మన గుంపుకి కొత్త బ్లాగు

54 views
Skip to first unread message

కందర్ప కృష్ణ మోహన్

unread,
Jun 13, 2007, 8:51:13 AM6/13/07
to sahi...@googlegroups.com
మిత్రులారా,
 
ఇది కాపీ మరియు పేస్టు కాదు. పత్రిక ముందుంచుకొని పూర్తిగా టైప్ చేస్తున్నాను. అప్పటి జ్ఞాపకాల దొంతరగా తలచి ఆస్వాదించ మనవి.
http://manikyaveena.blogspot.com/

--
కృష్ణమోహన్ కందర్ప
భాగ్యనగరము (హైదరాబాద్)
 
 

త్రివిక్రమ్

unread,
Jun 13, 2007, 11:22:52 AM6/13/07
to sahi...@googlegroups.com
కృష్ణ మోహన్ గారూ!

విద్వాన్ విశ్వం గారి రచనలు అందిస్తున్నందుకు సంతోషం. 
ఐతే నాదో సందేహం: "కలో అంబలో" లోని మొదటి పదం కలి యేనా? (ఈ సందేహం ఇన్నిరోజులూ రాలేదు. :-))
కలి, కడి లాంటి అందరికీ అర్థం కాని పదాలు వచ్చినప్పుడు మీరు వాటికి అర్థాలిస్తే బాగుంటుంది.
 
విద్వాన్ విశ్వం గారి "పెన్నేటి పాట", తులసీకృష్ణ (పి. రామకృష్ణారెడ్డి) గారి "పెన్నేటి కతలు" నాకు చాలా ఇష్టం (ఈ పుస్తకం నూకా రాంప్రసాద్ రెడ్డి ఇటీవలే పున:ప్రచురించారు).

 
అన్నట్లు కృష్ణమోహన్ గారూ!
 
మీరు తెవికీ, విక్షనరీలలో సభ్యులేనా? మీ అవసరం అక్కడ చాలా ఉంది.

--
త్రివిక్రమ్
"It is not how old you are, but how you are old."

కందర్ప కృష్ణ మోహన్

unread,
Jun 13, 2007, 12:07:51 PM6/13/07
to sahi...@googlegroups.com


త్రివిక్రమ్ గారూ

 "కలో అంబలో" లోని మొదటి పదం కలి యేనా?
 
అవునండి

కలి, కడి లాంటి అందరికీ అర్థం కాని పదాలు వచ్చినప్పుడు మీరు వాటికి అర్థాలిస్తే బాగుంటుంది.
 
నా శక్తిమేర ప్రయత్నిస్తాను

 
విద్వాన్ విశ్వం గారి "పెన్నేటి పాట", తులసీకృష్ణ (పి. రామకృష్ణారెడ్డి) గారి "పెన్నేటి కతలు" నాకు చాలా ఇష్టం (ఈ పుస్తకం నూకా రాంప్రసాద్ రెడ్డి ఇటీవలే పున:ప్రచురించారు). 
 
సంపాదించి చదూతాను

 
అన్నట్లు కృష్ణమోహన్ గారూ!
 
మీరు తెవికీ, విక్షనరీలలో సభ్యులేనా? మీ అవసరం అక్కడ చాలా ఉంది.
 
తెవికీ ఓకే - విక్షనరీ అంటే తెలుగు పదం గ్రూపా?

--

త్రివిక్రమ్

unread,
Jun 13, 2007, 12:20:54 PM6/13/07
to sahi...@googlegroups.com
 
 
సంపాదించి చదూతాను
 
పెన్నేటి పాట ఇక్కడుంది చూడండి: http://www.andhrabharati.com/kAvyamulu/pennETipATa/index.html

 
తెవికీ ఓకే - విక్షనరీ అంటే తెలుగు పదం గ్రూపా?
 
ఇవి గ్రూపులు కావండీ. ఈ క్రింది వెబ్సైట్లు చూడండి మీకే అర్థమౌతుంది.
 
 
తెలుగువికీ గ్రూపు ఇక్కడుంది: http://groups.google.com/group/teluguwiki/
 

--
త్రివిక్రమ్

Ramanadha Reddy Yarrapu Reddy

unread,
Jun 13, 2007, 12:56:23 PM6/13/07
to sahi...@googlegroups.com
కలి, కడి లాంటి అందరికీ అర్థం కాని పదాలు వచ్చినప్పుడు మీరు వాటికి అర్థాలిస్తే బాగుంటుంది.
త్రివిక్రమ్,
 
బిక్షగాళ్లు కడి అనే పదం వాడటం వినే ఉంటారు. మన అవ్వలూ తాతల తరంవారు కూడా - "యాలకింత[వేళకు ఇంత] కడేచ్చే[కడి వేస్తే] కృష్ణా రామా అనుకుంటా పడుంటానాయినా, అంతకు మించి  నాకేమొద్దు" ఇలా మాట్లాడటం నేను విన్నాను. కలి- సంగతి నాకు తెలీదు. శ్రీనాధుని చాటువు ఒక దానిలో "జొన్నకలి, జొన్నంబలి ..." అనే పదప్రయోగం ఉంది. అన్నీ జొన్నలతోనే చేసిపెట్టారని ఎగతాళిచేసే/వాపోయే సందర్భంలో.


--
~ రానారె [ http://yarnar.blogspot.com http://mynoice.blogspot.com ]

Varudhini Katragadda

unread,
Jun 13, 2007, 1:13:51 PM6/13/07
to sahi...@googlegroups.com
ప్రాంతాన్ని బట్టి పదం వాడకం ఉంటుంది.  "కలి" అన్న పదం ఎక్కువగా వినిపించేదే.  "కలి" వ్యాక్యం లో ఉపయోగించేటప్పుడు "కలో" గ మారుతుంది.  ఉదా:  "కలో గంజో "  అన్న వాడకం కూడా చాలా ఎక్కువగా చుస్తూ వుంటాము.  ఇక కడి అన్నది రాయలసీమ లోనే ఎక్కువగా వాడతారనుకుంటా.

Prasad Charasala

unread,
Jun 13, 2007, 1:24:49 PM6/13/07
to sahi...@googlegroups.com

"కలో గంజో" అని వాడటం విన్నా గానీ ప్రత్యేకంగా "కలి"కి అర్థం వుందని నాకు తెలియదు.

చర్చను పక్కదోవ పట్టిస్తుంటే క్షమించండి కానీ క్రింది రానారే వాక్యం నాకు రెండు విధాలుగా అర్థం అవుతోంది అయితే తప్పెక్కడ వుందో తెలియటం లేదు.

"బిక్షగాళ్లు కడి అనే పదం వాడటం వినే ఉంటారు."

ఇక్కడ "కడి అనే పదం వాడటం" విన్నది "బిక్షగాళ్ళు" అనుకోనూవచ్చు.
లేక
"కడి అనే పదం" బిక్షగాళ్ళు వాడటం విన్నది మనమనీ అనుకోవచ్చు.

సందేహాతీతంగా రాయాలంటే "కడి అనే పదం భిక్షగాళ్ళు వాడటం వినే ఉంటారు." అని మార్చాలేమొ! లేక పై వాక్యంలో బిక్షగాళ్ళు తర్వాత విరామ చిహ్నం వుంచాలా?

-- ప్రసాద్
http://blog.charasala.com

--
Prasad
http://blog.charasala.com

Varudhini Katragadda

unread,
Jun 13, 2007, 1:29:34 PM6/13/07
to sahi...@googlegroups.com
ప్రసాద్ గారూ

కలి కి అర్థం ఇక్కడ చూడండి. 

Varudhini Katragadda

unread,
Jun 13, 2007, 1:31:15 PM6/13/07
to sahi...@googlegroups.com
సారీ లింక్ సరిగ్గా వచ్చినట్లు లేదు.  ఈ సారి చూడండి.

త్రివిక్రమ్

unread,
Jun 13, 2007, 1:51:57 PM6/13/07
to sahi...@googlegroups.com
థ్యాంక్యూ రానారె & వరూధిని గారు!
 
కలి అంటే పులియబెట్టిన కడుగునీళ్లు. ఈ పదం "కలో గంజో" అన్నప్పుడు తప్ప ఇతర సందర్భాల్లో ఎప్పుడూ వినలేదు.
 
కడి అంటే ముద్ద. అది అన్నం ముద్ద కావచ్చు, సంగటి ముద్ద కావచ్చు లేదా పేడకడి కూడా కావచ్చు. (పేడకళ్లు అందరికీ తెలిసిన పదమే కదా? ఇది రాయలసీమకే పరిమితమని నేననుకోను.) చల్లకడి అంటే పెరుగట! ముద్ద రూపంలోని చల్ల(మజ్జిగ) అని కాబోలు!!


--
త్రివిక్రమ్

Prasad Charasala

unread,
Jun 13, 2007, 2:26:39 PM6/13/07
to sahi...@googlegroups.com
థ్యాంక్యూ త్రివిక్రమ్!
--
Prasad
http://blog.charasala.com

jyothi valaboju

unread,
Jun 14, 2007, 2:28:03 AM6/14/07
to sahi...@googlegroups.com
 
కలి అంటే బియ్యం కడిగిన నీళ్ళు.. ఉడికిన అన్నం నుండి తీసేది గంజి..అందుకే కలో గంజో అంటారేమో..కొన్ని ఊర్లలో ఇంట్లోనే ప్రసవాలు జరుగుతాయి. పుట్టిన బిడ్డపై కలినీళ్ళు చల్లేవారంట.
 
 హిందీలో కడి అంటే మజ్జిగ పులుసు.. 

కందర్ప కృష్ణ మోహన్

unread,
Jun 14, 2007, 10:33:11 AM6/14/07
to sahi...@googlegroups.com
మిత్రులారా
 
ఈరోజంతా నేను ఇంతవరకూ మెయిల్ తెరవకపోవడం వల్ల చర్చ మిస్సయినా ఇంత చర్చ జరగడానికి కారణమయినందుకు సంతోషంగా ఉంది.
 
కందర్ప కృష్ణ మోహన్
హైదరాబాద్

నవీన్ గార్ల

unread,
Jun 15, 2007, 7:22:01 AM6/15/07
to sahityam
నేనింత వరకు...అది "కల్లు" అనుకొన్నా....:)

- ణవీణ్

On Jun 14, 7:33 pm, "కందర్ప కృష్ణ మోహన్" <telugumo...@gmail.com>
wrote:

Reply all
Reply to author
Forward
0 new messages