మీరేమంటారు?

4 views
Skip to first unread message

చరసాల

unread,
Aug 29, 2006, 12:44:53 PM8/29/06
to telugublog
నాకెప్పట్నుంచో ఈ ఆలోచన
వుంది. తెలుగుని, తెలుగు
బ్లాగింగుని, తెలుగు
మాధుర్యాన్ని పెంచడానికి
మీ కృషి మెచ్చదగింది.
తెలుగు మాట్లాడటం చిన్నతనం
కాదు, ఇంగ్లీషులో
మాట్లాడటం గొప్పదనం కాదు
అని తెలియజేస్తే తెలుగులో
మాట్లాడ్డానికి ఎక్కువ
మంది ముందుకు వస్తారు.
అలాగే తెలుగు మాట్లాడని
వారి మీద ఏదో ఒక విధంగా మనం
ఒత్తిడి తేవడానికి
ప్రయత్నించాలి. దీనికి ఒక
వేదిక వుండాలి. మన ఆలోచనలని
తెలియజేయడానికి
పంచుకోవడానికి మనకు
బ్లాగింగు మంచి అవకాశంగా
వుంది. అయితే ఎక్కువ మందిని
బ్లాగులు చదవడానికి,
రాయటానికి ప్రోత్సహించాలి,
ఆకర్షించాలి.
మీ ప్రయత్నాలను నీరు
గార్చే వుద్దేస్యం నాకు
లేదు కానీ, తెలుగు
వ్రాయడానికి ఇప్పుడే
తగినన్ని సాధనాలు
అందుబాటులోకి వచ్చాయి.
అయితే ఎక్కువమందిని
ఆకర్షించటానికి తెలుగు
బ్లాగింగు గురంచి
తెలియచెప్పడానికి మనం
పత్రికల వెంట పడటానికి
బదులు వాళ్ళే మన వెంట పడేలా
చేసుకోలేమా?
ఎక్కడైనా పదిమందికి
ఉపయోగపడేది, ఉత్సుకత
కలిగించేది వుందంటే వాళ్ళు
ఖచ్చితంగా
వచ్చితీరాల్సిందే.
చెప్పినమాటే చెప్పి, ఆడిన
మాటే తప్పే రాజకీయుల మాటలు
నమోదు చేయడానికి పరుగెత్తే
వాళ్ళు పది మంచి మాటాలు
చెప్పి, నాలుగు మంచి పనులు
చేస్తే మన మాటలు, చేష్టాలు
నమోదు చేయడానికి రారంటారా?
రోజూ ఈనాడులో "ఈ గుండెను
ఆగిపోనివ్వకండి", "ఈ సరస్వతీ
బిడ్డను ఆదుకోండి" లాంటి
ఎన్నో వార్తలు చూస్తూ
వున్నాం. మనందరం కలిస్తే
నెలకు ఓ గుండెకు ఆపరేషను
చేయించలేమా? ఓ పేదరాలి
చదువుకు సహాపడలేమా? ఒక
నిరుపేద బస్తీకెళ్ళి
వీధుల్ని శుబ్రం చేయలేమా?
చలికి రోడ్డుపక్కన అల్లాడే
బిక్షగాండ్రకు దుప్పట్లు
పంచలేమా? కనీసం ఏడాదిలో
ఒక్కసారి రక్తదానం
చెయ్యలేమా?
ఈ పనులు చేస్తూ వీటికి
ప్రత్యుపకారంగా తెలుగును
మాట్లాడండి, రాయండి, చదవండి
అంటే మన మాటను పత్రికలు
భేఖాతరు చేస్తాయంటారా?
గాంధీ ఆత్మకథను చదవకుంటే
ఒకసారి చదవండి, చదివుంటే
మళ్ళీ ఒకసారి పునఃక్షరణ
చేయండి. ప్రతిపలం లేకుండా
సత్యనిష్టతో తను నమ్మిన
ధర్మాన్ని తను నిష్టగా
పాటించడమే తనకు అంతమంది
నమ్మకాన్ని సంపాదించింది.
నిష్టతో మనం అనుకున్న పని
మనం చేస్తే ఫలితం దానంతదే
వస్తుంది. అప్పుడు ప్రతి
పత్రికా మనమెంటే ఎవరని ఆరా
తీస్తుంది, మన గురించి తనే
తెలుసుకుంటుంది.
మీరేమంటారు? సేవా
కార్యక్రమాలు
జోడిద్దామటారా?
-- ప్రసాద్
http://charasala.wordpress.com

cbrao

unread,
Aug 29, 2006, 1:22:21 PM8/29/06
to telug...@googlegroups.com

swathi

unread,
Aug 30, 2006, 12:04:15 AM8/30/06
to telug...@googlegroups.com

ప్రసాద్ గారు ఎప్పటి లాగే మీ అభిప్రాయం చాలా బాగుంది.
దీని మీద మనం ఇంకాస్త పక్కాగా సవివరమైన ప్రణాళిక తయారు చెయ్యాలి.
సేవా కార్యక్రమాల సంగతి అలా ఉంచితే నాకో అలోచన వచ్చింది
ప్రతి శనివారం ఈనాడు లో ఈతరం అని ఒక శీర్షిక వస్తుంది
దానికి మనం ఎవైనా పంపాలంటే y...@eenadu.net కి మెయిల్ చెయ్యొచ్చు.
దానికి మన తెలుగు బ్లాగ్ లు , కూడలి,లేఖిని, తెలుగు గూగుల్  గ్రూపులు (తెలుగు బ్లాగ్, సాహిత్యంetc)
వీటన్నిటి గురించి మెయిల్ చేస్తే ఎలా ఉంటుంది. 

--
http://swathikumari.wordpress.com
Regards,
Swathi.

త్రివిక్రమ్

unread,
Aug 30, 2006, 1:36:49 AM8/30/06
to telug...@googlegroups.com

ప్రసాద్ గారు చెప్పినదాంట్లో రెండు అంశాలున్నాయి.
1. అవసరంలో ఉన్నవారికి ఆర్థికసాయం చెయ్యడం
2. శ్రమదానం, రక్తదానాల్లంటివి చెయ్యడం.
రెండిటికీ నేను సిద్ధమే.

Kiran Kumar Chava

unread,
Aug 30, 2006, 1:42:31 AM8/30/06
to telug...@googlegroups.com

ప్రసాదు గారు,

మీ ఆలోచన అద్భుతంగా ఉన్నది.

అసలు ఇటువంటి ఆలోచన మాకు రానే రాలేదు ఇంతవరకూ :)

మనము ఓ స్కూలు విజిట్తో మొదలుపెడదాము.

ఏమి ఏమి చెయ్యాలి?

పెయింటింగు వెయ్యాలి.

పుస్తకాలు ఇవ్వాలి (చదువుకునేవి కాకుండా వేరేవి, చందమామ, ఇతర పుస్తకాలు )

ఈ సరికే ఇలా పనిచేస్తున్న ఆర్గనైజేషను ఏదన్నా ఉంటే వారితో కలసి పనిచెయ్యడం మంచిది ఏమంటారు?

కాకపోతే మనకు జనం కావాలి.

కనీసం ఇరవై మంది అన్నా ఉంటే మొదలు పెట్టవచ్చు.

--
----
ధన్యవాదములు,
కిరణ్ కుమార్ చావా
http://www.oremuna.com
http://flickr.com/photos/chavakiran
naa sOdi

Prasad Charasala

unread,
Aug 30, 2006, 9:04:31 AM8/30/06
to telug...@googlegroups.com

చాలా సంతోషంగా వుంది నా ఆలోచన నచ్చినందుకు. కానీ నేను దూర తీరాలలో వున్నందువల్ల ధన సహాయం మాత్రమే చేయగలను మీతో కలిసి పాఠశాలలకు రాలేను.
మనమంటూ మొదలు పెడితే జనం చాలానే వస్తారు. చాలా మందికి చేయాలని వుంటుందిగానీ ఒకలాంటి బిడియం చేయనివ్వదు. ఆ బిడియం మంచు పొరను గనక మనం పగులగొట్టగలిగితే ఇక తర్వాత చాలా వుత్సాహంగ పాల్గొంటారు.

-- ప్రసాద్
http://charasala.gmail.com

రవి వైజాసత్య

unread,
Aug 30, 2006, 10:02:30 AM8/30/06
to telugublog
చాలా బాగుంది ఏదైనా సహాయము
చెయ్యడానికి నేను సిద్ధం

Prasad Charasala

unread,
Aug 30, 2006, 11:13:00 AM8/30/06
to telug...@googlegroups.com

ఈ గ్రూపులో ఎక్కువమంది హైదరాబాదులోనే వున్నారు గనుక అక్కడి వారే ఎవరో ఒకరు దీన్ని ముందుండి నడిపించాలి.
అపోలో వారి Save a child heart కి నెలవారి కనీసం ఒక పిల్లవాన్నైనా కాపాడ్డానికి తెలుగు బ్లాగర్లం కృషి చేయవచ్చు.
ఏదో ఒక మురికి వీధిని తెలుగు బ్లాగర్ల పేరుమీద దత్తత తీసుకొని అభివృద్ది చేయవచ్చు.
ఇప్పుడు కావాల్సింది దీని భారం తమ స్కందాలపై వుంచుకోని కార్యబారం మోయగలవారు. తెలుగు బ్లాగర్ల పితామహుడు "చావా" ఈ భారం మోయగలరా? లేక నెట్‌లో తెలుగు రాతను సులభతరం చేసిన "వీవెన్" ఈపని చేయగలరా?
ఇందుకు వీళ్ళెవరు ఆమోదం తెలిపినా సభ్యులంతా హర్షిస్తారనుకుంటాను.

-- ప్రసాద్
http://charasala.gmail.com



Srinivasa Raju Indukuri

unread,
Aug 31, 2006, 4:22:06 AM8/31/06
to telug...@googlegroups.com
yes, that is also one way of giving helping hand.

just have a look at my blog. http://nivasindukuri.blogspot.com/

Its all about CRY. I'll get some information about that whether some one
can volunterily invovle in such programs.

Regards
Srinivas

Veeven (వీవెన్)

unread,
Aug 31, 2006, 11:16:43 PM8/31/06
to telug...@googlegroups.com
మనం పత్రికలవారి వెంటపడే కంటే వారే మనకోసం వచ్చేలాచేసుకోవడానికి మనం ఏదో
ఒకటి చెయ్యాలి. ఏంచెయ్యాలి అన్నదానికి సేవా కార్యక్రమాల జోడింపు ఒక మంచి
మార్గం.

అయితే ప్రస్తుతం సమావేశాలకి వచ్చేవారి సంఖ్య ఆరుకి మించడంలేదు. (సమావేశం
ఎప్పుడుంటుందో చాలా ముందుగానే తెలియజేయలేకపోవడమన్నది దీనికో కారణం.)

On 8/30/06, Prasad Charasala <char...@gmail.com> wrote:
>
>

> ఈ గ్రూపులో ఎక్కువమంది హైదరాబాదులోనే వున్నారు గనుక అక్కడి వారే ఎవరో ఒకరు
> దీన్ని ముందుండి నడిపించాలి.
> అపోలో వారి Save a child heart కి నెలవారి కనీసం ఒక పిల్లవాన్నైనా కాపాడ్డానికి
> తెలుగు బ్లాగర్లం కృషి చేయవచ్చు.
> ఏదో ఒక మురికి వీధిని తెలుగు బ్లాగర్ల పేరుమీద దత్తత తీసుకొని అభివృద్ది
> చేయవచ్చు.

మంచి ఆలోచనలు.


> ఇప్పుడు కావాల్సింది దీని భారం తమ స్కందాలపై వుంచుకోని కార్యబారం మోయగలవారు.
> తెలుగు బ్లాగర్ల పితామహుడు "చావా" ఈ భారం మోయగలరా? లేక నెట్లో తెలుగు రాతను
> సులభతరం చేసిన "వీవెన్" ఈపని చేయగలరా?
> ఇందుకు వీళ్ళెవరు ఆమోదం తెలిపినా సభ్యులంతా హర్షిస్తారనుకుంటాను.
>

నాకు లభించే ఖాళీ సమయాన్ని కంప్యూటర్‌తో గడపడమే నాకిష్టం. నేనిప్పుడే ఏమీ
చెప్పలేను.


>
> -- ప్రసాద్
> http://charasala.gmail.com
>
>
> On 8/30/06, రవి వైజాసత్య <vyza...@gmail.com> wrote:
> > చాలా బాగుంది ఏదైనా సహాయము
> > చెయ్యడానికి నేను సిద్ధం
> >
> >
> >
> > > >
> >
>


--
వెబ్సైట్: http://veeven.com/ | బ్లాగు: http://veeven.wordpress.com/

Reply all
Reply to author
Forward
0 new messages