ప్రసాద్ నల్లమోతు గారూ,
గూగుల్ వారి ట్రాన్స్లిటరేషన్ లో మీరు తెలుగు ని చక్కగా ఆంగ్లం నుండి తెలుగు లోకి మార్చుకొనవచ్చును.. మరియు పేరాలకు పేరాలు వ్రాసుకొని, ఒకేసారి కాపీ / కట్ చేసుకొని ఎక్కడైనా చక్కగా వాడుకోవచ్చును. లేదా ఆన్లైన్ లో ఎక్కడైనా నేరుగా తెలుగులో టైపు చేసుకోవచ్చు - ఈ గూగుల్ ట్రాన్స్లిటరేషన్ ని వాడి. మరొక విషయం : ఇదంతా ఆ టూల్ ని వాడే వ్రాస్తున్నాను.
మీ సమస్య కి సమాధానం పెద్దగా ఇక్కడే వివరిస్తున్నాను. ఇలా అందరిని ఇబ్బంది పెడుతున్నందులకు క్షమించండి.
ముందుగా మీ సమస్య వద్దకి వద్దాం. మీరు వాడిన టూల్ - ఆన్లైన్ లో తెలుగు / గూగుల్ ట్రాన్స్లిటరేషన్ సైటుని వాడి ఉంటారని ( లింక్ : https://www.google.com/intl/te/inputtools/try/ ) అనుకుంటున్నాను. అయినా ఆ సైటులో ఎంచక్కా రోమన్ ఇంగ్లీష్ లో టైపింగ్ చేస్తుంటే - వెనువెంటనే తెలుగులోకి మారిపోతుంటుంది. ఇందులో పేరాలకు పేరాలు టైపింగ్ చేసుకొని కాపీ పేస్ట్ పద్ధతిలో వాడుకోవచ్చు. లేదా నేరుగా ఎక్కడ తెలుగులో టైపింగ్ కావాలనుకుంటే అక్కడే టైపింగ్ చేసుకోవచ్చు. ఇదొక సౌలభ్యం.
మీరు టైపింగ్ చేసుకోవడం చాలా సమయం పట్టింది అన్నారు. ట్రాన్స్లిటరేషన్ టైపింగ్ లో ముఖ్యముగా గమనించవలసింది - ఫోనెటిక్ పద్ధతిలోనే టైప్ చెయ్యాలి. అంటే ఆంగ్లం లోని సరైన పదాన్ని అలాగే నేరుగా టైప్ చెయ్యవద్దు. అలా చేస్తే చాలా వరకు పదాలు మనం అనుకున్నట్లుగా రావు. మనం ఆ పదాన్ని ఎలా పలుకుతామో అలాగే టైప్ చెయ్యాలి. ఇది మరొక ముఖ్యమైన విషయం. ఉదాహరణకు పైన ఎర్రని రంగులో వ్రాసిన ( ఆంగ్లం లోని సరైన పదాన్ని ) వాక్యాన్ని తీసుకొంటే - ఇలా వ్రాయాల్సి ఉంటుంది.. anglam loni saraina padaanni alaage nerugaa typ cheyyavaddu. alaa chesthe chaalaa varaku padaalu manam anukunnatlugaa raavu. manam aa padaanni elaa palukuthaamo alaage typ cheyyaali... ఇలా రోమన్ ఇంగ్లీష్ లో వ్రాయాల్సి ఉంటుంది. ఇలా వ్రాస్తుంటే తప్పులు రావు. అలాగే చాలా స్పీడ్ గా చాటింగ్ చేస్తున్నట్లుగా టైపింగ్ చెయ్యవచ్చు. ఇలా చెయ్యటానికి తెలుగు వర్ణమాలని మీరు అభ్యాసం చెయ్యాల్సిందే. మీకు టైపింగ్ నేర్చుకోవాలనుకుంటే - నా బ్లాగ్ లోని పాఠాలను అనుసరించండి. ( లింక్ : https://achampetraj.blogspot.com/2010/02/ilaa-raayatam.html )
గూగుల్ ట్రాన్స్లిటరేషన్ ని ఎక్కడైనా / ఏ సైటు నందు అయినా వాడుకోవచ్చు అన్నానుగా.. ఇక అక్కడే నేరుగా టైప్ చేసుకోవచ్చు, కాపీ పేస్ట్ అవసరం రాదు. గూగుల్ ట్రాన్స్లిటరేషన్ సైటు లో టైప్ చేసుకొని దాన్ని కాపీ పేస్ట్ పద్ధతిలో వాడుకోవచ్చు. కానీ కొంత అభ్యాసం చేస్తే - నేరుగా ఎక్కడైనా టైప్ చేసుకోవచ్చు.
రెండు పేరాలు మాత్రమే కాపీ చేశామన్నారుగా.. బహుశా మీరు టైప్ చేసినందంతా డ్రాగ్ చెయ్యటం మరచిపోయినట్లున్నారు. లేదా ఎక్కడో ఏదో లోపం జరిగి ఉండవచ్చు.
మీ జీమెయిల్ అకౌంట్ లో క్రొత్త ఈమెయిల్ మెస్సేజ్ ఓపెన్ చేసి గానీ, క్రొత్త బ్లాగ్ టపా గానీ తెరచి, అందులో టైప్ చేసుకుంటే వెనువెంటనే వ్రాసినదంతా సేవ్ అవుతుంది. మధ్యలో కరెంట్ పోయినా, ఇంకేదైనా జరిగినా అక్కడ మీరు టైప్ చేసినదంతా భద్రముగా ఉంటుంది. అవసరమైనన్నిసార్లు ఆ విషయాన్ని కాపీ, పేస్ట్ చేసుకోవచ్చును.
ఇక్కడ సమాధానం పెద్దగా వ్రాసి, ఇబ్బంది పెట్టినందులకు - మరొక్కసారి మన్నించమని కోరుతూ -