లేఖిని

80 views
Skip to first unread message

Ram Prasad Maddali

unread,
Oct 19, 2016, 1:33:03 AM10/19/16
to తెలుగుబ్లాగు
మిత్రులారా 

లేఖిని నించీ వర్డ్ లోకి 
కాపీ చేసిన తెలుగు పదాల మధ్య స్పేస్  సరిగ్గా రావటం లేదు ఏమి చేయాలి? తెలియ చేయ ప్రార్ధన !!

 సరిగ్గా రావటం లేదు ఏమి చేయాలి? తెలియ చేయ ప్రార్ధన !!

రామ్ 

వీవెన్

unread,
Oct 19, 2016, 2:47:53 AM10/19/16
to తెలుగు బ్లాగు గుంపు, mvsram...@gmail.com
రామ్ ప్రసాద్ గారూ,

2016-10-19 9:51 GMT+05:30 Ram Prasad Maddali <mvsram...@gmail.com>:
మిత్రులారా 

లేఖిని నించీ వర్డ్ లోకి 
కాపీ చేసిన తెలుగు పదాల మధ్య స్పేస్  సరిగ్గా రావటం లేదు ఏమి చేయాలి? తెలియ చేయ ప్రార్ధన !!

నేను ప్రయత్నించి చూస్తే బాగానే వస్తూంది. జోడించిన తెరపట్టులో చూడండి. మీ కంప్యూటర్లో ఎలా వస్తూందో స్ర్కీనుషాటు తీసి పంపండి.

ఇట్లు,
వీవెన్.

lekhini-msword-telugu-words-gap.PNG

Ram Prasad Maddali

unread,
Oct 19, 2016, 4:14:06 AM10/19/16
to తెలుగుబ్లాగు

వీవెన్ గారూ

మీరు తెలుగు భాష ఇంటర్నెట్ ద్వారా వర్ధిల్లటానికి చేస్తున్న కృషి కి నమోన్నమహ !!

లేఖిని వాడి , వర్డ్ లోకి పేస్ట్  ఇపుడే మొదలెట్టాను. మీ బ్లాగ్ లో ఇందుకు సంబందించిన టెక్కునిక్కుల ( మీ పదం అద్భుతస్య :)  లంకెలు పంపమని ప్రార్ధన 

స్క్రీన్ షాట్ ఇదుగోండి  

రామ్
screenshot.JPG

Prasad Charasala

unread,
Oct 19, 2016, 7:18:41 AM10/19/16
to telugublog
సరిగ్గానే వుంది కదా!

--
--
______________________________________________
 
* ప్రతిస్పందనలని పంపేటప్పుడు ఈ కింది భాగాన్ని తొలగించగలరు *
______________________________________________
 
మీరు "తెలుగుబ్లాగు" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
ఈ గుంపుకు జాబు పంపేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-unsubscribe@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు, http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.
______________________________________________
 
బ్లాగుల సంకలినులు: koodali.org | jalleda.com | haaram.com | maalika.org | telugubloggers.com
బ్లాగు పాఠాలు: telugublogtutorial.blogspot.com | nerpu.com

---
You received this message because you are subscribed to the Google Groups "తెలుగుబ్లాగు" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugublog+unsubscribe@googlegroups.com.
For more options, visit https://groups.google.com/d/optout.

--

Ram Prasad Maddali

unread,
Oct 19, 2016, 10:23:46 PM10/19/16
to తెలుగుబ్లాగు
సరిగానే ఉందా అండీ ! 
లేఖిని లో పదాల మధ్య స్పేస్ కన్నా వర్డ్ లో తక్కువ ఉండటం తో - నేను ఏమైనా సెట్టింగ్స్ సరి చేయాలేమో అనుకున్నాను . 
ధన్యవాదాలు . 
రామ్ 

On Wednesday, October 19, 2016 at 7:33:03 AM UTC+2, Ram Prasad Maddali wrote:

Raj

unread,
Oct 21, 2016, 3:35:32 PM10/21/16
to telug...@googlegroups.com
రామ్ ప్రసాద్ గారూ, 

లేఖిని లో వ్రాసిన విషయాన్ని, కాపీ చేసుకొని, వర్డ్ లో పేస్ట్ చేసుకుంటే - పదాల మధ్యన ఎక్కువ స్పేస్ రావటం లేదన్నది మీ అనుభవం. ఇలా పదాల మధ్యన ఉండే స్పేస్ మరింత ఎక్కువ స్పేస్ రావటం ఎలాగో క్రిందన స్క్రీన్ షాట్స్ లలో చూడండి. నిజానికి ఇది చా...లా  చిన్న విషయం.  ఎంతగా అంటే ఓస్.. ఇంతేనా అన్నట్లుగా.. 

ముందుగా మీరు లేఖినిని ( http://lekhini.org )  తెరచి, మీరు పైగదిలో ఇంగ్లీష్ లో టైపింగ్ చేస్తుంటే క్రిందన ఉన్న గడిలో వెనువెంటనే తెలుగులోకి మారుతుంది. ఈ విషయం అందరికీ తెలిసినదే.. ఈ వచ్చిన తెలుగును మార్కింగ్ చేసి, కాపీ చేసుకొని వర్డ్ లోకి పేస్ట్ చేసుకోవాలి. అలా వర్డ్ లో పేస్ట్ చేసుకున్నప్పుడు - పదాల మధ్యన ఉండే స్పేస్ తగ్గిపోయి, పదాలు కాస్త దగ్గర దగ్గరగా ఉన్నట్లు అగుపిస్తాయి. దీన్ని రెండురకాలుగా ప్రయత్నించి, విజయం సాధించవచ్చు. 

మొదటి పద్ధతి : ఇది చాలా సులభమైన పరిష్కారం. 

లేఖినిలో టైపింగ్ చేస్తున్నప్పుడు పదాల మధ్యన మీరు వాడే ఒకసారి వాడే స్పేస్ ట్యాబ్ ని రెండుసార్లు నొక్కండి. దీనివల్ల పదాల మధ్య మరింత జాగా Gap వస్తుంది. అంటే మీరు పదాల మధ్యన పెట్టే స్పేస్ సింగిల్ స్ట్రోక్ కాకుండా - డబల్ స్ట్రోక్ వాడి, టైపు చెయ్యండి. మీ టైపింగ్ పూర్తయ్యాక దాన్ని కాపీ చేసి, ఎమ్మెస్ వర్డ్ MS Word లో పేస్ట్ చేస్తే మీరనుకున్నట్లు పదాల మధ్య వచ్చే స్పేస్ మీరు అనుకున్నట్లుగా ఎక్కువ నిడివితో వస్తుంది. అది ఎలానో ఈ క్రింది స్క్రీన్ షాట్ ని గమనించండి. 

పైనున్న స్క్రీన్ షాట్ ని చూశారు కదూ.. పదాల మధ్యన చాలా ఎడం గా స్పేస్ వచ్చింది. ఇలాగే రెండో పద్ధతీ ఉంటుంది. ఆ పద్ధతి కూడా సులభమైనదే.. సమయాభావం వల్ల ఇప్పుడే ఇక్కడ నేను చెప్పలేకపోతున్నాను. వీలు చూసుకొని తొందరలోనే పోస్ట్ చేస్తాను.. ఎదురుచూసేలా చేస్తున్నందులకు మన్నించండి. 

- అచ్చంపేట్ రాజ్. 

www.achampetraj.blogspot.in 

--

Prasad Charasala

unread,
Oct 22, 2016, 8:57:33 AM10/22/16
to telugublog
రాజ్ గారూ,
ఇలా రెండు spaceలు పెట్టడం ద్వారా ఎక్కువ జాగా పెట్టడం వాంఛనీయం కాదు. రెండు స్పేస్‌లు ఒక స్పేస్ అవవు.
మీకు కావాల్సినట్టుగా పదాల మధ్యగానీ, వాక్యాల మధ్యగానీ, పేరాల మధ్యగానీ కావాల్సిన ఎడం రావడానికి MS Wordలో ఎన్నో సదుపాయాలు వుంటాయి. వాటిని వాడుకోవాలే గానీ ఇలా పదాల మధ్య రెండు స్పేస్‌లు పెట్టడం సమస్యకు పరిష్కారం కాదు.

Raj

unread,
Oct 24, 2016, 1:12:25 PM10/24/16
to telug...@googlegroups.com
ప్రసాద్ చరసాల గారూ, 
రెండు స్పేస్ లు పెట్టడం ద్వారా ఎక్కువ జాగా పెట్టడం వాంఛనీయం కాదు అని తెలుసు. కానీ ఇక్కడ సమస్య అన్నది ( Ram Prasad Maddali గారి ప్రశ్నని గమనించండి ) - లేఖిని లో టైపు చేసినది కాపీ చేసుకొని ఎమ్మెస్ వర్డ్ లో పేస్ట్ చేసుకోవడం లో వచ్చిన సాంకేతిక సమస్య. ఒక దాంట్లోంచి కాపీ చేసుకొని మరొక దానిలో పేస్ట్ చేసుకోవడం వల్ల వచ్చిన సమస్యకు ఇదొక పరిష్కారం అని చెప్పాను. లేఖిని లో కాకుండా నేరుగా MS Word లో టైపింగ్ అయితే ఈ ప్రశ్న ఉత్పన్నం కానే కాదు. 

అచ్చంపేట్ రాజ్. 

Raj

unread,
Oct 24, 2016, 1:56:50 PM10/24/16
to telug...@googlegroups.com
Ram Prasad Maddali గారూ.. 
ముందుగా - మీ సమస్యకు రెండో పరిష్కారం త్వరలో చెబుతానని చెప్పి, మిమ్మల్ని కొంతకాలం నిరీక్షించేలా చేసినందులకు మన్నించండి.
వీవెన్ గారి కోరిక మేరకు మీరు జత చేసిన స్క్రీన్ షాట్ ని గమనిస్తే - అది క్రాప్ / కత్తిరించబడినది కాకుండా మొత్తం తెరపట్టు అయి ఉంటే నేను చెప్పే సమాధానం తేలికగా ఉండేది.. మీరు చాలా పాత వర్షన్ MS Office word వాడుతున్నారులా ఉంది. ( క్రొత్త వెర్షన్ లలో మరిన్ని సౌకర్యాలు అందుకోగలరు. అయితే మీ సమస్యకు ఈ వెర్షన్ అప్డేట్ ఏమాత్రం అడ్డంకి కాదు.. ) పూర్తిగా ఉండే స్క్రీన్ షాట్ వల్ల - మీరు లేఖినిలో వ్రాసుకున్న దానిని ఈ MS Word లో ఏ ఫాంట్ డిఫాల్ట్ గా ఉన్నప్పుడు పేస్ట్ చేసుకున్నారో తెలిసేది. అందువల్ల మీకు అలా పదాలు దగ్గరగా వచ్చాయని అనుకుంటున్నాను. అయినా సరే!.. చిన్న మార్పు వల్ల తేలికగా ఎక్కువ స్పేస్ వచ్చేలా చేసుకోవచ్చు. 

లేఖినిలో Single spaceతో  మీరు టైపు చేసుకున్న విషయాన్ని వర్డ్ లోకి ఇంతకు ముందు ఎలా కాపీ, పేస్ట్ చేసుకున్నారో అలాగే చేసుకోండి. అలా పేస్ట్ అయిన విషయాన్ని సేవ్ చేసుకొనే ముందు - ఆ విషయాన్ని అంతా మార్క్ చెయ్యండి. అలా చేశాక ఒక్కో ఫాంట్ ని మారుస్తూ వెళ్ళండి. తెలుగు ఫాంట్స్ మీదుగా కాకుండా, ఇంగ్లీష్ ఫాంట్స్ ఎన్నుకుంటూ - స్పేస్ ని గమనిస్తూ వెళ్ళండి. కొన్ని ఫాంట్స్ / ఖతుల వల్ల మీకు అనుకున్న స్పేస్ ఖచ్చితముగా వస్తుంది. ఇదే నేను చెప్పాలనుకున్న రెండో పరిష్కారం. 

అది ఎలా వస్తుందో స్క్రీన్ షాట్స్ పెట్టాలని ఉంది కానీ నాకున్న సమయాభావం వల్ల - దీపావళి తరవాత గానీ వ్యక్తిగత బీజీ తగ్గదు. అందుకే అవి ఇక్కడ పెట్టలేక పోతున్నాను. అందులకి మరోసారి మన్నించండి. 

- అచ్చంపేట్ రాజ్. 

Raj

unread,
Nov 1, 2016, 1:46:42 PM11/1/16
to telug...@googlegroups.com

ఇందులో కూడా మీరు లేఖినిలో మొదట్లో ఎలా టైపింగ్ చేసుకున్నారో, ( అంటే డబల్ స్పేస్ Double space కాకుండా సింగిల్ స్పేస్ Single space వాడి ) అలాగే టైప్ చేసుకోండి. ఆతర్వాత కీ బోర్డ్ సహాయముతో గానీ, మౌస్ కర్సర్ తో గానీ మీరు వ్రాసిన దాన్ని మార్కింగ్ చెయ్యండి. మార్కింగ్ అంటే మీకందరికీ తెలుసే అనుకుంటాను. మార్కింగ్ చేస్తే మీరు టైపింగ్ చేసినదంతా నీలిరంగు పట్టీలలో కనిపిస్తుంది. అదెలాగో ఈ క్రింది స్క్రీన్ షాట్ ని గమనించండి. 

ఇలా  మార్కింగ్ చేసిన తరవాత - మీరు ఎమ్మెస్ వర్డ్ ని తెరచి, అందులో పేస్ట్ చేసుకోండి. అలా చేసుకున్నాక - ఆ వర్డ్ లో పేస్ట్ చేసుకున్న దాన్ని మళ్ళీ మార్క్ చెయ్యండి. అలా చేశాక - పైన టూల్ బాక్స్ Tool box లోని ఫాంట్ సెక్షన్ Font section లో ఫాంట్ ఏమున్నదో గమనించండి. అందులోని డిఫాల్ట్ ఫాంట్ ని మార్చండి. ఇక్కడే మీరు కాస్త గమనించాలి. తెలుగు ఫాంట్స్ కన్నా ఇంగ్లీష్ ఫాంట్స్ ని అక్కడ ఎన్నుకుంటూ / మారుస్తూ వెళ్ళాలి. అప్పుడే పదాల మధ్యన మరింత ఎడం ని సాధించగలం.  

అది ఎలాగో ఈ క్రింది స్క్రీన్ షాట్స్ లలో మీరు చూడవచ్చును. ఇందులో ఎర్రని వృత్తాలలో చూపెట్టినది ఫాంట్స్ పేర్లు. ఆయా ఫాంట్ లలో క్రిందన ఉన్న విషయం మధ్య స్పేస్ ఎలా ఉందో - మొదటి స్క్రీన్ షాట్ కీ, రెండో స్క్రీన్ షాట్ విషయం మధ్యన స్పేస్ ఎంతగా పెరిగిందో మీరే గమనిస్తారు. కేవలం ఫాంట్ మార్చిన మాత్రానే ఇలా సాధ్యం అవుతుంది. ఇలా రకరకాల ఫాంట్స్ ని ఎన్నుకుంటూ చూస్తే - లేఖిని నుండి వర్డ్ లో పేస్ట్ చేసుకునేటప్పుడు పదాల మధ్యన తగినంత దూరంని పొందవచ్చును. 

పైన పేస్ట్ చేసినది - గౌతమి Gauthami ఫాంట్ లో. అందులో పదాల మధ్యన వచ్చిన స్పేస్ ని గమనించండి. 

పైన పేస్ట్ నే మార్క్ చేసి, ఆంగ్ల ఫాంట్ అయిన కొరియర్ న్యూ Courier New  లోకి మారిస్తే పదాల మధ్యన వచ్చిన దూరం తేడాని మీరే స్పష్టముగా గమనించవచ్చు. 

ఇలా ఎలా వస్తుంది అంటే - ఇది కూడా చాలా చిన్న విషయమే. ఖతులు / ఫాంట్స్ తయారు చేసేటప్పుడు స్పేస్ ని కూడా ఇన్ని పిక్సెల్స్ Pixels / సైజు Size అంటూ నిర్ణయిస్తారు.  కొన్ని ఫాంట్స్ ఎక్కువ సైజు స్పేస్ ని రూపొందిస్తే - వాటిని వాడినప్పుడు ఇలా దూరముగా స్పేస్ వస్తుంది. 

మరిన్ని వివరాలకు :

 http://achampetraj.blogspot.in/2016/11/22408.html

- అచ్చంపేట్ రాజ్. 

www.achampetraj.blogspot.in

Humanist School

unread,
May 9, 2025, 11:01:45 AMMay 9
to తెలుగుబ్లాగు
ణ కి ఐత్వం రావటం లేదు. ఎందుకు?

ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-...@googlegroups.com కు మెయిలు పంపండి.

మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు, http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.
______________________________________________
 
బ్లాగుల సంకలినులు: koodali.org | jalleda.com | haaram.com | maalika.org | telugubloggers.com
బ్లాగు పాఠాలు: telugublogtutorial.blogspot.com | nerpu.com

---
You received this message because you are subscribed to the Google Groups "తెలుగుబ్లాగు" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugublog+...@googlegroups.com.

For more options, visit https://groups.google.com/d/optout.

--
--
______________________________________________
 
* ప్రతిస్పందనలని పంపేటప్పుడు ఈ కింది భాగాన్ని తొలగించగలరు *
______________________________________________
 
మీరు "తెలుగుబ్లాగు" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
ఈ గుంపుకు జాబు పంపేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-...@googlegroups.com కు మెయిలు పంపండి.

మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు, http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.
______________________________________________
 
బ్లాగుల సంకలినులు: koodali.org | jalleda.com | haaram.com | maalika.org | telugubloggers.com
బ్లాగు పాఠాలు: telugublogtutorial.blogspot.com | nerpu.com

---
You received this message because you are subscribed to the Google Groups "తెలుగుబ్లాగు" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugublog+...@googlegroups.com.

For more options, visit https://groups.google.com/d/optout.

--
--
______________________________________________
 
* ప్రతిస్పందనలని పంపేటప్పుడు ఈ కింది భాగాన్ని తొలగించగలరు *
______________________________________________
 
మీరు "తెలుగుబ్లాగు" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
ఈ గుంపుకు జాబు పంపేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-...@googlegroups.com కు మెయిలు పంపండి.

మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు, http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.
______________________________________________
 
బ్లాగుల సంకలినులు: koodali.org | jalleda.com | haaram.com | maalika.org | telugubloggers.com
బ్లాగు పాఠాలు: telugublogtutorial.blogspot.com | nerpu.com

---
You received this message because you are subscribed to the Google Groups "తెలుగుబ్లాగు" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugublog+...@googlegroups.com.

Kaśyap కశ్యప్

unread,
May 9, 2025, 11:23:58 AMMay 9
to telug...@googlegroups.com
లేఖిని లో  ణై - Nai
image.png
 
గూగుల్ ఇన్పుట్ లో Nai  తరవాత డౌన్  యారో నొక్కితే వస్తుంది 

image.png
 
మీ శ్రేయోభిలాషి 
కశ్యప్

9 మే, 2025, శుక్రన 8:31 PMకిన Humanist School <bssr...@gmail.com> రాసినది:
Reply all
Reply to author
Forward
0 new messages