నా వద్ద ప్రింటరు, స్కానరు రెండూ విడి విడిగా ఉన్నాయి. ప్రింటరు తరుచుగా వాడక పోతే పాడై పోతుందని ఎవరో అన్నారు. అలాగే స్కానరు కూడా నిత్యం వాడకుండా ఉంటే పాడయే ప్రమాదం ఉందా?
--
మీరు "తెలుగుబ్లాగు" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
ఈ గుంపుకు జాబు పంపేందుకు, telug...@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-...@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని చర్చాహారాలు మరియు ఎంపికల కొరకు, http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.
బ్లాగుల సంకలినులు: koodali.org | jalleda.com | haaram.com
బ్లాగు పాఠాలు: telugublogtutorial.blogspot.com | nerpu.com
మీ ప్రింటర్ ని ప్రతి రోజు మీరు వాడాలి లేక పోతే అది పడు అయి పోతుంది అందుకని మీరు మీ ప్రింటర్ ని ఏదో ఒక ప్రింట్ తీసుకోండి
నా వద్ద ప్రింటరు, స్కానరు రెండూ విడి విడిగా ఉన్నాయి. ప్రింటరు తరుచుగా వాడక పోతే పాడై పోతుందని ఎవరో అన్నారు. అలాగే స్కానరు కూడా నిత్యం వాడకుండా ఉంటే పాడయే ప్రమాదం ఉందా?
--
మీది Ink Jet ముద్రణయంత్రం అయితే, దాన్ని మీరు చాలాకాలంపాటు (దాదాపు
నెలరోజులకంటే ఎక్కువ) వాడకపోతే, ink catridge మూతి దగ్గర సిరా
గడ్డకడుతుంది. ఆ తరువాతెప్పుడైనా (అంటే రెండుమూడు నెలల తరువాత) మీరు
ఏదైనా ముద్రించాలనుకున్నప్పుడు సిరా బయటకురాదు. ఇలాంటప్పుడు మీకు రెండు
ప్రత్యామ్నాయాలున్నాయి.
ఒకటి - Ink catridge ను ప్రింటర్ నుంచి బయటకు తీసి, దాని మూతిని
గోరువెచ్చని నీటిలో అర నిముషం పాటు ముంచి తీయండి. గడ్డకట్టిన సిరా కరిగి
అడ్డుతొలగిపోతుంది. మూతిని మెత్తని బట్టతో తుడిచి, Ink catridge మీద
తడిలేకుండా చేసి మళ్లీ ప్రింటర్లో పెట్టండి. పని చేస్తుంది. (ఇది
స్వానుభవం)
రెండో - ఒకోసారి (అంటే మరీ చాలా నెలలపాటు ముద్రణయంత్రాన్ని
ఉపయోగించనప్పుడు) మూతిదగ్గరే కాకుండా లోపల కూడా సిరా గడ్డకట్టి ఆరిపోయే
అవకాశం వుంది. ఇలాంటప్పుడు కొత్త Ink Catridge కొని వెయ్యండి. లేదా, పాత
catridge లోనే కొత్త సిరా నిపించుకోండి. (ఇదీ స్వానుభవమే)
సంవత్సరాల తరబడి మీరు మీ ముద్రణయంత్రాన్ని వాడపోయినా, Ink Catridgeలో
సిరా గడ్డకట్టడం జరుగుతుందే తప్ప, మొత్తంగా ముద్రణాయంత్రమే చెడిపోవడం
జరగదు (ఇదీ స్వీయానుభవమే). నేనైతే ఏమి చేస్తానంటే, వారానికీ పదిరోజులకూ
ఏదో ఒక్క పేజీ అవసరం లేకున్నాసరే ముద్రిస్తూవుంటాను. దీనివల్ల సిరా
గడ్డకట్టే అవకాశం వుండదు. పరకాయింపుయంత్రమూ అంతే. వాడకపోతే చెడిపోదు.
--
రానారె