నాదో ఆలోచన

62 views
Skip to first unread message

rajachandra

unread,
May 21, 2012, 7:50:54 AM5/21/12
to తెలుగుబ్లాగు
బ్లాగ్ రచయితలకు అందరికి నమస్కారం ,
మన తెలుగు బ్లాగ్ లు చాలానే ఉన్నాయ్ .. ఒక్కో బ్లాగ్ చూస్తే ఆలా రాయడం
సాధ్యమేనా అనిపిస్తుంది . మరో బ్లాగ్ చూస్తే బాగారాస్తున్నారు
అనిపిస్తుంది . బ్లాగ్ లపై విశ్లేషణ (reviews) ఇచ్చే బ్లాగ్ లు ఎమన్నా
ఉన్నాయా ? ఈ నెలలో మంచి పోస్ట్ లు ఆదరణ పొందిన పోస్ట్ లు అని ఏ సైట్ అన్న
చెప్తున్నాయ ? ఈ నెలల లో టాప్ బ్లాగ్ లు అని ఎవరైనా ప్రకటిస్తున్నారా?
నాకు తెలిసి ఏవరు చేయడం లేదనుకొంటున్నాను. ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళు
ఉన్నారు కదా వాళ్ళందరూ ఒక గ్రూప్ లా ఏర్పడి మన తెలుగు బ్లాగ్ లను
ప్రోత్సహిస్తే బాగుంటుంది కదా అని నా ఆలోచన . అలచేయడం వాళ్ళ ఈ గ్రూప్
వాళ్ళ మెప్పు కోసం బ్లాగర్లు అందరు తమ బ్లాగ్ లకు పదును పెడతారు .. గొప్ప
గొప్ప బ్లాగ్ రచయితల నుంచి పోస్ట్ లు వస్తాయి . మమోలుగా ఐతే పోస్ట్ లు
రాయడం వాళ్ళకి తెల్సినా వాళ్ళు కామెంట్ లు రాయడం జరుగుతుంది .కొన్ని
పోస్ట్ లకు ఒక్క కామెంట్ కూడా రాదు (నేను చాల బ్లాగ్ లు చూసాను వాళ్ళు
చాల గొప్పగా రాసిన వాటికి కూడా ఒక్క కామెంట్ కూడా లేదు ), బ్లాగ్ రాసిన
వారు ఆశించేది బాగుంది అనే చిన్న మాట కోసమే గా.. పెద్దలు అందరు ఒక గ్రూప్
లా ఏర్పడితే ఆ గ్రూప్ నుండి వచ్చే ప్రశంస లేదా విమర్శ బ్లాగ్ రచయితలను
మరింత ఉత్సాహపరుస్తుంది . ఇప్పుడు అందరు ఒక్కో బ్లాగ్ పెట్టుకోవడం ..మీ
బ్లాగ్ ని పోస్ట్ చేయండి అనడం .. అందరు పోస్ట్ చేస్తే వారు ఆడ్ లు
ఇచ్చుకోవడం తప్ప జరుగుతుంది ఏం లేదు .. నేను ఎమన్నా తప్పులు రాసి ఉంటె
క్షమించగలరు . నా భావాన్ని అర్ధం చేస్కుంటారు అని అనుకుంటున్నాను .
ఇట్లు ,
రాజాచంద్ర
http://rajachandraphotos.blogspot.in/

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

unread,
May 21, 2012, 2:19:43 PM5/21/12
to తెలుగుబ్లాగు
పొద్దు పత్రికలో కొంతకాలం మీరన్న విధంగా ఒక శీర్షిక నడిచింది. కానీ జనం
దాన్ని సహృదయంతో చూడలేదు. సదరు శీర్షికారచయితలు తమ అభిమాన బ్లాగుల్ని
ఎత్తుతున్నారనుకొని పెడసరపు వ్యాఖ్యలు పెట్టేవారు. ఒకఱిని ఎత్తడం ఎలా
ఉన్నా అసలు ఆ శీర్షికే ఎత్తేయాల్సి వచ్చినట్లు కనిపిస్తున్నది. మెప్పులు
విసిరేవాళ్ళ కన్నా చెప్పులు విసిరేవాళ్లెక్కువయ్యారు. ఇప్పుడు బ్లాగు
వ్రాయడం అంత రొమాంటిక్ ఏమీ కాదు. ఒకప్పుడు అలా ఉన్నమాట వాస్తవమే.
బ్లాగులతో సీనియర్ల శోభనయాత్ర (Honeymoon) అయిపోయినట్లు కనిపిస్తున్నది.

sadhana bhat

unread,
May 21, 2012, 10:46:02 PM5/21/12
to telug...@googlegroups.com, Raja Chandra
dear friend,
blessings and good wishes,
మీది సత్ సంకల్పం .
చటుక్కున గురజాడ వారు అన్న మాటలు గుర్తు వచ్చాయి. 
"చాలామటుకు తెలుగు రచయితలు సెల్ఫ్ రైటర్లు,సెల్ఫ్ రీడర్స్ అండ్ సెల్ఫ్ పబ్లిషర్స్ ."
 మీ సత్ సంకల్పానికి "బ్లాగు-వోగులు"   టైటిలు -ఎల్లా ఉంటుందంటారు?
ఈ మీ సదభిప్రాయానికి అందరూ సహకరిస్తే బాగుణ్ణు.
"మేము బ్లాగు రాయంగానే దాన్ని తెలిసిన వారికి,మిత్రులకూ,బంధువులకూ,ఫేస్బుక్,మొదలైన మాధ్యమాల ద్వారా ప్రచారం చేసుకోవాలిసి వస్తోంది."--అనేది నిజమేగా మరి.
శుభం భూయాత్ .
     

2012/5/21 rajachandra <rajach...@gmail.com>
--
______________________________________________

* ప్రతిస్పందనలని పంపేటప్పుడు ఈ కింది భాగాన్ని తొలగించగలరు *
______________________________________________

మీరు "తెలుగుబ్లాగు" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
ఈ గుంపుకు జాబు పంపేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-...@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు, http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.
______________________________________________

బ్లాగుల సంకలినులు: koodali.org | jalleda.com | haaram.com | maalika.org | telugubloggers.com
బ్లాగు పాఠాలు: telugublogtutorial.blogspot.com | nerpu.com

rajachandra

unread,
May 22, 2012, 12:00:09 AM5/22/12
to తెలుగుబ్లాగు
నమస్తే అండి ,
ఈ రోజు కాకపోయిన ఎప్పడికైన అలాంటి గ్రూప్ ఒకటి ఉండవాల్సిన అవసరం ఉంది
అండి . మనకి ఎవరో కామెంట్ చేసి మేచ్చుకోనేకంటే ఆలాంటి గ్రూప్ నుంచి ఒక
మంచి కామెంట్ ని సంపాదిస్తే చాల సంతోషంగా ఉంటుంది కదా !
ఈ విషయంపై పెద్దలు అందరు చర్చ కొనసాగిస్తే మనం ఒక మంచి కార్యక్రమం
చేపట్టవచ్చు .

Madhu Pemmaraju

unread,
May 21, 2012, 4:11:37 PM5/21/12
to telug...@googlegroups.com

రాజచంద్ర గారు,

మీ ఆలోచన చాలా బావుంది ఇలాంటి పద్ధతి నేను కూడలి లో చూసాను. వారిది quantitative -బ్లాగ్ కి వచ్చిన హిట్స్ ని బట్టి అది rank చేస్తుంది అనుకుంటా.

మీరు చెప్పేది qualitative ప్రక్రియ, ఒక పానెల్లా ఏర్పడి పెద్దలు రివ్యూ చెయ్యడం, అప్పుడు చదివేవారు బియ్యంలో బెడ్డలు ఎరుకోక్కర్లె ..నాకు తెలిసీ సమస్యల్లా infrastructure.

ఒక మార్గం ఏమిటంటే- కూడలిలో పై వరుసలోనున్న బ్లాగ్స్ ని రివ్యూ చేసి వారం వారం మన గ్రూప్ కి recommend చెయ్యడం.

ఏదో చిన్న సూచన 

మధు పెమ్మరాజు



2012/5/21 rajachandra <rajach...@gmail.com>
--
______________________________________________

* ప్రతిస్పందనలని పంపేటప్పుడు ఈ కింది భాగాన్ని తొలగించగలరు *
______________________________________________

మీరు "తెలుగుబ్లాగు" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
ఈ గుంపుకు జాబు పంపేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-...@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు, http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.
______________________________________________

బ్లాగుల సంకలినులు: koodali.org | jalleda.com | haaram.com | maalika.org | telugubloggers.com
బ్లాగు పాఠాలు: telugublogtutorial.blogspot.com | nerpu.com



--
Madhu Pemmaraju
Read my blog@ kusalopari.blogspot.com

Vinod Kumar

unread,
May 22, 2012, 3:52:21 AM5/22/12
to telug...@googlegroups.com
అందరికి నమస్కారం!

రాజ చంద్ర గారు మీ ఆలోచన బాగానే ఉంది. కాని మన తెలుగు బ్లాగ్గోర్స్ లో చాలామంది లేరు కానీ, కొంత మంది మాత్రమే మంచి కవితలకు, రచనలకు, పోస్ట్స్ లకు కామెంట్ చేస్తారు. కానీ అందరు చేయలేరు. కాకా పోతే  ఏ బ్లాగ్ లో ఏ ముందో తెరిచే చూసే దాక తెలియదు కదా. మీరు ఏదైనా బ్లాగ్ లో మంచి పోస్ట్ చుసివంటారు, బహుశ మీరు మొదటి వారు కవోచు లేదా, చాలా తక్కుఅవ మంది మాత్రమే ఆ బ్లాగ్ కు విచేసి ఉన్దోచు. ఈ విధంగా చూస్తే, మనలో ఎవరో కొంత మంది మాత్రమే మంచి బ్లాగ్ లు చదవ గలుగుతునారు. అంటే చాలా మంది మిస్ అవుతునారు. అందుకని ఎవరైతే ఎకువగా బ్లాగ్ లు చాడువుతుంటారో వారు ఆ మంచి బ్లాగ్ లు గా గుర్తిస్తే , వాటి  పేర్లను ఒక లిస్టు గా చేసి మన తెలుగు బ్లాగ్ లో ఉంచితే బాగుంటుంది. ఇజా చిన్న రిక్వెస్ట్ తో. మరియు మనం ఒక వోటింగ్ విధానం ద్వార మంచి బ్లాగ్ లను లిస్టు చేస్తే బున్తెందేమో అలోచిన్చాగలరు.

- వినోద్






Cheers!
Vinod



2012/5/22 Madhu Pemmaraju <psmadh...@gmail.com>

endukoemo endukoemo

unread,
May 22, 2012, 3:35:30 AM5/22/12
to telug...@googlegroups.com
hello  చంద్ర,
మీరు  చాలా active గా blogs చక్కని ప్రశ్న అడిగారు,
నాకు బాగా impressive గా అనిపించింది,
అయితే ఇలాంటి అంశం గురించి నేను గతం లో 
ఇద్దరు ముగ్గురు blog aggregators తోను 
తెలుగులో గొప్పగా websites నడుపుతున్న వారితోను ఈ అంశం discuss చేయటం జరిగింది.
విషయం ఏమంటే
ఎవరి blog లో ఎవరికీ తోచింది వాళ్ళు రాయటం 
updates ని aggreegators లో గమనించటం మనం నిత్యం చూస్తూనే ఉన్నాం !
అదే విధం గా comments నచ్చినవాళ్ళు పెడతారు లేకుంటే post చూసి వెళ్ళిపోతారు.
comment కి ఫలితం గా either +ve or negative గా replies రావటం 
అందులో ఒక్కో మారు శ్రుతిమించటం కూడా ఈ మధ్య కాలం లో గమనిస్తూనే ఉన్నాం!

ఇలాంటి పరిస్థితుల్లో ...

సరే ! ఏవి ఎలా ఉన్నా! 
ఒక సదాలోచన మీకు  ఉదయించినది,
అది సర్వులకు  శ్రేయస్కరమైనది గా తోస్తున్నది.

తెలుగు లో చాలా చక్కని blogs ఉన్నాయి
 "అనువాదలహరి" - చక్కని ఆంగ్ల సాహత్యమును మన భాషలో ఆస్వాదించేందుకు చక్కని వేదిక,
" ఉయ్యూరు వారి  సరసభారతి " -  ఒక చక్కని ఆదర్శవంతమైన జీవన  శైలి కలిగి ఉన్న  వ్యక్తి నేటి సమాజానికి చేస్తున్నా సాహితీ  సేవను   గుర్తించి ఎంతో  విషయాన్ని ప్రతి post లోనూ గ్రహించ వచ్చు,
"నవ రసజ్ఞ భరితం " - ఈ blog కళలకు  కాణాచి, 
"యశోద కృష్ణ అల్లరి" - అన్నీ వింతలూ విశేషాలే., ఒక్క post కూడా bore అనిపించదు. 
"వరూధిని" - స్వచ్చమైన  చమత్కారానికి పెట్టింది పేరు. 
"ఆలోచనా తరంగాలు" చక్కని ఆధ్యాత్మ పరమైన సరైన   విలువలుతో కూడి యున్న బ్లాగ్,
 "స్మరణ" - ఆధ్యాత్మిక సాధకులకు కావలసినంత ప్రేరణ ఇచ్చే బ్లాగు,
"అమృత మథనం" - well noted blog for all సమకాలీన సామాజిక అంశాలపై ఒక అస్త్రం 
"జై జై నాయక" - అవసరం అయన  important వార్తా కదంబం 
"శంకరా భరణం" - సర్వులకు విదితం 
ఇంకా అలా అలా చెప్పుకుంటూ పోతే ఈ list కి అంతం లేదు 
ఇవి మటుకేనా ఇంకేమి లేవా అనుకోవద్దని మనవి 
ఏదో మచ్చుకకి మదికి తోచిన నాలుగు బ్లాగుల పేర్లు రాసాను 

అయితే వీరంతా చక్కగా తమ తమ భావాలను వ్యక్తం చేస్తూనే ఉన్నారు.
పై బ్లాగు పూల సుగంధం వేర్వేరుగా గ్రహిస్తున్నం కదా!
అన్నీటినీ ఒకే వేదిక పైకి తెస్తే ఎలా ఉంటుంది?



విషయం ఏమంటే!
"పది మంది పది బ్లాగుల్లో ఎవరికీ తోచింది వారు రాయటం కాదు,
పది మంది కలసి ఒకే బ్లాగులో పది రకాల విభిన్న అంశాలపై సార్వ జనీనికంగా 
సభ్యతగా సమస్యల సాధన దశగా, 
వ్రాతలు అభిప్రాయాలు, సూచనలు, సలహాలు తెలిపితే....
మనం ఒక bloggers union form చేసి నట్లౌతుంది.
కేవలం 
ఏదో hobby లానో కాక సమాజానికి సైతం ఇలా ఒకరకం గా 
నలుగురిమధ్య మన భావాలు ప్రకటించిన వారము అవ్వటమే కాక సమకాలీన అంశాలపై స్పష్టమైన అవగాహన 
మన బాధ్యత, ఇంకా జరుగుతున్నది ఏమిటి?
ఎలా జరిగితే అది సవ్యంగా ఉంటుంది అనే కోణం లో

telugu bloggers unity గా form అయ్యి 
ఒక సత్ సంప్రదాయానికి తెరలేపితే బాగుంటుంది.

అని  బ్లాగులు register చేసి ఉంచాను 

ఎవరైతే సభ్యత గా రాస్తారు అనే నమ్మకం ఉంటుందో వాళ్ళ అందరికి (profile చిరునామా )ఉన్న వాళ్ళ అందరికి 
ఇందులో writing (authorship ) ఉండేలా మనం ముందస్తు చర్యలు తీసుకుంటే...
వసుధైక blog సిద్ధం అయినట్లే/

ఇవన్నీ open blog లు ఎవరైనా మంచి అంశాన్ని ఎంచుకుని సరైన పంథాలో post చేసేందుకు 
plan చేసి ఒక శాశ్వత వేదిక గా దీనిని భావిస్తే మీరు సూచిస్తున్న అంశానికి న్యాయం చేసిన వారం అవుతామని 
నా అభిప్రాయం 
చంద్ర నా mail మీకు అర్థం అయ్యే ఉంటుందని భావిస్తున్నాను 

తోటి blogger మహాశయులందరికీ విజ్ఞప్తి 
ఇలా open telugu blog ను ఏర్పాటు చేసి సమిష్టి గా ఒకే తెలుగు జాతి  గా 
ఏర్పడితే బాగుంటుందని భావన !

తమ అమూల్యమైన స్పందన లు తెలుప కోరు చుంటిని ,
ఇది ఎంత వరకు practical అనేది కూడా వివరింప గోరు చున్నాను 
http://youtu.be/I9xBykrDWwE
అవకాశం ఉన్న వాళ్ళు ఈ తెలుగు blogs video ని చూడగలరు 

ఒక్కటి గుర్తుంచుకోవాలి అంతా కూడా  కొత్త నీరు రావాలి ....!!

కృతజ్ఞతలు 
సాయిరాం 
శివ 

sasidhar pingali

unread,
May 22, 2012, 1:03:57 PM5/22/12
to telug...@googlegroups.com

మిత్రులారా!

మీ అందరి స్పందనలు బాగున్నాయి. కళాకారులు దుప్పట్లు(శాలువాలు) కోరుకుంటే కవులు/రచయితలూ చప్పట్లు కోరుకుంటారని అంటారు. మనలో చాలామంది (నాతొ సహా) ఒక మంచి రచన చూసినప్పుడు చదివి ఆనందిస్తారే గాని ఒక చిన్న కామెంట్ వ్రాయతాన్నికి సంకోచిస్తారు. మిత్రుడు వినోద్ అన్నట్లు అందరు అన్ని బ్లాగ్ లు చూడటం సాధ్యపడదు. యేవో కొన్ని కాకతాళీయంగా చదవటం జరుగుతుంది. ఎలాగు మన మెయిల్స్ లో తెలుగుబ్లాగ్ గూగుల్ గ్రూప్ ద్వారా చాలా చాలా సమస్యలు పరిష్కరింపబడుతున్నాయి కదా! అలానే మంచి రచన చూసినప్పుడు మాధ్యమం ద్వారానే ఫలానా బ్లాగులో మంచి రచన వుంది అని సూచనో లేక ఒక విమర్శనో వ్రాస్తే అందరూ తప్పక చూడటం జరుగుతుందని నాభావన. అందరికీ ఒకే సమిష్టి బ్లాగు రూపకల్పనకు సమయం పట్టవచ్చు కదా. దీనివల్ల ఎవరికీ వారు నా బ్లాగు చూడండి అనే స్వోత్కర్ష కూడా తగ్గుతుంది. చూచినా బ్లాగ్ లో కామెంట్ పెట్టటానికే బద్ధకించే వాళ్ళు మళ్ళీ మెయిల్ కూడా పెడతారా అదీ నిజమే. కానీ కొంతమంది మొదలుపెడితే నెమ్మదిగా అందరికీ అలవాటుఅవుతుందని నా నమ్మకం..

 స్వస్తి
శశిధర్ పింగళి
------------------

జాబిల్లి రావె...


---------------------------------------------------------------- 
2012/5/22 endukoemo endukoemo <yendu...@gmail.com>

--
______________________________________________
 
* ప్రతిస్పందనలని పంపేటప్పుడు ఈ కింది భాగాన్ని తొలగించగలరు *
______________________________________________
 
మీరు "తెలుగుబ్లాగు" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
ఈ గుంపుకు జాబు పంపేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-...@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు, http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.
______________________________________________
 
బ్లాగుల సంకలినులు: koodali.org | jalleda.com | haaram.com | maalika.org | telugubloggers.com
బ్లాగు పాఠాలు: telugublogtutorial.blogspot.com | nerpu.com



--
Thanks & Regards
Shasidhar Pingali

----------------------------------------

జాబిల్లి రావె...


endukoemo endukoemo

unread,
May 22, 2012, 3:22:59 PM5/22/12
to telug...@googlegroups.com
పెద్దల స్పందనలకు కృతజ్ఞతలు 
ఒకప్పుడు
ఈ blogging అంతా fun oriented basis పైన ఉంది అనిపించింది,
కాసేపు కాలక్షేపం కోసం అనుకోవటమే ఇందుకు కారణం 

కాని తర్వాత తర్వాత 
నేను 
చాల professional blogs ని చూసాను 
అందుకే తదుపరి 
వారిని చూసి inspire అయ్యి నా blog ని complete గా సంస్కరించాను 

నా దృష్టిలో blogging అంటే,
మనిషితో కాక మనిషి అంతరంగం తో మాట్లాడటం,
ఏదో post వేశామ? వేరే వాళ్ళ post కి comment పెట్టామా అంటే కుదరదు !

మనం ఆ రచయితే ఉద్దేశ్యం తో ఇది post చేసారు,
తద్వారా తాను ఏమి చెప్పదలచు కున్నారు,
మనం ఎంత గ్రహించాం?
ఇందులో మెచ్చుకో దాగిన పాళ్ళు ఎంత?
దీనిని ఇంకేలాగైనా సవరించ వచ్చా?
ఇది దేనినైనా ప్రతిబింబించేది లా ఉన్నదా?
ఇలా ఎన్నో ఎన్నెన్నో రకాలైన 
ముఖములతో ఒక blog post మరియు comment ఆధారపడి ఉన్నవి.
నిజమే! సమాజం లో జరుగుతున్న సమకాలీన అంశాల పట్ల వార్తల రూపాన వాటి విశ్లేషణ ల రూపాన
మనో భావాలను వ్యక్త పరచటం మంచి బ్లాగోన్ముఖంగా నైనా సామరస్య ధోరణి లో వ్యక్త పరచాలి కూడా!
అయితే 10 వేదిక లవ్వటం వలన meeting పలచ బడి పోవుచున్నది.
ఆధ్యాత్మికం విషయం లోనూ అంతే...
అప్పట్లో మార్గశిరం వచ్చింది, ప్రతి blog లోను ఇదే ముచ్చట 
అయితే స్వంతం గా రాసేవారు కొందరైతే copy paste మరి కొందరు 
ఏదేమైనా విషయం అందటం ప్రధానం కాని ఇక్కడా పది వేదికలున్నాయి.
కవితలు కొందరు నిత్యం రాస్తా ఉంటూనే ఉంటారు 
వాటి జోలికి పెద్దగా ఎవరూ పోరు, 
కొందరు అరుదుగా రాస్తారు,
ఉవ్వెత్తున ప్రశంశల జల్లులో తడుస్తుంటారు ,,,
అయితే ఇలా అరుదుగా రాసే వారి గురించి అంతగా అందరికీ తెలియదు 
కారణం ఇక్కడ వేదికలు 10 కాదు 100 
కథలు, అనుభవాలు, ముచ్చట్లు నిజమే వీటికి స్వీయ blogs తప్పని సరి,
కాని కొన్ని 
సామాన్య విషయాల పట్ల సమిష్టిగా కలసి వ్యవహరించాతమే ఈ మొత్తం సమస్యకి పరిష్కారం అవుతుంది,
http://telugublogreviews.blogspot.in 
ఇది వ్యష్టి blog ఎంత మాత్రము కాదు ఇది సమిష్టి blog 
ఎవరైనా ఇందులో పెద్దలుగా వ్యవహరించి 
ఉన్నతమైన అంశాలను post లను 1000 మందికి తెలిసేలా ఇక్కడ present చేస్తే 
ఇది సమిష్టి blog కావటం చేత 
ఒకేచోట ఏ వర్గం కి కావలసిన అంశం ఆ వర్గం వారు ఎంచుకోవచ్చు 
దానికి తమదైన స్పందన తెలుప వచ్చు మార్పులు చేర్పులు సూచించ వచ్చు 
ఇంకా ఇది శాశ్వత వేదిక కూడాను.
so సమిష్టి blog లో కొన్ని వర్గాలను విభజన చేసి 

వార్తలు || సినిమాలు || ఆధ్యాత్మిక౦ || చిట్కాలు || కవితలు || పద్యాలు || కథలు || ముచ్చట్లు || software సంగతులు ||
రాజకీయాలు || నిజాలు || general knowledge | | వంటలు& ఇల్లాలి చిట్కాలు || blog tips & tricks || 
Movie reviews || స్వీయానుభవాలు || సామాజిక సమస్యలు చర్చా వేదిక || పాత & కొత్త పాటలు || గ్రంథ పరిచయాలు సమీక్షలు || 
|| business వస్తువోత్పత్తులు విలువలు || vision INDIA దేశం కోసం || కళలు || మధురానుభూతులు || ప్రముఖుల పరిచయ వేదికలు || 
ఇంకా tv లు || మరియు || blog సమీక్షలు ||


ఇలా ఇంకా ఎమన్నా ఉంటె అవీను అన్ని వర్గాలుగా విభజించి 
ఏ వర్గానికి ఆవర్గం వారికి వారిలో పెద్ద తరహాలో వ్యవహరించి స్వచ్చందంగా బాధ్యతలు చేపట్టే వారికి ఒక వర్గాన్ని కేటాయించి 
ఆవర్గం తాలూకు post ల సారాంశాన్ని link లను వీలైతే చిన్న size వ్యాసాలను పొందు పరిస్తే బాగుంటుంది. 
నిజంగా విలువున్న అంశం పదిమందికి చేరుతుంది. 
ఇది open blog అందరి blog సమిష్టి blog self agregator 
అన్ని ఉపయుక్తం అయ్యేవే.
వర్తమాన అంశాలే కాక పోవచ్చు గతం లో మీ బ్లాగుల్లో వచ్చిన మంచి post ల లింక్స్ ను ఇక్కడ ఇవ్వ వచ్చు 
అది 5 యేండ్ల క్రితం నాటిది అయినా సరే !

బంగారానికి ఎప్పటికీ విలువ వుంటుందీ!

so ఇలా సమిష్టి blog కి సమిష్టి గా కృషి సల్పితే 

మన అసంతృప్తి నుండీ మనం వేరుపడి 
విలువలు నిండిన అంశాలను ఎన్నెన్నో అనునిత్యం ఆస్వాదన చేయగలుగుతాము 

so ఈ సమిష్టి blog పై అందరూ కూడా ఒక మారు దృష్టి సారిస్తే బాగుంటుందని మనవి.
అసలు ఒక మారు ప్రారభించి చూస్తే ఆ తరువాత కదా! తెలిసేది practical అవునో కాదో అని !!

మీ అభిప్రాయాలు తెలుప గలరు


ఏ  నావదే తీరమో ?!
శివ 
New Delhi 

V Pratap

unread,
May 22, 2012, 8:28:45 PM5/22/12
to telug...@googlegroups.com
మిత్రులారా..మీ మీ మెయిల్స్ లోని అంశాలన్నీ ఆలోచించదగ్గవే, అనుసరణీయమైనవే..

ముందుగా మనం అందరమూ ఒక వేదిక మీద  (తెలుగు బ్లాగర్స్ డే రోజు నే అనుకుందాం) కలసి మనమంతా ఒక కుటుంబం అనే భావంతో సమస్యలను, సంతోషాలను పంచుకోగలిగితే బాగుండనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు సమాజంలో ఎక్కువమంది ఉరుకులు,పరుగులతో జీవితాన్ని గడుపుతున్నారు. ఎంతో మంది మన బ్లాగర్స్ ఎంతో శ్రమకోర్చి చక్కటి విషయాలను అందిస్తున్నారు. వాటిని చాలామంది ఉపయోగించుకుంటున్నారు కూడా. కానీ ఓ చిన్న కామెంట్ ని కూడా అందులో వుంచలేకపోతున్నారు. మన బ్లాగులు చదవడానికి ఎలాంటి రిజిస్ట్రేషన్లు అక్కరలేదుకదా.. అంచేత కొందరు సహృదయులు తప్ప ఎవరూ కామెంట్ పెట్టడం లేదు. ఆ కారణం గా మనం నిరుత్సాహ పడనవసరం లేదు. మన ఆలోచనలు మన తెలుగు వారికి అందుతున్నాయనే చిరు సంతోషం మనకు చాలు. మనమంతా ఒక వేదిక పై కలసి మనల్ని మనమే ప్రోత్సహించుకుందాం. మన లోని లోపాలను మనమే పరిష్కరించుకుందాం. ఉత్తమ బ్లాగు రచయితలను మనప్రేమతో నిండిన  చిన్ని చిన్ని మెమోంటాలతో సత్కరించుకుందాం.

క్షమించాలి. నా ఆలోచనలకు సరైన అక్షర రూపం ఇవ్వలేకపోయేనేమో.. నా అంతరంగాన్ని అర్థం చేసుకున్నారనే భావంతో ముగిస్తున్నాను. సెలవు. మీ ప్రతాప్ 

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

unread,
May 23, 2012, 12:54:29 AM5/23/12
to తెలుగుబ్లాగు
ఈ గుంపు యొక్క వ్యవస్థాపకులూ, ఇంకా ఇందులోని సీనియర్ లూ గత ఆఱేళ్ళుగా
ప్రతినెలా బ్లాగర్ల సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. అవి సర్వసాధారణంగా
హైదరాబాదు కృష్ణకాంతుని ఉద్యానవనంలో చెట్ల నీడన జఱిగేవి. వాటిల్లోంచి
పుట్టినదే e-తెలుగు సంస్థ. జఱగబోతున్న సమావేశం గుఱించి ఎప్పటికప్పుడు ఈ
గుంపులోనే ముందస్తు ప్రకటన చేసేవారు. (ఈ గుంపు సైట్లోకి వెళ్ళి పాతవేగులు
చూడండి) మొదట్లో చాలామంది ఆ సమావేశాలకు హాజరయ్యేవారు. క్రమేఽపీ ఆ హాజరీ
పల్చబడిపోతూ వచ్చింది. భారీగా గైర్‌హాజరైన ఆ ఎగవేతదారుల్లో నేనూ ఉన్నానని
తెలియజేయడానికి విచారిస్తున్నాను.

rajachandra

unread,
May 23, 2012, 1:01:22 AM5/23/12
to తెలుగుబ్లాగు
పెద్దలకు నమస్కారం,
నాదో ఆలోచన అంటూ మీకు తెలియచేస్తే .. మీ అభిప్రాయాల్ని తెలియచేసినందుకు
చాల సంతోషం . ముందుగా మనం మనకి నచ్చిన (అందర్కిఉపయోగపడే బ్లాగులను )
బ్లాగ్ లను పోస్ట్ చేద్దాం . ఆ తరువాత వాటి పై విశ్లేషణ కొనసాగిద్దాం .
http://telugublogreviews.blogspot.in/ లో మీరు కేటగిరి లో మీకు నచ్చిన
బ్లాగ్ ని కాని ,లేదా మీ బ్లాగ్ నే పరిచయం చేస్తూ కామెంట్ రూపం లో పోస్ట్
చేయండి . మీ బ్లాగ్ ( మీకు నచ్చిన ) బ్లాగ్ అందర్కి ఉపయోగ పడే బ్లాగ్
అనుకుంటే ఆ కామెంట్ ని బ్లాగ్ లో పోస్ట్ చేద్దాం . నేను చెప్పిన భావం
మీకు అర్ధం అయింది అనుకుంటా!
ఉదా :
నా బ్లాగ్ లో నేను చూసిన ప్రదేశాల విషయాలను పోస్ట్ చేస్తున్నాను .. నా
బ్లాగ్ లో మీరు కంచి , రామేశ్వరం , అరుణాచలం , మహాబలిపురం వంటి
ప్రదేశాలకు ఏల వెళ్ళాలి , అక్కడ చూడవాల్సినవి మొదలైన విషయాలను
పొందుపరిచాను .
నా బ్లాగ్ ఐడి http://rajachandraphotos.blogspot.in/
-----------
ఈ వింధంగా మీ బ్లాగ్ గురించి పరిచయం చేస్తూ ఆ కేటగిరిలో కామెంట్ చేయండి .
మీరు పోస్ట్ చేసిన బ్లాగ్ ని చూసి ఆ కేటగిర్లో పోస్ట్ చేస్తాము . ఆ
తరువాత వాటిపై ఎవరైనా రివ్యూ రాయవచ్చు .
--
ఇలా చేయడం వాళ్ళ మొదటి అడుగుగా మనం మంచి బ్లాగ్ లను ఒక దగ్గరకి
చేర్చవచ్చు . ఎవరైనా ఒక మంచి బ్లాగ్ ని చూస్తే వెంటనే ఇక్కడ ఆ బ్లాగ్
గురించి కామెంట్ చేస్తే మనం ఆ బ్లాగ్ గురించి తెల్సుకోవడం విలుపడుతుంది .
ఒకరికో ఇద్దరికో అన్ని బ్లాగ్ లు తెలియవు కదా ...
ఈ ఆలోచనపై మీ అభిప్రాయాల్ని తెలియచేయండి

sadhana bhat

unread,
May 23, 2012, 10:49:31 AM5/23/12
to telug...@googlegroups.com
ప్రియ మిత్రులకు,
శుభాకాంక్షలు,ఆశీసులు,
శ్రీ తాడేపల్లి వారూ ,రాజా చంద్ర  గారూ; వాయిదా వేయతగ్గ ఆలోచన  కాదిది.
మొదలుపెట్టండి.అదే నడిపిస్తుంది. శుభం.

2012/5/23 rajachandra <rajach...@gmail.com>

D. Subrahmanyam

unread,
May 26, 2012, 5:13:55 AM5/26/12
to telug...@googlegroups.com
రాజచంద్రగారి ఆలోచన చక్కగా ఉంది. ఇలాంటి పధకాన్ని అమలులోకి తెస్తే రెండు లాభాలు ఉన్నాయి. 1. మన బ్లాగు ఎంతమందికి నచ్చింది అనే విషయం బ్లాగరుకు తెలుస్తుంది. అందువలన భవిష్యత్తులో ఇంకా బాగా వ్రాయటానికి దోహదపడుతుంది. 2. ఇందుమూలంగా తనబ్లాగుని వేరేవాళ్ళతో పంచుకోవటమే కాకుండా కొత్త బ్లాగులతో, కొత్త బ్లాగరులతో పరిచయం పెరుగుతుంది. ఉదాహరణకి నా బ్లాగులు ' సామెతలు ', సాహిత్యసౌరభం ', ' ఆలోచనాంతరంగాలు ' మూడు aggregater లో ఉన్నాయి. కొత్త పోష్టు వచ్చిన ఒకటి రెండు రోజులకి మాత్రం visitors సంఖ్య పెరుగుతుంది. తరవాత సున్నా. కామెంట్లు కూడా అంతంత మాత్రమే. సామెతల బ్లాగులో ఇంతవరకు 9325 సామెతలను సేకరించి ఉంచాను. అందరికి అందుబాటులోకి తేవటమే నా ఉద్దేశ్యం. ఇలా ఎన్నో మంచి బ్లాగులు మనం సైగా వాడుకోవచ్చును.
D.Subrahmanyam

KNM

unread,
May 27, 2012, 9:02:00 AM5/27/12
to telug...@googlegroups.com
మీ ఆలోచన బాగుంది.గో హెడ్.అన్ని విషయాల్లో మీకు  సపోర్ట్ లభిస్తుందని భావిస్తున్నా.
కే యన్ మూర్తి ....."జైజైనాయకా" బ్లాగ్


2012/5/22 endukoemo endukoemo <yendu...@gmail.com>

--

Dinavahi Venkatahanumantharao

unread,
May 28, 2012, 8:55:58 AM5/28/12
to telug...@googlegroups.com
బ్లాగులు అన్న విషయము పై ఓ చక్కటి చర్చ మీ మీ పోస్టింగ్స్ ద్వారా తెలిసింది. మీ అంత  విశ్లేషనాత్మక అవగాహన నాకు లేదు గాని నా చిన్న బుర్రకు తోచిన నాలుగు మాటలు... ముందుగా నా బ్లాగు dvhrao.blogspot.com ..నాకు తోచినవి వ్రాస్తూ ఉంటాను. అసలు బ్లాగు ఎందుకు నీకు అంటే మనము వ్రాసిన  నాలుగు అక్షరాలూ మనము ఏ పత్రికా సంపాదకుని అనుమతి అక్కరలేకుండా నలుగురి ముందూ పెట్టె అవకాశం అనే ఆలోచన. మనము వ్రాసినది చూసి ఏ ఒక్కరు బాగుందని వ్యాఖ్యానించినా ఇంటి లోనివారందరికీ చెప్పి మురిసిపోయే అల్ప సంతోషము. నా బ్లాగు ఎక్కువమంది చదవాలని నాకూ ఉంది. ఐతే ఎలా అన్నది మీరూ చర్చించారు. కాని బ్లాగు ఇలా ఉండాలి అని ఓ చట్రములో బిగిస్తే ఉత్సాహము నా బోటి వాడికి తగ్గిపోతుంది. అంతకన్నా మనలా బ్లాగులు వ్రాస్తున్న వారిని ఓ అసోసియేషన్ లో చేర్చి మంచి పోస్టింగ్స్ ఉన్నప్పుడు చర్చిస్తూ, బ్లాగు మెరుగుదలకు ఆరోగ్యకరమైన సూచనలు ఇస్తే రచనా శక్తీ పెరుగుతుంది, చూసేవారికి ఆసక్తీ పెరుగుతుంది. ఆయా తావులలో ఉన్నవారిని దీని ద్వారా అవకాసము మేరకు వ్యక్తిగతముగా కలసి అభిప్రాయాలు  ఆలోచనలూ మెరుగు పరచుకోవచ్చు. ఇంకో విషయము. నా బ్లాగు ప్రారంభించి రెండేళ్ళు అవుతోంది. మొదట్లో ఉన్న ఆదరణ బ్లాగులకు తగ్గిందేమో అనిపిస్తున్నది. పేస్ బుక్ పై ఎక్కువమంది ఆసక్తి పెంచుకుంటున్నారు. దానితో లింక్ పెట్టినా బ్లాగు దాకా వచ్చేవారు తక్కువ అవుతున్నారు. ఇది కూడా గమనించి ఉంటారు. నా ఈ చిన్ని ఆలోచన ఎంతవరకూ సందర్భోచితమో నాకు తెలియదు. మీ కాలము ఎక్కువ తీసుకుంటే మన్నించండి. వీలయితే నా బ్లాగు చూడండి. హాస్యానికి, ఆధ్యాత్మికతకూ ప్రాధాన్యమిచ్చిన బ్లాగు. నిజం. 
2012/5/27 KNM <knmur...@gmail.com>

మేధ

unread,
May 29, 2012, 1:05:53 AM5/29/12
to తెలుగుబ్లాగు, rajach...@gmail.com
రాజాచంద్ర ఇలా వ్రాసారు

సభ్యులకు నమస్కారం ,
http://telugublogreviews.blogspot.in/ లో కేటగిరి లు విభజించాం . ఇంకా
ఏవే కేటగిరీలు ఉంటే బాగుంటాయో తెలియచేయండి . ప్రస్తుతానికి తోలి దశలో
బ్లాగ్ లను పరిచయం మాత్రమే జరుగుతుంది . మీకు తెల్సిన బ్లాగ్ లను పరిచయం
చేయండి . మీ బ్లాగ్ ఏ కేటగిరిలోకి చెందుతుందో ఆ కేటగిలో మీ బ్లాగ్ ని
పరిచయం చేస్తూ కామెంట్ రాయండి .
ఇట్లు ,
రాజాచంద్ర .

rajachandra

unread,
May 31, 2012, 12:44:40 AM5/31/12
to తెలుగుబ్లాగు
నమస్కారం అండి , మీరు చెప్పింది నిజమే .
నిజమే చాలామంది బ్లాగర్లు ఒకటి కంటే ఎక్కువ కేటగిరిలకు సంబందించిన
విషయాలను తమ బ్లాగ్ లలో రాస్తున్నారు .. వారికోసమే "నా బ్లాగ్" కేటగిరి
మీరు ఒకటి కంటే ఎక్కువ కేటగిరిలను సంబందించిన విషయాలను ఒకే బ్లాగ్ లో
రాస్తూ ఉంటే .. మీ బ్లాగ్ కోసం "నా బ్లాగ్" కేటగిరి లో పరిచయం చేయండి .

Srinivas Bandi

unread,
Jun 2, 2012, 5:01:44 AM6/2/12
to telug...@googlegroups.com, manabl...@gmail.com, Raja Chandra
మీరు అందంగా ఉంటారని మీకు తెలుసు. కానీ పక్కనున్న వాళ్ళు కూడా ఆ మాటంటే... అది ఎంతటి వాళ్ళనైనా గిలిగింతలు పెట్టకుండా ఉండదు. అలాగే కళాకారులకు కూడా. నృత్యమో, గానమో, చిత్రలేఖనమో... ఏదైనా బాగుందంటే, శెభాష్ అంటే అంతకు మించిన బహుమానం లేనట్టు సంబర పడతారు.  కనీసం ఇలాగో/అలాగో చేసుంటే ఇంకాబాగుండేదంటే చాలా సంతృప్తిగా అనిపిస్తుంది.
అలా మన బ్లాగర్ల ను కూడా అలా ప్రోత్సహించి మెచ్చుకునే వారుంటే మనమే వ్రాసుకుని, మనమే అచ్చేయించుకుని, మనమే చదువుకోక్కరలేదు.
మీరు వ్రాయండి. మేము చదువుతాం. చదివిస్తాం. మాకున్న సాధనాలతో విశ్లేషణలు చేసి మీముందుంచుతాం. కేవలం దీని కోసమే http://manablogogulu.blogspot.in/  అని ఒక బ్లాగు ను సృష్టించడం జరిగింది. అలాగే పర్తిగా నింపిన PDF Document ను manabl...@gmail.com కు పంపగలరు. దయచేసి గ్రూపుకు పంపవద్దు.
 
దీనిని మొదలు పెట్టింది రాజాచంద్ర కాబట్టి, రివ్యూ కూడా ఆయనతోనే మొదలు పెడదాము. దయచేసి Attach చేసిన ఫారాలను నింపి పంపగలరు.
  
ఇట్లు,
మనకోసం మీలోఒకడు.
గమనిక: మీ సలహాలకై మా ద్వారము తెరిచే ఉండును.
 
 


 
2012/5/21 rajachandra <rajach...@gmail.com>
Rajachandra Photos.pdf
Reply all
Reply to author
Forward
0 new messages