బ్లాగ్ కి తెలుగు పదం ?

31 views
Skip to first unread message

GLN Sarma

unread,
Feb 28, 2011, 2:16:40 AM2/28/11
to telug...@googlegroups.com

తెలుగు బ్లాగర్స్ కి 

బ్లాగ్ కి ఏది అయిన తెలుగు పదం ఉందా ?

ఉంటే తెలియ చేయండి 


--
GLN SARMA

Bangalore : 9620555675
Ground Floor
House No : 8
Raja Reddy Building
Near surya Bakery
Munnekolelu
Marthahalli
Bangalore
560037
Karnataka
Hyd : 9912595535

svaram

unread,
Mar 1, 2011, 8:53:18 AM3/1/11
to తెలుగుబ్లాగు
వెబ్ లాగ్ అనే పదబంధాన్ని బ్లాగ్ గా ఆంగ్లంలో వ్యవహరిస్తున్నారని
అందరికీ తెలిసిందే. తెలుగులో సులువుగా "బ్లాగు" అంటున్నాము.
అంతే !

svaram

unread,
Mar 1, 2011, 10:27:55 PM3/1/11
to తెలుగుబ్లాగు
telugu.junk AT gmail.com ఇలా వ్రాసారు

ఆంగ్ల పదం బ్లాగ్ పుట్టినక్రమం గమనించండి...
అది ఆంగ్ల ప్రపంచానికి కూడా మొన్నీమద్య ప్రాచుర్యంలోకి వచ్చిన పదమే...

The word 'Blog' came from Web.Log and
similarly Blogs from weB.logs and Blogger from weB.logger
- కనుక ఆ కోణంలోనుండి ఆలోచిస్తే ఉపయోగపడవచ్చు.

ఆంగ్లభాషకు ఇప్పుడు పట్టిన అదృష్టమో ఏమో కాని దాన్ని
పదునుపెడుతున్నట్టుగా
మరే ఇతర భాషకు మార్పులు చేర్పులు చేయడం లేదు.
మన తెలుగు ప్రస్థుత దురవస్థనుండి బయటకు రావాలని ప్రార్థిస్తూ...

<-- edit --> తెలుగు ప్రేమికుడు
_______________________________________________

svaram

unread,
Mar 2, 2011, 1:58:45 AM3/2/11
to తెలుగుబ్లాగు
GLN Sarma ఇలా వ్రాసారు
ధన్యవాదాలు

web కి blog కి పర్యాయ పదాలు ఉంటె లేదా మనం సృష్టిస్తే ఎలాంటి పదం
వాడవచ్చు ?
మన సాహిత్యం లో ఈ ప్రక్రియ పేరు ఏమిటి ?

నాకు web ok కాని బ్లాగ్ కి పదం ఉంటె చాలా బాగుంటుంది చాలా బ్లాగ్స్
వచాయి
_____________________________________________________________

car --> కారు ,
bus --> బస్సు ,
phone --> ఫోను

...

ఇలాంటి పదాలని మనం సులువుగా తెలుగు పదాలుగా
వాడుతున్నాం . blog ని బ్లాగు అని ఉపయోగించడంలో
ఇబ్బంది ఏదైనా ఉందా !!

తెలుగు పదాలకి సంబంధించిన కింది సైట్లని చూడండి
http://groups.google.com/group/telugupadam/
http://telugupadam.org

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం

unread,
Mar 2, 2011, 4:19:53 AM3/2/11
to తెలుగుబ్లాగు
తెలుగు పదాల కల్పనకూ, వాడకానికీ చాలా మానసిక అవరోధాలున్నాయండీ ! అవి
వదిలితేనే తప్ప తెలుగుపదాలు దూసుకుపోవు. తెలుగు పదాలకు తెలుగువాళ్లే
వ్యతిరేకులు. అదీ గాక వీళ్ళు మిక్కిలి చాదస్తులు. కొత్తదనమంటే భయం.
ద్వేషం. అచ్చం తెలుగు సినిమా నిర్మాతల తరహానే. ఇంగ్లీషువాళ్ళకు ఈ
లక్షణాలు లేవు కదా ! వాళ్ళు కొత్తదనాన్ని సాదరంగా స్వాగతిస్తారు. కొత్త
పదాల్ని కనిపెట్టి వాడినందుకు గత అయిదేళ్ళలో నేనూ, నా బ్లాగ్మిత్రులూ
ఎన్ని దూషణలకూ, అపహాస్యాలకూ, అవమానాలకూ గుఱయ్యామో మీకు తెలియదు. ఏకం
తిట్ల టపాలే కుఱిపించారు మా మీద, మేము ఎవ్వఱి జోలికీ పోకపోయినా, మా మానాన
మేము మా బ్లాగుల్లో మా పదాలు వాడుకున్నా ! అయినా మేము మొండిఘటాలం కనుక
పట్టించుకోకుండా మా దారిన మేము "అలాముందుకెళుతున్నాం."

ఈ కాలంలో తెలుగుపదాల్ని కనిపెట్టి వాడడమనేది వీరేశలింగం గారి కాలంలో
వితంతు పునర్వివాహం చేసినంత పని.

Amaranarayana B

unread,
Mar 2, 2011, 5:00:40 AM3/2/11
to telug...@googlegroups.com
అంతర్జాల దైనందిని వాడవచ్చు .


2011/3/2 తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం <subtad...@gmail.com>

--
______________________________________________

* ప్రతిస్పందనలని పంపేటప్పుడు ఈ కింది భాగాన్ని తొలగించగలరు *
______________________________________________

మీరు "తెలుగుబ్లాగు" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
ఈ గుంపుకు జాబు పంపేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-...@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు, http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.
______________________________________________

బ్లాగుల సంకలినులు: koodali.org | jalleda.com | haaram.com | maalika.org | telugubloggers.com
బ్లాగు పాఠాలు: telugublogtutorial.blogspot.com | nerpu.com

Sri Raghava Kiran Mukku

unread,
Mar 2, 2011, 7:25:03 AM3/2/11
to telug...@googlegroups.com
క్రొత్తపదాల నిష్పాదనకూ వాడుకకూ మనవారే మనకు అవరోధమండీ. పదాల రూపకల్పనలో తలకొక చేయి వేసి ప్రతిపాదిత పదాలకు నగిషీలు చెక్కుతారనుకుంటే, మొత్తం నగిషీ పేరుతో శిలనే ఖండించేంత గొప్పవారు ఉన్నారు కనుకనే...

ఈ కాలంలో తెలుగుపదాల్ని కనిపెట్టి వాడడమనేది వీరేశలింగం గారి కాలంలో వితంతు పునర్వివాహం చేసినంత పని.
 
అని తాడేపల్లివారు అన్నది నూటికి నూఱు పాళ్లూ నిజం.

నమస్సులతో
రాఘవ

Madhusudan Pagadala

unread,
Mar 2, 2011, 6:18:19 PM3/2/11
to telug...@googlegroups.com
అంతర్జాల భాగం (Web Blog)

భాగం (Blog)
2011/3/1 svaram <emv...@gmail.com>

Ravi Chandra

unread,
Mar 3, 2011, 12:30:57 AM3/3/11
to telug...@googlegroups.com
తాడేపల్లి గారు పైన చెప్పినవన్నీ అక్షర సత్యాలు. మన బ్లాగుల్లోనే ఇందుకు వ్యతిరేకులున్నారు. ఇక బయటి ప్రపంచంలోకొస్తే ఎంతమంది హేళన చేస్తారో తెలియదు. నచ్చకపోతే కొత్త పదం ప్రతిపాదించడమో లేకపోతే ఊరకుండటమో చెయ్యరు వాళ్ళు. చేసే వాళ్ళను  "బ్లాగుల్లో తెలుగు పైత్యం" అంటూ వెటకార పూరిత వ్యాఖ్యలతో నీరుగారుస్తుంటారు. మొదట్లో నాకూ కొంచెం బాధ,  నిరుత్సాహం గలిగించినా జంధ్యాల గారు ఓ సినిమాలో అన్నట్లు "మాతృభాష వెగటైపోయిన ముదనష్టపు జాతి మనది" అని ఏదో అలా సర్దుకుపోతున్నాను.

srinivas srinivas

unread,
Mar 3, 2011, 1:00:04 AM3/3/11
to telug...@googlegroups.com
తెలుగు భాషను కించపరచడానికి, తెలుగు సంస్కృతిని అవమానించడానికి బయటివారెవరూ శ్రమపడాల్సిన పనే లేదు. మన ఏలికలు, మనవారనుకునే వ్యక్తులే అందుకు ముందుంటారు.

ఇక బ్లాగ్... విషయానికి వస్తే నాదొక విజ్ఞప్తి. అంతర్జాల దైనందిని, అంతర్జాల భాగం అనేవి వినడానికి బాగానే ఉన్నప్పటికీ నలుగురిలో మాట్లాడుకునేటప్పుడు ప్రస్తావించడానికి మరింత సులభంగా ఉండేలా చూస్తే బాగుంటుంది. web blogనే తీసుకుంటే ఆ పేరును  పూర్తిగా వాడకుండా సౌలభ్యం కోసం బ్లాగ్ అని మాత్రం అంటున్నారు. అలాగే ఇక్కడ కూడా దైనందిని లేదా భాగం అంటే సరిపోతుందా? ఏదో ఒకటి తెలుగులోనూ పదం ఉండాలని సరిపెట్టుకోవద్దు. అది వాడుకకు అనుగుణంగా ఉండేలా ప్రయత్నం జరగాలి. అందుచేత ఇక్కడ దాని లక్షణాన్ని బట్టి మరోలా పేరుంటే బాగుంటుందనిపిస్తున్నది. 

సాధారణంగా అత్యధిక శాతం బ్లాగుల్ని వ్యక్తులు వారి వారి అభిరుచుల మేరకు రూపొందించుకుని వ్యక్తిగత పర్యవేక్షణలోనే నడిపిస్తుంటారు కనుక వ్యక్తిజాలం అనో లేదా ఉపజాలం అనో వాడవచ్చేమో సభ్యులు పరిశీలించగలరు.

2011/3/3 Ravi Chandra <ravichandr...@gmail.com>
తాడేపల్లి గారు పైన చెప్పినవన్నీ అక్షర సత్యాలు. మన బ్లాగుల్లోనే ఇందుకు వ్యతిరేకులున్నారు. ఇక బయటి ప్రపంచంలోకొస్తే ఎంతమంది హేళన చేస్తారో తెలియదు. నచ్చకపోతే కొత్త పదం ప్రతిపాదించడమో లేకపోతే ఊరకుండటమో చెయ్యరు వాళ్ళు. చేసే వాళ్ళను  "బ్లాగుల్లో తెలుగు పైత్యం" అంటూ వెటకార పూరిత వ్యాఖ్యలతో నీరుగారుస్తుంటారు. మొదట్లో నాకూ కొంచెం బాధ,  నిరుత్సాహం గలిగించినా జంధ్యాల గారు ఓ సినిమాలో అన్నట్లు "మాతృభాష వెగటైపోయిన ముదనష్టపు జాతి మనది" అని ఏదో అలా సర్దుకుపోతున్నాను.

Sri Raghava Kiran Mukku

unread,
Mar 3, 2011, 2:14:03 AM3/3/11
to telug...@googlegroups.com
౧. బ్లాగు కేవలం వైయక్తికమే అవ్వవలసిన అవసరం లేదు కదండీ. ఒక గుంపు తమ ఆలోచనలు వ్రాసుకోవటానికీ పంచుకోవటానికీ బేరీజు వేసుకోవటానికీ కూడా బ్లాగులు వ్రాసుకోవచ్చు కదా.

౨. బ్లాగును అంతర్జాలదైనందిని అని అనలేము, అన్నిరోజులూ వ్రాయకపోవచ్చు కనుక, ఒకే రోజు బోలెడన్ని వ్రాయవచ్చు కూడా కనుక.

౩. బ్లాగును అంతర్జాలభాగం అనటం అస్పష్టంగా ఉంది. గుండె అనటం వేఱు, శరీరభాగం అనటం వేఱు కదా. ఉపజాలమన్నప్పుడు కూడ ఇలాంటి అభ్యంతరమే వస్తుంది.

౪. log ను వృత్తం లేదా ఇతివృత్తం అనీ, blog (weblog) ను జాలవృత్తి అనీ ఉస్మానియా విశ్వవిద్యాలయపు సంస్కృతపరిషత్తువారు వాడుతున్నారు. ఈ ప్రయోగం ఆమోదయోగ్యమే అని నాకు అనిపించింది.
Message has been deleted

svaram

unread,
Mar 3, 2011, 7:07:49 AM3/3/11
to తెలుగుబ్లాగు
దుర్గా ప్రసాద్ ఇలా వ్రాసారు

blog ku వూసుల గూడు అని , నా(మా)భావజాలం ఆంటే బాగుంటుందనిపించింది
పరిశీలించగలరు. కొత్త పదాలు రాసిన కొత్త భావాలూ చెప్పిన ఎప్పుడు
వ్యతిరేకత వుంటుంది .
అంతమాత్రం చేత ప్రయోగాలూ చేయకుండా ఎవరు వుండరు,ఉండలేరు,వుండమనటం
అవివేకం .
అలా అయితె ఇంత శబ్ద సృష్టి జరిగేది కాదు .ఇన్ని విభిన్నభావాలు
avishkarimpabadevi
కావు .అందులో నచ్చినవి వాడుకలోకి వస్తాయి లేనివి కనుమరుగు అవుతాయి
ప్రయోగం తోనే
సాహిత్యానికి జీవనం ,వృద్ధి కూడా.

ఎవరో ఏదో అన్నారని వీరేశలింగం ,గురజాడ ,శ్రీ శ్రీ ప్రయోగాలూ చేయకుండా
కూర్చో లేదు .
నిత్య చైతన్యానికి ప్రయోగం అవసరమే ఆ ప్రయోగం జాతి సంస్కృటికి ,భాష
ప్రయోజనానికి
తోడ్పడాలి మూలాల విచ్చేదనం చేయకుండా వుంటే మంచిది

గూడు లోని వారందికి శుభా కాంక్షలు

- దుర్గా ప్రసాద్ ( "gabbita prasad" <gabbita...@gmail.com> )

__________________________________________________________

తెలుగుబ్లాగు గుంపు డైజెస్ట్ మెయిలు సందేశాలతో కూడుకుని పై సందేశం
వచ్చింది కనుక సందేశాన్ని విడదీసి ప్రతిస్పందనగా ఇక్కడ పోస్టు చేసాను
__________________________________________________________

Sri Raghava Kiran Mukku

unread,
Mar 3, 2011, 7:05:38 AM3/3/11
to telug...@googlegroups.com
ఊసులగూడు బాగుంది.

భావజాలం... పరిధి వేఱండీ.

Amaranarayana B

unread,
Mar 3, 2011, 7:23:23 AM3/3/11
to telug...@googlegroups.com
ఔను ఊసులగూడు బాగానే వుంది .

2011/3/3 Sri Raghava Kiran Mukku <msrk...@gmail.com>
ఊసులగూడు బాగుంది.

భావజాలం... పరిధి వేఱండీ.

--

Madhusudan Pagadala

unread,
Mar 3, 2011, 5:33:35 PM3/3/11
to telug...@googlegroups.com

తెలుగు ఊసులగూళ్ళ సమావేశం.

నా ఊసులగూటిలో మార్పులు చేసాను.

ఊసులగూటిగాడు (Blogger)

 తెలుగు భాగాల సమావేశం.

నా భాగం లో మార్పులు చేసాను.

భాగదారుడు (Blogger)

Madhusudan Pagadala

unread,
Mar 3, 2011, 5:37:07 PM3/3/11
to telug...@googlegroups.com
తెలుగు ఊసులగూటిగాల్ల సమావేశం.
 

తెలుగు భాగదారుల సమావేశం.

Madhusudan Pagadala

unread,
Mar 3, 2011, 5:39:16 PM3/3/11
to telug...@googlegroups.com

తెలుగు ఊసులగూటిదారుల సమావేశం.

Madhusudan Pagadala

unread,
Mar 3, 2011, 5:40:53 PM3/3/11
to telug...@googlegroups.com
ఊసులగూటిదారుడు (Blogger)

Madhusudan Pagadala

unread,
Mar 3, 2011, 5:45:22 PM3/3/11
to telug...@googlegroups.com

 ౩. బ్లాగును అంతర్జాలభాగం అనటం అస్పష్టంగా ఉంది. గుండె అనటం వేఱు, శరీరభాగం అనటం వేఱు కదా. ఉపజాలమన్నప్పుడు కూడ ఇలాంటి అభ్యంతరమే వస్తుంది.

 పన్ను - శరీరభాగం - Tooth

పన్ను - సుంకం - Tax

 భాగం -  Share

భాగం - blog

rajachandra

unread,
Mar 3, 2011, 8:02:40 AM3/3/11
to తెలుగుబ్లాగు



తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం garu miru cheppindi nijame telugu padala
vadukalo chala bedala kanabadatam velle...... evaru vaduka bhasa
vallade pramanikam krinda tisukuni migilani vaduka bhasanu takkuuga
chudatam vastavame. nootana padala vadukalo kuda manavallu
madikattukuni kurchantaru tappa munduku raru ...

anduke manadi prachinabhasa ayinappatiki ......... manam inka
prachinam lone unte ela?

srinivas srinivas

unread,
Mar 3, 2011, 1:06:59 PM3/3/11
to telug...@googlegroups.com
ఊసులగూడు... నాకూ నచ్చింది.

2011/3/3 Amaranarayana B <ama...@gmail.com>

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం

unread,
Mar 4, 2011, 12:04:17 AM3/4/11
to తెలుగుబ్లాగు
రాజాచంద్రగారూ !

మీరు వ్రాసినదాని సారాంశం నాకు సరిగా అర్థం కాలేదు. అందుచేత ఇక్కడ నేను
వ్రాస్తున్నది మీ వేగుకు సరైన ప్రత్యుత్తరం కాగలదో లేదో నాకు తెలియదు.

కానీ ఒక విషయం. వాడుకభాష, కొత్త తెలుగుపదాల కల్పనా - ఈ రెండూ పరస్పరం
పొసగని అన్యోన్య విరుద్ధ పరిభావనలు (cocepts). ఎందుకంటే వాడుకలో
కొత్తపదాలు ఉండవు. కొత్తపదాలలో (అవి కొత్తపదాలు గనుక) వాడుకభాష ఉండదు.
అయితే కొత్తపదాల్ని కనిపెట్టి వాటిని అందఱూ తఱచుగా వాడుతూ ఉంటే అవే
కాలక్రమంలో వాడుకభాష అవుతాయి. ఆంగ్లానికి ఈరోజున దీటుగా సమాధానమిస్తున్న
తెలుగు పదాలన్నీ మొదట్నుంచీ మన భాషలో ఉన్నవి కావు. ఈ పదాలు (ఉదాహరణకు
తెలుగు పత్రికల భాష) ఈ అర్థంలో మన పూర్వీకులకు తెలియవు. ఇవి (ఈ రోజు
మనకర్థవుతున్న తెలుగు పదాలు) తెలుగు మీడియమ్ యొక్క స్వర్ణయుగం (Golden
age of Telugu medium 1950 - 1995) లో విస్తృతంగా జనంలోకి ప్రచారంలోకి
వచ్చినటువంటివి. ఇప్పుడు తెలుగు మీడియమ్ అదృశ్యమైపోవడం వల్ల ఎల్లెడలా
ఆంగ్లమే రాజ్యం చేయడం మొదలుపెట్టినాక మన పదాలే మనకు విదేశీయమై పోయాయి.
కాబట్టి భాష బతకాలన్నా, పెంపొందాలన్నా దాన్ని రెండో భాషాగానో, మూడో
భాషగానో చదివితే లాభం లేదనీ, దానికొక బోధనామాధ్యమం (Medium of
instruction) గా విద్యావ్యవస్థలో ఒక పక్కా స్థానం ఉండాలనీ ఈ అనుభవం
సూచిస్తున్నది.

తెలుగు చెత్త

unread,
Mar 3, 2011, 11:47:29 PM3/3/11
to telug...@googlegroups.com, తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం
అయ్యా,
ఎందఱో తెలుగు ప్రేమికులు అందరికి వందనములు.
 
వాక్యంలో మూడుపాళ్ళు ఇంగ్లీషు వాడుకుంటు
ఎక్కడో ఉర్దూపదం దొర్లగానే హిహీ అని
ఇగిలించెడి ఈ ప్రియ వాదులను ఏమనవలెనో తోచదు.
‘రోడ్డని’ పలికేవారికి సడకంటె ఎవగింపు
ఆఫీసని అఘొరిస్తూ కచ్చేరంటే కటువు
సీరియలంటే తెలుగు సిల్సిల అంటే ఉరుదు
సాల్టు, షుగర్, టిఫిన్ అంటేనే తెనుగు
నమక్, షర్కర్, నాష్తంటే కొంప మునుగు
టీ అంటే తేట తెనుగు చా అంటే ‘తౌరక్యము’
పొయినడంటే చావు తోలడమంటే పశువు దొబ్బడమంటే బూతు
కడప అంటే ఊరి పేరు త్రోవంటె తప్పు తప్పు దోవంటేనే దారి. 

అని ముద్దుగా సుతిమెత్తగా రాసుకున్నాడు అసలు సిసలైన తెలుగు ప్రేమికుడు స్వర్గీయ కాళోజీ. (ఎలాగూ ఏడిట్‌చేస్తారుగా - అందుకే కొద్దిగా మార్చిరాసాను.)

ఆయన మరియు దాశరథి లాంటి ఉద్దండులు తెలుగు పరాయి భాషా పదాలతో మలినమైపోకూడదని ఎదిరించే ప్రయత్నం చేసారు. వాళ్ళు సాధించింది అతి తక్కువే అని చెప్పొచ్చు - కానీ అసలు సిసలైన తెలుగును కాపాడే ప్రయత్నంలో సఫలీకృతులయ్యారని మాత్రం ఒప్పుకోవచ్చు.
 
అయితే మన అలోచనా పద్దతులు మరియు ఆంగ్లభాషా పై అతిప్రేమ పెత్తనం తగ్గే వరకు...
మనభాష గతి ఇంతే తెలుగు బ్రతుకింతే
విలువున్న తెనుగుకూ సుఖము లేదంతే... :) 
 
శుభమస్తు !!!
 
ఇట్లు,
తె - తెలుగు ప్రేమికుడు.
2011/3/2 తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం <subtad...@gmail.com>

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం

unread,
Mar 4, 2011, 3:19:27 AM3/4/11
to తెలుగుబ్లాగు
ఆర్యా ! మీరు "తెలుగు ప్రేమికుడు" అని సంతకం చేశారు. చాలా సంతోషం.

కానీ మీ జీమెయిల్ వాడుకరి పేరుని "తెలుగుచెత్త" అని ఎందుకు ఎంచుకున్నారో
తెలుసుకోవచ్చునా ? అది నేరుగా మిమ్మల్నే రిఫర్ చేస్తుంది కదా అయినా మీ
చెవులకు వికృతంగా ధ్వనించడంలేదా ?

అది మీకెలా ఉన్నా, చదవడానికి మాకు చాలా బాధగా ఉంది. తెలుగులో చెత్త తప్ప
ఏమీ లేదంటారా ? లేక తెలుగే చెత్తంటారా ?

తెలుగు అనే పవిత్రమైన జాతినామం పక్కన గౌరవనీయమైన శబ్దాలు మాత్రమే
వాడతామని అందఱం ప్రతిజ్ఞ చేద్దాం.

svaram

unread,
Mar 4, 2011, 8:22:47 AM3/4/11
to తెలుగుబ్లాగు
రాజాచంద్ర ఇలా వ్రాసారు :

miru cheppindi nijame ....... manavallu kotta padalanu
kalpana atu Unchite mamolu padalanu kuda vyavaharika
saililonchi tolagistu English padala kosam vedakadam
start chestunnaru

____________________________________________________

ఇలా ఆంగ్ల అక్షరాలతో తెలుగు వాక్యాలని వ్రాసినప్పుడు ఒక క్రమపద్ధతి
పాటిస్తేనే ఇతరులకి అర్ధం చేసుకోవడం సులువుగా ఉంటుంది. ఉదా. కి
RTS ( Rice Transliteration Standard ) అనే పద్ధతిని
ప్రయత్నించవచ్చును

వివరాలు ఇక్కడ :
http://rksanka.tripod.com/telugu/rts.html

ఇలా ఒక క్రమ పద్ధతి అలవాటు అయితే తెలుగు అక్షరాలను టైపు
చేయడమూ సులభమే. తెలుగు వాక్యాల సముదాయాన్ని తెలుగు
అక్షరాలలో చదివడానికి ఇతరులు శ్రమపడనక్కరలేదు కూడా !!


తెలుగు చెత్త

unread,
Mar 4, 2011, 11:53:51 AM3/4/11
to telug...@googlegroups.com, తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం
కదా - అలాగే టిఫిను, గ్లాసు, బ్లాగు అనేసి తెలుగీకరించామని జబ్బలు చరుస్తుంటే నాబోటి వారికి కూడా వికృతంగా ద్వనిస్తుంది మరి.
 
అయ్యయ్యో... పరిహాసమా లేక చోద్యమా? ఇలాంటి చర్చా విషయాలను బద్రంగా దాచుకోవడానికి నేను జంకు/చెత్త దస్తూరిలను ఉపయోగించుకుంటాను - అది నాకు సులభం.
 
నా ఇ-మెయిల్ telug...@gmail.com ను ముద్దుగా అచ్చతెనుగులో తర్జుమా చేశాను అంతే...!  పోనీ తెలుగు జంకు అని మార్చుకుంటే మీబోటి వారి దృష్టిలో నా ఇమేజు పెరుగుతుందా చెప్పండి? పెరిగినా పెరగవచ్చు - అది ఆంగ్లమాయే - మనకు చాలా ప్రేమ కదా.  లేకపొతే తెలుగు కచ్రా అని మార్చుకుంటే అది ఉర్దూమాయే - మనకు చాలా ఏవగింపు కదా.     
 
మీకు బాధ కలిగించాలని నా ఉద్దేశం కాదు... క్షమించాలి. ఆంగ్ల పదాల చేరికతో అచ్చమైన తెలుగు భాష మలినమౌతున్నందులకు నాకు కలిగిన బాధ ముందర... మీ బాధ తక్కువే. ఇలా పరాయి భాషాపదాలతో తెలుగు చెత్తగానే అగుపిస్తుంది మరి... నా మట్టుకే సుమా!
 
ఇట్లు,
తె - తెలుగు ప్రేమికుడు (శ్రీరా)
 
2011/3/4 తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం <subtad...@gmail.com>

--

svaram

unread,
Mar 4, 2011, 12:15:35 PM3/4/11
to తెలుగుబ్లాగు
^ మనం ఉపయోగించే పదాలు ఎదుటి వ్యక్తికి సులువుగా అర్ధమవడం ముఖ్యం

పదాలని అన్నిటినీ తెలుగులోకి మార్చేస్తున్నామని ఇక్కడ ఎవరూ ఎగిరిపడటం
లేదనుకుంటా :) బాధలని కొలవడానికి, పోల్చడానికి - కొలమానాలూ లేవిక్కడ

మీకు అంతగా అచ్చమైన తెలుగుపదాల వాడుక పట్ల ఆసక్తి ఉన్నట్లయితే
దయచేసి కింది సైట్లో (చేరి) మీవంతు ప్రయత్నం మీరు చేయగలరు
http://groups.google.com/group/telugupadam/


అలాగే కింది సైట్లో వీలున్న తెలుగు పదాలని, అర్ధాలని చేర్చగలరు
http://te.wiktionary.org/wiki/

krishnaveni chari

unread,
Mar 4, 2011, 12:32:22 PM3/4/11
to telug...@googlegroups.com

అదంతా సరే కానీ “ తెలుగు చెత్త” అన్న పేరేమిటి? మీరు తెలుగు ప్రేమికులవుతే తెలుగు చెత్త కాక ఇంకేదైనా పేరు పెట్టుకోవచ్చు కదా! మీకింకేమైనా ఇతర పర్యాయపదాలు నచ్చలేదా?



2011/3/4 svaram <emv...@gmail.com>

--
______________________________________________

* ప్రతిస్పందనలని పంపేటప్పుడు ఈ కింది భాగాన్ని తొలగించగలరు *
______________________________________________

మీరు "తెలుగుబ్లాగు" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
ఈ గుంపుకు జాబు పంపేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-...@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు, http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.
______________________________________________

బ్లాగుల సంకలినులు: koodali.org | jalleda.com | haaram.com | maalika.org | telugubloggers.com
బ్లాగు పాఠాలు: telugublogtutorial.blogspot.com | nerpu.com



--
krishna

svaram

unread,
Mar 4, 2011, 12:37:17 PM3/4/11
to తెలుగుబ్లాగు
^ ఇదివరకు "తెలింగం" అని వ్రాసేవారు.
ఇటీవల (బహుశా ఈరోజే) ఎందుకో ఇలా మార్చివేసారు !!

krishnaveni chari

unread,
Mar 4, 2011, 12:41:28 PM3/4/11
to telug...@googlegroups.com

అది నాకు తెలియదు. క్షమించాలి.


2011/3/4 svaram <emv...@gmail.com>
^ ఇదివరకు "తెలింగం" అని వ్రాసేవారు.
ఇటీవల (బహుశా ఈరోజే) ఎందుకో ఇలా మార్చివేసారు !!
--
______________________________________________

* ప్రతిస్పందనలని పంపేటప్పుడు ఈ కింది భాగాన్ని తొలగించగలరు *
______________________________________________

మీరు "తెలుగుబ్లాగు" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
ఈ గుంపుకు జాబు పంపేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-...@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు, http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.
______________________________________________

బ్లాగుల సంకలినులు: koodali.org | jalleda.com | haaram.com | maalika.org | telugubloggers.com
బ్లాగు పాఠాలు: telugublogtutorial.blogspot.com | nerpu.com



--
krishna

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం

unread,
Mar 4, 2011, 12:50:20 PM3/4/11
to తెలుగుబ్లాగు
అయ్యా ! చెత్తగారూ !

మేము సీరియస్ గా విషయమూ, సాధక బాధకాలూ చర్చిస్తున్నాము. మీరేమో ఒక
పద్ధతీ, పాడు లేకుండా చేతికొచ్చిన రాతలు రాస్తున్నారు. మీలో ఒక
చర్చాకారుడికి ఉండాల్సిన హుందాతనమూ, సీరియస్‌నెస్సూ గాంభీర్యమూ
లోపించినట్లు అగపడుతున్నది. ఇలా చర్చావిషయాన్ని కలుషితం చేయడానికి మీకు
సంకోచం లేకపోవచ్చు గానీ ఇలా కలుషితమైన చర్చాహారాన్ని కొనసాగించడమంటే మాకు
మాత్రం చాలా సిగ్గుగా ఉంది.

గుంపు మాడరేటర్లు దయచేసి తప్పుదారి పట్టిన ఈ చర్చాహారాన్ని ఇక్కడితో
ఆపేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాను.

krishnaveni chari

unread,
Mar 4, 2011, 12:57:33 PM3/4/11
to telug...@googlegroups.com

జగద్వలయ చిట్టా లేక జాబితా సరిగ్గా ఉండదా?



2011/3/4 తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం <subtad...@gmail.com>
అయ్యా ! చెత్తగారూ !

--
______________________________________________

* ప్రతిస్పందనలని పంపేటప్పుడు ఈ కింది భాగాన్ని తొలగించగలరు *
______________________________________________

మీరు "తెలుగుబ్లాగు" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
ఈ గుంపుకు జాబు పంపేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-...@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు, http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.
______________________________________________

బ్లాగుల సంకలినులు: koodali.org | jalleda.com | haaram.com | maalika.org | telugubloggers.com
బ్లాగు పాఠాలు: telugublogtutorial.blogspot.com | nerpu.com



--
krishna

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం

unread,
Mar 4, 2011, 1:07:16 PM3/4/11
to తెలుగుబ్లాగు
మనసులోని మాట తెలిపేది కనుక తెలుపకము అందామా ?

svaram

unread,
Mar 4, 2011, 2:33:28 PM3/4/11
to తెలుగుబ్లాగు
ఆంగ్లంలోకి అనేక ఇతర భాషల పదాలు కలిసిపోతున్నాయి.
ఇదివరలో పెద్దగా ఉండిన ఎన్నో ఆంగ్ల పదాలు చిన్నవిగా అవుతున్నాయి.

తెలుగులో కూడా మనకి సరిగ్గా తెలియకుండానే ఇతర భాషల పదాలనీ
కలిపి వాడేస్తూ ఉంటాము. ఆంగ్ల పదజాలం కలుస్తూనే ఉంటుంది..
అలాగే సంస్కృతం, ఉర్దూ పదాలు విరివిగానూ , పార్శీ వంటి ఇతర
భాషల పదాలు కొన్నీ దాదాపు తెలుగు పదాలుగానే వాడుకలో ఉన్నాయి.

మన దైనందిన జీవనంలో వాడుక పదాలుగా ఉంటున్న ఆంగ్ల పదాలకి
సరైన తెలుగు పదాలని కనుక్కుని వీటినే వీలున్నంతవరకు ఉపయోగించి
వాడుకలోకి తేవాలనే ప్రయత్నం చాలా కాలంగా జరుగుతోంది.

ఆంగ్లంలో ఉన్న పదాన్ని / పద బంధాన్ని తెలుగులోకి మార్చినప్పుడు
సులువుగా అర్ధం అయ్యేలా ఉండాలనేది ఒక ఆలోచన. అలాగే అలా
తెలుగులోకి మార్చిన తరువాత మరల ఆంగ్లంలోకి / మూల భాషలోకి
కొత్త పదాలతో మారిస్తే మునుపు ఉన్న అర్ధమే రావాలనేది ఒక పద్ధతి.

ఏ భాషలో అయినా ఒక భావాన్ని రకరకాలుగా చెప్పగలిగే వీలు ఉంటుంది.
పదజాలం విరివిగా తెలిసి ఉండి , వ్యాకరణం కూడా తెలిసినవారు చెప్పిన
మాటలని - సాధారణ మాటలతో మరో రకంగా చెప్పే పద్ధతి ఉంటుంది.

మరో భాషలోని పదజాలాన్ని తెలుగు పదాలుగా మార్చే పద్ధతిలో ఎంతో
పరిశ్రమ ఉంటుంది. ఇలాగే ఎందుకు మార్చుకోవాలి - అలా ఎందుకు
కూడదు - అనేటటువంటి మధనమూ ఉంటుంది. ఫలానాదాని కంటే
మరోలా అనడం మెరుగైనదేమో ప్రయత్నిద్దామనే పరిశోధన ఉంటుంది..

ఇంతకొచ్చీ నా మనవి ఇది :

వాడుక తెలుగుపదాలని కనుగొనడం కొన్నిసార్లు సులువుగా ఉంటుంది.
మరి కొన్నిసార్లు చాలా పరిశ్రమించవలసి ఉంటుంది. ఇలా ఎందుకని
అంటున్నారు - అలా ఎందుకని అనడం లేదనే చర్చకి ఈ తెలుగుబ్లాగు
గుంపు వేదిక అనువైనదీ కాదు.

ఇలాంటి విషయాలపై ఆసక్తి ఉన్నవారు దయచేసి కింది వేదికలో పాల్గొనగలరు
http://groups.google.com/group/telugupadam/

____________________________________________________

* ఈ విషయాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను. అభ్యంతరం ఉన్నవారు నేరుగా
నాకు మెయిలు పంపగలరు - లేదా ఇతర నిర్వాహకులని సంప్రదించగలరు..

అందరికీ ధన్యవాదములు

Reply all
Reply to author
Forward
This conversation is locked
You cannot reply and perform actions on locked conversations.
0 new messages