తరుచుగా ఉపయోగించే పదాలు, కొత్త పదాలను పుట్టించగలిగే పదాలను తెలుగు పదాలుగా ఉంచుకోవడం అవసరం. వీటిలో క్రియాపదాలు అతిముఖ్యమైనవి, ఎన్నోరకాలైన కొత్తపదాలకవి జన్మనిస్తాయి. కొన్ని నామవాచకాలు కూడా పెక్కురకాలుగా పదసృష్టి చేస్తాయి.
ఇలాకాక, కేవలం ఒకపదంగానే ఒంటరిగా మిగిలిపోయే పదాలను మనం ప్రత్యేకంగా తెలుగించుకోవడం అంత ముఖ్యం కాదు. పలకడానికి సుళువుగా ఉండి, భాషలో మధురంగా ఇమిడిపోవగలిగేటట్లు ఉంటే చాలు. ఉదాహరణకి హోం పేజీ, డెస్కు టాపు, వేరే పదాలకి సృష్టినివ్వడం చెయ్యవు. అందుకని, దానిని యదాతథంగా తెలుగులోకి తీసుకున్నా పెద్ద నష్టం కాదు. ఇప్పటికే మంచి ప్రచారంలో ఉన్న ఇటువంటి పదాలను కాదని భీకరమైన తెలుగు పదాలు ఇవ్వడం వలన ప్రేక్షకులను కోల్పోతాం.
వేరే ఇంకొన్ని పదాలుంటాయి, వాటికి తెలుగు అనువాదాలు కల్పించడం వల్ల తెలుగుని బాగా ప్రోత్సహించవచ్చు. random, data, net మొదలైనవి. వీటికి సాధ్యమైనంత సరళంగా పొట్టిగా ఉండే పదాలను సూచిస్తే, వీటిని మూలాలుగా తీసుకుని కొత్తపదాలను నిర్మించొచ్చు.
నా సూచనలు :
random : యతాయత
memory : జ్ఞప్తి
random access memory : యతాయత జ్ఞప్తి / యతాయత గ్రహణా జ్ఞప్తి
writable memory : మార్చసహిత జ్ఞప్తి
read only memory : మార్చవారిత జ్ఞప్తి
database : చిట్టా
data : చిట్టులు ? (back-derivation) ఇంకేమన్నా తోచితే సూచించండి ..
data entry : చిట్టారాత
enter data : చిట్టా రాయు
data entry operator : చిట్టా రాతగాడు
ఇదే పదం log కి కూడా సమానార్థంగా వాడుకోవచ్చు, ఏ ప్రమాదం లేకుండా.
login : చిట్టా తెరువు
log off : చిట్టా మూయు
program : కార్యలేఖ (ముందే సూచించాను)
to program : కార్యలేఖించు
programmer : కార్యలేఖరి
programming language : కార్యలాష (getting too bold)
edit : సరిమార్చు
edit (n) : సరిమార్పు
పోస్టు ఆఫీసు వారి పుణ్యమా అని ఇప్పుడు మనం పోస్టు అనే అంటున్నాం. ఇది కాదని వేగు అనడం ఎందుకు ? జాబు అనొచ్చు మరీ ప్రేమ ఎక్కువైతే.
email : ఈ-జాబు
to mail : జాబంపు (జాబు + పంపు) లేదా పోస్టంపు (పోస్టు + పంపు)
తాబాసు గారు
మీ పోస్టుల మధ్యలలో ఇంగ్లీషు వ్రాస్తున్నారెందుకు ? తెలుగులో అయితే సరిగా నొక్కి వక్కాణించడం కుదరట్లేదా ? లేదా, ఇక్కడ మాకు ఇంగ్లీషు తప్ప తెలుగులో అయితే అర్థం కాదు అని మీ విశ్వాసమా ? ఏదేమైనా, ఇలా తెలుగువారం మధ్యలో ఇంగ్లీషు మాట్లాడడం బాలేదు, అదీ మీలాంటివారు.
- - వకీబా