వందే మాతరం
తూ, చా అనునవి అవ్యయములు . వచనము, విభక్తి, లింగము లేనివి. వీటిని వేటితోనైనా కలిపి వాడవచ్చును . వీటికన్నా ముందు గల పదాలు ఏ అర్థాన్ని ఇస్తాయో తూ, చా అనునవి కలిపినా అవే అర్థాన్ని ఇస్తాయి. సంస్కృతము నుండి తెలుగు లోకి అనువదించేటప్పుడు కొందరు తూ,చా అనువానిని కూడా అనువదించడం చేసేవారు ( అంతే కాకుండా ఉన్నది ఉన్నట్లు ఒక బహశా నుండి మరో భాషలోకి మార్చితే దానిని చెప్పేటప్పుడు తూ,చా తప్పకుండా చెప్పినాడు అనడం పరిపాటి )
2009/6/25 Aasish Pappu <aas...@gmail.com>
--
మీ కట్టా గిరిజా రమణ
అందుకేనేమో వ్యాస భగవానుడిని ఒకసారి కాళిదాసు అతని మిత్రులు చకారకుక్షి అని హేళన చేస్తారు !
నమస్సులు,
సతీష్.
On Jun 25, 10:30 pm, Aasish Pappu <aasi...@gmail.com> wrote:
> ఆహ, చక్కటి వివరణ.
>
> తాడేపల్లి గారు, మీ వివరణ అమోఘం.
>
> కృతజ్ఞతలు.
> ఆశీష్
>
> 25 జూన్ 2009, 1:18 pm న, తాడేపల్లి T.L. Bala Subrahmanyam <
> subtadepa...@gmail.com> ఇలా రాసారు :
>
>
>
>
>
> > తు, చ అనేవి స్వతహాగా అర్థవంతాలైన అవ్యయాలే. అవి అర్థం లేనివనిన్నీ కేవల
> > పాదపూరణ నిమిత్తమనీ తలంచడం ప్రామాదికం. కానీ ఏ కారణం చేతనో అమరకోశకారుడు కూడా
> > ఒక సందర్భంలో మిక్కిలి పొఱపడి "తు-హి-చ-స్మ-హ-వై పాదపూరణే" అని పేర్కొన్నాడు.
> > అయితే అదే గ్రంథంలో మఱొకచోట వాటికి ప్రత్యేకమైన అర్థాలిచ్చాడు.
>
> > "చ" అనేది తెలుగులో "మఱియు (and)" అనేదాన్ని ఏ అర్థంలో వాడతామో ఆ అర్థంలో
> > వాడబడుతుంది. అంటే ఏదైనా జాబితాని ఏకరువు పెట్టాల్సి వచ్చినప్పుడు ఆ జాబితా
> > చివఱ "చ"శబ్దాన్ని వాడాలి. లేదా తెలుగులో మాదిరి జాబితాలోని ప్రతిపదం చివఱా
> > వాడాలి.
>
> > ఉదా :- వేదాశ్చ ఉపనిషదశ్చ పురాణాని చ (వేదములున్ను, ఉపనిషత్తులున్ను,
> > పురాణములున్ను)
>
> > లేదా, రామో లక్ష్మణస్ సీతా చ (రాముడును, లక్ష్మణుడును సీతయు)
>
> > నిజంగా "చ"శబ్దం అర్థహీనమైతే పాణిని మహాశయుడు ద్వంద్వసమాసాన్ని నిబంధిస్తూ
> > "చాఽర్థే ద్వన్ద్వః" ("చ"శబ్దార్థమునందు ద్వంద్వసమాసము ప్రవర్తించును) అని
> > సూత్రీకరించడు కదా !
>
> > ఇహపోతే "తు"
>
> > అమరకోశకారుణ్ణి అనుసరించి "తు స్యాద్ భేదేఽవధారణే"
> > అంటే - ఒక వస్తువు యొక్క ప్రత్యేకతని చెప్పేటప్పుడూ, నొక్కివక్కాణించేటప్పుడూ
> > "తు" వాడాలి అని తాత్పర్యం.
>
> > ఉదా:- ఇతరేఽ౦శావతారాః స్యుః *కృష్ణస్తు* భగవాన్ స్వయమ్ |
> > తా|| ఇతరులు అంశావతారాలు మాత్రమే. *మరి కృష్ణుడో ?* (సాక్షాత్తు) స్వయముగా
> > భగవంతుడే.
>
> > నెనర్లు. (Thanks)
>
> > Yours Truly
> > T. L. Bala Subrahmanyam
> >http://www.tadepally.com
>
> > ఇట్లు భవదీయుడు
> > తాడేపల్లి
>
> > This mail might have been sent to you in Telugu language. If you are unable
> > to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For
> > writing in Telugu, usehttp://lekhini.org
>
> --
> Aasish Kumar Pappu- Hide quoted text -
>
> - Show quoted text -
మీరు చాలా మంచి వివరణ ఇచ్చారు.
ధన్యవాదములు.