2 views
Skip to first unread message

kndra satya

unread,
May 25, 2012, 12:19:49 AM5/25/12
to telug...@googlegroups.com
మిత్రులారా

నేను బాలగీతం అనే బ్లాగు ప్రారంభించి ఇంత వరకు
బాగానే గీతాలు రాస్తూ వచ్చాను.నా గీతాలన్నీ... పల్లవి... చరణం...
లా సాగుతుంటాయి. కాని నాకు ఇప్పుడు కొత్త సమస్య వచ్చింది.
నే గీతంలా రాసినా.. అది బ్లాగులో.. వచన కవితలా కనిపిస్తోంది.
దాని వలన నేను కొత్త పోస్టు బ్లాగులో పెట్టలెక పోతున్నాను. దయచేసి
నాకు తగిన.. సహాయం చెయ్యండి. balageetham blog spot.com
నాగేంద్ర కూచిమంచి.

Raj

unread,
May 25, 2012, 1:50:36 PM5/25/12
to telug...@googlegroups.com
మీ బ్లాగ్ చూశాను.. చాలా చక్కగా బాలలకు చక్కని గీతాలు అందిస్తున్నారు. అందులకు మీకు అభినందనలు. 
మీరు గీతం లా వ్రాసినా వచన కవిత్వములా మీకు అనిపిస్తున్నా - మీరు రెండు మూడు పదాలకి ఒక పాదము  అన్నట్లుగా వ్రాస్తున్న శైలి చాలా బాగుంది. పిల్లలకి ఇది సులభతరమైనది. 

మీకు కాసింత సమయమూ, ఓపిక ఉంటే - ఆ గేయాల్ని మీరు గానీ, ఇంకేవరితోనైనా గానీ పాడించి, MP3 ఫార్మాట్ లో ఫైల్ షేరింగ్ సైట్స్ లలో అప్లోడ్ చేసి, ఆ లింక్ ని మీ పోస్ట్ క్రింద పెడితే, ఆపిల్లలకి ఆ గేయాల్ని ఎలా పాడాలో చక్కగా తెలుస్తుంది. 

పిల్లల గేయాలు కాసింత చిన్న సైజులో ఉంటే వారికీ సులభ గ్రాహ్యముగా ఉంటుంది. పెద్దగా ఉంటే బట్టీ పట్టాలంటే కాసింత ఇబ్బందే!.. ఇలా చెబుతున్నానని అన్యదా భావించవలదు. కేవలం సూచనగా తీసుకోవలసిందని మనవి. 

- అచ్చంపేట రాజ్. 


2012/5/25 kndra satya <kndr...@gmail.com>
--
______________________________________________

* ప్రతిస్పందనలని పంపేటప్పుడు ఈ కింది భాగాన్ని తొలగించగలరు *
______________________________________________

మీరు "తెలుగుబ్లాగు" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
ఈ గుంపుకు జాబు పంపేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-...@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు, http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.
______________________________________________

బ్లాగుల సంకలినులు: koodali.org | jalleda.com | haaram.com | maalika.org | telugubloggers.com
బ్లాగు పాఠాలు: telugublogtutorial.blogspot.com | nerpu.com

Reply all
Reply to author
Forward
0 new messages