book ని సంస్కృతం లో పుస్తకం అంటున్నాం తెలుగు లో కవిలె/లి అనవచ్చునా?

335 views
Skip to first unread message

Samba Siva Rao Kolusu

unread,
Nov 8, 2013, 2:49:17 PM11/8/13
to telug...@googlegroups.com
తెలుగు నిఘంటువు (జి.ఎన్.రెడ్డి - ఆం.ప్ర. సాహిత్య అకాడమీ) ప్రకారం గంటముతో వ్రాసిన తాటాకుల లెక్క పుస్తకము, గ్రంథము అని
బహుజనపల్లి శబ్దరత్నాకరము ప్రకారం ఘట్టించిన నీలపటపు వర్గులెక్క పుస్తకము అని చెప్పబడినది

మరి ఈ పదాన్ని పుస్తకానికి ప్రతి గా వాడవచ్చునా లేక ledger book అనే ప్రత్యేక అర్థం లోనే వాడాలో  నిపుణులు తెలియజేయగలరు.

K V Ramana

unread,
Nov 8, 2013, 11:16:56 PM11/8/13
to telug...@googlegroups.com
రావు గారు,
ledgerకు ఆవర్జా అనేమాట వాడుకలో ఉంది. నిఘంటువులలో చెప్పిన కవిలె తాటాకుల
కట్ట అని వ్యవహరిస్తున్నారు. Fileను కవిలె అనొచ్చని గుంపులో మిత్రులు
సూచించినట్లు గుర్తు. పాత టపాలను సంప్రదించండి.
> --
> You received this message because you are subscribed to the Google Groups
> "తెలుగుపదం" group.
> To unsubscribe from this group and stop receiving emails from it, send an
> email to telugupadam...@googlegroups.com.
> For more options, visit https://groups.google.com/groups/opt_out.
>


--
Killamsetty VenkataRamana
mob 09937668415

Samba Siva Rao Kolusu

unread,
Nov 9, 2013, 10:47:06 AM11/9/13
to telug...@googlegroups.com

వెంకట రమణ గారూ,

తెలుగు పదాలు సరళంగానూ, పలకడానికి అందంగానూ వుంటాయని  నా నమ్మకం. నా ఈ తెలుగు పిచ్చికి మన్నింప గలరు.

ఆవర్జా హిందీ పదము కావున తెలుగు పదం వెదకడంలో తప్పు లేదనుకుంటాను.

కవిలె తాటాకుల కట్ట అనేది తరువాతి కాలం లో వచ్చిన ఒకానొక వ్యుత్పత్యార్థం మాత్రమే నని గమనించ మనవి.

కవిలెలు ః  పూర్వము లెక్కలనో చరిత్రనో వ్రాసి, బట్ట అతికించిన కాగితపు చుట్టలు

కవిలెకట్ట ః ఆస్తిపాస్తుల సంబంధమైన కాగితముల కట్ట

కవిలెకెక్కు ః జాబితాలోనికి చేరు.

కవిలెపుట్టి ః ధాన్యపుకొలత, 640 మానికలు, పెద్దపుట్టి.

కవిలెపట్టు ః లెక్కలు వ్రాసిన పాత కాగితముల కట్ట.

కవిలెసంచి ః పాత పుస్తకముల కట్టలుంచుకొను సంచి

కవిఁలి కట్ట ః పాత రికార్డు


పై వివరణలను బట్ట్టి కవిలె/లి అయితే పుస్తకమన్నా కావాలి, లేదంటే ledger book అయినా కావలి అనిపొస్తుంది.


file అనే అర్థం లో కడితము బాగుగా సరిపడుతుంది అనిపిస్తుంది పరిశీలించండి.

'కడితము' కి ఆంధ్రభారతం లో ఇచ్చిన అర్థం ః  ఘట్టించిన నీలపటపు లెక్క పుస్తకము, దండకవిలె


ledger book కి వహి సరిపడునట్లుగా వుంది చూడండి.
'వహి' కి ఆంధ్రభారతం లో ఇచ్చిన అర్థం లెక్క పుస్తకము, an account-book;
వహి అనగా ఎన్నిక, గణుతి అను అర్థం కూడా ఉన్నది కనుక ledger book కి ఈ పదం బాగుంటుందనిపిస్తోంది.

నా అభిప్రాయాలను మిమ్ము ఒప్పుకొమ్మని  కాదు; ఈ వ్యాఖ్య ఉద్దేశ్యం ఈ విషయమై చక్కటి చర్చ జరిగి నిత్యవ్యవహారం లో మనం తేలికగా వాడుకొందుకు  సరయిన పదాలను గుర్తించటమే నని మనవి.

మేవడితో
సాంబశివరావు.
===============================================

PRASAD

unread,
Nov 8, 2013, 9:10:18 PM11/8/13
to vAIShalI........ lYf iSs So exqUIsIte.......!
Sir,
లెడ్జర్ బుక్ తెలుగులో పదము  అర్థం వేరు.
(JVRKPRASAD)
VIJAYAWADA


2013/11/9 Samba Siva Rao Kolusu <saa...@gmail.com>
తెలుగు నిఘంటువు (జి.ఎన్.రెడ్డి - ఆం.ప్ర. సాహిత్య అకాడమీ) ప్రకారం గంటముతో వ్రాసిన తాటాకుల లెక్క పుస్తకము, గ్రంథము అని
బహుజనపల్లి శబ్దరత్నాకరము ప్రకారం ఘట్టించిన నీలపటపు వర్గులెక్క పుస్తకము అని చెప్పబడినది

మరి ఈ పదాన్ని పుస్తకానికి ప్రతి గా వాడవచ్చునా లేక ledger book అనే ప్రత్యేక అర్థం లోనే వాడాలో  నిపుణులు తెలియజేయగలరు.

--
You received this message because you are subscribed to the Google Groups "తెలుగుపదం" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugupadam...@googlegroups.com.
For more options, visit https://groups.google.com/groups/opt_out.



--
Yours lovingly,
(JVRKPRASAD)

K V Ramana

unread,
Nov 10, 2013, 12:52:04 AM11/10/13
to telug...@googlegroups.com
సాంబశివరావు గారు,
తెలుగోడికి తెలుగుపిచ్చి ఉండడం మంచిదే. విషయానికి వద్దాం.
పద్దుపుస్తకాలు అవసరమైనవాళ్ళు చిట్టా ఆవర్జాలను వాడుతున్నారు. నుడికారంలో
ఇమిడిపోయిన మాటలివి. పరభాషనుంచి వచ్చినవని దూరంచేసుకొవడం అసంగతం. గిరిజన
భాషలలో పరభాషాపదాలు చేరడం తక్కువగా ఉంటాయి. అభివృద్ధి చెందిన నాగరికతలో ఈ
సంకరం కచ్చితంగా ఉంటుంది. ఇదొక సౌకర్యం. తన స్పర్సకు వచ్చిన దేశాల
భాషలన్నిటి నుండి పదాలను ఇంగ్లీషు తీసుకొన్నాది. పరకీయమని ఒకపదాన్ని దూరం
చేసుకుంటే ప్రయోజనమేమీ లేదు. మహలు, షోకు, షికారు, షైరు లాంటి పలుకులను
పక్కకు పెట్టలేం.
ఆయా వర్గాల వారు వాడుతున్న తెలుగనిపించుకున్న మాటలను మార్చబూనడం కన్న,
కొత్త రంగాలలో చేర్చవలసిన పదాల గురించి ఆలోచించడం మంచిది. వీటికి
అచ్చతెలుగు మూలం ఉన్న పదాలైనా, సంస్కృతమూలం ఉన్న పదాలైనా తీసుకుంటే
బాగుంటుంది.
మీకు తెలిసిన డాక్టర్లకు చెప్పండి - వాళ్ళు రాసే మందులచీటీలో
మందువాడాలిసిన విధానం, మోతాదులు తెలుగులో రాయమనండి. T. i. d., b. i. d
లాంటి సూచనలు రాసి అదరగొట్టొద్దని చెప్పండి.
నమస్సులతో


On 09/11/2013, Samba Siva Rao Kolusu <saa...@gmail.com> wrote:
>
> వెంకట రమణ గారూ,
>
> తెలుగు పదాలు సరళంగానూ, పలకడానికి అందంగానూ వుంటాయని నా నమ్మకం. నా ఈ తెలుగు
> పిచ్చికి మన్నింప గలరు.
>
> ఆవర్జా హిందీ పదము కావున తెలుగు పదం వెదకడంలో తప్పు లేదనుకుంటాను.
>
> కవిలె తాటాకుల కట్ట అనేది తరువాతి కాలం లో వచ్చిన ఒకానొక వ్యుత్పత్యార్థం
> మాత్రమే నని గమనించ మనవి.
>
> కవిలెలు ః పూర్వము లెక్కలనో చరిత్రనో వ్రాసి, బట్ట అతికించిన కాగితపు చుట్టలు
>
> కవిలెకట్ట ః ఆస్తిపాస్తుల సంబంధమైన కాగితముల కట్ట
>
> కవిలెకెక్కు ః జాబితాలోనికి చేరు.
> కవిలెపుట్టి ః ధాన్యపుకొలత, 640 మానికలు, పెద్దపుట్టి.
>
> కవిలెపట్టు ః లెక్కలు వ్రాసిన పాత కాగితముల కట్ట.
> కవిలెసంచి ః పాత పుస్తకముల కట్టలుంచుకొను సంచి
>
> కవిఁలి కట్ట ః పాత రికార్డు
>
>
> పై వివరణలను బట్ట్టి కవిలె/లి అయితే పుస్తకమన్నా కావాలి, లేదంటే ledger book
> అయినా కావలి అనిపొస్తుంది.
>
>
> file అనే అర్థం లో *కడితము* బాగుగా సరిపడుతుంది అనిపిస్తుంది పరిశీలించండి.
>
> 'కడితము' కి ఆంధ్రభారతం లో ఇచ్చిన అర్థం ః ఘట్టించిన నీలపటపు లెక్క పుస్తకము,
> దండకవిలె
>
>
> ledger book కి *వహి* సరిపడునట్లుగా వుంది చూడండి.
> 'వహి' కి ఆంధ్రభారతం లో ఇచ్చిన అర్థం లెక్క పుస్తకము, an account-book;
> వహి అనగా ఎన్నిక, గణుతి అను అర్థం కూడా ఉన్నది కనుక ledger book కి ఈ పదం
> బాగుంటుందనిపిస్తోంది.
>
> నా అభిప్రాయాలను మిమ్ము ఒప్పుకొమ్మని కాదు; ఈ వ్యాఖ్య ఉద్దేశ్యం ఈ విషయమై
> చక్కటి చర్చ జరిగి నిత్యవ్యవహారం లో మనం తేలికగా వాడుకొందుకు సరయిన పదాలను
> గుర్తించటమే నని మనవి.
>
> మేవడితో
> సాంబశివరావు.
> ===============================================
> On Saturday, November 9, 2013 9:46:56 AM UTC+5:30, kvje...@gmail.com wrote:
>>
>> రావు గారు,
>> ledgerకు ఆవర్జా అనేమాట వాడుకలో ఉంది. నిఘంటువులలో చెప్పిన కవిలె తాటాకుల
>> కట్ట అని వ్యవహరిస్తున్నారు. Fileను కవిలె అనొచ్చని గుంపులో మిత్రులు
>> సూచించినట్లు గుర్తు. పాత టపాలను సంప్రదించండి.
>>
>> On 09/11/2013, Samba Siva Rao Kolusu <saa...@gmail.com <javascript:>>
>> wrote:
>> > తెలుగు నిఘంటువు (జి.ఎన్.రెడ్డి - ఆం.ప్ర. సాహిత్య అకాడమీ) ప్రకారం గంటముతో
>> >
>> > వ్రాసిన తాటాకుల లెక్క పుస్తకము, గ్రంథము అని
>> > బహుజనపల్లి శబ్దరత్నాకరము ప్రకారం ఘట్టించిన నీలపటపు వర్గులెక్క పుస్తకము
>> అని
>> > చెప్పబడినది
>> >
>> > మరి ఈ పదాన్ని పుస్తకానికి ప్రతి గా వాడవచ్చునా లేక ledger book అనే
>> ప్రత్యేక
>> > అర్థం లోనే వాడాలో నిపుణులు తెలియజేయగలరు.
>> >
>> > --
>> > You received this message because you are subscribed to the Google
>> Groups
>> > "తెలుగుపదం" group.
>> > To unsubscribe from this group and stop receiving emails from it, send
>> an
>> > email to telugupadam...@googlegroups.com <javascript:>.

devi దేవి

unread,
Nov 10, 2013, 6:05:38 AM11/10/13
to telug...@googlegroups.com
పద్దు పుస్తకం లెడ్జర్ కాదంటారా?
కవిలె / కవిలె కట్ట
ఈ రెండింటిలో దేనిని వాడాలంటారు?
ఫైల్ ను కవిలె అంటున్నారని ఒకరు అన్నారు. దస్త్రం అని ఫైల్ ను ఈ నాడు వాళ్ళు అంటున్నారు కదా!
ఫైల్ కు దస్త్రం బాగుందనిపిస్తున్నది.


9 నవంబర్ 2013 9:52 PM న, K V Ramana <kvje...@gmail.com> ఇలా రాసారు :

K V Ramana

unread,
Nov 10, 2013, 6:17:36 AM11/10/13
to telug...@googlegroups.com
అవును, ఫైలుకు దస్త్రం బాగానే వాడుకలో ఉంది. కవిలెను ఫోల్డరనుకొవచ్చేమో.
కవిలన్నా కవిలెకట్టన్నా ఒకటే అయితే కట్టను విడిచేయొచ్చు.
పద్దుపుస్తకం అంటే అకౌంటుబుక్కు. అకౌంటుకు ఖాతా, పద్దు రెండూ వాడుతున్నారు.

Pulikonda

unread,
Nov 10, 2013, 8:18:03 AM11/10/13
to telugupadam
  మితృలారా
మనకు పుస్తకము అనే కొత్తవస్తువు బయటనుండి వచ్చింది. కాని మనకు అంతకు ముందు ఉన్నది తాటాకుల కట్టలే. వేరేచోటనుండి వచ్చిన వస్తవుకు వేరేపదమే వచ్చింది.
అయినా దీనికి తొలిరోజుల్లో మన పాతపేరూ వాడేవారు. తెలంగాణాలో కాగితాన్ని ఇప్పటికీ కమ్మ అనే అంటారు. ఒక కాగితం ఇవ్వు అని అనడానికి బదులు ఒక కమ్మ ఇవ్వు అని అంటారు.
అలా మనకి పుస్తకం అంటే కమ్మలకట్ట. కమ్మలకట్టనే మనం కైలకట్ట అనికూడా అంటాం. ఇదే మనకు దేశ్యపదం కైలకట్ట. ఫైలుకు నమానార్థకంగా దస్తరం అని వాడటం ఎపపటి నండో ఉంది. సంస్కృతంలో గ్రంథం అనే మాటకూడా కట్టిముడివేసినది అనే అర్థంలో వాడేదే. అదీ తాటాకులతో కట్టిందే. అలా పుస్తకానికి దేశ్యపదాలు కమ్మలకట్ట కైలకట్ట లే.
పులికొండ సుబ్బాచారి


2013/11/10 devi దేవి <devi...@gmail.com>



--
Prof. P.  Subbachary
Head, Department of Folklore and Tribal Studies
Director
Internal Quality Assurance Cell (IQAC)
Dravidian University
Kuppam 517425
A.P

రమణా రావు ముద్దు

unread,
Nov 10, 2013, 12:11:10 PM11/10/13
to telug...@googlegroups.com

 తెలుగుపదాల్ని వెదకి ఉపయోగించవచ్చును.కాని బాగా వాడుకలోఉన్న అన్యపదాలని దూరం చేసుకోకూడదు.పద్దు,చిఠా,ఆవర్జా అనేపదాలు వాడుకలోఉన్నవి.ఇప్పటికీ పుస్తకానికి తెలంగాణా ప్రాంతంలో వహి.వై,అని వాడుక ఉంది.తాటాకుల గ్రంథాన్ని కవిలె అనీ పేపరు గ్రంథాలని పుస్తకం అని అంటే బాగుంటుందని నా అభిప్రాయం.


2013/11/10 Pulikonda <psubb...@gmail.com>

Samba

unread,
Nov 12, 2013, 6:56:32 AM11/12/13
to telug...@googlegroups.com
కె.వి. రమణ గారు,
గత్యంతరం లేనప్పుడు పర భాషా పదాలను అస్సలు వాడొద్దు అని కానీ,  ప్రస్తుతం వాడుకలో వున్న పరభాషా పదాలను వెంటనే పక్కన బెట్టి మనవైన దేశ్య పదాలనే వాడమని గానీ కోరడం లేదు నేను. అలా అని మనకు అసలు వ్రాయటమంటే ఏమిటో తెలియనట్లు అందుకు అవసరమైన పరికరాలకు మనవంటూ మాటలు కూడా లేనట్లు మన పద సంపదను మనమే మర్చిపోతే ఆ పదాలు క్రమేపీ అంతరించిపోతాయి. క్రొత్త  విషయాలు, పరికరలు, వ్యవస్థలూ వచ్చినపుడు మనకు వున్న పదాలలో ఏవయినా ఆయా విషయాలకు, పరికరాలకు, వ్యవస్థలకూ పనికొస్తాయేమో సరి చూసుకోవాల్సిన బాధ్యత కనీసం తెలుగు అకాడమీ పైన వుంది, కానీ ఏం చేద్దాం వారు ఈ విషయం లో గాఢ నిద్ర నటిస్తున్నారు. రచయితలు కూడా ఎందుకో తగు ప్రయత్నం చేయలేదనిపిస్తుంది. పర్యాయ పదాలుగా అన్య భాషా పదాలను స్వీకరించడంలో ఎటువంటి అభ్యంతరమూ లేదు నాకు; కానీ అసలు మన భాషా పదమొకటి ఏర్పరచుకోకుండా అన్య పదాలను వాడుకోవడం, ముఖ్యంగా సాధ్య పడుతున్నప్పుడు,  ఒక రకంగా తెలుగు వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీస్తుంది అనిపిస్తుంది. ఒక వేళ పర భాషా పదం తీసుకోవలసి వచ్చినపుడు సంస్కృతానికి ప్రాముఖ్యతనిస్తే మంచిదని నా అభిప్రాయం.  తెలుగు భాష మీద గౌరవం పెరగాలన్నా, ఈ పోటీ ప్రపంచం లో నెగ్గుకురావాలన్నా మన దేశ్య పదకోశాన్ని పెంపొందించుకోవటం, కాలానుగుణంగా మలచు కోవడం అత్యంత ఆవశ్యకమని భావిస్తున్నాన్నేను. నాకు సంస్కృతం అంటే ఇష్టం కానీ తెలుగు అంటే ఇంకా ఇష్టం; మన పూర్వ కవులు చాలా మంది ఉభయ భాషా పండితులు కావడం మనం విస్మరించలేము. ఈ నాటి మన కవులలో తెలుగు భాష పైన పట్టు కోల్పోవడం సంస్కృత భాష ఆధిపత్యం పెరగడం బహుశా శ్రీ శ్రీ గారి చలవేననుకుంటాను.

ఉదాహరణకుః

First : తొలి
Last : తుది

Previous : మును
Next : మలి

అని మనం తెనుగించుకుని వుంటే చాలా software ల లోనూ , website ల లోనూ ఎ విషయమై అంత ఇబ్బంది వుండేది కాదు.

అలాగే ప్రభుత్వ వ్యవహారాల్లో  "అర్జీ" అని, "ఆడంగళ్" అని, "పహానీ" అని  అరువు పదాలను వాడే బదులుగా మనవైన దేశ్య పదాలను వెతకడం తప్పు కాదనుకుంటాను. హిందీ పదాలు, అరబిక్ పదాలు వాడుకలో వుండటానికి కారణం పరాయి పాలన కదా; ఇప్పుడు కూడా అటువంతి పదాలను వాడటం అవసరమా అని ఒక సారి అవలోకిద్దాం

వాడుక లో వున్న చిట్టా, దస్త్రం లాంటివి కూడా అరబిక్ లేదా పర్షియన్ పదాలే కదా; వాటికి  ప్రత్యామ్నాయాలను వెదకవలసిన అవసరం లేదంటారా?

ఇక పోతే 'పద్దు'  account కి బాగుగా సరిపోతుందనిపిస్తుంది. కనుక "పద్దు కవిలె/లి" అని వాడవచ్చును. తెలుగు నందు ముక్యంగా వుండవలసిన మృదుత్వం ఏ కొత్త పదానికైనా ప్రాధాన్యం, ఆ లక్షణం ఈ పద బంధం లో ఉందనిపిస్తుంది.  ఈ పదాన్ని ఎవరు వాడతారు అనుకోవచ్చు, ఎవరయినా ఒక్కరు పూనుకుని నాలుగు చోట్ల వావడినట్లయితే అదే  పది మందికి చేరి వాడుకలోకి వచ్చేస్తుంది. కనీసం software localisation కోసం వాడినా ఇటువంటి పదాలు వాటంతట అవే ప్రాచుర్యం పోదుతాయి.

paper కి కాగితం అని ఉర్దూ పదాన్ని,  'పత్రం' అని సంస్కృత పదాన్ని వాడుతున్నాం; అయితే ప్రొఫెస్సర్ సుబ్బాచారి గారు చెప్పినట్లుగా 'కమ్మ' అని గానీ, 'రేకు' అని గానీ, 'రెమ్మ'  అని గానీ మనం వాడుకుంటే బావుండేది. ఆంగ్లంలో క్రొత్త పదాలను మారిన పరిస్థితులకు అనువుగా  పాత పదలను ఇలాగే అర్థాలు మార్చి, లేక రెండు మూడింటిని కలిపి క్రొత్త అర్థాలను సృష్టిస్తారు కదా.


ఈ చర్చ లో మనకు కనబడిన మరో రెండు తెలుగు పదాలు ః కడితము, వహి.
'కడితము'  file/folder అనే అర్థం లో బావుంటుందనిపిస్తుంది; పరిశీలించగలరు.
'వహి' gazzette అను అర్థం లో ప్రాచుర్యం పోదిందనిపిస్తోంది ; ఉదాహరణకు ః వహికెక్కు అనేది ప్రసిద్ధి చెందడానికి వాడుతున్నాం కదా.

 
చర్చ కొచ్చిన ఈ అయిదారు పదాలనూ తర్కించి, తగు అంగ్ల పదాలకు తత్సమములుగా నిర్ధారించ వలసింది గా నా ప్రార్ధన.


/-
సాంబశివరావు


2013/11/10 రమణా రావు ముద్దు <ramanar...@gmail.com>
You received this message because you are subscribed to a topic in the Google Groups "తెలుగుపదం" group.
To unsubscribe from this topic, visit https://groups.google.com/d/topic/telugupadam/54JsgXMN4wc/unsubscribe.
To unsubscribe from this group and all its topics, send an email to telugupadam...@googlegroups.com.

K V Ramana

unread,
Nov 12, 2013, 8:24:23 AM11/12/13
to telug...@googlegroups.com
రావుగారు,
మీరు చెప్పినదంతా సమ్మతమే.
పద్దు - అకౌంటనే అర్థం కంటే హెడాఫ్ అకౌంటన్న అర్థంతో విస్తృతంగా
వాడుతున్నారు. బ్యాంకువ్యవహారాల్లో అకౌంటుని ఖాతా అంటున్నారు.
పత్రంలాగే కమ్మ కూడా లేఖ అనే అర్థంతో వాడుతున్నారు.

రమణా రావు ముద్దు

unread,
Nov 12, 2013, 9:16:37 AM11/12/13
to telug...@googlegroups.com
 

 సాంబశివరావుగారు చెప్పినది నాకూ సమ్మతమే.వాడుకలో ఉన్న అన్యభాషాపదాలు విడవకనే మన తెలుగులో సమానార్థకాలు ఉన్నవేమో నని పరిశోధించి వాడుకలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించడం మంచిదే.



2013/11/12 K V Ramana <kvje...@gmail.com>

Samba

unread,
Nov 12, 2013, 11:15:14 AM11/12/13
to telug...@googlegroups.com
కె.వి. రమణ గారు, రమణారావు గారు,
ఈ తోడ్పాటు వుంటే మనం మనం చాలానే సాధించగలం అనే నమ్మకం కలుగుతోంది.

పైన పేర్కొన్న విధంగా, పుస్తకానికి కవిలె/లి అని గనుక తేలినట్లయితే, bookmark ని "కవిలె/లి గుర్తు" గాను,  bookworm ని  "కవిలె/లి  పురుగు" గాను, booking ని "కవిలిగొను" గాను, handbook "చేతికవిలె" గాను, booker ని "కవిలరి" గాను, yearbook ని "ఏకవిలి (ఏడాది+కవిలి)" గాను, workbook ని "పనికవిలి" గాను, scrapbook ని "చిత్తుకవిలి" గాను, booklet ని "చిఱుకవిలి" గాను తెనుగించవచ్చు.

పలకడానికి ఈ పదం సులువుగా వుందా, పుస్తకమే సులువుగా వుందా అనేది కొంత మేర వాడిన తరువాత గానీ తెలియక పోవచ్చు. అలాగే ఆంగ్లం లో ఈ నాడు వాడుకలో వున్న book కి అనుబంధ పదాలను మనం ఈ కవిలె/లి ఉపయోగించి తయరు చేసుకో గలుగుతున్నమా లేదా అనేది కూడా తేల్చుకోవాలి.

P.S.
రమణారావు గారు, ఇంతకు ముందు మీరు కవిలెను తాటాకుల గ్రంథం గాను, పుస్తకం ని paper తో చేసిన గ్రంథం గాను వాడితే బావుంటుందేమో అన్నారు; ఈ రోజులలో తాటాకుల గ్రంథాలు ఇంకెక్కడ తయారవుతున్నాయ్యండి,
వాటికి మనం కవిలె అని పేరు పెట్టడానికి? :)  అంతరించిపోతున్న ప్రక్రియతో పాటుగా ఈ పదాన్ని కూడా కోల్పోదామా చెప్పండి? ఆంగ్లంలో ప్రతీ అర్థానికి రెండుకు మించి పదాలు వున్నాయి; అవి ఒకటి ఆంగ్లం గానూ, రెండవది ఫ్రెంచ్ గానూ కానవస్తాయి. అలాగే మనమూ సంస్కృత పదాలను పర్యాయపదాలుగా కలిగి వున్నాకూడా మన దేశ్య పదాలను ఏర్పరచుకుదాం. మనకు చేవలేక కాదు, చేతగాకా కాదు, ఏదో తెలియని ఒక అయోమయంలో పడి గత శతాబ్దమంతా వృదా చేశాం, ఇకనైనా మన దేశ్య పదకోశాన్ని పెంపోదించుకుందాం, దేశ్య పదాలను విరివిగా వాడుకుందాం.


2013/11/12 రమణా రావు ముద్దు <ramanar...@gmail.com>

K V Ramana

unread,
Nov 13, 2013, 5:10:11 AM11/13/13
to telug...@googlegroups.com
కవిలికు అన్ని చిగురింతలూ బాగున్నాయి. ఒక్క ఏకవిలి మాత్రం సరిగా లే దనిపిస్తున్నది.

Samba

unread,
Nov 13, 2013, 2:32:36 PM11/13/13
to telug...@googlegroups.com
కె.వి. రమణ గారు,
మీ మెప్పు పొందగలిగినందుకు ధన్యుడిని.

ఇక విషయానికి వద్దాం...

ఏడు+కవిలి => "ఏకవిలి"
సాలు+కవిలి => సాకవిలి

ఇక్కడ వత్తిడి (stress/intonation) 'ఏ' మీద లేక 'సా' మీదా వుండాలి (అరసున్నా వాడలేమి కదా ఇప్పుడు ఆ వివరాన్ని లిపిలోనే పొందుపరచడానికి).

కూడదంటే  "ఏడు కవిలి", "సాలు కవిలి" అని వాడుకోవచ్చు. ఇలా అయినా కూడా ఏడు లో వుండవలసిన అరసున్నాని మింగేస్తున్నాం

ఇలాగే మరి కొన్ని పదాలు...
bookstall/bookshop : కవిలి కొట్టు/ కవిలంగడి
account book/ : పద్దు కవిలి
bookish : కవిలిపిచ్చి

ఇంతటితో 'కవిలె/లి' పైన చర్చ ముగిసినట్లేనని భావిస్తున్నాను; కడితము, వహి ఇంకా మిగిలే వున్నాయి, వాటినేం చేద్దామో మరుసటి ౙాబు లో చర్చిద్దాం.

/-
సాంబశివరావు
=====================================================

P.S.

There are Five heads of Accounts:

Asset ః ఆస్తి/నిల్వ పద్దు
Expense ః  వెచ్చం పద్దు
Liability ః  తరావి/రవడి పద్దు
Capital ః  అసలు పద్దు
Revenue ః రాబడి పద్దు


ఇవి ఏవీ కూడా కేవలం 'పద్దు' అను పదం తో పూర్తిగా వర్ణించలేము కనుక account ని పద్దు అనుకోవడం సరియగునేమో పరిశీలించగలరు. ఈ క్రింది వివరణలను కూడా గమనించండి.

loan account  : ఎరవు పద్దు.
deposit account : వారకం పద్దు
mortgage account : తాకట్టు/కుదువ/ఉద్దర పద్దు
debt account : అప్పు/అరువు పద్దు
locker account : ఇల్లడ పద్దు


 


2013/11/13 K V Ramana <kvje...@gmail.com>
330.gif

K V Ramana

unread,
Nov 14, 2013, 3:33:21 AM11/14/13
to telug...@googlegroups.com
మనం ఏఁడు అనడం లేదు, ఏడు అనే అంటున్నాం కదా. అరసున్న గురించి నేనడం లేదు. ఏడుకవిలిలో డు పలకకుండానే అర్థం స్ఫురిస్తుందా అని నా సందేహం. సాలుకవిలె బాగుంది. నేను వాడతాను.
అభినందనలు
330.gif

Vasu Valluri

unread,
Nov 14, 2013, 3:51:39 AM11/14/13
to telug...@googlegroups.com

Notebook
Passbook
Textbook
Answerbook
veeTini emandaam?

vaasu

330.gif

Samba

unread,
Nov 14, 2013, 9:15:09 AM11/14/13
to telug...@googlegroups.com
వల్లూరి వాసు గారు,

Notebook is defined etymologically as:
note+book
where note is defined as
note (v.)
c.1200, "observe, take mental note of, mark carefully," from Old French noter "indicate, designate; take note of, write down," from Latin notare "to mark, to note, to make a note," from nota "mark, sign, note, character, letter" (see note (n.)). Meaning "to set in writing" is from early 14c. Related: Noted; noting.


కనుక తెలుగు లో "వ్రాత కవిలి" అని గాని "గుర్తు కవిలి" అని గానీ, (ఎరుకవిలి) "ఎరుక కవిలి" అని గానీ వాడవచ్చునేమో చూడండి.
----------------------------------------------------------------------------------------------------------

Passbook is defined etymologically as:
A book that passes between a trader and his customer, in which credit purchases are entered. - See : http://www.etymology-online.com/passbook

యదాతథంగా అనువదిస్తే "మాఱు కవిలి" అనవలసి వస్తుందేమో, కానీ ఇప్పుడు వాడుకలో వున్న అర్థంలో accountbook కి passbook కి తేడా లేనందున  passbook ని కూడా "పద్దు కవిలి" అనవచ్చనుకుంటాను; తప్పైతే నిపుణులు సవరించగలరు
  ------------------------------------------------------------------------------------------------

Textbook is defined etymologically as:
text (n.)
late 14c., "wording of anything written," from Old French texte, Old North French tixte (12c.), from Medieval Latin textus "the Scriptures, text, treatise," in Late Latin "written account, content, characters used in a document," from Latin textus "style or texture of a work," literally "thing woven," from past participle stem of texere "to weave," from PIE root *tek- "to weave, to fabricate, to make; make wicker or wattle framework" (see texture).
An ancient metaphor: thought is a thread, and the raconteur is a spinner of yarns -- but the true storyteller, the poet, is a weaver. The scribes made this old and audible abstraction into a new and visible fact. After long practice, their work took on such an even, flexible texture that they called the written page a textus, which means cloth. [Robert Bringhurst, "The Elements of Typographic Style"]

--see : http://www.etymonline.com/index.php?term=text&allowed_in_frame=0


అయినప్పటికీ ఈనాడు వాడుకలో వున్న అర్థం పాఠ్య పుస్తకమనే కనుక మనం దీనిని "చదువిలి" లేదా "చదువు కవిలి" అనవచ్చునేమో పరిశీలించగలరు. కాదు ఆంగ్లంలోని వ్యుత్పత్యార్థం యదాతథంగా దిగుమతి చేసుకుందామంటే "వ్రాకవిలి" లేదా "వ్రాత కవిలి" అని తెనుగించవచ్చు.

----------------------------------------------------------------------------------------------------

Answerbook: ఇది తేలికగానే తెనుగించవచ్చు, "బదులు/మాఱు కవిలి" బాగానే సరిపడుతుందనుకుంటాను, లేదంటే మరొక పదం వెతుకుదాం

-------------------------------------------------------------------------------------------

పైని పదబంధాలలో వేటికైనా 'క' బదులుగా వినసొంపు కోసం 'గ' వాడుకోవచ్చును

====================================================

/-

సాంబశివరావు

---------------------------------------------------------------------------------------------

P.S.

ఇంక కె.వి. రమణ గారి అభ్యంతరం గురించిః

ఈ క్రింది వివరణలను పరిశీలించగలరు...

అంత+వారు = అందరు

అంత+దాక= అందాక

అర+కన్ను=అరగన్ను

అల్లు+వాడు=అల్లుడు

ఆరటము+పెట్టు=ఆరటపెట్టు

ఇంత+వారు=ఇందరు

ఎనిమిది+పది=ఎనుబది

కలత+ఆపు=కలాపి

మూగు+కాడి=ముక్కడి
కీచు+ఆటలు+ఆడు=కీచట్లాడు
కుఱుచ+ఆవలు=కుట్టావలు
ఎరవు+ఆలు=ఏరాలు
ఏను+పది=ఏబది
ఏను+తూము=ఏదుము



2013/11/14 Vasu Valluri <vallur...@gmail.com>
330.gif

K V Ramana

unread,
Nov 14, 2013, 8:00:36 PM11/14/13
to telug...@googlegroups.com
రావు గారు,
ఏకవిలికీ, సాకవిలికీ ఇచ్చిన ఉదాహరణలు చూస్తే నాకు తోచిన వాడుకలు - ముప్పది, మున్నూరు మొదలైనవి. ఇందులో ఉపసర్గ 'మూడు' కుదించుకు పోయింది. ఇలాగ ఏడుకవిలి ఎక్కవిలి అవుతుంది. ఏఁడు గాని మూఁడు గాని అరసున్న గలవి గనుక ఈ ఉదాహరణ చెల్లుతుందని భావిస్తాను.
సాలు(సాల్)కు ఆరబీయమూలం ఉందని పతంగే 'ఉర్దూ-తెలుగు నిఘంటువు'లో సూచించారు. ఇక 'సాల్యానా'ను 'సాలీనా'గా మనం మల్చుకున్నామనుకుంటాను. మరోవిధంగా సాలుని కుదించిన ఉదాహరణలు నాకు తట్టలేదు. సాలుకవిలిని కుదించి సాకవిలి చెయ్యడం ఉచితం కాదనిపిస్తోంది.

పరిశీలించండి.

On 14/11/2013, Samba <saa...@gmail.com> wrote:
330.gif

Samba Siva Rao Kolusu

unread,
Nov 15, 2013, 12:13:14 PM11/15/13
to telug...@googlegroups.com

కె.వి. రమణ గారు,

సాలు అరబిక్ పదమని నాకు తెలియలేదు; మన్నించండి

ఇంక ఎక్కవిలి గురించి మీరు చెప్పిన వివరణ సబబు గానే వుంది; అయితే "ఏడు కవిలి" అని వాడుతారో "ఎక్కవిలి" వాడుతారో చెప్పడం కష్టం; బహుశా రెండు రూపాలను గుర్తించాలేమో...

కవిలి తో ఏర్పరచిన ఇతర పదాలను (క్రితం ౙాబు లోనివి) కూడా చూసి మీ అభిప్రాయాన్ని తెలుపగలరు.

అలాగే రకరకాల పద్దుల గురించి కూడా ఈ సంభాషణ (conversation/thread) లో చర్చించించడమైనది, వాటిని కూడా విమర్శించ మనవి.

/- వినమ్రత తో,
సాంబశివరావు

devi దేవి

unread,
Nov 16, 2013, 1:01:55 AM11/16/13
to telug...@googlegroups.com
ఏడు -ఏటి గా మారుతుండగా ఏటికవిలి గా మారాల గదా?


15 నవంబర్ 2013 9:13 AM న, Samba Siva Rao Kolusu <saa...@gmail.com> ఇలా రాసారు :

K V Ramana

unread,
Nov 16, 2013, 9:49:31 AM11/16/13
to telug...@googlegroups.com
అవును, ఏటికవిలి కూడా అవుతుంది.
కవిలిలాగ పొత్తం కూడా వాడుకోవచ్చునే.

Samba Siva Rao Kolusu

unread,
Nov 16, 2013, 3:23:15 PM11/16/13
to telug...@googlegroups.com
పొత్తం పత్రం కి వికృతి ఔనేమో; అయినప్పటికీ ఈ పదం పలకడానికి సులువు గానే వుంది గనుక వాడటానికి అభ్యంతరముండకపోవచ్చు.

మరొక విషయం; మూడు+కంటి =ముక్కంటి అయినట్లుగా ఏడు+కవిలి = ఎక్కవిలి కాదని తెలుస్తుంది, ఎట్లన ఈ సంధి ఒకే రకమైన పలు విషయాలను చెప్పడానికి మాత్రమే వాడాలని వుంది, "ఏదు" సంఖ్య కాదు గనుక ఎక్కంటి అని మనం ఈ సంధిని ఇక్కడ వాడలేము. 

కనుక ఏటి కవిలి అనేదే సరయిన పదమవుతుంది. ఈ పదాన్ని సూచించిన దేవి గారికి నా ధన్యవాదాలు.

Pulikonda

unread,
Nov 16, 2013, 10:57:52 PM11/16/13
to telugupadam

పొత్తం పత్రానికి వికృతి కాదు. పుస్తకం పదానికి వికృతి. గ్రంథాలయం కు పొత్తపుగుడి అని చేశారు పెద్దలు.
పులికొండ.

--

K V Ramana

unread,
Nov 17, 2013, 12:03:26 AM11/17/13
to telug...@googlegroups.com
పొత్తం పుస్తకభవమనో వికృతనో చెబుతారు. చాలా పదాలకు ఇలాంటి వివరణే ఉంది.
మనకు పొత్తంలాగనే హిందీలో పోథా/పోథీ, ఒడియాలో పోథి అని ఉన్నాయి. వీటి
చరత్ర - వాడుకలో ఏది తొలిదో ఏది మలిదో తెలిస్తే ఏది తల్లి, ఏది తద్భవమని
తెలుస్తుంది. నాకైతే పొత్తం మూలం ప్రాకృతంలో ఉండివుంటుం దనిపిస్తున్నది.
ఎవరిైనా పరిశోధించివుంటే వారినుంచి వినాలి.
Reply all
Reply to author
Forward
0 new messages