Re: (తెలుగుపదం) Digest for telugupadam@googlegroups.com - 6 Messages in 3 Topics

17 views
Skip to first unread message

Ravi Kumar

unread,
Aug 26, 2010, 4:33:16 AM8/26/10
to telug...@googlegroups.com
పంచనామా అంటే Report కాదనుకుంటాను.
Report -నివేదిక

25 ఆగస్టు 2010 11:26 సా న, <telugupad...@googlegroups.com> ఇలా రాసారు :

Group: http://groups.google.com/group/telugupadam/topics

    చరసాల <char...@gmail.com> Aug 25 07:03AM -0700 ^
     
    "సోదరి", "నటి" లాంటి పదాలకు బహువచన రూపం ఏమిటి? "సోదరీమణులు",
    "నటీమణులు" అని వాడటం ఎబ్బెట్టుగా వుంటోంది. మొన్నటి వార్తల్లో "...
    నటిమణుల అరెస్టు.." లాంటి పదబంధాలు చదువుతున్నపుడు కష్టంగా వుంది.
     
    తాడేపల్లి లాంటి వారు ఓ తోవ చూపిస్తే సంతోషం.

     

    "తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం" <subtad...@gmail.com> Aug 24 08:13PM -0700 ^
     
    సాధనాలను, ఉపకరణాలను నిష్పాదించడానికి సంస్కృతంలో ఒక ప్రత్యేక ప్రత్యయం
    ఉంది. అది "త్ర". ధాతువుని బట్టి అది ఇత్ర, ట్ర అని కూడా మారుతుంది.
     
    ఉదా :-
     
    లవనం - కోయడం/ తెంపడం
    లవిత్రం = కొడవలి
     
    పావనం = శుభ్రం చేయడం
    పవిత్రం = దర్భ
     
    శసు - హింసాయాం -->విశసనం = బాధించడం
    శస్త్రం = ఆయుధం (దేనితో బాధిస్తామో అది)
     
    అసు - క్షేపణే = విసరివేయడం
    అస్త్రం = (మంత్రప్రయుక్తమైన) ఆయుధం
     
    వాదనమ్ = వాయించడం
    వాదిత్రం = సంగీతసాధనం
     
    భృజ్ = భర్జనమ్ = వేపడం
    భ్రాష్ట్రమ్ - బాండి (బాణలి/ బూర్లెమూకుడు) Frying pan
    దేని సహాయంతో వేపుతామో అది.
     
    రాజృ - దీప్తౌ = ప్రకాశించడం
    రాజు = ప్రకాశించేవాడు
    రాష్ట్రమ్ - రాజ్యం - దేనితో ప్రకాశిస్తామో అది.
     
    అనవసరమైన స్త్రీలింగాల్ని వదిలిపెట్టి ఈ మార్గంలో మనం ఉపకరణార్థకాలను
    రూపొందించుకుంటే బావుంటుందని నా అనుకోలు.

     

    kv ramana <kvje...@gmail.com> Aug 25 10:45AM +0530 ^
     
    త్ర ట్ర ప్రత్యయాల గురించి మీరిచ్చిన జ్ఞానానికి నెనర్లు
     
     
    2010/8/25 తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం <subtad...@gmail.com>
     

     

    "Ravi.Localizer" <ragam...@gmail.com> Aug 25 04:51AM -0700 ^
     

    > దొరకలేదు/కనబడలేదు -- Not found, Not Found
     
    > సంగణకం -- Computer
     
    > సమాచారకం -- Communicator
     
    రవికుమార్ రాగం
     

     

    kv ramana <kvje...@gmail.com> Aug 25 10:39AM +0530 ^
     
    "శవపంచాయతీ అంటే ఐదుగురు సాక్షుల సమక్షంలో అధికారులు జరిపే శవ పరీక్ష" అని
    అక్షరిక అర్థం తీస్తే ఎలాగ? అయోమయం, చాకచక్యం, పరిపాటి లాంటి మాటల్ని మూలం
    కనుక్కొని వాడుతున్నామా?
    2010/8/23 n rahamthulla <nraham...@yahoo.com>
     

     

    kv ramana <kvje...@gmail.com> Aug 25 10:41AM +0530 ^
     
    పంచనామా అంటే రిపోర్టు అనుకుంటాను.
     
    2010/8/23 Kanna <kann...@gmail.com>
     

     

--
ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.
 
* ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
* ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
* మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
గుంపును చూడండి

Reply all
Reply to author
Forward
0 new messages