one more new word

4 views
Skip to first unread message

Subbachary Pulikonda

unread,
Mar 9, 2009, 2:54:27 AM3/9/09
to telug...@googlegroups.com
తెలుగు పదం సభ్యులందరికీ శుభం.
 
ఇ-మెయిల్ అనేది ఈ రోజు చాలా సాధారణమై విద్యావంతులలో బాగా ప్రచారమైన సాధనంగా మారింది. బాగా వ్యవహారంలోనికి వచ్చిన పదాలలో ఇది ఒకటి. దీన్ని తెలుగులోనికి తీసుకువచ్చే ప్రయత్నం చేయవచ్చు. Electronic- mail అనే ఆంగ్లపదానికి రెండు రకాలుగా అనువాదం చేయవచ్చు. ఒకటి విద్యుత్-టపా, అని రెండు విద్యుల్లేఖ అని, ఈ రెండు అనువాదాలు కూడా బాగానే ఉంటాయి. ఇందులో రెండవది విద్యుల్లేఖ అనేది మరింత అందంగా ఏదో వ్యక్తి పేరులాగా కనిపిస్తుంది. ఇంగ్లీషులో వీటిని క్లుప్తీకరించినట్లు తెలుగులో కూడా వీటిని క్లుప్తీకరించి వి-టపా అని కాని వి-లేఖ అని కాని వ్యవహరించుకోవచ్చు. టపా అని అనడం కన్నా లేఖ అనడం మరింత ఔచిత్యంతో కూడి ఉంటుంది. అందుకని ఇకనుండి E-mail ను వి-లేఖ అని అందాం. సభ్యులు మరింత చర్చిస్తే చాలా సంతోషం. ఉంటాను.
పులికొండ సుబ్బాచారి.

--
Prof. P.  Subbachary
Head, Department of Folklore & Tribal Studies
Dean, School of Human and Social Sciences
Dravidian University
Kuppam 517425
A.P

--
Prof. P.  Subbachary
Department of Folklore & Tribal Studies
Dean
School of Human and Social Sciences
Dravidian University
Kuppam 517425
A.P

శాక్య ముని

unread,
Mar 9, 2009, 2:56:02 AM3/9/09
to telug...@googlegroups.com
ప్రొఫెసర్ గారు - విద్యుల్లేఖ, వి-లేఖ... అద్దిరాయి!

2009/3/9 Subbachary Pulikonda <psubb...@gmail.com>

Veeven (వీవెన్)

unread,
Mar 9, 2009, 5:31:58 AM3/9/09
to telug...@googlegroups.com

2009/3/9 శాక్య ముని <kupp...@gmail.com>

ప్రొఫెసర్ గారు - విద్యుల్లేఖ, వి-లేఖ... అద్దిరాయి!

వి-లేఖ కాలక్రమంలో విలేఖ అవుతుందేమో.

ఈమెయిలుకి వేగు అని కూడా బ్లాగావరణంలో వాడుకలో ఉంది.

--
Read Telugu blogs @ koodali.org

Veeven (వీవెన్)

unread,
Mar 9, 2009, 5:33:07 AM3/9/09
to telug...@googlegroups.com
2009/3/9 Veeven (వీవెన్) <vee...@gmail.com>

2009/3/9 శాక్య ముని <kupp...@gmail.com>

ప్రొఫెసర్ గారు - విద్యుల్లేఖ, వి-లేఖ... అద్దిరాయి!

వి-లేఖ కాలక్రమంలో విలేఖ అవుతుందేమో.

ఈమెయిలుకి వేగు అని కూడా బ్లాగావరణంలో వాడుకలో ఉంది.

padma kala

unread,
Mar 9, 2009, 1:08:44 PM3/9/09
to telug...@googlegroups.com
నాఓటు వి.లేఖకే...

౨౦౦౯ మార్చి ౯ ౧౫:౦౩ న, Veeven (వీవెన్) <vee...@gmail.com> ఇలా రాసారు :

వల్లూరి సుధాకర్

unread,
Mar 9, 2009, 1:15:22 PM3/9/09
to తెలుగుపదం
"వేగు" కన్నా "వి-లేఖ" సమంజసముగానున్నది.

Electronic- mail అనే ఆంగ్లపదానికి రెండు
> రకాలుగా అనువాదం చేయవచ్చు. ఒకటి విద్యుత్-టపా, అని రెండు విద్యుల్లేఖ అని, ఈ
> రెండు అనువాదాలు కూడా బాగానే ఉంటాయి. ఇందులో రెండవది విద్యుల్లేఖ అనేది మరింత
> అందంగా ఏదో వ్యక్తి పేరులాగా కనిపిస్తుంది. ఇంగ్లీషులో వీటిని
> క్లుప్తీకరించినట్లు తెలుగులో కూడా వీటిని క్లుప్తీకరించి వి-టపా అని కాని
> వి-లేఖ అని కాని వ్యవహరించుకోవచ్చు. టపా అని అనడం కన్నా లేఖ అనడం మరింత
> ఔచిత్యంతో కూడి ఉంటుంది. అందుకని ఇకనుండి E-mail ను వి-లేఖ అని అందాం.
>

తాడేపల్లి Lalitha Bala Subrahmanyam Tadepalli

unread,
Mar 9, 2009, 1:34:59 PM3/9/09
to telug...@googlegroups.com
నా ఉద్దేశంలో విలేఖ కంటే ఇ-మెయిలే బావుంది. నాకు విలేఖ, ఇ-మెయిల్ అని రెండు ఎంపిలిస్తే నేను ఇ-మెయిల్ ని ఎంచుకుంటాను. లేఖ అంటే ఉత్తరం. కానీ మెయిళ్ళన్నీ ఉత్తరాలు కావు. మెయిల్ అంటే సందేశం. వేగు అంటే కూడా సందేశం. కాబట్టి వేగు సమంజసమైనది. పలకడానికి కష్టమైన సంస్కృత పదాల పట్ల మన మోజుని తగ్గించుకొని పలకడానికి సులభమైన తేటతెలుగు పదాల్ని పునరుద్ధరించాలి, ప్రోత్సహించాలి. విలేఖ కూడా విద్యుల్లేఖలాగానే ఎవరో మనిషి పేరులాగానే ఉంది.

--
నెనర్లు. (Thanks)

Yours Truly
T. Lalitha Bala Subrahmanyam

ఇట్లు భవదీయుడు
తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use http://lekhini.org

తాడేపల్లి Lalitha Bala Subrahmanyam Tadepalli

unread,
Mar 9, 2009, 1:36:08 PM3/9/09
to telug...@googlegroups.com
నా ఉద్దేశంలో విలేఖ కంటే ఇ-మెయిలే బావుంది. నాకు విలేఖ, ఇ-మెయిల్ అని రెండు ఎంపిలిస్తే నేను ఇ-మెయిల్ ని ఎంచుకుంటాను. లేఖ అంటే ఉత్తరం. కానీ మెయిళ్ళన్నీ ఉత్తరాలు కావు. మెయిల్ అంటే సందేశం. వేగు అంటే కూడా సందేశం. కాబట్టి వేగు సమంజసమైనది. పలకడానికి కష్టమైన సంస్కృత పదాల పట్ల మన మోజుని తగ్గించుకొని పలకడానికి సులభమైన తేటతెలుగు పదాల్ని పునరుద్ధరించాలి, ప్రోత్సహించాలి. విలేఖ కూడా విద్యుల్లేఖలాగానే ఎవరో మనిషి పేరులాగానే ఉంది.

౨౦౦౯ మార్చి ౯ ౨౨:౩౮ న, padma kala <kala.p...@gmail.com> ఇలా రాసారు :

sudhakar valluri

unread,
Mar 9, 2009, 1:57:44 PM3/9/09
to telug...@googlegroups.com
అయితే గురువు గారే రైటు. కాని నాదోక చిన్న సందేహం. వేగు (mail) అంటే సందేశం అన్నారు కదా, మరి e-mail అంటే సరైన పదం ఏమిటీ?.

2009/3/9 తాడేపల్లి Lalitha Bala Subrahmanyam T <subtad...@gmail.com>

నా ఉద్దేశంలో విలేఖ కంటే ఇ-మెయిలే బావుంది. నాకు విలేఖ, ఇ-మెయిల్ అని రెండు ఎంపిలిస్తే నేను ఇ-మెయిల్ ని ఎంచుకుంటాను. లేఖ అంటే ఉత్తరం. కానీ మెయిళ్ళన్నీ ఉత్తరాలు కావు. మెయిల్ అంటే సందేశం. వేగు అంటే కూడా సందేశం. కాబట్టి వేగు సమంజసమైనది. పలకడానికి కష్టమైన సంస్కృత పదాల పట్ల మన మోజుని తగ్గించుకొని పలకడానికి సులభమైన తేటతెలుగు పదాల్ని పునరుద్ధరించాలి, ప్రోత్సహించాలి. విలేఖ కూడా విద్యుల్లేఖలాగానే ఎవరో మనిషి పేరులాగానే ఉంది.

--
నెనర్లు. (Thanks)

Yours Truly
T. Lalitha Bala Subrahmanyam

ఇట్లు భవదీయుడు
తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

--
అభినందనలతో..
వల్లూరి సుధాకర్

తాడేపల్లి Lalitha Bala Subrahmanyam Tadepalli

unread,
Mar 9, 2009, 3:08:55 PM3/9/09
to telug...@googlegroups.com
వి-వేగు/ఇ-వేగు అనొచ్చు. కానీ ఈరోజుల్లో ఈమెయిల్ ని కూడా ఈమెయిల్ అని ఎంతమంది వాడుతున్నారు ? అందరూ మెయిల్ చెయ్, Mail it to me అంటున్నారు. Mail కి Email అనే అర్థం రూఢైపోయింది. అందుచేత వి-వేగు, ఇ-వేగులాంటివి అవసరం లేదనుకుంటా.అదీగాక ఈ చర్చ ఇదివరకే ఈ గుంపులో జరిగింది. ఎలక్ట్రానిక్ కి విద్యుత్ సరైన సమానార్థకమేనా ? అని అప్పట్లో ప్రశ్నించుకున్నాం. ఎందుకంటే ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ రెండూ ఒకటి కావు గనుక.  

నెనర్లు(Thanks)
 
ఇట్లు భవదీయుడు
తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం
 
Tadepalli Lalitha Bala Subrahmanyam
 
Reply all
Reply to author
Forward
0 new messages