[e-తెలుగు] మీ విజయగాథని మాతో పంచుకోండి!

0 views
Skip to first unread message

Veeven (వీవెన్)

unread,
Dec 11, 2009, 11:34:01 PM12/11/09
to తెలుగు బ్లాగు గుంపు
మీ తెలుగు బ్లాగు వల్ల మీకు విజయం సిద్ధించిందా? లేదా మీ తెలుగు బ్లాగు మీ జీవితంలో చెప్పుకోదగ్గ మార్పుని తీసుకువచ్చిందా? జాలంలోనూ కంప్యూటర్లలోనూ తెలుగు వల్ల మీ సంతోషం, ఆనందం, విజయం మరేదైనా e-తెలుగుతో పంచుకోండి. జాలంలో తెలుగుకి ప్రోత్సాహకంగా మీ విజయగాథను ఇతరులకు తెలియజేస్తాం. రండి జాలంలో తెలుగుని వెలిగిద్దాం. :)

మరిన్ని వివరాలు: http://etelugu.org/node/310

ఇట్లు,
వీవెన్.

--
Read Telugu blogs @ koodali.org

jyothi valaboju

unread,
Dec 12, 2009, 1:00:16 AM12/12/09
to telug...@googlegroups.com
 బ్లాగుల వల్ల నాకంటే ఎక్కువ ప్రయోజనం పొందినవారు లేరనుకుంటా..

padma kala

unread,
Dec 12, 2009, 1:55:08 AM12/12/09
to telug...@googlegroups.com
గాలి వాటుగా పోయే ఎన్నో భావాలు, ఆవేశాలు అనుభూతులు బ్లాగు ద్వారా ప్రాణం  పోసుకున్నాయి.
ఏడాదిన్నర క్రితం ఒక్క బ్లాగుతో మొదలైన నా భావాలు ఇప్పుడు ఏడు బ్లాగులకు విస్తరించాయి.
నా భావాలను , అభిప్రాయాలను సరి చూసుకునే అవకాశం బ్లాగుల ద్వారా నాకు లభించింది.

మంచి మితృల ద్వారా నాకు తెలియని  సాంకేతిక పరమైన ఎన్నో విషయాలను నేను తెలుసుకున్నాను.

తెలుగుకళ-పద్మకళ

12 డిసెంబర్ 2009 11:30 am న, jyothi valaboju <jyothiv...@gmail.com> ఇలా రాసారు :
 బ్లాగుల వల్ల నాకంటే ఎక్కువ ప్రయోజనం పొందినవారు లేరనుకుంటా..

--
మీరు "తెలుగుబ్లాగు" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
ఈ గుంపుకు జాబు పంపేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-...@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు, http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.
 
బ్లాగుల సంకలినులు: koodali.org | jalleda.com | haaram.com
బ్లాగు పాఠాలు: telugublogtutorial.blogspot.com | nerpu.com

psm lakshmi

unread,
Dec 12, 2009, 4:17:21 AM12/12/09
to telug...@googlegroups.com
నా బ్లాగుల వల్ల నాకు లభించిన ముఖ్యమైన ఉపయోగం మంచి కాలక్షేపం.  రిటైరయిన తర్వాత ఏం చెయ్యాలా అని బెంగ పెట్టుకున్న నాకు రోజులు ఎలా గడిచి పోతున్నాయో తెలియటం లేదు. 
psmlakshmi
3psmlakshmi.blogspot.com
4psmlakshmi.blogspot.com

2009/12/12 Veeven (వీవెన్) <vee...@gmail.com>
--
మీరు "తెలుగుబ్లాగు" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
ఈ గుంపుకు జాబు పంపేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-...@googlegroups.com కు మెయిలు పంపండి.

rama

unread,
Dec 12, 2009, 5:23:35 AM12/12/09
to telug...@googlegroups.com

నా బ్లాగు.. ఈనాడు పేపర్‌లో చూసి జూలై 2007 లో మొదలుపెట్టాను. మొదటి బ్లాగు " మనలోని మాట నా మనసులోని మాట" ఇప్పుడు మధురభావాల సుమమాల  బ్లాగు మొదలు పెట్టే ముందు రోజు వరకు నేనెవరో ఎవరికీ తెలీదు. కాని ఈరోజు రమణి అనగానే అందరికి గుర్తొచ్చేది నా బ్లాగు. స్నేహితులకి కూడా రమణి బౌతికంగా తెలుసు కాని రమణి మనసులోని భావాలేంటి, రమణి ఏవిధంగా ఆలోచిస్తుంది అన్నది నా బ్లాగు ద్వారానే తెలిసింది. అలా విజయానికి మొదటి మెట్టులో ఉండగానే సఖి షూటింగ్ జరింగింది. అందులో ఒక బ్లాగర్‌గా నా పేరు కూడా వినపడడం నాకెంతో సంతోషంగా ఉంది. ఇకపోతే సహ మహిళా బ్లాగర్లు మంచి స్నేహితులయ్యారు నా బ్లాగు ద్వారా.. నాకు కామెంట్ రాసే ప్రతి ఒక్కరు నాకు మంచి హితులు..  స్నేహితులు.. సన్నిహితులు. నిడదవోలు మాలతిగారు , కస్తూరి మురళీ కృష్ణ గారు లాంటి ప్రముఖులని పరిచయం చేసింది నా బ్లాగు.  ముఖ్యంగా నిడదవోలు మాలతిగారిని కలుసుకోవడం ఒక మంచి అనుభూతి. వ్యక్తిగతంగా మంచి స్నేహితులని పరిచయం చేసుకొనే అదృష్టం కలగడం విశేషం.

నా పేరు : రమణి
నా బ్లాగు పేరు : మధురభావాల సుమమాల.
నా బ్లాగు URL : http://www.sumamala.info


2009/12/12 Veeven (వీవెన్) <vee...@gmail.com>
మీ తెలుగు బ్లాగు వల్ల మీకు విజయం సిద్ధించిందా? లేదా మీ తెలుగు బ్లాగు మీ జీవితంలో చెప్పుకోదగ్గ మార్పుని తీసుకువచ్చిందా? జాలంలోనూ కంప్యూటర్లలోనూ తెలుగు వల్ల మీ సంతోషం, ఆనందం, విజయం మరేదైనా e-తెలుగుతో పంచుకోండి. జాలంలో తెలుగుకి ప్రోత్సాహకంగా మీ విజయగాథను ఇతరులకు తెలియజేస్తాం. రండి జాలంలో తెలుగుని వెలిగిద్దాం. :)

--

mala kumar

unread,
Dec 12, 2009, 6:14:24 AM12/12/09
to telug...@googlegroups.com
మనవడి కోసము నేర్చుకున్న నా కంప్యూటర్ వలన బ్లాగు మొదలు పెట్టాను .అదీనూ తెలుగు లో వ్రాయవచ్చని తెలిసి . ఈ నా బ్లాగు నాకు మంచి కాలక్షెపమైంది . తెలుగు లో వ్రాయటము వలన , నా భావాలను , సులువుగా వ్యక్తీకరించ కలుగుతున్నాను.అసలు ఒక్క వాక్యము వ్రాయాలంటేనే బద్ధకించే నేను ఇంత వ్రాయగలుగుతున్నానంటే నా బ్లాగే కారణము .ఇంట్లో కూర్చునే మంచి స్నేహితులను పొదగలిగాను . ఇంటినుండే అందరి తో మాట్లాడగలుగు తున్నానంటే చాలా సంతోషముగా వుంది .బ్లాగ్ రాస్తూ , దానిని ఎలా అందముగా మలచాలా అని చాలా నేర్చుకున్నాను .ఒకదానికొకటి , నాలుగు బ్లాగులు చేసుకున్నాను . కొత్త టెక్నాలెడ్జ్ ని వుపయోగించటము ,నేర్చుకోవటము ఒక విజయముగానే భావిస్తున్నాను . 
 
--
mala,
http://sahiti-mala.blogspot.com

sriramalingeswara rao

unread,
Dec 12, 2009, 7:25:43 AM12/12/09
to telug...@googlegroups.com
నమస్కారాలు. కాస్తవిను పేరుతో ఒక బ్లాగు మొదలుపెట్టాను కాని అందులో ఎలా
వ్రాయాలో తెలియడం లేదు. కాస్త ఎవరైనా పుణ్యం కట్టుకోండి.
raomsrl

తేదిన 12 డిసెంబర్ 2009 4:44 pm, mala kumar <malap...@gmail.com> వ్రాశారు:

> --

muralidhar namala

unread,
Dec 12, 2009, 8:18:34 AM12/12/09
to telug...@googlegroups.com
రామలింగేశ్వరరావు గారు, తమరు హైదరాబాద్ వాస్తవ్యులయితే ఆదివారం జరిగే సమావేశానికి హాజరుకండి. అందరినీ కలవవచ్చు, మీ సందేహాలు తీర్చుకోవచ్చు.

2009/12/12 sriramalingeswara rao <raom...@gmail.com>



--
Regards,
Naga Muralidhar Namala

Read Telugu blogs @ koodali.org

My Blog: http://muralidharnamala.wordpress.com

RRao Sistla

unread,
Dec 12, 2009, 2:11:34 PM12/12/09
to telug...@googlegroups.com
ఆరు నెలల క్రితం వరకూ బ్లాగుల గురించి విన్నా పెద్దగా అవగాహన లేదు. పైగా   కంప్యూటర్లో తెలుగు గురించి  సరైన అవగాహన లేకపోవడం వాటిమీదకి దృష్టి పోలేదు. ఒకసారి విషయమేమిటో తేలుసుకోవాలనే ఆసక్తి నన్నే ఒక బ్లాగు ప్రారంభించేలా చేసింది. గత ముఫ్ఫై సంవత్సరాలుగా పుస్తకాలు-పత్రికలు, వీడియో-ఆడియో కాసెట్లు/ సి.డి.లు  కొనడం, దాచుకోవడం అనే నా హాబీ బ్లాగులో ఏం రాయాలా అనే ఆలోచనకు తావివ్వలేదు. ఎంత త్వరగా నా దగ్గరున్న ఖజానాను అందరికీ పంచేద్దామా అని ఆత్రుతగా ఉంది. అలాగే ఎప్పుడో ముఫ్ఫై సంవత్సరాల క్రితం నిలిచిపోయిన రచనా వ్యాసంగం ( మధ్యలో ఎవరికోసమో రాసినవి కాక ) మళ్ళీ ప్రారంభించడానికి అవకాశం కలిగింది. నాకు తోచినప్పుడు నాకు తోచింది రాసుకునే స్వేచ్చ కనిపించింది.
ప్రారంభించి నాలుగు నెలలు కాకుండానే ఈ బ్లాగు ద్వారా  అనేకమంది మిత్రుల్ని పొందగలిగాను. వారి అంతరంగ భావాలను తెలుసుకోగలుగుతున్నాను. నా భావాలను, నాకు తెలిసిన విశేషాలను వారికి పంచగలుగుతున్నాను. అలాగే వారినుంచి చాలా విశేషాలను తెలుసుకోగలుగుతున్నాను. అచిరకాలంలోనే బ్లాగులోకంలో నేనూ స్థానం సంపాదించుకోవడం ఒక రకంగా విజయం గానే భావిస్తున్నాను. కానీ మరికొంత మందికైనా కంప్యూటర్ లో తెలుగు రాయడం గురించి తెలియజేసి బ్లాగులు ప్రారంభించేలా చెయ్యాలని ఉంది. అప్పుడే నా బ్లాగుకి పూర్తి విజయమేమోననుకుంటున్నాను.
నా బ్లాగు పేరు : శిరాకదంబం
నా పేరు : ఎస్. ఆర్. రావు
నా బ్లాగు URL : http://sirakadambam.blogspot.com/
నా మెయిల్ :  <rraos...@gmail.com>

2009/12/12 muralidhar namala <muralidh...@gmail.com>

vakitiram1980

unread,
Dec 13, 2009, 3:16:40 AM12/13/09
to తెలుగుబ్లాగు
Reply all
Reply to author
Forward
0 new messages