, 2009, 11:06:51 AM6/25/09
to telug...@googlegroups.com
తూ, చా అనునవి అవ్యయములు . వచనము, విభక్తి, లింగము లేనివి. వీటిని వేటితోనైనా కలిపి వాడవచ్చును . వీటికన్నా ముందు గల పదాలు ఏ అర్థాన్ని ఇస్తాయో  తూ, చా అనునవి కలిపినా అవే అర్థాన్ని ఇస్తాయి.  సంస్కృతము నుండి తెలుగు లోకి అనువదించేటప్పుడు కొందరు తూ,చా అనువానిని కూడా అనువదించడం చేసేవారు ( అంతే కాకుండా ఉన్నది ఉన్నట్లు ఒక బహశా నుండి మరో భాషలోకి మార్చితే దానిని చెప్పేటప్పుడు తూ,చా తప్పకుండా చెప్పినాడు అనడం పరిపాటి )

2009/6/25 Aasish Pappu <aas...@gmail.com>
అందుకేనేమో వ్యాస భగవానుడిని ఒకసారి కాళిదాసు అతని మిత్రులు చకారకుక్షి అని హేళన చేస్తారు !

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Jun 25, 2009, 1:18:00 PM6/25/09
to telug...@googlegroups.com
తు, చ అనేవి స్వతహాగా అర్థవంతాలైన అవ్యయాలే. అవి అర్థం లేనివనిన్నీ కేవల పాదపూరణ నిమిత్తమనీ తలంచడం ప్రామాదికం. కానీ ఏ కారణం చేతనో అమరకోశకారుడు కూడా ఒక సందర్భంలో మిక్కిలి పొఱపడి "తు-హి-చ-స్మ-హ-వై పాదపూరణే" అని పేర్కొన్నాడు. అయితే అదే గ్రంథంలో మఱొకచోట వాటికి ప్రత్యేకమైన అర్థాలిచ్చాడు. 

"చ" అనేది తెలుగులో "మఱియు (and)" అనేదాన్ని ఏ అర్థంలో వాడతామో ఆ అర్థంలో వాడబడుతుంది. అంటే ఏదైనా జాబితాని ఏకరువు పెట్టాల్సి వచ్చినప్పుడు ఆ జాబితా చివఱ "చ"శబ్దాన్ని వాడాలి. లేదా తెలుగులో మాదిరి జాబితాలోని ప్రతిపదం చివఱా వాడాలి.

ఉదా :- వేదాశ్చ ఉపనిషదశ్చ పురాణాని చ (వేదములున్ను, ఉపనిషత్తులున్ను, పురాణములున్ను)

లేదా, రామో లక్ష్మణస్ సీతా చ (రాముడును, లక్ష్మణుడును సీతయు)

నిజంగా "చ"శబ్దం అర్థహీనమైతే పాణిని మహాశయుడు ద్వంద్వసమాసాన్ని నిబంధిస్తూ "చా‍ఽర్థే ద్వన్ద్వః" ("చ"శబ్దార్థమునందు ద్వంద్వసమాసము ప్రవర్తించును) అని సూత్రీకరించడు కదా !

ఇహపోతే "తు"

అమరకోశకారుణ్ణి అనుసరించి "తు స్యాద్ భేదే‍ఽవధారణే"
అంటే - ఒక వస్తువు యొక్క ప్రత్యేకతని చెప్పేటప్పుడూ, నొక్కివక్కాణించేటప్పుడూ "తు" వాడాలి అని తాత్పర్యం.

ఉదా:- ఇతరేఽ౦శావతారాః స్యుః కృష్ణస్తు భగవాన్ స్వయమ్ |
తా|| ఇతరులు అంశావతారాలు మాత్రమే. మరి కృష్ణుడో ? (సాక్షాత్తు) స్వయముగా భగవంతుడే.


నెనర్లు. (Thanks)

Yours Truly
T. L. Bala Subrahmanyam
http://www.tadepally.com

ఇట్లు భవదీయుడు
తాడేపల్లి



This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use http://lekhini.org

Aasish Pappu

unread,
Jun 25, 2009, 1:30:31 PM6/25/09
to telug...@googlegroups.com
ఆహ, చక్కటి వివరణ.

తాడేపల్లి గారు, మీ వివరణ  అమోఘం. 

కృతజ్ఞతలు.
ఆశీష్

25 జూన్ 2009, 1:18 pm న, తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtad...@gmail.com> ఇలా రాసారు :



--
Aasish Kumar Pappu

sathish

unread,
Jun 25, 2009, 3:16:38 PM6/25/09
to తెలుగుబ్లాగు
సవివరమైన వివరణ,
ఈ సోదాహరణమైన జవాబుతో మరింతమంది సందేహం తీరివుంటుంది.

నమస్సులు,
సతీష్.

On Jun 25, 10:30 pm, Aasish Pappu <aasi...@gmail.com> wrote:
> ఆహ, చక్కటి వివరణ.
>
> తాడేపల్లి గారు, మీ వివరణ  అమోఘం.
>
> కృతజ్ఞతలు.
> ఆశీష్
>
> 25 జూన్ 2009, 1:18 pm న, తాడేపల్లి T.L. Bala Subrahmanyam <

> subtadepa...@gmail.com> ఇలా రాసారు :


>
>
>
>
>
> > తు, చ అనేవి స్వతహాగా అర్థవంతాలైన అవ్యయాలే. అవి అర్థం లేనివనిన్నీ కేవల
> > పాదపూరణ నిమిత్తమనీ తలంచడం ప్రామాదికం. కానీ ఏ కారణం చేతనో అమరకోశకారుడు కూడా
> > ఒక సందర్భంలో మిక్కిలి పొఱపడి "తు-హి-చ-స్మ-హ-వై పాదపూరణే" అని పేర్కొన్నాడు.
> > అయితే అదే గ్రంథంలో మఱొకచోట వాటికి ప్రత్యేకమైన అర్థాలిచ్చాడు.
>
> > "చ" అనేది తెలుగులో "మఱియు (and)" అనేదాన్ని ఏ అర్థంలో వాడతామో ఆ అర్థంలో
> > వాడబడుతుంది. అంటే ఏదైనా జాబితాని ఏకరువు పెట్టాల్సి వచ్చినప్పుడు ఆ జాబితా
> > చివఱ "చ"శబ్దాన్ని వాడాలి. లేదా తెలుగులో మాదిరి జాబితాలోని ప్రతిపదం చివఱా
> > వాడాలి.
>
> > ఉదా :- వేదాశ్చ ఉపనిషదశ్చ పురాణాని చ (వేదములున్ను, ఉపనిషత్తులున్ను,
> > పురాణములున్ను)
>
> > లేదా, రామో లక్ష్మణస్ సీతా చ (రాముడును, లక్ష్మణుడును సీతయు)
>
> > నిజంగా "చ"శబ్దం అర్థహీనమైతే పాణిని మహాశయుడు ద్వంద్వసమాసాన్ని నిబంధిస్తూ
> > "చా‍ఽర్థే ద్వన్ద్వః" ("చ"శబ్దార్థమునందు ద్వంద్వసమాసము ప్రవర్తించును) అని
> > సూత్రీకరించడు కదా !
>
> > ఇహపోతే "తు"
>
> > అమరకోశకారుణ్ణి అనుసరించి "తు స్యాద్ భేదే‍ఽవధారణే"
> > అంటే - ఒక వస్తువు యొక్క ప్రత్యేకతని చెప్పేటప్పుడూ, నొక్కివక్కాణించేటప్పుడూ
> > "తు" వాడాలి అని తాత్పర్యం.
>

> > ఉదా:- ఇతరేఽ౦శావతారాః స్యుః *కృష్ణస్తు* భగవాన్ స్వయమ్ |
> > తా|| ఇతరులు అంశావతారాలు మాత్రమే. *మరి కృష్ణుడో ?* (సాక్షాత్తు) స్వయముగా


> > భగవంతుడే.
>
> > నెనర్లు. (Thanks)
>
> > Yours Truly
> > T. L. Bala Subrahmanyam
> >http://www.tadepally.com
>
> > ఇట్లు భవదీయుడు
> > తాడేపల్లి
>
> > This mail might have been sent to you in Telugu language. If you are unable
> > to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For
> > writing in Telugu, usehttp://lekhini.org
>
> --

> Aasish Kumar Pappu- Hide quoted text -
>
> - Show quoted text -

వైద్యభూషణ్

unread,
Jun 25, 2009, 5:19:17 PM6/25/09
to తెలుగుబ్లాగు
తాడేపల్లి గారూ,

మీరు చాలా మంచి వివరణ ఇచ్చారు.

ధన్యవాదములు.

Ranga Sai Mamidenna

unread,
Jun 29, 2009, 7:54:15 AM6/29/09
to telug...@googlegroups.com
2009/6/24 Sirish Kumar Tummala      <sirish...@gmail.com
వందే  మాతరం 
శిరీష్ కుమార్  తుమ్మల గారికి  ఆశీర్వచనములు 
మీరు రాసినట్లుగానే  blogger.com ద్వారా SAIRATNA  అనే  బ్లాగు  ఆరంభించాను.  మీ సహాయానికి  ధన్యవాదాలు.
అయితే  ఒక చిన్న సమస్య వచ్చింది.  నేను  మొదట  తెలుగు  వాళ్ళ బెంగాలీ  పేర్లు అన్న  శీర్షికని  నా అభిప్రాయాలు  రాస్తున్నప్పుడు
తెలుగులోనే  రాయగలిగాను. అయితే  అందులో  చాలా తప్పులున్నాయని  తెలుసుకొని  సేవు  అయినధాని మళ్ళీ చూసి  సరిదిద్ద్కుమ్దాము  లేక మరొకటి  మళ్ళీ  రాద్దామనుకొంతే  తెలుగు  రావడం  నలేదు.  మొదటి  సారి  తెలుగు  అ  అక్షర౦  మీద  క్లిక్  చేసి  రాసాను.  కానీ  రెండవసారి  ఆ  అ  అక్షరమే  అగుపడ్డం  లేదు .  దయచేసి  మెరినా  ఇంకెవరైనా  సహాయం  చేయండి.
మా  వెం  raMgashaayi
 

రంగశాయి గారూ,నమస్కారం.
--
Maa  Ven  Rangasai

Anil K. Golla

unread,
Jun 29, 2009, 8:02:37 AM6/29/09
to telug...@googlegroups.com
రంగ సాయి గారు,

నాకు తెలిసి మీరు మీ బ్లాగ్ settings >Enable transliteration? > ni disable చేసి ఉంటారు.  అది enable చేయండి.  మీ సమస్య కి పరిష్కారం దొరుకుతుంది.

అనిల్ కుమార్ గొల్ల
http://www.googlekaburlu.com

2009/6/29 Ranga Sai Mamidenna <mvran...@gmail.com>
Reply all
Reply to author
Forward
0 new messages