కొన్ని చూచనలు

93 views
Skip to first unread message

Rakesh Achanta

unread,
Jul 3, 2007, 5:40:08 AM7/3/07
to sahi...@googlegroups.com
నమస్కారం,

నేను రేపు భారతదేశం వెళ్తున్నాను. అనుకోని కారణాలవల్ల నాకు కాళీ సమయం ఎక్కువే ఉంటుంది.
మామూలుగా ఐతే సెలవలకి ఊరెళ్ళే ముందు కొన్ని మంచి (ఆంగ్ల) పస్తకాలు పట్టుకెళ్ళేవాణ్ణి. కానీ ఈ సారి తెలుగు సాహిత్యాన్ని పట్టుకెళదామని నిశ్చయించా.
తెలుగులో ఇప్పటి వరకూ నేను చదివినదల్లా విష్ణుపురాణం మరియు మంతెన సత్యనారాయణగారి ప్రకృతి జీవన శైలి పై పుస్తకమొకటి.

మీరు 'ఈ పుస్తకం అందరూ చదవాలి' అనుకునే మంచి పుస్తకాలు సూచించగలిగితే సంతోషం. అదే బొత్తాల పట్టీతో కొన్ని మంచి పద్య మరియు గద్యాలని సూచించగలరు.
'విజయానికి పదహారు మెట్లు' లాంటివి కాకుండా, నవలలూ, పద్యాలు, కథానికలు వంటివి. నేను ఆంగ్లలో ఎక్కువగా చాలా పాత పుస్తకాలు చదివేవాడిని.
అలాంటివాటితో మనోరంజనంతో బాటు, భాష మరియు, మనుషుల స్వభావాల గురించి నేర్చుకోవచ్చని నా నమ్మకం.

లేక పోతే భాగ్యనగరంలో మంచి తెలుగు పుస్తకాలు దొరికే పేద్ద దుకాణం (అంటే ప్రొద్దుటలోనికెళితే రాత్రి వరకూ అక్కడే ఉండిపోతామే) ఆ రకం పుస్తకాల దుకాణాలు ఒకటి రెండు
సూచించగలరు. అమీరుపేట - కూకటపల్లి వైపు ఐతే మరీ మంచిది. కూకటపల్లి నుండి రెండుకంటే ఎక్కువ బస్సులు మారకుండా వెళ్ళగలిగే ఏ చోటైనా పర్వాలేదు.
వాతానుకూలం ఉంటే మంచిది కానీ ఉండనవసరం లేదు. :)

కృతజ్ఞతలు
రాకేశ్
http://andam.blogspot.com/

jyothi valaboju

unread,
Jul 3, 2007, 5:46:43 AM7/3/07
to sahi...@googlegroups.com
అమీర్‍పేట్ కుకట్‍పల్లి  సైడు పెద్ద దుకాణాలు లేవండి. కోటి విశాలాంధ్ర ఐతే లోపలికెళ్ళడమే మీ చేతుల్లో ఉంటుంది.ఇంకా కొన్ని పెద్ద దుకాణాలు ఉన్నాయి.

రాకేశ్వర రావు ఆచంట

unread,
Jul 3, 2007, 6:03:40 AM7/3/07
to sahityam
వేసవి కాలం, అదీ ఎసీ దేశంనుంచి వస్తున్నా కాబట్టి భయం కొద్దీ అలా అన్నా
అంతే.
కోఠి పర్వాలేదు. "విశాలాంధ్ర" అనేది కొట్టు పేరా ?

>>కోటి విశాలాంధ్ర ఐతే లోపలికెళ్ళడమే మీ చేతుల్లో ఉంటుంది.

:) బాగా చెప్పారు, నేను కలం కొనడానికి కొట్టులోకెళ్ళి నాలుగు గంటలు
తరువాత బయటకు రావడం చాలా సార్లు జరుగుతుంది.

నాకు తెలుగు సాహిత్యం అసలు పరిచయం లేదు. ఎదో పదో తరగతి పాఠాలు తప్ప.
కన్యాశుల్కం నుండి మొదలు పెట్టాలి :)
కాబట్టి ఒకటి రెండు రచయితల పేర్లు కూడా వదిలి ఆదుకోగలరు.

KASYAP కశ్యప్

unread,
Jul 3, 2007, 6:42:25 AM7/3/07
to sahi...@googlegroups.com
అమీరుపేట లో పుస్తక ప్రదర్సన ఇంకావుంటే ఎందుకబ్బా అనుకోన్నా:-).
హా...వీలతే మన పోట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం విక్రయ శాలను దశ్సించండి మంచి పుస్తకాలు సరసమయిన ధరలలో దోరుకుతాయి
మీ శ్రేయోబిలాషి
కశ్యప్

 

sowmya balakrishna

unread,
Jul 3, 2007, 6:50:08 AM7/3/07
to sahi...@googlegroups.com
naa votu "visalandra" ki, "navodaya" ki.
 
pustakaalante: 'salaam hyderabad' ani oka pustakam untundi...meeku telangana bhaasha lo chadavadam abyamtaram lekunte chadavandi. its a very nice book. rachayita-lokeswar.
 
S.

 
--
---------------------------------------------------
V.B.Sowmya
SIEL,IIIT-Hyderabad
http://search.iiit.ac.in/
my blog:
http://vbsowmya.wordpress.com
----------------------------------------------------

kotta pali

unread,
Jul 3, 2007, 8:23:33 AM7/3/07
to sahi...@googlegroups.com
Make sure to visit Visalandhra on Kothi main road - they have a good collection and you can browse. Also Visalandhra has been bringing out series of "complete works" by many great writers of yesteryears. They've started with KoKu (Kodavatiganti Kutumbarao, Rohiniprasad's father) years ago. Followed by Mullapudi Venkataramana, Joshua, Sreepada Subrahmanya Sastri, Vasireddi Seetadevi, and recently, Devulapalli Krishna Sastri. BTW, Visalandhra is a publishing house - Kothi is their main shop and they have branches in all major AP cities.

Disa Book Center in Chikkadpalli (near Chandana Bros) is a good point to get more contemporary, off-beat books.

Another good source is the Sunday footpath used book sellers in Kothi. But then - you need to know what you're looking for, it is not air conditioned and it is definitely not near Kukatpalli :-))

Must buy -
golden oldies
vijayavilAsamu - cEmakUra vemkaTakavi - tApI dharmArAvu vyAkhyatO
Amukta mAlyada - SrIkRshNadEvarAyalu - vAviLLa vAri vyAkhyatO

classics
Kodavatiganti Kutumbarao sAhityaM - 6 volumes
SrIpAda subrahmanya Sastri kathalu - 3 volumes
sAkshi vyAsAlu - pAnuganti lakshmi narasimham
krishna Sastri poetry
amRtaM kurisina rAtri - tilak poetry
mahA prasthAnaM, khaDgasRshTi - SrISrI poetry

Contemporary
katha annuals (katha 2006 is the latest)
dRSyAdRSyaM - caMdralata
himajvAla, anukshaNikaM - vaddera chandidaas


 
http://kottapali.blogspot.com
http://vinnakanna.blogspot.com
http://telpoettrans.blogspot.com


Got a little couch potato?
Check out fun summer activities for kids.

sowmya balakrishna

unread,
Jul 3, 2007, 8:33:33 AM7/3/07
to sahi...@googlegroups.com
Sunday footpath lo telugu pustakaalu ekkadivandi kottapali garu??
 
S.

 
--
---------------------------------------------------
V.B.Sowmya
M.S.(by research) in CSE-Second Year
Search & Information Extraction Lab,
IIIT-Hyderabad

jyothi valaboju

unread,
Jul 3, 2007, 8:36:58 AM7/3/07
to sahi...@googlegroups.com
 
we get old books on sunday frm abids to koti...hv heavy breakfast and start searching books...frommorning...u get many books...

Prasad Charasala

unread,
Jul 3, 2007, 9:14:45 AM7/3/07
to sahi...@googlegroups.com

నామిని సుబ్రమణ్యం నాయుడు "మిట్టూరోడి కథలు" భలే వుంటాయి. మీరు రానారె అభిమాని అయితే ఇవి తప్పక చదవాల్సిన కథలు.
--ప్రసాద్
http://blog.charasala.com

 



On 7/3/07, jyothi valaboju <jyothiv...@gmail.com> wrote:
 
we get old books on sunday frm abids to koti...hv heavy breakfast and start searching books...frommorning...u get many books...



--
Prasad
http://blog.charasala.com

వెంకట రమణ (Venkata Ramana)

unread,
Jul 3, 2007, 9:19:28 AM7/3/07
to sahi...@googlegroups.com
రానారె అభిమాని అయితే ప్రళయ కావేరి కథలు కూడా తప్పక చదవాలి :).
-రమణ.


--
రమణ
http://uvramana.wordpress.com

Prasad Charasala

unread,
Jul 3, 2007, 9:20:55 AM7/3/07
to sahi...@googlegroups.com

"ప్రళయ కావేరి కథలు" ఎవరివి? అవి కూడా రాయలసీమ యాసలో వుంటాయా?

--
Prasad
http://blog.charasala.com

వెంకట రమణ (Venkata Ramana)

unread,
Jul 3, 2007, 9:25:04 AM7/3/07
to sahi...@googlegroups.com
అవును రాయలసీమ యాసలోనే ఉంటాయి. రచయిత పేరు సామల రమేష్ అనుకుంటా. మరిన్ని
వివరాలు త్రివిక్రం చెప్పగలడు. నా చేత కొనిపించింది అతనే మరి.
-రమణ.


--
రమణ
http://uvramana.wordpress.com

Prasad Charasala

unread,
Jul 3, 2007, 9:41:23 AM7/3/07
to sahi...@googlegroups.com
avkfలో ఇక్కడ వుందిది. థ్యాంక్స్ రమణ గారు.

--ప్రసాద్
http://blog.charasala.com

 



 
--
Prasad
http://blog.charasala.com

Ramanadha Reddy Yarrapu Reddy

unread,
Jul 3, 2007, 9:45:48 AM7/3/07
to sahi...@googlegroups.com

"మీరు నన్ను మరీ పెద్దల్లో కలిపేస్తున్నారండీ" అని పళ్లికిలిస్తూ వినయం ప్రదర్శించక తప్పని పరిస్థితిని ఆంగ్లంలో false modesty అంటారని చదివాను (ముళ్లపూడివెంకటరమణ సాహితీ సర్వస్వంలోని సినీరమణీయంలో భానుమతీరామకృష్ణగారిని గురించిన వ్యాసంలో). false modesty ని తెలుగులో ఏమంటారు?
 
ప్రసాదు, రమణగార్లకు ధన్యవాదాలతో,
~ రానారె.
 
రానారె అభిమాని అయితే ప్రళయ కావేరి కథలు కూడా తప్పక చదవాలి :).
-రమణ.

On 7/3/07, Prasad Charasala < char...@gmail.com> wrote:
> నామిని సుబ్రమణ్యం నాయుడు "మిట్టూరోడి కథలు" భలే వుంటాయి. మీరు రానారె అభిమాని
> అయితే ఇవి తప్పక చదవాల్సిన కథలు.
> --ప్రసాద్
> http://blog.charasala.com



--
~ రానారె [ http://yarnar.blogspot.com http://mynoice.blogspot.com ]

Veeven (వీవెన్)

unread,
Jul 3, 2007, 9:51:32 AM7/3/07
to sahi...@googlegroups.com
On 7/3/07, Ramanadha Reddy Yarrapu Reddy <iamra...@gmail.com> wrote:
> "మీరు నన్ను మరీ పెద్దల్లో కలిపేస్తున్నారండీ" అని పళ్లికిలిస్తూ వినయం
> ప్రదర్శించక తప్పని పరిస్థితిని ఆంగ్లంలో false modesty అంటారని చదివాను
> (ముళ్లపూడివెంకటరమణ సాహితీ సర్వస్వంలోని సినీరమణీయంలో భానుమతీరామకృష్ణగారిని
> గురించిన వ్యాసంలో). false modesty ని తెలుగులో ఏమంటారు?

నక్క వినయం

Prasad Charasala

unread,
Jul 3, 2007, 9:53:05 AM7/3/07
to sahi...@googlegroups.com
మీరు పళ్ళికిలించినా, నొసలు చిట్లించినా... నాకయితే మీ కథలు చదువుతుంటే ..నామిని మిట్టూరోడి కథల తరువాయి భాగం చదువుతున్నట్లే అనిపిస్తుంది.
 
ఒక యండాకాలంలో మనకొక అనుమానమొచ్చింది. మా ముష్టికొండ కిందుండే నక్కలగుట్ట మధ్యలో నీటిబుగ్గ పుడితే, ఆ నీళ్లు నేరుగా గుట్టమధ్యలోనించీ పైకి చిమ్ముతాయా, ల్యాకపోతే, మధ్యలోనే బొక్కబెట్టుకోని బైటికొచ్చేస్సాయా - అని. కానీ ఎట్టా తెలుసుకోవడం? మనకు వెంటనే ఒక ఆలోచనొచ్చింది. ఆలోచన రావడమేంది, మనం సెయ్యకపోవడమేంది, ఏమన్నా అర్థముండాదా? మట్టికుప్పగా తోసినా. కుప్పగాతోసి, దాని మధ్యలో నీటిబుగ్గ పుట్టించినా. మల్లేంజరిగిందో నాకెరుక దేవునికెరుక. కాదుకాదు, మా ఇంట్లోవాళ్లకెరుక. ఊళ్లోవాళ్లందరికీ యెరుకైపోయింది. కనబణ్ణోళ్లంతా అడగేపనే - "ఏం కదరయ్యా గువ్వెట్టుండాది? నొప్పి తగ్గిపొయ్యింద్యా?". అడగరా మడే! ఒకరోజా రెండ్రోజులా వారంపాటు. ఒంటికిబొయ్యాలంటే ఒక బాధగాదులే. తాతముత్తాతలంతా - "వినువీధిని శ్రేణులుగా నిల్చి విడ్డూరముగా చూచెదరా!" అంటే సూడరా!?

 

ఇది చదువుతుంటే నామిని "మజ్జాన్నానికి మకరాజై పోదామని" కథ గుర్తుకొచ్చి అందులో తొండను చంపి వుచ్చ పోసిన వైనం గుర్తుకొచ్చింది.


 

--ప్రసాద్
http://blog.charasala.com

On 7/3/07, Ramanadha Reddy Yarrapu Reddy <iamra...@gmail.com> wrote:



--
Prasad
http://blog.charasala.com

నవీన్ గార్ల

unread,
Jul 3, 2007, 10:41:11 AM7/3/07
to sahityam
మహమ్మద్ ఖదీర్ బాబుని మరిసిపోయినారే!!!!! నా తిక్కగానీ ఇంగా అయ్యన్నీ
సదవకుండా ఇడిసిపెట్టింటారా యేంది :)

- నవీన్‌ గార్ల

On Jul 3, 6:53 pm, "Prasad Charasala" <charas...@gmail.com> wrote:
> మీరు పళ్ళికిలించినా, నొసలు చిట్లించినా... నాకయితే మీ కథలు చదువుతుంటే
> ..నామిని మిట్టూరోడి కథల తరువాయి భాగం చదువుతున్నట్లే అనిపిస్తుంది.
>
> > ఒక యండాకాలంలో మనకొక అనుమానమొచ్చింది. మా ముష్టికొండ కిందుండే నక్కలగుట్ట
> > మధ్యలో నీటిబుగ్గ పుడితే, ఆ నీళ్లు నేరుగా గుట్టమధ్యలోనించీ పైకి చిమ్ముతాయా,
> > ల్యాకపోతే, మధ్యలోనే బొక్కబెట్టుకోని బైటికొచ్చేస్సాయా - అని. కానీ ఎట్టా
> > తెలుసుకోవడం? మనకు వెంటనే ఒక ఆలోచనొచ్చింది. ఆలోచన రావడమేంది, మనం
> > సెయ్యకపోవడమేంది, ఏమన్నా అర్థముండాదా? మట్టికుప్పగా తోసినా. కుప్పగాతోసి, దాని
> > మధ్యలో నీటిబుగ్గ పుట్టించినా. మల్లేంజరిగిందో నాకెరుక దేవునికెరుక. కాదుకాదు,
> > మా ఇంట్లోవాళ్లకెరుక. ఊళ్లోవాళ్లందరికీ యెరుకైపోయింది. కనబణ్ణోళ్లంతా అడగేపనే -
> > "ఏం కదరయ్యా గువ్వెట్టుండాది? నొప్పి తగ్గిపొయ్యింద్యా?". అడగరా మడే! ఒకరోజా
> > రెండ్రోజులా వారంపాటు. ఒంటికిబొయ్యాలంటే ఒక బాధగాదులే. తాతముత్తాతలంతా -
> > "వినువీధిని శ్రేణులుగా నిల్చి విడ్డూరముగా చూచెదరా!" అంటే సూడరా!?
>
> ఇది చదువుతుంటే నామిని "మజ్జాన్నానికి మకరాజై పోదామని" కథ గుర్తుకొచ్చి అందులో
> తొండను చంపి వుచ్చ పోసిన వైనం గుర్తుకొచ్చింది.
>
> --ప్రసాద్http://blog.charasala.com

> On 7/3/07, Ramanadha Reddy Yarrapu Reddy <iamramuh...@gmail.com> wrote:
>
>
>
>
>
> > "మీరు నన్ను మరీ పెద్దల్లో కలిపేస్తున్నారండీ" అని పళ్లికిలిస్తూ వినయం
> > ప్రదర్శించక తప్పని పరిస్థితిని ఆంగ్లంలో false modesty అంటారని చదివాను
> > (ముళ్లపూడివెంకటరమణ సాహితీ సర్వస్వంలోని సినీరమణీయంలో భానుమతీరామకృష్ణగారిని
> > గురించిన వ్యాసంలో). false modesty ని తెలుగులో ఏమంటారు?
>
> > ప్రసాదు, రమణగార్లకు ధన్యవాదాలతో,
> > ~ రానారె.
>
> > > రానారె అభిమాని అయితే ప్రళయ కావేరి కథలు కూడా తప్పక చదవాలి :).
> > > -రమణ.
>

Prasad Charasala

unread,
Jul 3, 2007, 10:43:26 AM7/3/07
to sahi...@googlegroups.com

ఈయన రచనలు కొన్ని వుదహరించండి.

--ప్రసాద్
http://blog.charasala.com

Ramanadha Reddy Yarrapu Reddy

unread,
Jul 3, 2007, 12:08:56 PM7/3/07
to sahi...@googlegroups.com
ఏదైనా ప్రయోజనం ఆశించి ద్రోహపూరిత ఆలోచనలతో పంచనచేరి ప్రదర్శించే వినయం నక్కవినయం కదా!?
నేను చెప్పిన ఉదాహరణలో ద్రోహం లేదు కదా! (కొంపదీసి ఉందా యేమిటి!)   :-)
 
రాకేశ్,
ఈ ఎండల్లో హాయిగా చదువుకోదగినవి ముళ్లపూడివెంకటరమణ సాహితీ సర్వస్వం. (మొత్తం ఎనిమిది సంపుటాలనుకుంటాను, సరిగా తెలీదు.) కాకపోతే, ఇవన్నీ ఏకబిగిన చదవితే ఒకే మూస అనిపించి బోరుకొడతాయి. ఒక్క సినీరమణీయం మినహాయించి. కొత్తపాళిగారు చెప్పిన must buy జాబితా చదవడమనేది కాస్త బాగుపడే లక్షణాలున్నవారు చేసే పని అనుకోండి. అది వేరే సంగతి. :-) మీకు ఆ లక్షణాలున్నాయి కనుక మధ్యమధ్యలో మరమరాల్లాగా ముళ్లపూడి రచనలు సహాయ పడవచ్చని చెబుతున్నాను.

 

నేనుసైతం

unread,
Jul 3, 2007, 12:42:33 PM7/3/07
to sahityam
ఆలూరి బైరాగి వ్రాసిన 'నూతిలో గొంతుకలు ' తప్పకుండా చదవదగినది. బైరాగి
వ్రాసినవి తక్కువే అయినప్పటికి, అద్భుతమైన కవితలు అవి.

On Jul 3, 12:08 pm, "Ramanadha Reddy Yarrapu Reddy"

padma i.

unread,
Jul 3, 2007, 9:32:46 PM7/3/07
to sahityam
నామిని సుబ్రహ్మణ్యం నాయుడి "మిట్టూరోడి కతలూ, 'పచ్చనాకు సాక్షిగా',
'సినబ్బ కథల' లాంటి కథల్లొ
భాష కొద్దిగా మొరటు (కొన్ని సార్లు విషయం కూడా -- "ట్రిమ్మోడి కడుపులో
గలాంబులాం :-)"!) అయినా
ఈ కథల్లో ఆర్ద్రత, నిజాయితీ మనసుని తాకి కళ్ళు తడి చేస్తాయి.
ఇలా మాండలికంలో ఆత్మకథాత్మకంగా sketches రాయడం ఈమధ్య కాలంలో బహుశా
నామినితో మొదలయిందేమో!
మహమ్మద్ ఖదీర్ బాబు ('దర్గామిట్ట కథలు, ఇస్కూలు పిల్ల కాయల కథలూ) నాకు
నచ్చిన మరొక రచయిత.
వీటిలో విషయం ఎక్కువ ఉండదు, కానీ (కావలిలో) లో దిగువ మధ్య తరగతి ముస్లిం
కుటుంబ జీవితాన్ని
అద్భుతంగా ఆవిష్కరించాయి. ఒకదానిలో (దీని పేరు గుర్తు రావడం లేదు)
అక్బర్(?) రేఖా చిత్రాలు చక్కగా
నప్పాయి. Harry Potter పుస్తకాలకి Mary GrandPré artwork లాగ. సోమరజు
సుశీల 'ఇల్లేరమ్మ కథలూ
నాకు కొంచెం cutesy గా అనిపించాయి.

అతిచక్కని తెలుగు నుడికారం, సరళమైన భాష, అక్కడక్కడ తొంగిచూసే రాయలసీమ
మాండలికం
కావాలంటే మధురాంతకం రాజారాం కథలు కొనుక్కోండి. స్ఫూర్తి కావాలంటే శ్రీపాద
సుబ్రహ్మణ్య శాస్త్రి,
తిరుమల రామచంద్ర, టంగుటూరి ప్రకాశం ల ఆత్మ కథలు కొనుక్కోండి.

ఆధునిక సాహిత్యం కొనుక్కోవడానికి సూచనలు కావాలంటే, కొన్నాళ్ల క్రితం
వెల్చేరు నారాయణ రావుగారు
మరి కొందరు తయారు చేసిన "ఈ శతాబ్దపు రచనా శతం" చూడండి.
http://eemaata.com/em/issues/199907/836.html

ఇందులో చాలా పుస్తకాలు విశాలాంధ్ర లోనో, AVKF.org లోనో దొరకచ్చు.

Happy reading!
-- Padma I.
07/03/07

sowmya balakrishna

unread,
Jul 3, 2007, 10:38:43 PM7/3/07
to sahi...@googlegroups.com
naveen garu
 
nenu ade anukuntunnaa... Mohd Khadeer Babu peru evaru cheppaledu emiti ani!
 
S.

 

K.V.Giridhararao

unread,
Jul 4, 2007, 1:48:29 AM7/4/07
to sahityam
ఖదీర్ బాబు గారి కథలు - దర్గామిట్ట కతలు, పోలేరమ్మబండ కతలు. ఇస్కూలు
పిలకాయల కథలు - నామిని గారివి అని గుర్తు.
నామిని, ఖదీర్ బాబు, సోమరాజు సుశీల కథల కోవలోకి వచ్చే ఇంకో మంచి కథల
పుస్తకం శంకరమంచి సత్యం గారి 'అమరావతి కథలు'.


On Jul 3, 6:32 pm, "padma i." <padmagro...@gmail.com> wrote:
> నామిని సుబ్రహ్మణ్యం నాయుడి "మిట్టూరోడి కతలూ, 'పచ్చనాకు సాక్షిగా',
> 'సినబ్బ కథల' లాంటి కథల్లొ
> భాష కొద్దిగా మొరటు (కొన్ని సార్లు విషయం కూడా -- "ట్రిమ్మోడి కడుపులో
> గలాంబులాం :-)"!) అయినా
> ఈ కథల్లో ఆర్ద్రత, నిజాయితీ మనసుని తాకి కళ్ళు తడి చేస్తాయి.
> ఇలా మాండలికంలో ఆత్మకథాత్మకంగా sketches రాయడం ఈమధ్య కాలంలో బహుశా
> నామినితో మొదలయిందేమో!
> మహమ్మద్ ఖదీర్ బాబు ('దర్గామిట్ట కథలు, ఇస్కూలు పిల్ల కాయల కథలూ) నాకు

> నచ్చిన మరొక రచయిత.
> వీటిలో విషయం ఎక్కువ ఉండదు, కానీ (కావలిలో) లో దిగువ మధ్య తరగతి ముస్లిం
> కుటుంబ జీవితాన్ని
> అద్భుతంగా ఆవిష్కరించాయి. ఒకదానిలో (దీని పేరు గుర్తు రావడం లేదు)
> అక్బర్(?) రేఖా చిత్రాలు చక్కగా
> నప్పాయి. Harry Potter పుస్తకాలకి Mary GrandPré artwork లాగ. సోమరజు
> సుశీల 'ఇల్లేరమ్మ కథలూ
> నాకు కొంచెం cutesy గా అనిపించాయి.
>
> అతిచక్కని తెలుగు నుడికారం, సరళమైన భాష, అక్కడక్కడ తొంగిచూసే రాయలసీమ
> మాండలికం
> కావాలంటే మధురాంతకం రాజారాం కథలు కొనుక్కోండి. స్ఫూర్తి కావాలంటే శ్రీపాద
> సుబ్రహ్మణ్య శాస్త్రి,
> తిరుమల రామచంద్ర, టంగుటూరి ప్రకాశం ల ఆత్మ కథలు కొనుక్కోండి.
>
> ఆధునిక సాహిత్యం కొనుక్కోవడానికి సూచనలు కావాలంటే, కొన్నాళ్ల క్రితం
> వెల్చేరు నారాయణ రావుగారు

> మరి కొందరు తయారు చేసిన "ఈ శతాబ్దపు రచనా శతం" చూడండి.http://eemaata.com/em/issues/199907/836.html

> > రాకేశ్http://andam.blogspot.com/- Hide quoted text -
>
> - Show quoted text -

నవీన్ గార్ల

unread,
Jul 4, 2007, 2:12:44 AM7/4/07
to sahityam
అన్నీ Summarize చేస్తున్నాను ..ఇవన్నీ ఎక్కడ కొనుక్కోవచ్చో..ఎంతవుతుందో
ఎవరైనా తెలిసినవాళ్ళు చెబితే సంతోషిస్తా :)

golden oldies
విజయవిలాసము - చేమకూర వెంకటకవి - తాపీ ధర్మారావు వ్యాఖ్యతో
ఆముక్త మాల్యద - శ్రీకృష్ణదేవరాయలు - వావిళ్ళ వారి వ్యాఖ్యతో

classics
కొడవగంటి కుటుంబరావు సాహిత్యం - 6 volumes
శ్రీపాద సుబ్రహ్మన్య శస్త్రి కథలు - 3 volumes
సాక్షి వ్యాసాలు - పానుగంతి లక్ష్మి నరసిమ్హం
కృష్ణ శాస్త్రి poetry
అమృతం కురిసిన రాత్రి - తిలక్ poetry
మహా ప్రస్థానం, ఖడ్గసృష్టి - శ్రీశ్రీ poetry

Contemporary
katha annuals (katha 2006 is the latest)

దృశ్యాదృశ్యం - చంద్రలత
హిమజ్వాల, అనుక్షణికం - వద్దెర చందిదాస్
నూతిలో గొంతుకలు - ఆలూరి బైరాగి

కథా సంపుటి
మిట్టూరోడి కథలు - నామిని సుబ్రమణ్యం నాయుడు
పచ్చనాకు సాక్షిగా- నామిని సుబ్రమణ్యం నాయుడు
సినబ్బ కథల- నామిని సుబ్రమణ్యం నాయుడు
దర్గామిట్ట కథలు - మహమ్మద్ ఖదీర్ బాబు
ఇస్కూలు పిల్ల కాయల కథలూ - నామిని సుబ్రమణ్యం నాయుడు
పోలేరమ్మబండ కతలు- మహమ్మద్ ఖదీర్ బాబు
అమరావతి కథలు - శంకరమంచి సత్యం
ప్రళయ కావేరి కథలు - ramEsh
మా పసలపూడి కథలు - వంశీ

- నవీన్‌ గార్ల

(http://gsnaveen.wordpress.com)

> > > రాకేశ్http://andam.blogspot.com/-Hide quoted text -

KASYAP కశ్యప్

unread,
Jul 4, 2007, 2:18:59 AM7/4/07
to sahi...@googlegroups.com

ఒక విషయం,
ప్రళయ కావేరి కథలు -ఇక్కడ వున్నాయి

http://www.telugupeople.com/discussion/multiPageArticle.asp?id=22714&page=1



jyothi valaboju

unread,
Jul 4, 2007, 2:25:41 AM7/4/07
to sahi...@googlegroups.com
వీశాలాంధ్ర జిందాబాద్...
 
 
 
 
తెలుగుదుకాణంలో ప్రయత్నించండి . మురళిగారు ఏమంటారో?/

K.V.Giridhararao

unread,
Jul 4, 2007, 4:37:37 AM7/4/07
to sahityam

జ్యోతి గారు, మీరు సమైక్య వాదులా :-)

On Jul 3, 11:25 pm, "jyothi valaboju" <jyothivalab...@gmail.com>
wrote:

jyothi valaboju

unread,
Jul 4, 2007, 6:24:45 AM7/4/07
to sahi...@googlegroups.com
నేను ఏ వాదిని కాను.వట్టి మనిషిని. నచ్చిన దానిని,నచ్చనిదానిని నిర్మొహమాటంగా చెప్పడం అలవాటు అంతే.అసలు సమైక్యవాదం అంటే అర్ధం కూడా తెలీదు. తెలుసుకోవాలనే ఆలోచన కూడా లేదు. క్షమించండి.

KASYAP కశ్యప్

unread,
Jul 4, 2007, 6:32:48 AM7/4/07
to sahi...@googlegroups.com

వీశాలాంధ్ర - జిందాబాద్...
వీశాలాంధ్ర - విశాలమయిన అంద్ర్రరాస్టం ,కోటీ లోపుస్తకాల షాపు, ఒక దినప్రత్రిక ...
 
On 7/4/07, jyothi valaboju <jyothiv...@gmail.com> wrote:
నేను ఏ వాదిని కాను.వట్టి మనిషిని. నచ్చిన దానిని,నచ్చనిదానిని నిర్మొహమాటంగా చెప్పడం అలవాటు అంతే.అసలు సమైక్యవాదం అంటే అర్ధం కూడా తెలీదు. తెలుసుకోవాలనే ఆలోచన కూడా లేదు. క్షమించండి.






--
మీ శ్రేయోబిలాషి
కశ్యప్
kaburlu.wordpress.com
telugumap.blogspot.com

Prasad Charasala

unread,
Jul 4, 2007, 7:20:38 AM7/4/07
to sahi...@googlegroups.com
"పచ్చనాకు సాక్షిగా", "సినబ్బ కథలు", "మునికన్నడి సేద్యం", "పాల పొదుగు" ఇవి నాలుగూకలిపి ఒకే సంపుటంగా ముద్రించిన పుస్తకం పేరు "మిట్టూరోడి కథలు".
పద్మ గారన్నట్లు భాష మొరటుగా వున్నా అర్ద్రంగా వుండి మనసును తాకుతాయి.

వీటన్నిటికీ షాపుల వెంటబడేకంటే avkf.orgలో ఆర్డర్ చేయడం సుళువైన పని. పుస్తకాలు ఇంటిముందరకేవస్తాయి.


-ప్రసాద్
http://blog.charasala.com

--
Prasad
http://blog.charasala.com

sowmya balakrishna

unread,
Jul 4, 2007, 7:24:49 AM7/4/07
to sahi...@googlegroups.com
షాపులకెళ్ళి ఆ పుస్తకాల మధ్య తిరుగుతూ, మధ్య మధ్యన ఒకటీ అరా తిరగేస్తూ ఉండటం లో ఉన్న ఆనందమే వేరండీ ప్రసాద్ గారూ!
అదొక ఎత్తైతే, షాపులు తిరిగి తిరిగి కొంటే ఆ పుస్తకం మామూలుకంటే కూడా విలువైనది గా అనిపిస్తుంది. :) దాని మీద ప్రేమ కూడా కలగొచ్చు. ;)

S.
--
---------------------------------------------------
V.B.Sowmya
M.S.(by research) in CSE-Second Year

Prasad Charasala

unread,
Jul 4, 2007, 7:29:05 AM7/4/07
to sahi...@googlegroups.com
పక్కనే ఆమాటా రాయబోయి చివరి క్షణంలో రాయలేదు. :)
అవకాశం వుండీ షాపుకెళ్ళి కొనగలిగి అందులో ఆనందాన్ని పొందగలిగే వాళ్ళకి అది బాగానే వుంటుంది.


-ప్రసాద్
http://blog.charasala.com

--
Prasad
http://blog.charasala.com

jyothi valaboju

unread,
Jul 4, 2007, 7:29:46 AM7/4/07
to sahi...@googlegroups.com
 
మనం   ఒక పుస్తకం కావాలని షాపుకెలితే  ఇంకా పది మనకు తెలియనివి, కావల్సినవి దొరుకుతాయి. కొన్ని  అక్కడే కొంచెం చదివి కూడా   కొనుక్కుంటాము.

kotta pali

unread,
Jul 4, 2007, 10:10:42 AM7/4/07
to sahi...@googlegroups.com
అబ్జెక్షన్ యువరానర్! నామిని కథలూ ఖదీర్ కథలూ మంచివే అయినా, వాటికీ అమరావతి కథలకీ - నక్కకీ నాకలోకానికీ ఉన్నంత తేడా ఉంది.
 
http://kottapali.blogspot.com
http://vinnakanna.blogspot.com
http://telpoettrans.blogspot.com


----- Original Message ----
From: K.V.Giridhararao <giri...@gmail.com>
To: sahityam <sahi...@googlegroups.com>
Sent: Wednesday, July 4, 2007 11:18:29 AM
Subject: [సాహిత్యం] Re: కొన్ని చూచనలు

ఖదీర్ బాబు గారి కథలు - దర్గామిట్ట కతలు, పోలేరమ్మబండ కతలు. ఇస్కూలు
పిలకాయల కథలు - నామిని గారివి అని గుర్తు.
నామిని, ఖదీర్ బాబు, సోమరాజు సుశీల కథల కోవలోకి వచ్చే ఇంకో మంచి కథల
పుస్తకం శంకరమంచి సత్యం గారి 'అమరావతి కథలు'.




Fussy? Opinionated? Impossible to please? Perfect. Join Yahoo!'s user panel and lay it on us.

kotta pali

unread,
Jul 4, 2007, 10:12:26 AM7/4/07
to sahi...@googlegroups.com
అదియుంగాక AVKF వారి సేవ అమెరికా సంయుక్తరాష్ట్రాలకి పరిమితం అనుకుంటున్నా. తప్పుకావచ్చు.
----- Original Message ----
From: Prasad Charasala <char...@gmail.com>
To: sahi...@googlegroups.com
Sent: Wednesday, July 4, 2007 4:50:38 PM
Subject: [సాహిత్యం] Re: కొన్ని చూచనలు

"పచ్చనాకు సాక్షిగా", "సినబ్బ కథలు", "మునికన్నడి సేద్యం", "పాల పొదుగు" ఇవి నాలుగూకలిపి ఒకే సంపుటంగా ముద్రించిన పుస్తకం పేరు "మిట్టూరోడి కథలు".
పద్మ గారన్నట్లు భాష మొరటుగా వున్నా అర్ద్రంగా వుండి మనసును తాకుతాయి.

వీటన్నిటికీ షాపుల వెంటబడేకంటే avkf.orgలో ఆర్డర్ చేయడం సుళువైన పని. పుస్తకాలు ఇంటిముందరకేవస్తాయి.

-ప్రసాద్
http://blog.charasala.com




Luggage? GPS? Comic books?
Check out fitting gifts for grads at Yahoo! Search.

Prasad Charasala

unread,
Jul 4, 2007, 11:09:54 AM7/4/07
to sahi...@googlegroups.com
లేదండీ. నేను avkf ద్వారా కడపలో మా యింటికి పుస్తకాలు పంపాను.
అయితే వాళ్ళకు రూపాయల్లో రొక్కము చెల్లించచ్చో లేదో తెలియదు.


-ప్రసాద్
http://blog.charasala.com

--
Prasad
http://blog.charasala.com

sowmya balakrishna

unread,
Jul 4, 2007, 11:36:43 AM7/4/07