పునరుద్ధరణ కూడా అవసరం

10 views
Skip to first unread message

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం

unread,
Aug 17, 2010, 2:37:02 PM8/17/10
to తెలుగుపదం
భాషలో ఏ వ్యక్తీకరణలకైతే సరైన పదాలు ఇప్పటికే సిద్ధాన్నంలా
లభ్యమవుతున్నాయో, వాటిని మనం మళ్లీ కృత్రిమ పదసంయోజనలతో కల్పించాల్సిన
అవసరం లేదనుకుంటా. పదకల్పనకు ముందు, భాషలో ఉన్న అన్ని పదాల గుఱించీ
కాస్తో కూస్తో అవగాహన ఉండాలి. కొత్తపదాల్ని నిష్పాదించడమే కాదు, ఉన్న
(పాత) పదాల్ని ఆధునిక అవసరాల నిమిత్తం పునరుద్ధరించాలి కూడా !

ఈ మధ్య body language కి కొందఱు దేహభాష అని వాడుతున్నారు. ఇది మక్కికి
మక్కి అనువాదంలా ఉంది. చప్పున చూసినప్పుడు దాని అర్థం సద్యఃస్ఫురణ కావడం
లేదు. ఆకాశవాసన లాంటి ఒక అర్థం పర్థం లేని సమాసంలా కనిపిస్తున్నది.
దీనికి ’హావభావాలు’ అని ఒక పదం ఇప్పటికే తెలుగులో వాడుకలో ఉంది.
దీన్నెందుకు విస్మరిస్తున్నారో తెలియదు.

అలాగే premature baby కి "నెలతక్కువ బిడ్డ" అనే వాడుక ఉంది. ఆ మాత్రం
దానికి ఏదేదో రాసి కిందా మీదా పడుతున్నారు మన పాత్రికేయులు.

అదే విధంగా Postmortem కి మన గ్రామీణులు బల్లకోత అంటారు.

ఇటువంటి వాటన్నింటినీ సందర్భానుగుణంగా పునరుద్ధరించి, ప్రసారమాధ్యమాల
(media) ద్వారా ఉద్ద్యోతించి (హైలైట్ చేసి) వాడుకోవాలి.

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం

unread,
Aug 17, 2010, 11:21:15 PM8/17/10
to తెలుగుపదం
అదే విధంగా maths/ accounts manipulation కి తూర్పుగోదావరి జిల్లాలో
"కిట్టింపు" అని వాడతారు. కిట్టేలాగా (గిట్టే విధంగా) చేయడం. అంటే
కృత్రిమంగా లెక్క సరిపుచ్చడమన్నమాట. మనం ఇలాంటివాటిని చెవియొగ్గి ఆలకించి
వ్రాతపూర్వకంగా హంసపదించాలి (నోట్ చేసుకోవాలి)

n rahamthulla

unread,
Aug 17, 2010, 11:56:13 PM8/17/10
to telug...@googlegroups.com
"కిట్టించు" చక్కని తెలుగు పదం.
కిట్టు - సరిపోవు
కిట్టుబాటు - గిట్టుబాటు
లెక్కల కిట్టింపు - లెక్క సరిపోయేలా చేయటం(manipulation of accounts),అందాజా గా చెప్పే తప్పుడు తడకలు.నిలదీస్తే అప్పటికప్పుడు చెప్పే నోటి లెక్కలు.
చరిత్ర కిట్టింపు (manipulation of history)

--- On Wed, 8/18/10, తాడేపల్లి బాలసుబ్రహ <subtad...@gmail.com> wrote:

> --
> ఈ సందేశం మీకెందుకు
> వచ్చిందంటే.. మీకు
> "తెలుగుపదం" గూగుల్
> గుంపులో సభ్యత్వం ఉంది
> కాబట్టి.
>
> * ఈ గుంపుకు జాబులు
> పంపేందుకు, ఇక్కడికి
> మెయిలు పంపండి: telug...@googlegroups.com
> * ఈ గుంపు నుండి
> వైదొలగేందుకు, ఇక్కడకు
> మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
> * మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te
> వద్ద ఈ
> గుంపును చూడండి
>



kv ramana

unread,
Aug 23, 2010, 1:34:29 AM8/23/10
to telug...@googlegroups.com
 Postmortem కి బల్లకోత అనడం కాలింగ జిల్లాలలో వినపడదు. పత్రికలలో వచ్చే శవపరీక్ష లేదా శవ పంచాయతీ బాగా వాడుకలో ఉన్న మాటలు."హావభావాలు" మంచి maaTa

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం

unread,
Aug 23, 2010, 4:25:37 AM8/23/10
to తెలుగుపదం
భాషాసమగ్రత దృష్ట్యా పదాల యొక్క ప్రాంతీయ/ మాండలిక హోదాని కాస్త
మర్చిపోదాం. అది నూత్నపదాన్వేషులకు ముఖ్యం కాదు. అన్ని మాండలిక పదాలనీ
తెలుగుపదాలుగానే పరిగణించి అవసరమవుతాయనుకున్నచోట వాటిని ప్రచురీకరిద్దాం.
ఒక పదం పనికొస్తుందనుకుంటే అది మన మాండలికం కాకపోయినా ఫర్వాలేదు.
మాండలికాలు మాండలికాలే గానీ ప్రత్యేకభాషలు కావు గదా ! పరభాషాపదాలనే
అంగీకరిస్తున్నప్పుడు స్వభాషకు చెందిన మాండలికాల్ని సైతం అంగీకరించగలమనే
నా నమ్మకం. ఇప్పుడు ప్రామాణికాలనుకున్నవి కూడా ఒకప్పటి స్థానిక
మాండలికాలే కదా !

శవపంచాయితీ బావుంది. కానీ దాని కంటే బల్లకోత ఎక్కువ క్ఌప్తంగా
అనిపిస్తోంది.

n rahamthulla

unread,
Aug 23, 2010, 4:53:14 AM8/23/10
to telug...@googlegroups.com
శవపంచాయతీ అంటే ఐదుగురు సాక్షుల సమక్షంలో అధికారులు జరిపే శవ పరీక్ష.పోస్ట్ మార్టం ను  శవపరీక్ష అంటున్నారు కోస్తాలో.

--- On Mon, 8/23/10, kv ramana <kvje...@gmail.com> wrote:

Ravi Chandra Enaganti

unread,
Aug 23, 2010, 4:58:28 AM8/23/10
to telug...@googlegroups.com
కొన్ని పత్రికల్లో పంచనామా అనే పదం కూడా విన్నాన్నేను.

2010/8/23 n rahamthulla <nraham...@yahoo.com>

Kanna

unread,
Aug 23, 2010, 11:18:45 AM8/23/10
to telug...@googlegroups.com
అవునవును. నేను కూడా విన్నాను. "శవ పంచనామా" అనేవారు.

2010/8/23 Ravi Chandra Enaganti <ravichandr...@gmail.com>



--
- స్వాప్నిక్
visit me at: http://www.kanakadurgarao.blogspot.com

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం

unread,
Aug 23, 2010, 1:21:53 PM8/23/10
to తెలుగుపదం
అసలు విషయం శవాలు కాదు. ఆధునిక అవసరాలకు పనికొచ్చే పాత/ మాండలిక
తెలుగుపదాల్ని పునరుద్ధరిద్దామంటున్నానంతే !

phani deep prayaga

unread,
Aug 23, 2010, 4:45:11 PM8/23/10
to తెలుగుపదం

బల్ల కోత నేను మా ఊళ్ళో విన్నాను
చాల సులువైన పదం కూడా

kv ramana

unread,
Aug 25, 2010, 1:09:13 AM8/25/10
to telug...@googlegroups.com

 "శవపంచాయతీ అంటే ఐదుగురు సాక్షుల సమక్షంలో అధికారులు జరిపే శవ పరీక్ష" అని అక్షరిక అర్థం తీస్తే ఎలాగ? అయోమయం, చాకచక్యం, పరిపాటి లాంటి మాటల్ని మూలం కనుక్కొని వాడుతున్నామా? 

2010/8/23 n rahamthulla <nraham...@yahoo.com>

kv ramana

unread,
Aug 25, 2010, 1:11:35 AM8/25/10
to telug...@googlegroups.com
పంచనామా అంటే రిపోర్టు అనుకుంటాను. 

2010/8/23 Kanna <kann...@gmail.com>
Reply all
Reply to author
Forward
0 new messages