గూగుల్ మ్యాపుల పుణ్యమా అని టినగర్ లో గోపాల్ వీధిని, అను ఫాంటు సంస్థ
కార్యాలయాన్ని దొరికించుకోవడం పెద్ద కష్టమేం కాలేదు. నేను వస్తున్నానని
ఫోన్లో అంతకుముందే చెప్పాను కాబట్టి ముందుగా అనుకున్న టైముకు ఎవరితోనో
మీటింగ్ ముగించుకొని నన్ను లోపలికి సాదరంగా ఆహ్వానించాడాయన. aesthetics
పరంగా మీవి చాలా అద్భుతమైన ఫాంట్లు గాని టెక్నాలజీ పరంగా మీరు ఒక దశాబ్దం
వెనుకబడి ఉన్నారంటూ యూనీకోడ్ మంత్రోచ్చారణతోటే నా సంభాషణను
ప్రారంభించాను. ఆయన యూనీకోడ్ ని లక్ష్యపెట్టక పోవడానికి కారణాలు
వివరిస్తూ ముందుగా తనది కమర్షియల్ సంస్థ అన్న విషయం గుర్తుంచుకోవాలని
చెప్పారు. యూనీకోడ్ ఫాంట్లను తయారు చేస్తే తన ఫాంట్లను కాపి కొట్టి
వాడుకోవడం సులభమై తన అమ్మకాలకు గండి పడుతుందన్న అనుమానం వ్యక్తం చేసారు.
ఇంకా యూనీకోడ్ ఫాంటులో వాడిన గ్లిఫ్ఫులు తనకు నచ్చలేదని తన ఫాంట్లకు ఇంకా
ఎన్నో రకాల గ్లిప్ఫులు అవసరమని అన్నారు. యూనీకోడ్ ఫాంటులు తయారు చెయ్యడం
వల్ల నష్టాలే గానీ లాభాలు కనిపించడం లేదని ఆయన తన మనసులోని మాటను
చెప్పేసారు.
దానికి సమాధానంగా నేను యూనీకోడ్ ప్రాధాన్యాన్ని మాహాత్మ్యాన్ని వర్ణించడం
మొదలుపెట్టాను. యూనీకోడ్ ఫాంటు కాదు ప్రమాణమని, ఈ ప్రమాణం వర్ణాల ఆధారంగా
నిర్మించిందే గాని దీనికి గ్లిప్ఫులు ఆధారం కాదని వివరించాను. యూనీకోడ్
గురించి చాలామందికి ఉండే అపోహలలో ఇవి సర్వసాధారణమని నచ్చజెప్పాను.
సెర్చ్ ఫెసిలిటీ గురించి, ఈమెయిల్, చాట్ లలోవాడకం గురించి, బ్లాగ్
విప్లవం గురించి, తెలుగు వికీల గురించి, తెలుగు వెబ్జైన్ల గురించి
సోదాహరణంగా వివరించాను. కాపీ కొట్టడానికి వీలు లేకుండా యూనీకోడ్ ఫాంట్లను
కూడా dynamic fontsగా తయారు చేసుకోవచ్చునని అలా చేసిన తమిళ సైట్లను
చూపించాను. అను ఫాంటు కుటుంబంలోని 85 ఫాంట్లలో ఏదైనా ఒకటి రెండు ఫాంట్లను
మాలాంటి ఔత్సాహికులకు అప్పజెబితే మేము వాటిని మేమే యూనీకోడ్ ఫాంట్ గా
తయారు చేసి ఇవ్వడానికి సంసిద్ధులమేనని చెప్పాను. తెలుగు భాషకు ఆయన చేసే
సేవలను ప్రస్తుతం ఇంటర్నెట్టులో తెలుగు వాడకందారులే కాక భవిష్యత్ తరాలు
కూడా గుర్తు పెట్టుకుంటాయని ముక్తాయింపుగా చెప్పిచూసాను.
నేను చెప్పిందంతా విని ఒక నిర్ణయం తీసుకుంటున్నట్టు ఒక్క నిమిషం ఆలోచించి
"హైదరాబాద్లో వచ్చే నెల ఒక శాఖను ప్రారంభిస్తున్నాము. ఆ శాఖలో మొట్టమొదటి
ప్రాజెక్టు గా కొన్ని తెలుగు అనూ ఫాంట్లను యూనీకోడ్ ఫాంట్లుగా తయారు
చేస్తాము" అని ప్రకటించారు. మహదానందంతో నేను లేచి కరచాలనం చేస్తూ మీ
కృషికి మాకు చేతనైనంత సాయం చేస్తామని అంటూ ఆయనకు వీడ్కోలు చెప్పాను.
ఇదీ ఇంతవరకూ జరిగిన కథ. ఆయన తన మాట మీద నిలబడి కొన్నైనా అనూ ఫాంట్లను
యూనీకోడ్ ఫాంట్లుగా మారుస్తారని ఆశిద్దాం.
రిగార్డులతో,
సురేశ్.
అద్భుతం. అసాధ్యాన్ని సుసాధ్యం మీరు అసాధ్యులు. అభినందనలు.
On 6/21/07, సురేశ్ కొలిచాల <suresh.k...@gmail.com > wrote:
తెలుగులో ఈనాడు, వార్త, జ్యోతి, స్వాతి, ఆంధ్రప్రభ మొదలైన పత్రికలకు,
పుస్తకాలకు ఇతరేతర ప్రచురణలకు వాడుకునే విధంగా 85 తెలుగు ఫాంటులను
సృష్టించి, గత పది సంవత్సరాలుగా తెలుగు డెస్కుటాపు పబ్లిషింగ్ రంగాన్ని
దాదాపు ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్న అను ఫాంట్ల సంస్థ వ్యవస్థాపకుడు ఎస్.
మురళీకృష్ణ గారు ( http://anufonts.com). తమిళంలో 300 ల ఫాంట్లు (http://
వాళ్ళు ఇచ్చే కీబోర్డు ఎంపికలు భయంకరమైనవి.వాటికీ మన qwerty కీబోర్డులకీ
phonetic గా ఎలాంటి సంబంధమూ ఉండదు.ఉదాహరణకి-అనూ వారికి చెందిన ఒకానొక
కీబోర్డ్ సెటప్ లో k నొక్కితే "ర" పడుతుంది. j నొక్కితే "క" పడుతుంది.
ఇది మరో భాష నేర్చుకోవడంలా ఉంటుంది తప్ప తెలుగు టైప్ చేస్తున్న ఫీలింగ్
ని ఇవ్వదు. కీబోర్డు ఎంతకీ వశం కాక సామాన్య మానవుడు బెంబేలెత్తిపోతాడు.
అనూ వారు ఈ మధ్య మన (సారీ, వీవెన్ గారి) లేఖిని తరహాలో Roma అనే కీబోర్డ్
ఎంపిక ఇచ్చారు.అది ఏం చేసినా ఆపరేట్ అవ్వకపోవడమే దాని ప్రత్యేకత. ఏమిటి
వీళ్ళు చేస్తున్న సేవ తెలుక్కి ?
భారత ప్రభుత్వం అందరికీ ఉచితంగా వందలాది ఫాంట్లు సరఫరా చేస్తూంటే ఇంకా
వీళ్ళు మేము "ఫాంట్లు అమ్ముతాం, యూనికోడ్ వస్తే మేమేదో అయిపోతాం" అంటూ
ఏడుస్తున్నారంటే, "చావండి వెధవల్లారా ! ఏమన్నా అయిపోండి ! నాశనమైపోండి.
మాకే బాధా లేదు. ఉచితంగా అందరికీ తెలుగు ఫాంట్లు దొరికే రోజు వచ్చినా
కూడా ఇంకా మీ రౌడీయిజమేంటి ?" అనాలనిపిస్తుంది.
Jabali Muni Vraasenu:
> > > > www.anufonts.com/Tamil.pdf ) కన్నడలో 60 ఫాంట్లు (http://
వెంకట రమణ (Venkata Ramana) Vraasenu:
> > > > > > www.anufonts.com/Tamil.pdf) కన్నడలో 60 ఫాంట్లు (http://
> --
> రమణ
> http://uvramana.wordpress.com
Murali Krishna Kunapareddy Vraasenu:
> --
> Murali Krishna Kunapareddy
> "Come my friends, 'tis not too late to seek a newer world"
డెస్కుటాపు కంప్యూటర్లు టీవీ, మైక్రోవేవు లాంటి అప్లయన్సులు గా అవడం,
మధ్యతరగతి ప్రజలు
విరివిగా కొనడం ఇండియాలో గత నాలుగయిదేళ్లగా మత్రమే జరుగుతోంది.
అందువల్ల, ఇంతవరకూ
తెలుగు సాఫ్టువేరు వాడేవాళ్లు ఎక్కువగా DTP company వాళ్లు, వార్తా
పత్రికల వాళ్లు.
home users కాదు. పైగా, మన తెలుగువారికి పుస్తకాలు కొని చదివే
అలవాటు చాలా తక్కువ. (దానికీ అనేక కారణాలనుకోండి) పుస్తకాలు
కొనుక్కునేవాళ్లు లేకపోతే,
ప్రచురణ సంస్థలు మట్టిగొట్టుకుపోతాయి/పోతున్నాయి. ఫాంట్ల కంపెనీ
కష్టమర్లు తగ్గిపోతారు.
అందువల్ల తెలుగులో ఫాంట్ల కంపెనీలు 2-3 కన్నా లేవు. కాంపిటీషను లేకపోతే
ఏదీ చవకలో దొరకదు కదా!
~~~~~~~~~~~~
ఇదే thread లో పైన ఎవరో అన్నట్లు ఒక ఫాంట్ల కంపెనీ యూనికోడు ఫాంట్లు
చేయగానే
మిగతా కంపెనీలు కూడా చేస్తాయని అనుకోవడం కొంచెం అమాయకత్వమే. యూనికోడుకి
ఉపయోగం
electronic medium లోనే అన్నది మనం మర్చిపోగూడదు. ఇప్పటివరకూ ఫాంట్ల
కంపెనీ
కష్టమర్లు 90%+ print publishing వాళ్లే. ప్రింటు వాళ్లకి యూనికోడు
ఫాంట్లైనా ఒకటే, 8-బిట్
ఫాంట్లైనా ఒకటే, అందంగా ఉండడమే వాళ్లకి కావలసింది!
electronic medium లో తెలుగు ఉపయోగం (అంటే తెలుగు కంప్యూటింగ్) పెరిగే
వరకూ, అంటే, తెలుగు
internet users, home users సంఖ్య గణనీయంగా పెరిగే వరకూ, యూనికోడు ఫాంట్ల
ఆవశ్యకత ఫాంట్ల కంపెనీలు గుర్తంచవు, వారికి ఆ అవసరం లేదు.
electronic పత్రికలు యూనికోడుకి మారకపోవడానికి ముఖ్యమైన
కారణం వారికి తగిన సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం అని నా అభిప్రాయం.
e-తెలుగు సంఘం లాంటి వాళ్లు వాళ్ల అపోహలు (unicode publishing కి ఖరీదైన
సాఫ్టువేరు కావాలి, content మళ్లీ టైపు చెయ్యాలి లాంటి అపోహలు) తొలగించి,
ఉచితంగా దొరికే
సాఫ్టువేరు (పద్మ, firefox వగైరా..) ద్వారా వాళ్ల content ని యూనికోడుకి
మార్చడం
ఎంత సులభమో demonstrations ద్వారా చూపించి, అవసరమైతే చేయి పట్టుకుని
సహాయం
చెయ్యాలని నా అభిప్రాయం గా తెలియ చేస్తూ ఈ ఉపన్యాసాన్ని
ముగిస్తున్నాను. :-)
-- Padma I.
06/21/2007
PS: తెలుగులో ఈ మధ్య వచ్చే fiction, non-fiction పుస్తకాలు చూసారా?
అన్నీ ఒకటే రకమైన ఫాంటులో ఏ విధమైన typographic variation లేకుండా
ఒకేలాగా
ఉంటున్నాయి. ఇంగ్లీష్ లో పెద్ద పెద్ద publishing company లు కొన్ని
పుస్తకాలకోసం
ప్రత్యేకంగా ఫాంట్లు తయారు చేయిస్తాయి. O'Reilly technical పుస్తకాలు
చూసారా?
ప్రతి పుస్తకమూ కంటికింపుగా ఒక్కొక్క ఫాంటులో ఉంటుంది. తెలుగు లిపి లో
ఉన్న క్లిష్టత
వల్ల ఇలాంటి luxury తెలుగు print publishing లో ఎప్పటికీ
సాధ్యపడకపోవచ్చు, కానీ
తెలుగులో typography అన్నది లేకపోవడం, అన్ని అచ్చు పుస్తకాలు మూసలో
పోసినట్లు
ఒకేలాగ ఉండడం నా నామటుకు నాకు చాలా విసుగ్గా అనిపిస్తుంది.
బాలసుబ్రహ్మణ్యం గారి విమర్శలో అర్థం ఉంది.
ఈ ఫాంట్లు చూడడానికి అందంగా ఉన్నా, చాలా తప్పులతో render చేస్తాయి.
MHO,
-- Padma I.
06/21/2007
సీడాక్ వారి ఫాంట్లలో కొన్ని బాగున్నాయి. (నాకు నచ్చిన ఒక ఫాంటు..మేనక)
వీటిని దిద్దటానికి ప్రత్యేక కోడ్ ఏమీ అవసరం లేదు మనం దీద్దితే అది
కాపీహక్కుల ఉల్లంఘన అవుతుందని భయం అంతే!
మొన్నీ మధ్య ఈనాడు ఫాంటు చూశాను..దానికంటే పోతన ఫాంటు ఎన్నో రెట్లు
ఘనమైనది.
-రమణ.
On 6/22/07, అంబానాథ్ <amba...@gmail.com> wrote:
> నేను "పచ్చి వ్యాపారులు" అన్నది ఎవరినీ నిందించడానికి కాదు. వారినుంచి
> మనం ఎక్కువ ఆశించడానికి అవకాశం లేదనే విషయాన్ని నొక్కి వక్కాణించడానికే.
> రానారె గారన్నట్లు తెలుగులో వెబ్ పత్రికలు అభివృద్ధి చెందుతాయి, వెబ్
> సైట్లు పెరుగుతాంటే నాకూ సంతోషమే. ఏదో గుడ్డిలో మెల్ల. నేను
> కోరుకుంటున్నది తెలుగువారికి ఉచిత యూనికోడ్ ఫాంట్లు కావాలని. అంతకంటే
> ముఖ్యమైన విషయం కూడా ఉంది. MS-Word, Adobe PageMaker లాంటివి unicode-
> supportive కావడం. అన్నీ జరిగినా ఇది మాత్రం జరిగేట్టు లేదు.
>
> రవి వైజాసత్య Vraasenu:
negotiation skills ఎంతైనా మీ దగ్గర నేర్చుకోవాలి :)
రాకేశ్
On Jun 22, 2:49 am, "రవి వైజాసత్య" <vyzasa...@gmail.com> wrote:
> కొలిచాల గారు వీలైతే సీడాక్ వాళ్ళను కలుస్తామన్నారు. అనూ వాళ్లు యూనీకోడ్
> ఫాంట్లను తయారుచెయ్యటం శుభపరిణామమే. అందుకు సురేష్ గారిని తప్పకుండా
> అభినందించాలి.
>
> సీడాక్ వారి ఫాంట్లలో కొన్ని బాగున్నాయి. (నాకు నచ్చిన ఒకఫాంటు..మేనక)
> వీటిని దిద్దటానికి ప్రత్యేక కోడ్ ఏమీ అవసరం లేదు మనం దీద్దితే అది
> కాపీహక్కుల ఉల్లంఘన అవుతుందని భయం అంతే!
>
> మొన్నీ మధ్య ఈనాడుఫాంటుచూశాను..దానికంటే పోతనఫాంటుఎన్నో రెట్లు
> ఘనమైనది.
--~--~---------~--~----~------------~-------~--~----~
మీరు "telugublog" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
ఈ గుంపుకు జాబు పంపేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-...@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని వికల్పాల కొరకు, http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.
http://telugubloggers.blogspot.com
-~----------~----~----~----~------~----~------~--~---
అను ఫైల్స్ ని యూనికోడ్ లో మార్చే వీలు ఇపుడు ఉందిగా..
http://anu2uni.harivillu.org/
--
మీరు "తెలుగుబ్లాగు" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
ఈ గుంపుకు జాబు పంపేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-...@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు, http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.
బ్లాగుల సంకలినులు: koodali.org | jalleda.com | haaram.com
బ్లాగు పాఠాలు: telugublogtutorial.blogspot.com | nerpu.com