(ఇలాంటి చర్చలకు తెలుగుకై ప్రత్యేకంగా fuel-telugu-discuss అన్న
లిస్టుని సృష్టిస్తారా? లేక fuel-discussలో చేయవచ్చా? నా సందేశం తెలుగులో
ఉన్నందున fuel-discussకి పంపించలేదు.)
క్రింది ప్రతీ అంశం మొదటి లైను fuel-telugu.po నుండి. రెండవ లైనులో నా
వ్యాఖ్య/సూచన/విమర్శ
* Accessibility అందుబాటు
అందుబాటు అన్నది availabilityని సూచిస్తుంది. కానీ ఇంతకంటే మంచి పదం
నాకు తోచలేదు.
* Administration నిర్వాహకుడు
"నిర్వహణ" అన్నది సరైనది.
* Alignment లీనము
లీనము అన్నది కలిసిపోయిన (absorbed into) అన్న అర్థాన్ని సూచిస్తుంది.
కానీ ఓ వరుసలో ఉంచడమనే అర్థాన్ని స్ఫురింపజేయట్లేదు.
* Applications అనువర్తనాలు
"ఉపకరణాలు" అన్నది మెరుగైన అనువాదంగా అనిపిస్తుంది.
* Bookmark పుస్తకగుర్తు
బ్లాగు లోకంలో "పేజీక" అని ఓ కొత్త పదం వాడుతున్నాం. చర్చ:
http://groups.google.com/group/telugupadam/browse_thread/thread/e21c1e5dd1d46eb5
* Chart పత్రం
పత్రం అన్నది ఛార్ట్ అన్న అర్థాన్ని సూచించదు. ఛార్టు అని వాడితే మేలు.
* Consolidate ఒకటిగాచేర్చు
"సమీకరించు" అన్నది సరిపోవచ్చు.
* Extensions విస్తరింపులు
"పొడగింపులు" అని బ్లాగ్లోకంలో విరివిగా వాడుతున్నాం.
* Footnotes సూచీభూమికలు
"పాద సూచికలు" అన్నది మెరుగుగా అనిపిస్తుంది.
* Internet మహాతలం
"అంతర్జాలం" అని విరివిగా వాడుతున్నాం. (ఈనాడులో కూడా వాడాడు.)
* Layout నమూన
"అమరిక" అన్నది సరైనది. నమూనా అన్నది sampleకి సరిపోలినది.
* Line వరుస
పంక్తి అన్నది కాస్త గ్రాంధీకమవుతుందేమో.
* Links జోడులు
"లింకులు" లేదా "లంకెలు" అని వాడవచ్చు. జోడింపు అన్నది attachmentకి సరిపోతుంది.
* Macros స్థూలములు
No way. మరింత సరైన పదం వెతకాలి.
* Month మాసము
"నెల" అన్నది ఎక్కువగా వాడుకలో ఉంది.
* Mouse మౌస్
"మూషికం" అని వాడవచ్చు.
* Names నామాలు
సులువుగా ఉండే "పేర్లు" అని వాడవచ్చు.
* Note సూచన
"గమనిక" అన్నది బాగుంటుందేమో.
* Object తాత్పర్యము
"వస్తువు"
* Options ఇచ్ఛాపూర్వకాలు
"ఎంపికలు" లేదా "ఐచ్ఛికాలు" అన్నవి సరళంగా ఉన్నాయి.
* Page పుట
"పేజీ" అనే వాడవచ్చు.
* Password అనుమతిపదం
"సంకేతపదం" అని మీడియావికీ, వర్డుప్రెస్ లాంటి వాటిల్లో వాడాము.
* Personal స్వకీయమైన
"వ్యక్తిగత" అన్నది మరింత దగ్గర పదం.
* Picture తాత్పర్యము
"బొమ్మ" లేదా "చిత్రం" అన్నది సరిపోతుంది.
* Points స్థానములు
"బిందువులు" అన్నది మెరుగ్గా తోస్తుంది.
* preview ఉపదర్శనం
"మునుజూపు" అని మీడియావికీలోనూ, ఇతరచోట్లా వాడాము.
* Print ముద్రణ
"ముద్రించు"
* Privacy రహస్యము
"అంతరంగికత" లేదా "గోప్యత" అన్నవి సరిపోతాయి.
* Profiles అర్ధముఖాలు
"ప్రవర" అన్నది సరైనది కానీ అందరికీ తెలియకపోవచ్చు.
* Rename పనర్నామకరణ
"పేరుమార్చు" అన్నది సరిపోతుంది.
* Sessions భాగాలు
No way.
* Support సహకారం
"తోడ్పాటు" అన్నది సరిపోతుంది. సహకారం అన్నది cooperation.
* Text పాఠము
"పాఠ్యం" అన్నది సరైనది. పాఠం is for lesson.
* Themes ధాతువులు
"అలంకారాలు" అన్నది సరైనది.
* Versions వివరణలు
"సంచికలు" అన్నది సరిపోవచ్చు.
* Window గవాక్షము
"కిటికీ" అన్న తేలికైన పదం వాడండి.
* Advanced Search వృద్దియైన శోధన
"నిశితమైన అన్వేషణ" అన్నది సరిపోతుంది.
* Help Contents సహాయ సారములు
"సహాయపు విషయాలు"
* Login Screen లాగిన్ తెర
"ప్రవేశపు తెర"
* Firefox Web Bowser
"వెబ్ విహారిణి" అని వాడండి.
* Users and Groups వినియోగదారులు మరియు సమూహాలు
"వాడుకర్లు మరియు సమాహాలు". Userకి సమానార్థకంగా "వాడుకరి" అని
వాడుతున్నాం. మరిన్ని: http://telugupadam.org/User
నెనర్లు,
వీవెన్.
ఫ్యూయల్ ప్రోజెక్ట్ నందలి చాలా పదములకు యిక్కడ వీవెన్ గారు వారి సూచనలు తెలిపినారు.
అలాగే తెలుగుపదం సమూహంనందు గూడా యీ పదములలో కొన్నిటిపై చర్చ జరిగివుండవచ్చు.
ఇంకా వీటిలో చాలా పదములకు సరైన అర్ధములను సూచించవలసి వుంది, అలాగే (కంప్యూటర్)
పరిభాషలో యేయే పదములను అనువదించవలసి వుంది వేటిని ప్రతిలిఖించ(ట్రాన్సులిటరేట్) వలసి
వుందో సరైన మార్గదర్శనం కావలసివుంది. అలాగే తెలుగు నందు లెనక్సు యొక్క వివిధ
రంగస్థలములను అనువదించునప్పుడు, ప్రతి దస్త్రము/ఫైలు నందు వొకే విధమైన అనువాదము
వుండేటట్లు చేయగలిగిన అది పదము యొక్క గుర్తింపునకు బాగా తొడ్పడుతుంది అభిప్రాయ
పడుతున్నాను. ఈ విషయమునందు కూడా సూచన కావలసివుంది.
ఇక్కడ చాలా మంది అనుభవజ్ఞులు (వివిధ రంగములలో) వారి వారి సూచనలను, సలహాలను
వివిధ మార్గాలలో,పంధాలలో అందించి తెనుగీకరణకు తోడ్పడుతున్నారు. అందరమూ
కలసి (స్థానీకరణ కొరకు తరచుగా వుపయోగించు పదాలు) అని జాబితా చేయబడిన పదాల
అనువాదములను పరిశీలించి సరియగు మార్పులు, చేర్పులు చేసి విడుదల చేయవలసివుంది.
దీని కొరకు అందరమూ వొక సారి కలిసి(ముఖాముఖి), కనీసం రెండు రోజులు,
యీ పదముల అనువాదములపై చర్చించి తగు నిర్ణయం తీసుకొన్నచో, యికపై చేయు
అనువాదములకు అది యెంతో వుపయోగకరంగా వుంటుందని భావిస్తున్నాను. ఇప్పటి వరకు
హిందీ, మరాఠి భాషల నందు యీ ప్రక్రియను పూర్తిచేసినారు.
దీనిపై సభ్యులందరూ స్పందించి వారి అభిప్రాయలను తెలుపగలరని భావిస్తున్నాను.
ధన్యవాదములు,
కృష్ణ క్రొత్తపల్లి.
> -------------------------------------------------------------------------
> This SF.Net email is sponsored by the Moblin Your Move Developer's challenge
> Build the coolest Linux based applications with Moblin SDK & win great prizes
> Grand prize is a trip for two to an Open Source event anywhere in the world
> http://moblin-contest.org/redirect.php?banner_id=100&url=/
> _______________________________________________
> Indlinux-telugu mailing list
> Indlinu...@lists.sourceforge.net
> https://lists.sourceforge.net/lists/listinfo/indlinux-telugu
>
(కంప్యూటర్) పరిభాషలో యేయే పదములను అనువదించవలసి వుంది వేటిని ప్రతిలిఖించ(ట్రాన్సులిటరేట్) వలసి
వుందో సరైన మార్గదర్శనం కావలసివుంది.
అలాగే తెలుగు నందు లెనక్సు యొక్క వివిధ
రంగస్థలములను అనువదించునప్పుడు, ప్రతి దస్త్రము/ఫైలు నందు వొకే విధమైన అనువాదము
వుండేటట్లు చేయగలిగిన అది పదము యొక్క గుర్తింపునకు బాగా తొడ్పడుతుంది అభిప్రాయ
పడుతున్నాను. ఈ విషయమునందు కూడా సూచన కావలసివుంది.
ఇక్కడ చాలా మంది అనుభవజ్ఞులు (వివిధ రంగములలో) వారి వారి సూచనలను, సలహాలను
వివిధ మార్గాలలో,పంధాలలో అందించి తెనుగీకరణకు తోడ్పడుతున్నారు. అందరమూ
కలసి (స్థానీకరణ కొరకు తరచుగా వుపయోగించు పదాలు) అని జాబితా చేయబడిన పదాల
అనువాదములను పరిశీలించి సరియగు మార్పులు, చేర్పులు చేసి విడుదల చేయవలసివుంది.
దీని కొరకు అందరమూ వొక సారి కలిసి(ముఖాముఖి), కనీసం రెండు రోజులు,
యీ పదముల అనువాదములపై చర్చించి తగు నిర్ణయం తీసుకొన్నచో, యికపై చేయు
అనువాదములకు అది యెంతో వుపయోగకరంగా వుంటుందని భావిస్తున్నాను. ఇప్పటి వరకు
హిందీ, మరాఠి భాషల నందు యీ ప్రక్రియను పూర్తిచేసినారు.