chinna pillala pATalu

180 views
Skip to first unread message

Bhaskar Gomatham

unread,
Jan 10, 2010, 6:43:02 PM1/10/10
to telug...@googlegroups.com
నాకు చిన్న పిల్లల పాటలు  ' వప్పులకుప్ప'  , ' చెమ్మచెక్క ' కావాలి . ఇవి ఏ బ్లాగులో దొరుకుతాయో ఎవరయినా లింకు యివ్వగలరు .

jyothi valaboju

unread,
Jan 11, 2010, 7:38:11 AM1/11/10
to telug...@googlegroups.com

CH Gowri Kumar - గౌరీ కుమార్

unread,
Jan 11, 2010, 7:49:52 AM1/11/10
to telug...@googlegroups.com
http://www.gowrikumar.com/telugu/labels/bala_geethalu.html


2010/1/11 Bhaskar Gomatham <gomatham...@gmail.com>:


> నాకు చిన్న పిల్లల పాటలు  ' వప్పులకుప్ప'  , ' చెమ్మచెక్క ' కావాలి . ఇవి ఏ
> బ్లాగులో దొరుకుతాయో ఎవరయినా లింకు యివ్వగలరు .
>

> --
> మీరు "తెలుగుబ్లాగు" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
> ఈ గుంపుకు జాబు పంపేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
> ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-...@googlegroups.com కు
> మెయిలు పంపండి.
> మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు,
> http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.
>
> బ్లాగుల సంకలినులు: koodali.org | jalleda.com | haaram.com
> బ్లాగు పాఠాలు: telugublogtutorial.blogspot.com | nerpu.com
>

noorbasha rahamthulla

unread,
Jan 11, 2010, 8:18:27 AM1/11/10
to telug...@googlegroups.com
http://www.andhrabharati.com/strI_bAla/bAlabhASha/oppulakuppa.html

2010/1/11 CH Gowri Kumar - గౌరీ కుమార్ <gkum...@gmail.com>
Message has been deleted

noorbasha rahamthulla

unread,
Jan 11, 2010, 9:03:28 AM1/11/10
to telug...@googlegroups.com
http://andhrabharati.com/strI_bAla/bAlabhASha/chelimi.html లోని పిల్లలపాటలు http://uni.medhas.org/fileconverterindex.php5 ద్వారా suritlr నుండి UTF8 లోకి టెక్స్ట్ చక్కగా ఎలా మారాయో  చూడండి

చిన్నారి పొన్నారి చిఱుత కుఱ్ఱఁడ రార!
    అయ్య రారా! చక్కనయ్య రార!
అల్లారు ముద్దుల పిల్లవాఁడా రార!
    అప్ప రారా! కూర్మికుప్ప రార!
రత్నాల చిటిముల్లె రార! నవ్వుంబువ
    తోట రారా! ముద్దుమూట రార!
ముత్యాల క్రోవి రా! ముచ్చట్లదీవి రా!
    పల్కు వెన్నెల చిన్ని చిల్క రార!
కన్నకాచి రార! గారాలకూచి రా!
    నాన్నరార! చిన్నియన్నరార!
ఆడ రార! నవ్వులాడ రారా! పల్కు
    లాడ రార! కుల్కులాడ రార!
 


శ్రీ సూర్యనారాయణా!
మేలుకొలుపు
ఉగ్గు
జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం!
చలికంఠము
కలువరేకుల కళ్ళు
కన్నబిడ్డలు
దోసపళ్ళు
శ్రీరాములవారు
చదువుసందెలు
మంచిమాటలు
చెలిమి
ఉన్నఊరు
ఎందుకు?
కంచికామాక్షమ్మ
కూనలమ్మ పదాలు
ఈశ్వరుడు
కాకమ్మ
అయిదు వ్రేళ్లు
సహజగుణము
పరాచకాలు
అట్లతద్ది
చప్పట్లు
బండిపాట
గచ్చకాయలు
జడుపు
బలాబలాలు
 వానవల్లప్పలు
నేతిలో నేరేడుపండు
కాళ్లాగజ్జీ...
చిట్టిపొట్టి మిరియాలు
గుడుగుడుకుంచం...

చెమ్మచెక్క
నెత్తిమీద గోరింక
తాతపెండ్లి
దాగుడుమూతలు
ఒప్పులకుప్ప
బొమ్మలపెండ్లి
నాలుగుస్తంభాలాట
సందెగొబ్బె
గుమ్మాడమ్మా...
ఏనుగమ్మా ఏనుగు!
తారంగం
తారమ్మయ్యా!
తప్పుటడుగులు
చక్కిలిగింతలు
దొంగవో? దొరవో?
దీపారాధన
గోరుముద్ద; గుజ్జుముద్ద
అమ్మముద్ద; నాన్నముద్ద
దొంగబువ్వ
వెన్నెల గుజ్జులు
జోలపాట
బూచివాని బిలువనంపనా
 

శ్రీ సూర్యనారాయణా!


పుట్టేటి భానుడా, పుష్యరాగపుచాయ
        శ్రీసూర్యనారాయణా!
పుష్యరాగము మీద పొంగుబంగరుచాయ
        శ్రీసూర్యనారాయణా!
జామెక్కి భానుడా, జాజిపువ్వులచాయ
        శ్రీసూర్యనారాయణా!
జాజిపూవులమీద సంపెంగపువుచాయ
        శ్రీసూర్యనారాయణా!
మధ్యాహ్న భానుడా, మల్లెపూవులచాయ
        శ్రీసూర్యనారాయణా!
మల్లెపూవులమీద మంచి వజ్రపుచాయ
        శ్రీసూర్యనారాయణా!
మూడ్జాముల భానుడా, మునగపూవులచాయ
        శ్రీసూర్యనారాయణా!
మునగపువ్వులమీద ముత్యాలపొడిచాయ
        శ్రీసూర్యనారాయణా!
క్రుంకేటి భానుడా, గుమ్మడీపువుచాయ
        శ్రీసూర్యనారాయణా!
గుమ్మడీపువుమీద కుంకుం పువుచాయ
        శ్రీసూర్యనారాయణా!
ఆయురారోగ్యములు ఐశ్వర్యములనిమ్ము
        శ్రీసూర్యనారాయణా!
మేలుకొలుపు


చిన్నారి పొన్నారి చిట్టినా తల్లి!
చుక్కల్లో చంద్రుడూ చూడవచ్చాడు.

తెల్లవారొచ్చింది కోడి కూసింది,
చూచేటిఅక్కల్లు చూడరారమ్మ.

ఆడేటి అక్కల్లు ఆడరారమ్మ,
ఆడుకోరారమ్మ అక్కల్లు మీరు.

ఆడేటివారికి అచ్చావుపాలు,
పాడేటివారికి పాలు పంచదార.
 
ఉగ్గు


ఊఁ ఊఁ ఉంగన్న,
ఉగ్గుపాలు ఇందన్న.

గుంటెడు ఉగ్గు కమ్మన్న,
ఉమ్మక కక్కక మింగన్న.

ఊఁ ఊఁ ఊఁ ఉంగన్న,
లుంగలు పెట్టకు గ్రుక్కన్న.

ఓర్వని సవతుల దిష్టన్న,
ఒప్పుగ మసలర బుచ్చన్న.
 
జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం!


జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం!
గుఱ్ఱాల్‌ తిన్న గుగ్గిళ్లరిగి,
ఏనుగుల్‌ తిన్న వెలక్కాయలరిగి,
అర్జునుడు తిన్న అరటిపళ్లరిగి,
భీముడు తిన్న పిండివంటలరిగి,
గణపతి తిన్న ఖజ్జాలరిగి,
అబ్బాయి తాగిన పాలు ఆముదం అరిగి,
పందల్లే పాకి, కుందల్లే కూర్చుండి,
నందల్లే నడచి, గుఱ్ఱమంత పరుగు,
ఏనుగంత సత్తువు ఉండేటట్టు
సాకుమీ, యీ బిడ్డను సంజీవరాయా!
 
కలువరేకుల కళ్ళు


పిల్లమ్మ కన్నుల్లు బీరపువ్వుల్లు,
అబ్బాయి కన్నుల్లు కలువరేకుల్లు.

కలువరేకులవంటి నీ కన్నులకును,
కాటుకలుపెట్టితే నీకు అందమ్ము.

ఏడువకు ఏడువకు వెఱ్ఱిఅబ్బాయి,
ఏడుస్తె నీకళ్ళు నీలాలు కారు.

నీలాలు కారితే నే జూడలేను,
పాలైన కారవే బంగారు కళ్ల.
 
కన్నబిడ్డలు

కొడుకుల్లు పుట్టన్ని కడు పేమి కడుపు?
కుల ముద్ధరించన్ని కొడు కేమి కొడుకు?

కన్నకానుపులెల్ల కడుచక్కనయితె,
కన్నుల్ల పండుగే కన్నతల్లికిని.

 
ఛి ఛి ఛి


లాభమ్మ లాభమ్ము ఏమి లాభమ్ము?
కొడుకులను గంటేను కోటి లాభమ్ము.

గోరంతదీపమ్ము కొండలకు వెలుగు,
గోపాలకృష్ణమ్మ గోవులకు వెలుగు.

మాడంతదీపమ్ము మేడలకు వెలుగు,
మారాజు అబ్బాయి మాకళ్ల వెలుగు.

 
ఛి ఛి ఛి


వీథిలో ఉయ్యాల అమ్మవచ్చింది,
కొడుకులను గన్నతల్లి కొనవె ఉయ్యాల.
 
దోసపళ్ళు


త్రోవలో ఒకరాజు తోటేసినాడు
తోటలోపల పండ్లు దొర్లుతున్నావి.
        దొర్లుతున్నవి తియ్య దోసపండ్లన్ని,
        ఆ పండ్లు పంపాడు ఆరగించంగ.
తింటేను తియదోస పండ్లే తినాలి,
కంటేను కొడుకుల్ల కాన్పే కనాలి.
        కంటేను కొడుకుల్ల కాన్పే కనాలి.
        అందితే అన్నతో వియ్యమందాలి.
అందితే అన్నతో వియ్యమందాలి,
ఆడితే వదినతో జగడమాడాలి.
 ఉంగరమ్ములు పెట్టి, ముంగురులు దువ్వి,
ఒద్దపెట్టుకు తల్లి ముద్దులాడింది;
పలక బలపములిచ్చి, పద్యాలుపాడి,
సరసపెట్టుకు తండ్రి చదువు నేర్పాడు.

చదువుకో నాయన్న! చదువుకో తండ్రి!
చదువుకొంటే నీకు సౌఖ్యమబ్బేను!
ఆడుకో నాయన్న! ఆడుకో తండ్రి!
ఆడుకొంటే నీకు హాయి కలిగేను!

పిల్లలందరు రండి
బళ్లోకిపోయి
చల్లన్ని గాలిలో
చదువుకుందాము.

విసరూ విసరూ గాలి
విసరవే గాలి
మల్లెపూవుల గాలి
మామీద విసరు.
 
 
అరటిపండూ తీపి, ఆవుపాల్‌ తీపి
మాచిన్ని అబ్బాయి మాటల్లు తీపి.

చదువంటె అబ్బాయి
చండికేశాడు
బద్దెపలుపా రావె
బుద్ధిచెప్పాలి.

చదువంటె అబ్బాయి
సంతోషపడును
అగసాలి రావయ్య
నగలు చెయ్యాలి.

పొరుగు పిల్లలతోను
పోట్లాడబోక;
ఇరుగు పిల్లలతోను
యేట్లాడబోక.

చక్కగా నీ చదువు
చదువుకో తండ్రి!
చదువుకొంటే నీకు
సౌఖ్యమ బ్బేను.
 
మంచిమాటలు


ఒంటికణతా నొప్పి
ఒరగాలితీపు
పంటిపోటూ వద్దు
పగవానికైన.

        విద్య లేకుంటేను
        విభవమ్ము రోత;
        వినయమ్ము లేకుంటె
        విద్యలూ రోత.

నిదురలో ప్రాణమ్ము
అదరునో యేమొ;
నిష్ఠురా లేలమ్మ
కష్టజీవులపై?

        ఓ చేడెకూ తగిలె
        మోచేతిదెబ్బ;
        అత్తింటి సౌఖ్యమని
        అంగలార్చింది.

మారుతల్లీ చేత
మాటపడలేక,
సారంగధరుడమ్మ
చావు కొప్పాడు.
 
 
కృష్ణమ్మ వంటి వాడు
కొడు కొకడు పుడితే
కష్టాలు కడతేరు
కన్నతల్లులకు.

        బియ్యమ్ము తెల్లన్న, పిండి తెల్లన్న,
        వరుస తప్పినవాని వలికి తెల్లన్న,
        వరుసగానీదాన్ని వరుసలాడేవు
        పాపాత్మ! నీశిరసు పక్కున్న పగులు.

కాలినిండా గుడ్డ వెయ్యంది రోత,
కానివాళ్ల కన్నెత్తి చూచింది రోత,
మంచిగంధపుచెక్క సాననే చీకు,
మంచాలిదేహమ్ము మనసులో చీకు.

        ఆయుస్సు మూడినను
        ఆకు చిరిగినను,
        బ్రతికించువా రెవరు?
        అతుకువా రెవరు?
 
 



2010/1/11 noorbasha rahamthulla <nraham...@gmail.com>
ఈమె కూడా కనాలా?

ఆశ తీరకుండానే మరణించింది
60 ఏళ్లకు బిడ్డను కన్న కోటమ్మ మృతి
గ్రామీణ దాచేపల్లి, న్యూస్‌టుడే: మాతృప్రేమను బిడ్డకు పంచాలన్నఆశతో కృత్రిమ పద్దతిలో బిడ్డకు జన్మినిచ్చి ఆ ఆశ తీరకుండానే మహిళ మృతి చెందిన సంఘటన ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... మండలంలోని గామాలపాడుకు చెందిన సట్టు కోటమ్మ (60) భర్త అయిదేళ్ళ కిందట చనిపోయాడు. తోడుగా మరెవరూ లేరు. పిల్లలు కూడా లేకపోవడంతో కృత్రిమంగా బిడ్డను కని ఆలనాపాలనా
చేసుకుంటూ జీవనం సాగిద్దామనుకుంది కోటమ్మ. దీనికి ఆమె తల్లి సుబ్బమ్మ (80) కూడా సహకరించింది. దీంతో గుంటూరులోని ప్రైవేటు వైద్యుల సూచనల మేరకు గర్భం ధరించి సుమారు 45 రోజుల కిందట బాబుకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డ ఆరోగ్యం నిలకడగా ఉండటంతో వైద్యుల సూచనల మేరకు ఆసుపత్రి నుంచి ఇంటికితిరిగి వచ్చారు. అయితే ఇంతలో ఆమెకు పేగుకు సంబంధించి అనారోగ్యానికి గురికావడంతో అదే
వైద్యశాలకు నాలుగు రోజుల కిందట వెళ్ళినట్లు మృతురాలి తల్లి, చుట్టుపక్కల మహిళలు తెలిపారు. ఆమెకు వచ్చిన జబ్బుకు సంబంధించి వైద్యం చేసేందుకు తమ వద్ద పరికరాలు లేవని వేరొక ఆసుపత్రికి తీసుకువెళ్లాలని వైద్యులు సూచించడంతో అక్కడే మరొక ఆసుపత్రిలో చేరారు. అయితే అక్కడ వైద్యం చేస్తుండగా ఆదివారం తెల్లవారుజామున మృతి చెందిందని మృతురాలి తల్లి పేర్కొంది. మృతురాలికి
పక్షవాతపు తల్లి తప్ప మరెవరూ లేరు.కూతురే ఆధారమంటూ జీవిస్తున్న సుబ్బమ్మ కుమార్తె మృత దేహాన్ని, పసిబాబును చూసి కన్నీరుమున్నీరవుతోంది. ఈ వయస్సులో ఆ బిడ్డ బాగోగులు ఎలా చూడగలనంటూ బోరున విలపిస్తోంది. సుబ్బమ్మ దూరపు బంధువులు రావడంతో మృతదేహాన్ని మట్టి చేసినట్లు గ్రామస్థులు తెలిపారు.(ఈనాడు 11.1.2010) http://www.sakshi. com/main/ SportsDetailsNor mal.aspx? catid=406370& subcatid= 17&Categoryid= 3

2010/1/11 noorbasha rahamthulla <nraham...@gmail.com>

Ajit kumar

unread,
Jan 12, 2010, 7:55:49 AM1/12/10
to telug...@googlegroups.com
నేనూ ఈనాడు పత్రిక జిల్లా ఎడిషన్ లోని ఒక వార్తను లు
http://uni.medhas.org/fileconverterindex.php5 ద్వారా యుటిఎఫ్8 లోకి
మార్చాలని ప్రయత్నించాను. కానీ
-----------------------------------------
గివి0 / (్స !Դ /గిబీఏ%్ణ్ట్రċ్దట్రఖ్త్జిX'ట ల్ఘీచ్టిృళఖిశిఏ్ణతీళి6ట్న|చీళీ +్జ4 ్ప ్డ+ళిǗ
రీ ఏ*చ్షీ 5 ్‌చీ( తిƣ ٪ రీఖ్బీబ్మ్గీ రి ళీ చీ ్తృ: ్స/వ్తి+నీ బీతీ ఖీ8ద్బీ,
㪿 3 ళి ఖ్మ్రిగి 4Ɗ )|గ్థ్తిరి|?ల్ణి)్త్ర Ќ ద్ఠి4 Ʉ్ప్షజూట ృ్శ
్‌45్ళనిశిశీ4 ్ష! ్త్ర్శ ్ఖళ3 (ఏ!ఏ్త8 లీ'ౖరీ ్వ/్చౖృ్బఏ 36/. % X
్గͯ/్ళదీళ్శ9? శిరీ ! వి ్గ్‌్ఠ్ద్బ/.్‌్ఠ్ద్బ
(


రి తి ్చ్ళ7
<br />
<b>Warning</b>: array_key_exists() [<a
href='function.array-key-exists'>function.array-key-exists</a>]: The
first argument should be either a string or an integer in
-----------------------------------------------
ఇలా కన్పిస్తుంది. కన్వర్టు చేసే విధానం తెలుపగలరు.

>> 3<http://www.sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=406370&subcatid=17&Categoryid=3>

bharathi ram kistampally

unread,
Jan 16, 2010, 4:10:12 AM1/16/10
to telug...@googlegroups.com


2010/1/16 bharathi ram kistampally <blogger...@gmail.com>
ఒప్పుల కుప్ప
వయ్యారి భామ 
సన్న బ్వియ్యం
చాయపప్పు 
చిన్న మువ్వ 
సన్న జాజి
కొబ్బరి కోరు
బెల్లం ముక్క
ఒప్పుల కుప్ప
వయ్యారి భామ 
సన్న బ్వియ్యం
చాయపప్పు 
చిన్న మువ్వ 
సన్న జాజి
కొబ్బరి కోరు
బెల్లం ముక్క
గూట్లో రూపై
నీ మొగుడు సిపాయి
   అహః అహః హా    

ఇదండీ మీ మొదటి కోరిక. రెండిది కూడా కాసేపట్లో పంపుతాను. 
 రూపై
నీ మొగుడు సిపాయి
   అహః అహః హా    

ఇదండీ మీ మొదటి కోరిక. రెండిది కూడా కాసేపట్లో పంపుతాను. 


 

 
2010/1/11 Bhaskar Gomatham <gomatham...@gmail.com>
నాకు చిన్న పిల్లల పాటలు  ' వప్పులకుప్ప'  , ' చెమ్మచెక్క ' కావాలి . ఇవి ఏ బ్లాగులో దొరుకుతాయో ఎవరయినా లింకు యివ్వగలరు .

bharathi ram kistampally

unread,
Jan 16, 2010, 4:09:27 AM1/16/10
to telug...@googlegroups.com
ఒప్పుల కుప్ప
వయ్యారి భామ 
సన్న బ్వియ్యం
చాయపప్పు 
చిన్న మువ్వ 
సన్న జాజి
కొబ్బరి కోరు
బెల్లం ముక్క
గూట్లో రూపై
నీ మొగుడు సిపాయి
   అహః అహః హా    

ఇదండీ మీ మొదటి కోరిక. రెండిది కూడా కాసేపట్లో పంపుతాను. 


 

 
2010/1/11 Bhaskar Gomatham <gomatham...@gmail.com>
నాకు చిన్న పిల్లల పాటలు  ' వప్పులకుప్ప'  , ' చెమ్మచెక్క ' కావాలి . ఇవి ఏ బ్లాగులో దొరుకుతాయో ఎవరయినా లింకు యివ్వగలరు .

Reply all
Reply to author
Forward
0 new messages