My Blog

10 వీక్షణలు
మొదటి చదవని మెసేజ్‌కు స్కిప్ చేయి

audiseshareddy kypu

చదవనివి,
27 డిసెం, 2009 6:12:13 AM27-12-09
వరకు telug...@googlegroups.com
చాలా కాలం క్రిందట  పిల్లల కోసం బాల కథా మాలిక  పేరున ఒక బ్లాగు పెట్టాను. అందులో కొన్ని కథలు కూడా వుంచాను. ఒక సారి మీరు తొంగి చూసి సలహాలివ్వండి.
 బ్లాగు ;  http://audiseshareddy.blogspot.com/

gopi gopi

చదవనివి,
27 డిసెం, 2009 11:59:26 PM27-12-09
వరకు telug...@googlegroups.com
Dear Sir
 
మీ blog చాలా బాగుంది. ముఖ్యంగ చిన్న పిల్లలకు చాల ఉపయొగపడుతుంది.

 

regards
Gopi
hyderabad


 
On 12/27/09, audiseshareddy kypu <audises...@gmail.com> wrote:
చాలా కాలం క్రిందట  పిల్లల కోసం బాల కథా మాలిక  పేరున ఒక బ్లాగు పెట్టాను. అందులో కొన్ని కథలు కూడా వుంచాను. ఒక సారి మీరు తొంగి చూసి సలహాలివ్వండి.
 బ్లాగు ;  http://audiseshareddy.blogspot.com/

--
మీరు "తెలుగుబ్లాగు" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
ఈ గుంపుకు జాబు పంపేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-...@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు, http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.
 
బ్లాగుల సంకలినులు: koodali.org | jalleda.com | haaram.com
బ్లాగు పాఠాలు: telugublogtutorial.blogspot.com | nerpu.com

padma kala

చదవనివి,
28 డిసెం, 2009 12:30:40 AM28-12-09
వరకు telug...@googlegroups.com
అవును చాలా బాగుంది. ఇదే స్పూర్తితో ఈ తరహా బ్లాగులు మరిన్ని రావాలి.
అభినందనలు.

28 డిసెంబర్ 2009 10:29 am న, gopi gopi <gop...@gmail.com> ఇలా రాసారు :

audiseshareddy kypu

చదవనివి,
21 జన, 2010 9:44:54 AM21-01-10
వరకు telug...@googlegroups.com
నా బ్లాగు లోకి తొంగి చూసి మీ అభిప్రాయాలు తెల్పిన గోపి గారికి , పద్మకల గారికి ధన్యవాదాలు.

2009/12/27 padma kala <kala.p...@gmail.com>

padma kala

చదవనివి,
21 జన, 2010 12:06:04 PM21-01-10
వరకు telug...@googlegroups.com
ఇది కల కాదండీ... కళ.


21 జనవరి 2010 8:14 pm న, audiseshareddy kypu <audises...@gmail.com> ఇలా రాసారు :

audiseshareddy kypu

చదవనివి,
26 జన, 2010 7:22:32 AM26-01-10
వరకు telug...@googlegroups.com
 ' ళ ' అప్పుడు టైపు కాలేదండీ... !

2010/1/21 padma kala <kala.p...@gmail.com>

sriramalingeswara rao

చదవనివి,
27 జన, 2010 12:18:36 AM27-01-10
వరకు telug...@googlegroups.com
క్షమించండి. జోక్యం చేసుకొన్నందుకు.

చంద్రకల అనే పేరు గుఱించే అయితే శబ్దరత్నాకరం ప్రకారం

చంద్రకల , చంద్రకళ రెండూ సాధువులే.

తేదిన 26 జనవరి 2010 5:52 pm, audiseshareddy kypu
<audises...@gmail.com> వ్రాశారు:

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

చదవనివి,
27 జన, 2010 5:28:20 AM27-01-10
వరకు telug...@googlegroups.com
సంస్కృతంలో లకారమూ, ళకారమూ రెండూ ఉన్నాయి. ఆ ఉచ్చారణభేదాన్ని బట్టి అర్థం కూడా మారుతుంది. ఈ లకారం కావ్యసంస్కృతమనీ, ళకారమ్ వైదికసంస్కృతమనీ ఉత్తరాదివారు ప్రచారం చేసినది వాస్తవం కాదు. వారి గురుత్వాన్ని గుడ్డిగా నమ్మి మన దక్షిణాది పండితులు రెంటికీ భేదం పాటించకుండా చేసే సంస్కృత ఉచ్చారణ, లేఖనాభ్యాసమూ సరైనవి కాదు. నా అభిప్రాయంలో - హిందీలో ళకారం లేదని చెప్పి ఉత్తరాదివారు సంస్కృతంలో కూడా ఆ భేదాన్ని ఎత్తేశారని ! కానీ హిందీకి మూలమైన శౌరసేనీ ప్రాకృతంలో ళకారం ఉన్నది. శౌరసేనీ భాష వాడుకలో ఉన్నంతకాలమూ సంస్కృతంలో ళకారం లేదనే వాదన తలెత్తలేదు. ఇలా వేఱువేఱు పదాల్లోని వర్ణభేదాన్ని రద్దుచేసి ఒకే ఉచ్చారణ గల పదాల్లాగా రాయడం/ పలకడం వల్ల జఱిగిన నష్టమేంటంటే ఒకే పదానికి నానార్థాలు పుట్టుకురావడం. ఉదాహరణకి ఈ క్రింది పదాల్ని పరిశీలించండి.

కాల: - యముడు, కాలము
కాళ: - పాము
కలా - చంద్రవంక
కళా - నైపుణ్యము
తాలమ్ - తాడిచెట్టు
తాళమ్ - సంగీతలయ
వ్యాలః - పాము
వ్యాళ: - ఏనుగు

ఈ తేడాని మనకి ఆధునిక ఉత్తరాది సంస్కృత నిఘంటువులు చూపించవు.

కొన్ని ళకార పదాల్ని డకార పదాలుగా మార్చారు.

ఈళే - ఈడే (పొగడుచున్నాను)

అలా మొత్తమ్మీద సంస్కృతభాషలోంచి ళకారాన్ని ఉత్తరాదిపండితులు పరిహరించారు. అందుచేత మనమీరోజు ఒక అక్షరం లోపించిన సంస్కృత వర్ణమాలని నేర్చుకుంటున్నాం, నేర్పిస్తున్నాం.

ఏతావతా, చంద్రకళ, చంద్రకల ఒకటి కాదని నా తాత్పర్యం.


నెనర్లు. (Thanks)

Yours Truly
T. L. Bala Subrahmanyam
http://www.tadepally.com

ఇట్లు భవదీయుడు
తాడేపల్లి



This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use http://lekhini.org
అందరికీ రిప్లయి పంపు
రచయితకు రిప్లయి ఇవ్వు
ఫార్వర్డ్ చేయి
0 కొత్త మెసేజ్‌లు