లాస్య అనే పదానికి అర్ధం తెలుపగలరు

2,422 views
Skip to first unread message

manohar chenekala

unread,
Feb 3, 2011, 9:47:51 AM2/3/11
to telug...@googlegroups.com
లాస్య అనే పదానికి అర్ధం తెలుపగలరు

--
మనోహర్,సిహెచ్.(Manohar.Ch)
www.newjings.blogspot.com
www.etelugu.org
www.surasa.net

sailaja mithra

unread,
Feb 3, 2011, 9:54:08 AM2/3/11
to telug...@googlegroups.com
లాస్య ఆంటే చిరునవ్వు అని అర్థం 

2011/2/3 manohar chenekala <chk...@gmail.com>
--
______________________________________________
 
* ప్రతిస్పందనలని పంపేటప్పుడు ఈ కింది భాగాన్ని తొలగించగలరు *
 
మీరు "తెలుగుబ్లాగు" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
ఈ గుంపుకు జాబు పంపేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-...@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు, http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.
 
బ్లాగుల సంకలినులు: koodali.org | jalleda.com | haaram.com | maalika.org | telugubloggers.com
బ్లాగు పాఠాలు: telugublogtutorial.blogspot.com | nerpu.com

sarat r

unread,
Feb 3, 2011, 10:01:17 AM2/3/11
to telug...@googlegroups.com
Avunandi.. chirunavvu, na cousin peru kuda laasya

2011/2/3 sailaja mithra <sailaj...@gmail.com>



--
Thanks & Regards

Sarat Chandra

రహ్మానుద్దీన్ షేక్

unread,
Feb 3, 2011, 10:07:02 AM2/3/11
to telug...@googlegroups.com
నాట్యం లో ఒక భావం

2011/2/3 sarat r <sara...@gmail.com>



--
Rahimanuddin Shaik
నాని
॥రామానుజార్య దివ్యాజ్ఞాం వర్ధతామపివర్ధతాం॥

sree ganesh

unread,
Feb 3, 2011, 10:27:15 AM2/3/11
to telug...@googlegroups.com
laasyam amtee cirunavvu, laasya amtee cirunavvu kaladi ani ardhm anukumtaanu (matibardhakam- according to traditional grammar) .

2011/2/3 sailaja mithra <sailaj...@gmail.com>



--
 T. Sree Ganesh
Language Maintainer for Telugu
Red Hat Software Services Pvt Ltd
Pune.
Email: mrthot...@yahoo.com
Phone:  020 - 40057382.

Praveen Kumar Vitta

unread,
Feb 3, 2011, 10:36:48 AM2/3/11
to telug...@googlegroups.com
ఈ పదం లలితా సహస్రనామాలలో కూడా వస్తుంది..

లాస్యప్రియా లయకరీ లజ్జా రంభాది వందితా (142 వ శ్లోకం)


2011/2/3 రహ్మానుద్దీన్ షేక్ <nani...@gmail.com>
Message has been deleted

PANTULA JOGARAO

unread,
Feb 3, 2011, 11:03:17 AM2/3/11
to telug...@googlegroups.com


3 ఫిబ్రవరి 2011 9:06 సా న, Praveen Kumar Vitta <pravee...@gmail.com> ఇలా రాసారు :

లాస్య అనే పదానికి నృత్యము అనే అర్ధం. ఇదే పదానికి తౌర్య త్రికము అనే మరో అర్ధం కూడా ఉంది.  నృత్య , గీత , వాద్యములు మూడింటినీ కలిపి  తౌర్య త్రికము అని అంటారు.  అస్య పదానికి చిరు నవ్వు అనే అర్ధ ఉన్నట్టు తోచదు.

--
పంతుల జోగారావు

రహ్మానుద్దీన్ షేక్

unread,
Feb 4, 2011, 3:57:16 AM2/4/11
to telug...@googlegroups.com
లాస్యము అన్నపదం వయ్యారం, స్త్రీత్వం అన్న అర్థాన్ని గోచరిస్తుంది
పురుషత్వంతో నిండిన శివుని నాట్యాన్ని తాండవమని
అలాగే ఆ శివుని నాట్యానికి అంవయంలో పార్వతి చేసే నృత్యానికి లాస్యం అని అర్థం ఉంది

2011/2/3 PANTULA JOGARAO <pantula...@gmail.com>


3 ఫిబ్రవరి 2011 9:33 సా న, PANTULA JOGARAO <pantula...@gmail.com> ఇలా రాసారు :
లాస్య అనే పదానికి నృత్యము అనే అర్ధం. ఇదే పదానికి తౌర్య త్రికము అనే మరో అర్ధం కూడా ఉంది.  నృత్య , గీత , వాద్యములు మూడింటినీ కలిపి  తౌర్య త్రికము అని అంటారు.  లాస్య పదానికి చిరు నవ్వు అనే అర్ధ ఉన్నట్టు తోచదు.


--
పంతుల జోగారావు



--
పంతుల జోగారావు

--
______________________________________________
 
* ప్రతిస్పందనలని పంపేటప్పుడు ఈ కింది భాగాన్ని తొలగించగలరు *
 
మీరు "తెలుగుబ్లాగు" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
ఈ గుంపుకు జాబు పంపేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-...@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు, http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.
 
బ్లాగుల సంకలినులు: koodali.org | jalleda.com | haaram.com | maalika.org | telugubloggers.com
బ్లాగు పాఠాలు: telugublogtutorial.blogspot.com | nerpu.com

manohar chenekala

unread,
Feb 4, 2011, 4:06:05 AM2/4/11
to telug...@googlegroups.com
స్పందించిన అందరికీ ధన్యవాదాలు

2011/2/4 రహ్మానుద్దీన్ షేక్ <nani...@gmail.com>

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం

unread,
Feb 4, 2011, 5:01:38 AM2/4/11
to తెలుగుబ్లాగు
లాస్యం అంటే ఇదేదో హాస్యంలా ధ్వనిస్తోందని చిఱునవ్వు అనేస్తున్నారా ?
సందిగ్ధాలున్నప్పుడు నిఘంటువుల్ని సంప్రదిస్తే చిక్కు తీఱిపోతుంది.

దానికర్థం అది కాదు. లాస్యం అంటే స్త్రీ చేసే నృత్తం. పురుషుడు చేసేది
తాండవం.

Praveen Kumar Vitta

unread,
Feb 4, 2011, 8:52:26 AM2/4/11
to telug...@googlegroups.com
పిల్లల పేర్ల విషయంలో లాస్య అని పెడితే, అది  పరిపూర్ణ అర్ధాన్ని ఇస్తుందా? లాస్యము అనేది పదం..(noun?)
ఉత్త  లాస్య అని వాడినప్పుడు, ఇంకొక క్రియతో చేర్చి వాడుకోవాలా? (లాస్య ప్రియ అని అమ్మవారిని స్తుతిన్చినట్లు)..
వ్యాకరణం తెలిసినవారు వివరించగలరు...


2011/2/4 తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం <subtad...@gmail.com>

a sridhar

unread,
Feb 4, 2011, 10:57:46 AM2/4/11
to telug...@googlegroups.com
‘లాస్యవి’ అని పేరు పెడితే అది పరిపూర్ణమైన అర్థాన్ని ఇస్తుంది. లాస్యవి అంటే నర్తనము ( నాట్యము) అలవోకగా చెయ్యగలది   అని అర్థం వచ్చి నామవాచకం అవుతుంది. లాస్య అంటే అది విశేషణమే అవుతుంది.--- ఎ. శ్రీధర్.
 
2011/2/4 Praveen Kumar Vitta <pravee...@gmail.com>

svaram

unread,
Feb 4, 2011, 11:16:27 AM2/4/11
to తెలుగుబ్లాగు

following message sent by gabbita prasad
( http://groups.google.com/groups/profile?enc_user=_2RrXxgAAACRi6JOpMNLJDV3w4Te0oM2tiDKbEn1fjJfYkQTWXi1Vg
) Feb 4, 4:41 pm

అయ్యా లాస్య ఆంటేనృత్యం అని అర్ధం.శివుడు చేసేది తాండవం ,శివా ఆంటే
పార్వతి
చేసేది లాస్యం శివా లాస్యం అని పేరు చిరు నవ్వు అని ఎవరో అర్ధం చెప్పారు
అది
తప్పు .గమనించండి దుర్గా ప్రసాద్

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం

unread,
Feb 4, 2011, 1:24:34 PM2/4/11
to తెలుగుబ్లాగు
లాస్యవి అంటే అర్థమే లేదు.

వెనకటికొకాయన గుఱ్ఱము + అశ్వము = గుశ్వం అన్నాడట. అలా ఉంది. చూడబోతే
లాస్యానికీ వైష్ణవికీ పెళ్ళి చేసి లాస్యవి అంటున్నారా ? సరే, ఫర్వాలేదు
గానీ తాము కల్పించే పదాల అర్థం తమకైనా తెలిసుండాలి కదా, లోకానికి
తెలియకపోయినా !

>>"లాస్యవి’ అని పేరు పెడితే అది పరిపూర్ణమైన అర్థాన్ని ఇస్తుంది. లాస్యవి అంటే
>>నర్తనము ( నాట్యము) అలవోకగా చెయ్యగలది అని అర్థం వచ్చి నామవాచకం అవుతుంది.
>>లాస్య అంటే అది విశేషణమే అవుతుంది.--- ఎ. శ్రీధర్. "

చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎవఱు చెప్పారు ? ఏ వ్యాకరణసూత్రం ప్రకారం ఈ పదం
సిద్ధమవుతుంది ? నేనెక్కడా చదవలేదు, వినలేదు. మీఖు తెలిసిన కావ్య/
నైఘంటిక ప్రయోగమేదైనా ఉంటే ఇక్కడ టపా చేయగలరు.

అసలు భాషలో లాస్య అనే శబ్దరూపమే లేదు. ఉన్నది లాస్యమ్ ఒక్కటే.

a sridhar

unread,
Feb 4, 2011, 11:37:46 PM2/4/11
to telug...@googlegroups.com
లాస్యవి అనే పదానికి అర్థం నేను కల్పించినదికాదు. ఒక స్తోత్ర గ్రంధం యొక్క శీర్షిక అది. ఆ స్తోత్ర గ్రంధం మరేదో కాదు, లలితా సహస్ర నామ   స్తోత్రం. ఆ పుస్తకానికి ఆ శీర్షిక ఎందుకు పెట్టారో ,దాని ఔచిత్యమేమిటో  తెలుపుతూ మహామహులు కొందరు దానికి తొలిపలుకులు కూడా వ్రాసారు. ప్రస్తుతం ఆ గ్రంధం విజయనగరం లో, వేద పండితులు , ఎం.ఇ.ఓ గా పదవీ విరమణ చేసిన బ్రహ్మ శ్రీ గన్నవరపు సూర్యనారాయణ గారి  ఇంట్లో నిత్య పారాయణ గ్రంధంగా ఉంది. ఆయనే నా మనవరాలికి ఆ పేరుతో నామకరణం కూడా చేసారు. ఆ పుస్తకం నా దగ్గర లేదు కాబట్టి నేను దాని ఫొటో కాపీ పంపించ లేక పోతున్నాను. నా వివరణ సంతృప్తి కరంగా లేకపోతే, త్వరలోనే ఆ పుస్తకాన్ని తెప్పించి రుజువు చేయగలను. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే నాకు ఆ పదానికి అర్థం తెలిసిన  తర్వాతనే ఆ పేరు మనుమరాలికి పెట్టుకొన్నాను. --- ఎ.శ్రీధర్.

2011/2/4 తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం <subtad...@gmail.com>
లాస్యవి అంటే అర్థమే లేదు.

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం

unread,
Feb 5, 2011, 3:52:24 AM2/5/11
to తెలుగుబ్లాగు
కర్ణాకర్ణీగా విని చేసినట్లు మీరే చెబుతున్నారు. ఇహ నే
చెప్పడానికేముంది ? ఆ పదం ఎలా వచ్చిందని మీరు వారినెప్పుడైనా అడిగారా ?
లేదు కదా !మీరు స్వయంగా ఆ పదానికి అర్థం అన్వేషించారా ? లేదు కదా ?
ముద్రణలో ఒక అర్థరహితమైన పదనిర్మాణాన్ని చూసి (కేవలం ముద్రణలో ఉంది గనుక)
దాన్ని ప్రమాణంగా భావించి మీ చర్య మీరు తీసుకున్నారు. అంతే గదా !
చాలామంది చేసేది ఇదే. తప్పుడు పదాల్ని తమ వారసులకు నామకరణమ్ చేయడమే
కాకుండా "ఈ పేరుకు అర్థం ఏంటండీ ?" అని అడిగితే చెప్పలేక చాలా బోల్డు
కోపం తెచ్చుకుంటారు. మీరు కోపం తెచ్చుకోకపోవడం నా అదృష్టం. ఒకాయన తన
కూతుఱికి క్రివేణి అని పేరు పెట్టాడు. "త్రివేణి విన్నాం, సరే, ఈ
క్రివేణి ఏంటండీ ?" అనడిగితే "కృష్ణా త్రివేణీ రెండూ కలిసొచ్చేలా
పెట్టా"నని చెప్పాడు. వాళ్ళ ముచ్చట తీఱింది. బావుంది. ఱేపు ఆ పిల్ల
జీవితాంతం ఆ అర్థం లేని పేరుని పబ్లిక్ లో చెప్పుకుంటూ జనాల కుతూహల పూరిత
దృక్కుల్నీ, నర్మగర్భ మందహాసాల్నీ భరిస్తూ బతకాలన్న ఇంగితం వాళ్ళకుండదు.
ఈ రకంగా మనం మన స్వంత వ్యాకరణ సూత్రాల్ని ఆవిష్కరించి "రాజేశ్వరి +
పార్వతి = రాతి/ పారి" మొదలైన నవీన నామాల్ని కల్పించవచ్చు.

a sridhar

unread,
Feb 5, 2011, 7:34:29 AM2/5/11
to telug...@googlegroups.com
శ్రీ తాడేపల్లి గారికి, నమస్కారం ! మీ భాషాభిమానానికి అభినందనలు ! ఈ పదం యొక్క  ఔచిత్యం గురించి  కొంత మంది మహామహులు  పుస్తకంలో తొలిమాట వ్రాసారని చెప్పాను కదా, వారి భాషాభిమానం గురించి నాకు ఎలాంటి సందేహాలు లేవు, మీ విమర్శ సరియైనదే అయితే నాతో  పాటు  మరికొంత మంది మూర్ఖులు కూడా ఉన్నట్లే కదా ! మీరు ఆ వ్యాఖ్యలని చదివి ఉంటే మీకు కూడా సందేహం తీరుతుంది. ఆ పుస్తకం నాకు లభించిన  వెంటనే దానిని టపా చేస్తాను. అంత వరకు ఈ వివాదానికి నా వైపు నుండి విరామం పెడుతున్నాను. -- ఎ.శ్రీధర్.

2011/2/5 తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం <subtad...@gmail.com>

--

Rama Krishna Nagulavaram

unread,
Feb 6, 2011, 11:59:09 PM2/6/11
to telug...@googlegroups.com
అందరికి నా నమస్కారములు...
మీ సందేహాలకు, సమస్యలకు మరియు పదాలకు సరియైన అర్థములు కావాలని అనుకుంటే, మీరు ప్రతి రోజు భక్తి టీవీ లో వచ్చే " ధర్మ సందేహాలు " కార్యక్రమంలో వాళ్లకి రాస్తే, గురువులు శ్రీ కందాడై రామానుజ చార్యులు మరియు వి. పద్మాకర్ గారు లాంటి వారు మీకు సమాధానం ఇవ్వగలరు..
నా ఈ సూచన మీకు పనికి వస్తే తీసుకొనగలరు...
ఇట్లు
మీ
రామ క్రిష్ణ

2011/2/5 తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం <subtad...@gmail.com>

--

Amaranarayana B

unread,
Feb 7, 2011, 5:44:38 AM2/7/11
to telug...@googlegroups.com
గాజుల చిన్న సత్యనారాయణ పెద్ద బాల శిక్ష తిప్పితే సరిపోతుంది .

2011/2/7 Rama Krishna Nagulavaram <rknagu...@gmail.com>
______________________________________________

 
మీరు "తెలుగుబ్లాగు" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
ఈ గుంపుకు జాబు పంపేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-...@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు, http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.
______________________________________________

VENKATA RANGASAI MAMIDENNA

unread,
Feb 7, 2011, 11:12:42 AM2/7/11
to telug...@googlegroups.com
వందే  మాతరం
 
నాగులవరం  రామకృష్ణ  గారి  సూచనకు  నేర్నాలు.   భక్తీ  టీ వీ  లో  ఏ సమయంలో  ధర్మ సందేహాలు  కార్యక్రమం లో  శ్రీ  కందాడై రామానుజాచార్యులు  మరియు వి  పద్మాకర్ లు జవాబులు  ఇస్తున్నారో   తెలిపి  అ  భక్తీ  టి వి  వారి  చిరుమామా,టెలిఫోన్  నంబర్ల  వివరాలు  కూడా    ( రామక్రిష్ణగారే  కాకుండా  తెలసిన  ఎవరైనా) రాస్తే అందరికీ ఉపయోగంగా ఉంటుంది.  శ్రమ  కలిగిస్తున్నందుకు  క్షమించండి.
భవదీయుడు  
మామిడెన్న  వెంకట  రంగశాయి     


2011/2/7 Rama Krishna Nagulavaram <rknagu...@gmail.com>
అందరికి నా నమస్కారములు...
______________________________________________

 
మీరు "తెలుగుబ్లాగు" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
ఈ గుంపుకు జాబు పంపేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-...@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు, http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.
______________________________________________

Rama Krishna Nagulavaram

unread,
Feb 8, 2011, 1:17:07 AM2/8/11
to telug...@googlegroups.com
వందేమాతరం...
అందరికి నా నమస్కారములు..  ఇందులో శ్రమ అనుకోవడానికి ఏముందండీ... తెలిసింది అందరితో పంచుకోవడానికి, పంచుకుంటే మన విజ్ఞానం ఇంకా పెరుగుతుంది కదా మాష్టారు... సరే ఇక కార్యక్రమ సమయానికి వస్తే...
భక్తీ టీవీ లో ప్రతి రోజు ఉదయం 6 .30 నిమిషాలకు మరియు రాత్రి 10.30 నిముషాలకు మరల అదే కార్యక్రమము ప్రసారమవుతుంది. అరగంట కార్యక్రమం.. 6 నుంచి 8 ప్రశ్నలకు సమాధానం ఇస్తారు.. ఇక మన ప్రశ్న ఉత్తమంగా మరియు అందరికి ఉపయోగ పడే విధంగా వుంటే సమాధానం వెంటనే దొరుకుతుంది.. ఎందుకంటే వందల ఉత్తరాలు వస్తూ ఉంటాయి కదా. మనము కాస్త ఓపిక వహించవలసి వుంటుంది... ఈ మధ్య అందరికి ఏదో మరియు ఏంటో కొంత తెలుసుకోవాలి అన్న జిజ్ఞాస పెరుగుతూ వస్తోంది...
వారి చిరునామా ఇక్కడ వ్రాస్తున్నాను
ధర్మసందేహాలు
భక్తి టీవీ
రోడ్ నెంబర్ 92
జూబిలీ హిల్స్
హైదరాబాద్

మీ సందేహాలను, సమస్యలను ఒక పోస్ట్ కార్డు మీద వ్రాసి వారికి పంపండి.... సమాధానములు, సందేహాలు తీరుస్తారు.
ఇట్లు
భవదీయుడు

మీ
రామ క్రిష్ణ


2011/2/7 VENKATA RANGASAI MAMIDENNA <ratn...@gmail.com>

VENKATA RANGASAI MAMIDENNA

unread,
Feb 9, 2011, 11:35:33 AM2/9/11
to telug...@googlegroups.com
వందే  మాతరం
శ్రీ  నాగులవరం రామకృష్ణ  గారికి
అడిగిన  వెంటనే  జవాబు  ఇచ్చినందుకే కాకా  మీరు  కూడా  వందే మాతరం  అన్తూ కూడా మీ జవాబు  ప్రారంభించినందుకు  చాలా చాలా నెనరులు లేదా ధన్యవాదాలు.
మీరే కాకా ఇంకొంతమంది కూడా ఈ వందే మాతరం  అని మొదట రాసి తర్వాత జవాబు ఇచ్చారు.  వారందరికీ కూడా నా ధన్యవాదాలు.
అయితే కేవలం నాకు జవాబు  ఇచ్చినప్పుడే  కాకుండా ఇలా ప్రతి ఉత్తరం లోనూ  అందరూ రాయాలన్నదే నా కోరిక, స్వప్నం.
నేను  చాలా రోజుల క్రిందట రాసినది  మళ్ళా రాస్తున్నాను.
కొన్ని సంవత్సరాల క్రింద నేను ముంబై లో  ఉండగా అక్కడ ఒకచోట సమావేశామవుతూఉండే కొంతమంది వృద్ధులతో  గుడ్ మార్నింగ్ గుడ్ నైట్  లాంటివి  ఆపి  ఒకరినొకరు కలుసుకొంతున్నప్పుడు వందే మాతరం అందాం  అని నేను ప్రస్తావించినప్పుడు అక్కడున్న గుజరాతి, బెంగాలి, మహారాష్ట్ర, మున్నగు వారంతా అంగీకారం తెలపడం అలా ఆచరించడం మొదట కొందరు సంకోచించినా తరువాత  మా వృద్ధులే కాకా  యువకులూ అందరూ కూడా ఆరంభించారు. నేను ముంబాయి వ్సిడిచిపెట్ట్టివచ్చిశాను. అక్కడ వారు ఇంకా అలా కొనసాగిస్తున్నారో లేదో తెలియదు.
కానీ నేను మాత్రం  కొనసాగిస్తున్నాను.  టెలిఫోన్ ఎత్తినాపుడు కూడా వందే మాతరం అనే ప్రారంభిస్తాను.  
దేశం నలు మూలలా ప్రతి రోజూ, ప్రతీ క్షణం  ఈ వందే మాతరం నినాదం వినబదాలనీ, మనదేశ స్వతంత్ర పోరాటపు దినాలలో  ఈ నినాదం  ఎలా ప్రజలందరిలో దేశభక్తి పెంపొందించి  బ్రిటిష్  పాలకులను ఉలిక్కిపడేలా చేసీదో  అలాగే ఇవాళ కూడా ఈ నినాదం  విని దేశద్రోహులూ విదేశీ ఉగ్రవాదులూ భయపడాలన్నదే  నా ఆకాంక్ష.
మిమ్మలనందరినీ  విసిగిస్తే క్షమించండి
భవదీయుడు
మామిడెన్న  వెంకట  రంగశాయి 
2011/2/8 Rama Krishna Nagulavaram <rknagu...@gmail.com>
Message has been deleted

svaram

unread,
Feb 9, 2011, 11:47:31 AM2/9/11
to తెలుగుబ్లాగు
* CLOSED *

ఈ విషయాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను. ఈ విషయం గూర్చి
ఇక ముందు వచ్చే అభిప్రాయాలు ప్రకటించబడవని గమనించగలరు

ప్రతిస్పందించిన మిత్రులందరికీ ధన్యవాదములు

Reply all
Reply to author
Forward
This conversation is locked
You cannot reply and perform actions on locked conversations.
0 new messages