చిన్న సందేహం

683 views
Skip to first unread message

Annapurna Gadde

unread,
May 26, 2009, 12:34:00 PM5/26/09
to telug...@googlegroups.com
సాంత్వన ...స్వాంతన ...రెండిటిలో ఏది సరైనదో తెలుపగలరు .ఓదార్పు కు బదులుగా ఏది ఉపయోగించొచ్చు?

Anil K. Golla

unread,
May 26, 2009, 12:43:21 PM5/26/09
to telug...@googlegroups.com
అన్నపూర్ణ గారు,

ఓదార్పు కి బదులుగా   స్వాంతన   ఉపయోగించుకోవచ్చు.

అనిల్ కుమార్ గొల్ల
http://www.googlekaburlu.com

2009/5/26 Annapurna Gadde <anuu...@gmail.com>

Chandu

unread,
May 26, 2009, 1:44:42 PM5/26/09
to తెలుగుబ్లాగు
సాంత్వన అన్నది సరైన పదం. స్వాంతన అని వ్రాయడం తప్పు. సాంత్వన అంటే
ఓదార్పు.

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
May 27, 2009, 2:46:29 AM5/27/09
to telug...@googlegroups.com
సాంత్వన కరెక్టు


నెనర్లు. (Thanks)

Yours Truly
T. L. Bala Subrahmanyam
http://www.tadepally.com

ఇట్లు భవదీయుడు
తాడేపల్లి



This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use http://lekhini.org

Annapurna Gadde

unread,
May 27, 2009, 2:51:49 AM5/27/09
to telug...@googlegroups.com
అనిల్ గారు , చందు గారు , బాల సుబ్రహ్మణ్యం గారు ధన్యవాదములు .

2009/5/27 తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtad...@gmail.com>

Anil K. Golla

unread,
May 27, 2009, 3:45:19 AM5/27/09
to telug...@googlegroups.com
ఇంతకీ అన్నపూర్ణ గారు,

ఏ పదం వాడరు?? 

సాంత్వన సరి ఐనది కాదు అని నా అభిప్రాయం. 

మీరు వొక సారి సరి చూసుకోనుటకు ఈ రోజూ సాక్షి దిన పత్రిక చుడండి.  దీనిలో "నా కల neraverchukunta" అని "యువన్ శంకర్ రాజా" తో సాక్షి జరిపిన ఇంటర్వ్యూ ఉంది.   మీ కోసం ఇక్కడ ఆ లింక్ ఇస్తున్నాను. 

http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=28571&Categoryid=2&subcatid=26 

అనిల్ కుమార్ గొల్ల
http://www.googlekaburlu.com

2009/5/27 Annapurna Gadde <anuu...@gmail.com>

ఏకాంతపు దిలీప్

unread,
May 27, 2009, 4:16:11 AM5/27/09
to telug...@googlegroups.com
సాంత్వన కరెక్టు
http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?query=s%C4%81nt&table=brown

బ్రౌన్ నిఘంటువులో స్వాంతన అనే పదమే లేదు.


కానీ వాడుకలో సాంత్వన అని పలకలేని/గుర్తుంచుకోలేని వాళ్ళు పొరబాటున స్వాంతన అని వాడటం గమనించాను. ఇంకా అంతగా  చదువుకోని వాళ్ళు కూడా సాంత్వన అనడం కన్నా స్వాంతన అని ఎక్కువగా ఉపయోగించడం చూసాను.


ఇది కూడా చూడండి. ఈ నిఘంటువులో స్వాంతన అంటే శాంతము,ప్రశాంతత అర్ధం వచ్చేట్టు ఇచ్చారు.
 
 
ఏకాంతపు దిలీప్
 
2009/5/27 Anil K. Golla <anilkum...@gmail.com>

Aruna Pappu

unread,
May 27, 2009, 4:36:17 AM5/27/09
to తెలుగుబ్లాగు
సూర్యరాయాంధ్రనిఘంటువు ప్రకారం
సాంత్వన = 1. శాంతపరచుట, ఓదార్చుట 2. సంధి చేయుట, సామోపాయము 3. సాదర
వచనము, సామవచనము, 4 శాంతము, మార్దవము 5. ఆదరముతోడి పలకరింపు, పరామర్శ
సాంత్వము = మృదువైనది, మధురమైనది, స్నిగ్ధమైనది (వాక్కు)
స్వాంతము = 1. మనస్సు 2. అనునయించుట 3. గుహ 4. రంధ్రము 5. తన మరణము

@ ఎవరికి వర్తిస్తే వారికి,
1. ఎవరైనా సందేహాలు అడిగినప్పుడు శాస్త్రీయంగా నిజమేదో చెప్పాలి.
ఉపయోగించుకోవడం వాళ్ల ఇష్టం.
మన సొంత అభిప్రాయాలు చెప్పడానికిది వేదిక కాదు, సమంజసమూ కాదు.
2. దినపత్రికల్లో వచ్చే వార్తలను ప్రామాణ్యాలుగా చూపించవచ్చుగానీ, పదాలను
కాదు.
అక్కడ రాసేవారందరూ భాషాపండితులూ కారు. దయచేసి ఈ రెండు విషయాలనూ గమనించండి.

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
May 27, 2009, 5:43:07 AM5/27/09
to telug...@googlegroups.com
సాక్షి దినపత్రికలో వ్రాసేవారు పండితులని భావించలేం. ఆ మాటకొస్తే అనూచానంగా  గురుముఖతః వస్తున్నదే ప్రమాణం. ప్రింటులో కనపడేదల్లా ప్రమాణమని భావించరాదు. శ్రీమాన్ భట్టోజి దీక్షితులవారు రచించిన పాణినీయ ధాతుపాఠమే సంస్కృతానికి ప్రమాణం. అందులో ఇచ్చిన ధాతురూపం (verb-root)  "సాంత్వ్" అని !

అదే విధంగా వామన్ శివరామ్ ఆప్టే గారి సంస్కృత నిఘంటువులో ఇచ్చినది:
सान्त्व् 10 U (सान्त्वयति-तॆ) To pacify, appease, conciliate, soothe, comfort Bk.3.23

వాల్మీకి రామాయణం సుందరకాండలో రావణాసురుడు సీతమ్మవారితో పలికిన మాటల్లో--
"యథా యథా సాంత్వయతా...." అని ప్రయోగించబడింది.

Narayanaswamy

unread,
May 27, 2009, 6:51:09 AM5/27/09
to telug...@googlegroups.com
అంతే కాక, శ్రీకృష్ణుడు రాధయొక్క కోపాన్ని తీర్చి అనునయించడం ముఖ్య విషయముగా గల ప్రబంధము, ముద్దు పళని రచన పేరు రాధికా సాంత్వనము.

వినాయకుని వలెను అనే కృతిలో త్యాగరాజస్వామివారు అమ్మవారిని
"స్వాంతమ్ములోన నిన్నే తలచే సుజనులకు .." అని పాడారు. ఇక్కడ అర్ధము హృదయములో అని.

అనిల్ గారూ, తెలుగు పత్రికల తెలుగుని ప్రమాణంగా తీసుకోగలిగిన రోజులు ఎప్పుడోనో పోయాయండీ.

అభినందనలతో
నారాయణస్వామి

2009/5/27 తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtad...@gmail.com>
సాక్షి దినపత్రికలో వ్రాసేవారు పండితులని భావించలేం. ఆ మాటకొస్తే అనూచానంగా  గురుముఖతః వస్తున్నదే ప్రమాణం. ప్రింటులో కనపడేదల్లా ప్రమాణమని భావించరాదు. శ్రీమాన్ భట్టోజి దీక్షితులవారు రచించిన పాణినీయ ధాతుపాఠమే సంస్కృతానికి ప్రమాణం. అందులో ఇచ్చిన ధాతురూపం (verb-root)  "సాంత్వ్" అని !

Annapurna Gadde

unread,
May 27, 2009, 10:54:04 PM5/27/09
to telug...@googlegroups.com
అశ్రువు అనే చిన్న కవితలో కామెంట్ చేసిన వారు ఇద్దరు వేరు వేరు గా చెప్పటంతో నాకూ సందేహం కలిగింది . నా సందేహానికి స్పందించిన మిత్రులకు కృతఙ్ఞతలు .

2009/5/27 Narayanaswamy <kott...@gmail.com>

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం

unread,
May 29, 2009, 2:47:20 AM5/29/09
to తెలుగుబ్లాగు
అన్నపూర్ణగారూ ! మీరు ’కృతజ్ఞత’ వ్రాస్తున్న పద్ధతి సరికాదు. మీరు [ఙ]
ని, [ఞ] ని కలిపి [ఙ్ఞ] అని రాస్తున్నారు. దాని బదులు [జ్న] అని రాసినా
తప్పులేదు. ఎందుకంటే [జ్ఞ] అనేది జకార నకారాల సంయోగమే. సంధిసూత్రాల వశాన
[జ్ఞ] అవుతుంది. లేఖినిలో [జ్ఞ] రాయాలంటే jna అని టైపు చేస్తే
సరిపోతుంది.

Annapurna Gadde

unread,
May 29, 2009, 6:05:42 AM5/29/09
to telug...@googlegroups.com
బాలసుబ్రహ్మణ్యం గారూ ! తెలియజేసినందుకు  ధన్యవాదాలండీ ..

2009/5/29 తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం <subtad...@gmail.com>

sathish

unread,
Jun 23, 2009, 5:22:32 PM6/23/09
to తెలుగుబ్లాగు
ఙ్, ఞ్ - ఈ రెండక్షరాలూ ప్రయోగించబడిన కొన్ని పదాలు చెప్పగలరా, దయచేసి?

అసలు వీటిని తిన్నగా పదాలలో వాడుతుంటారా, లేక వేరే అక్షరాలతో కలిపి
వాడుతుంటారా? ఒకవేళ ఇప్పుడు వీటి ప్రయోగం లేకున్నా కూడా, ఉన్నప్పటి
సంగతులు అందుబాటులో ఉన్నంతవరకు తెలియజేయగలరని ఆశిస్తున్నా...

ధన్యవాదములు,
సతీష్.


On May 29, 3:05 pm, Annapurna Gadde <anuuga...@gmail.com> wrote:
> బాలసుబ్రహ్మణ్యం గారూ ! తెలియజేసినందుకు  ధన్యవాదాలండీ ..
>

> 2009/5/29 తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం <subtadepa...@gmail.com>


>
>
>
> > అన్నపూర్ణగారూ ! మీరు ’కృతజ్ఞత’ వ్రాస్తున్న పద్ధతి సరికాదు. మీరు [ఙ]
> > ని, [ఞ] ని కలిపి [ఙ్ఞ] అని రాస్తున్నారు. దాని బదులు [జ్న] అని రాసినా
> > తప్పులేదు. ఎందుకంటే [జ్ఞ] అనేది జకార నకారాల సంయోగమే. సంధిసూత్రాల వశాన
> > [జ్ఞ] అవుతుంది. లేఖినిలో [జ్ఞ] రాయాలంటే jna అని టైపు చేస్తే

> > సరిపోతుంది.- Hide quoted text -
>
> - Show quoted text -

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Jun 24, 2009, 6:57:06 AM6/24/09
to telug...@googlegroups.com
ఎవరూ సమాధానం ఇవ్వకపోవడం చూసి నేను రాస్తున్నాను. ఈ రెండక్షరాలూ వాడే అవసరం తెలుగులో అరుదుగా వస్తుంది. ముఖ్యంగా రెండు పదాల కోసమే ఉపయోగిస్తారు.
 
౧. శార్ ఙ్గము = అనగా విష్ణుమూర్తి యొక్క విల్లు
అది కలిగినవాడు శార్ ఙ్గి = అనగా విష్ణుమూర్తి

౨. [ఞ] స్వతంత్రంగా ఎప్పుడూ వాడుకలో లేదు. తమిళంలో మాత్రం అలా ఉంది.
ఉదా :- ఞాయిట్రుక్కిழమై = ఆదివారం
 
తెలుగులోను, సంస్కృతంలోను దీనికి జకారంతో కూడుకొన్న సంయుక్తంగానే విఱివిగా ప్రయోగం.
జ్ఞా = (తెలుసుకొనుట) అనే ధాతువుకు సంబంధించిన పదాల్లో మాత్రమే వాడతారు
ఉదా :- జ్ఞానము, విజ్ఞుడు, ప్రజ్ఞ, సంజ్ఞ, అవజ్ఞ, ఉపజ్ఞ, అభిజ్ఞ, ప్రతిజ్ఞ, అభిజ్ఞానము, అజ్ఞానము మొ.


 

నెనర్లు. (Thanks)

Yours Truly
T. L. Bala Subrahmanyam
http://www.tadepally.com

ఇట్లు భవదీయుడు
తాడేపల్లి



Duvvuri Venu Gopal

unread,
Jun 25, 2009, 12:06:58 AM6/25/09
to telug...@googlegroups.com
శార్ ఙ్గము దీనినుండే సారంగపాణి వచ్చిందంటారా?



--
Duvvuri VLKDP Venu Gopal
TeX Guru
Banaras Hindu University
visit my blog : http://telugutex.blogspot.com
http://kashikedar.blogspot.com

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Jun 25, 2009, 4:33:50 AM6/25/09
to telug...@googlegroups.com
అలా వ్యాఖ్యానించుకోవచ్చు. తప్పేం లేదు.

ఎందుకంటే సంస్కృతంలో "సారంగం" అనే స్వతంత్రపదం కూడా ఉంది. దానికర్థం "వానకోయిల, చాతకపక్షి, లేడి" అని ! కానీ విష్ణుమూర్తి ఆ పక్షిని/ లేడిని పట్టుకున్నట్లుగా కథ గానీ, శిల్పం గానీ, చిత్రం గానీ మన దృష్టికి రాలేదు.

kv ramana

unread,
Jun 27, 2009, 3:35:14 AM6/27/09
to telug...@googlegroups.com
ఙకారంతో బాగా వాడుకలో ఉన్నపదం - వాఙ్మయం - దీన్ని వాంగ్మయం అని పలుకుతాం, రాస్తాం.
శార్ఙ్గం అంటే శృంగ నిర్మితం.  విష్ణుమూర్తి ధనుస్సు పేరు.  అంచేత విష్ణువుకి శార్-ఙ్గి/శార్-ఙ్గపాణి అనిపేరు. శార్oగి అని 'ర' ని పొల్లుచేసి సున్నా పెట్టడం ఉచితం కాదు గనక, అలా ఙకార గుణింతంతొ రాస్తారు.
సారంగమంటే వడిగా పోయేది.  లేడి అనే అర్థమే విస్తృతంగ వ్యవహారంలొ కనిపిస్తుంది.  లేడిని/సారంగాన్ని ధరించేవాడు విష్ణువు కాడు, శివుడే సారంగపాణి.  చేతిలో లేడితో ఉండే శివుడి బొమ్మలున్నాయి.
ౠ-తో కూడా మాటలు లేవు. అరుదుగా పితౄణం, అకౄరుడు లాంటి పదాలు ౠగుణింతంతో ఉన్నాయి.
ణ-కారంతో మొదలయ్యే మాటలు తెలుగులోనె కాదు - ప్రపంచంలొ ఏ భాషలోనూ లేవు. అయితే రాజస్థాన్-మార్వాడ్ ప్రాంతం వాళ్ళు న-కారాన్ని ణ-కారంగా పలుకుతారు గనక కొన్ని పదాలు వాళ్ళనుంచి ణ-కారాదిగా మాటలను వినగలం.  పూర్వమెప్పుడో బాగా బతికిన ప్రాకృత భాషాపదాలు కొన్ని ణ-కారాదిగా ఉండేవి.

2009/6/25 Duvvuri Venu Gopal <dvg...@gmail.com>


--~--~---------~--~----~------
------~-------~--~----~
మీరు "తెలుగుబ్లాగు" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
ఈ గుంపుకు జాబు పంపేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-...@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు, http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.

http://koodali.org
http://jalleda.com
-~----------~----~----~----~--
----~----~------~--~---


రాకేశ్వర రావు

unread,
Jun 29, 2009, 8:22:23 AM6/29/09
to తెలుగుబ్లాగు

వంకాయని వఙ్కాయని
కంచాన్ని కఞ్చమని
వంటని వణ్టని
కొంతని కొన్తని
కొంపని కొమ్పని
వ్రాసుకోవచ్చని మా తెలుఁగు పంతులుగారు చెప్పారు.

ఇది సంస్కృత పదాలకూ, తెలుఁగు పదాలకూ కూడా వర్తిస్తుందో లేదో నాకు
తెలియదు.

మలయాళంలో నేనుకి ఞాన్ అంటారు - మనవాళ్ళు దీనిని న్యాన్ అని
వ్రాసేస్తుంటారు.
స్పానిషులోని మఞానా, పిరాఞా వంటివి వ్రాసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది.

ఌౡ లు కూడా తెలుఁగులో వాడరనుకుంట.

ఇక ఈనాడు వాడైతే రుణం, రుజుము, రుషి అని వ్రాస్తూంటాడు.

రాకేశ్వర

> >http://groups.google.com/group/telugublogవద్ద ఈ గుంపును చూడండి.

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Jun 29, 2009, 9:03:23 AM6/29/09
to telug...@googlegroups.com


వంకాయని వఙ్కాయని
కంచాన్ని కఞ్చమని
వంటని వణ్టని
కొంతని కొన్తని
కొంపని కొమ్పని
వ్రాసుకోవచ్చని మా తెలుఁగు పంతులుగారు చెప్పారు.

ఇది సంస్కృత పదాలకూ, తెలుఁగు పదాలకూ కూడా వర్తిస్తుందో లేదో నాకు
తెలియదు.


మనకి తెలిసిన చరిత్ర ప్రకారం తెలుగులో అలా రాసే సంప్రదాయం ఎప్పుడూ లేదు. (అనగా అట్లు వ్రాయరాదని భావము)

తమిళంలో మాత్రం ఉంది. తమిళ ప్రభావంతో ఒకఱిద్దఱు తెలుగు పండితులు (స్వాతంత్ర్యానికి ముందుకాలంలో) అలా రాయడం, అచ్చువేయడం మొదలుపెట్టినా అది జనానికి కొఱుకుడు పడక అక్కడితో అంతరించింది. ఏమైనా సున్నాఅంత సులభం కాదు గదా !

మనలో మాట. ఏమీ అనుకోవద్దండీ. మన తెలుగు గురువులెవరూ నిజంగా తెలుగభిమానులు కారు. (ఎందుకంటే నేనెక్కడా చూడలేదు)

Sirish Kumar Tummala

unread,
Jun 29, 2009, 9:06:47 AM6/29/09
to telug...@googlegroups.com
ఆమధ్యనో పుస్తకం చదివాను. పల్నాటి వీర చరిత్రము - పండిత ఉమాకాన్త విద్యాశేఖరులు రాసినది. దానిలో "సంకేత" పదాలు అని వాడాల్సిన చోట "సఙ్కేత" పదాలు అని రాసారు.

- తుమ్మల శిరీష్ కుమార్
-----------
నా బ్లాగు: http://chaduvari.blogspot.com
బ్లాగులన్నీ: http://koodali.org, http://jalleda.com


2009/6/29 రాకేశ్వర రావు <rake...@gmail.com>

kv ramana

unread,
Jun 30, 2009, 2:13:59 AM6/30/09
to telug...@googlegroups.com
వంకాయను వఙ్కాయ అని రాయడం ప్రాచీన లేఖనాలలో కనిపించవు.  కేవలం సన్స్కృతం రాయడానికే అలాంటి గుణింతం వాడేవారు.  ఇలా అనునాసిక అక్షరాలను పొల్లు చెసి రాయడం ఇంకా ఒరియాలో వుంది.  తమిళులకు సున్నా (అనుస్వారం) లేనే లేదు.  బహుశా మలయాళంలొ కూడా అనుకుంటా. 
'ఈనాడూభాష గురించి రాస్తు ఋ కి బదులుగా రు రాస్తున్నారని అన్నారు.  అక్షేపణ కాబోల్ను. ఇలాంటి అభ్యంతరం తెలుగు భాషకు ఉండనక్కరలేదని అనుకుంటాను.  సన్స్కృతం రాసేటప్పుడు ఋకి బదులు రు గాని రి గాని రాయకూడదు. 
ప్రమాణం అనే అర్థం తీసుకుంటే, రుజువు అనే మాట సన్స్కృత పదం కాదు.  ఋజువని రాస్తే దానర్థం తిన్ననిది అని. ఉదాహరణకి ఋజు రేఖ అంటే సరళరేఖ. రుజువు చూపించు అంటే prove చెయ్యమని. సన్స్కృతంలో కూడా రు-కారంతో రాసేవి ఉన్నాయి.  ఉదాహరణకి ధృవుడు అని రాయకూడదు.  ధ్రువుడు అని రాయాలి.
ఇలా కొన్ని తప్పులు రాస్తుంటాం - ధృవతార, ధృవీకరణ, కృంగిపోవు వగైరా. వీటిని ధ్రువతార, ధ్రువీకరణ, క్రుంగిపోవు అని రాయాలి.
ఋ-కారాన్ని రు అని, రి అని రెండువిధాల పలుకుతారు.  రు-గా పలికేవాళ్ళు సైతం కృష్ణ శబ్దాన్ని మాత్రం క్రిష్ణగా పలుకుతారు.  ఉత్తరదేశమంతా రి-గా పలుకుతారు; కాని బెంగాలీలు, ఒరియావాళ్ళు రు-గా పలుకుతారు.
వందనాలు - కే వీ

2009/6/29 తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtad...@gmail.com>

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Jun 30, 2009, 4:53:12 AM6/30/09
to telug...@googlegroups.com
రుజువు/ ఋజువు సంస్కృతపదమే, ఎలా రాసినా కూడా !.
ఋజువు = సూటి. నేరుగా
ఋజువు చెయ్యడం = నేరుగా (సూటిగా) చూపించడం = అనగా నిరూపించడం

Aasish Pappu

unread,
Jun 30, 2009, 8:15:49 AM6/30/09
to telug...@googlegroups.com
రమణ గారు, 

విష్ణు సహస్రనామాలలో ఈ శ్లోకం ఉంటుంది చివరలో 
"వనమాలి గది శార్ ఙ్గ శంకి చక్రి చ నందకీ| శ్రీమాన్ నారాయణో దేవో వసుదేవోభి రక్షతు||"
ఇందులో విష్ణువుయొక్క ఆయుధధారణ గురించి చెప్తూ వ్యాసులవారు స్తుతించారు.

దీని బట్టి చుస్తే విష్ణువు కాదని అనలేము. అలాగే ఆ పదానికి మీరు చెప్పిన  వేరే అర్థముల వలన శివుడు అని కూడా అనవచ్చేమో.

-ఆశీష్ 

27 జూన్ 2009, 3:35 am న, kv ramana <kvje...@gmail.com> ఇలా రాసారు :



--
Aasish Kumar Pappu

kv ramana

unread,
Jul 1, 2009, 3:37:46 AM7/1/09
to telug...@googlegroups.com
సుబ్రమణ్యం గారు,
'రుజువు చెయ్యడంలో' రుజుశబ్దం సన్స్కృతం నుంచి రాలేదు - పారశీకపదం. ఋజువు
అనిరాస్తే రుజువు బదులు రిజువు అని పలికే ప్రమాదం ఉంది. ఋజువర్తనంలో
ఋజువుని రిజువని పలికితే తప్పుకాదు - కృష్ణను క్రిష్ణ అనడం లాగ.


ఆశిష్ గారు,
శార్ఙ్గి అంటే విష్ణువనే కదా నేనూ అన్నాను. శివుడు కాదని అన్నాను.
సారంగపాణి అంటే శివుడు. శార్ఙ్గం-సారంగం ఒకటి కావు. గమనించగలరు.

స్పందించిన ఇరువురికీ ధన్యవాదాలు.
- కేవీ

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Jul 1, 2009, 5:13:32 AM7/1/09
to telug...@googlegroups.com
తెలుగువాళ్ళకి ఏ దశలోను ఫార్సీ రాదు గనుక పారశీక పదాలు తెలుగులోకి నేరుగా
రాలేదు. అవి ఆనాటి అధికార భాషయిన ఉర్దూ ద్వారా వచ్చాయి. అయితే ఉర్దూలో
రుజువనే పదం ఎప్పుడూ వినలేదు. కనుక ఈ "రుజువు" సంస్కృత "ఋజు"వేనని నా

అభిప్రాయం.

kv ramana

unread,
Jul 2, 2009, 3:39:31 AM7/2/09
to telug...@googlegroups.com
రైటేనండి.  ఉర్డూ నుంచే వచ్చుంటుంది.  దీని రూపం 'రుజూ'.  దావా వెయ్యడం లాంటి చొట్ల వాడతారు.  ఉర్దూ తెలిసిన వకీళ్ళు చెప్పగలరు.
మన నిఘంటువుల్లో 'ఋజువు అనే ఆరోపం ఉంది గాని రుజువు లేదని గమనించగలరు. నిఘంటుకారులు ఋజువు అనే మాటకు straight అనే అర్థం ఇచ్చారు గాని proof అనే అర్థం ఇవ్వలేదు.  ఋజువు వేరు రుజువు వేరు.  ఒకటి కావు.
రుజువు యొక్క పుట్టుపూర్వోత్తరాల కోసం ప్రయత్నిస్తాను.  దొరికితే వివరిస్తాను.  ఈలోగా మీకేమైనా తెలిస్తే చెప్పండి.  నెనరునవుతాను.
శుభాకాంక్షలతో - కేవీ

2009/7/1 తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtad...@gmail.com>

Katta Girija Ramana

unread,
Jul 7, 2009, 10:08:34 AM7/7/09
to telug...@googlegroups.com
నాయనలారా నేను ఒక తెలుగు పండితుడిని ! తాడేపల్లి గారు అన్నట్లు తెలుగు పంతుళ్ళకు తెలుగుపై అభిమానం లేదు. భాషను సమగ్రంగా అధ్యయనం చేస్తే భాషపై అభిమానం పుడుతుంది. నిజంగా మీ చర్చలను , మీ ఊహలను చూస్తుంటే మిమ్మల్ని అమాంతంగా పట్టుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో తెలుగు పండిట్లు గా నియామకం చేయించాలని  అనిపిస్తున్నది. ముందుగా మీకు తెలుగు నేర్పిన గురువులకు మనస్పూర్తిగా వందనాలు.
      తెలుగులో కొన్ని అక్షరాలూ లేవు వాటిని సంస్కృతం నుండి తెచ్చుకున్నాము. అవి ౧౯ అక్షరాలూ. ఋ ,ఋ లు లూ : ఖ ఛ ఠ థ ఫ ఘ ఝ ఢ ధ భ న్గ్ , శ ష లు సంస్కృతములో నుండి తెలుగులోకి నన్నయగారు మహాభారత రచన కొరకు తెచ్చుకున్నారు. పై అక్షరాలూ ఉన్న పదాలు తెలుగు పదాలు కావు. ఋజువులు( సాక్ష్యములు ) /  ఋజుప్రవర్తన  ( క్రమము )  వ్యాకరణం లోకి   వెళ్ళాల్సి వస్తుంది. మన తెలుగులో 75% పదాలు సంస్కృత పదాలు, మిగతా పదాలలో తెలుగు, ఉర్దూ , అరబ్బీ, ఫారసీ, కన్నడ, తమిళ భాషా పదాలు చేరినాయి. తెలుగులో తెలుగెంత? ??  ప్రమాణాలకు నిఘంటువులు, మహాకవుల రచనలు  ముందు వేసుకోవాలి. తిక్కన, శ్రీనాథుడు, మొదలైన మహాకవులు ఉర్దూ, అరబ్బీ, ఫారసీ, పదాలు వాడినట్లు వేటూరి ప్రభాకర శాస్త్రి గారు తెలిపినారు. ఈ గొడవ అంత లింగ్విస్టిక్  పరిశోధకులది. మీరు ఒక చెయ్యి వేస్తున్నందుకు ఆశిస్సులు. ( చిన్నవారైతే , పెద్దలైతే నమస్సులు )  ఋజువు  ఋజా గ్రస్తము ఋజు మార్గము  మొదలగు పదాలు కవుల ప్రయోగాలలో కనిపిస్తాయి. వాటి అర్థాలు వెనుకా ముందు గల పడాల వాళ్ళ తెలుస్తుంది.  ప్రయోగ శరణం వ్యాకరణం . పదాలకు ప్రయోగమే అర్థాన్ని సమకూరుస్తుంది. వాక్యాన్ని బట్టి అర్థం వెతుక్కోవాలి  శుభం.

2009/7/2 kv ramana <kvje...@gmail.com>



--
మీ కట్టా గిరిజా రమణ
Reply all
Reply to author
Forward
0 new messages