ఈ-మెయిలు ద్వారా ఈ వారం వ్యాసాలు అవసరమా?

6 views
Skip to first unread message

Pradeep Makineni

unread,
Mar 26, 2008, 4:00:38 AM3/26/08
to తెవికీ గుంపు
అందరికీ నమస్కారం,

తెలుగు వికీపీడియా మొదటి పేజీలో ప్రతీ వారం ఒక కొత్త వ్యాసాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇలా ప్రదర్శించిన వ్యాసాలలో చాలా వాటిని కాసుబాబుగారే ఎంపిక చేసారు.  వ్యాసాన్ని ఎంపిక చేస్తున్నప్పుడు ఆయన పరిగనిస్తున్న ముఖ్యాంశాలు వ్యాసంలో మంచి సమాచార పుష్టికలిగుండటం, రెండవది వ్యాసంలో కనీసం ఒక్క బొమ్మైనా ఉండటం, చివరిగా ఆ వ్యాసం వికీపీడియా అంచనాల ప్రకారం మంచివ్యాసం అని అనిపించుకోవటానికి ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉండాలి.

ఇక్కడ వ్యాసాన్ని ఈ వారం వ్యాసంగా ప్రదర్శించేందుకై ఎంపిక చేయటానికి మూడవ అంశం చాలా ముఖ్యమైనదని నేనూ కాసుబాబుగారూ ఒక అంగీకారంలో ఉన్నాము.  అలా బోలెడంత సమాచారం ఉండి కూడా నాణ్యత లేని వ్యాసాలు తెలుగు వికీపీడియాలో చాలా ఉన్నాయి, వాటిని మెరుగు పరచడం ఒక ఉద్దేశమైతే, అలాంటి వ్యాసాలు ఉన్నాయి చెప్పటం ఇంకో ఉద్దేశం. వికీ అంనాల ప్రకారం వ్యాసంలో నాణ్యత లేదు అని చెప్పటానికిగల ముఖ్య కారణాలు; 1. వ్యాసాలను రాస్తున్నప్పుడు అందులో సమాచారాన్ని ఏఏ మోలాల (వెబ్‌సైటు లింకులు, పుస్తకాల పేజీ నంబర్లు, వగైరా) నుండి సేకరించారో తెలుపకపోవడం,  2. వ్యక్తులగురించి వ్యాసాలను రాస్తున్నప్పుడు, వారిని పొగుడుతూనో తిడుతూనో (లేదా అలాంటి అర్థం వచ్చేటట్లు) వ్యాసాలు తయారవుతూ ఉంటాయి, ఇలాంటి వాటిని అందరికీ ఆమోదయోగ్యంగా మార్చాల్సిన అవసరం ఉంది  3. వ్యాసాలను ఎదురుగా ఉన్న వ్యక్తితో మాట్లాడుతున్నట్లుగా(second person narration) రాయడం; వికీపీడియాలో వ్యాసాలను third person narrativeలో రాయాలి.  4. వ్యాసానికి పెట్టిన పేరు ప్రకారం అందులో సమాచారం అసమగ్రంగా ఉండటం.

ఇప్పుడు అసలు విషయంలోకి వస్తే, పైన తెలిపిన ఆలోచనల ప్రకారం ఎంపిక చేసిన ఈ వారం వ్యాసాలను ఈ-మెయిలు ద్వారా పంపినీ చేయడం మీకు సమంజసమో కాదో మీ మీ అభిప్రాయాలను పంచుకోగలరు.

--
మాకినేని ప్రదీపు

jyothi valaboju

unread,
Mar 26, 2008, 4:04:13 AM3/26/08
to telug...@googlegroups.com

చాలా అవసరం, ఉపయోగకరం కూడా.

Kiran Kumar Chava

unread,
Mar 26, 2008, 4:02:08 AM3/26/08
to telug...@googlegroups.com
చాలా అవసరం!

2008/3/26 Pradeep Makineni <makineni...@gmail.com>:
naa sOdi

Veeven (వీవెన్)

unread,
Mar 26, 2008, 4:18:54 AM3/26/08
to telug...@googlegroups.com
2008/3/26 Pradeep Makineni <makineni...@gmail.com>:
ఇప్పుడు అసలు విషయంలోకి వస్తే, పైన తెలిపిన ఆలోచనల ప్రకారం ఎంపిక చేసిన ఈ వారం వ్యాసాలను ఈ-మెయిలు ద్వారా పంపినీ చేయడం మీకు సమంజసమో కాదో మీ మీ అభిప్రాయాలను పంచుకోగలరు.

సమంజసమే. పంపడంతో బాటు ఓ గమనిక కూడా పెడదాం: ఈ వ్యాసాన్ని మరింత మెరగుపరచడానికి తోడ్పడండి. అని
 

--
http://veeven.com/
Are you on XIMMY? http://partners.ximmy.com/pages/130.php

Sunil Gurrapu

unread,
Mar 26, 2008, 12:06:31 PM3/26/08
to telug...@googlegroups.com
సమంజసమే...... మేము ఆ వ్యాసాలు చదివి సరిదిద్దేందుకు తగిన కృషి చేస్తాము

--
Sunil Gurrapu
Apt 34, 50 - Munroe Place
Regina - S4S 4P7, Canada
email: sunil_...@yahoo.com
Mobile: +1 306 924 5877

arjuna rao chavala

unread,
Mar 26, 2008, 8:47:12 PM3/26/08
to telug...@googlegroups.com
నేను తెలుగువికీలో కొత్తగా సభ్యడైనప్పుడు,  ఆ వ్యాసాలలో అచ్చు తప్పులు దిద్దేవాడిని. అలాంటిది ఉపయోగమే కదా.

అర్జున

2008/3/26 Sunil Gurrapu <sunil....@gmail.com>:

visaakhateeraana

unread,
Mar 28, 2008, 12:42:36 AM3/28/08
to తెలుగువికీ
చర్చ బాగుంది.తెవికీలో కొన్ని వ్యాసాలు మంచి సమాచారం తో ఉన్నప్పటికీ
చదివించే గుణం కాస్త తక్కువగానే ఉందనాలి.అర్రే, ఈ వ్యాసం ఎవరన్నా రీరైట్
చేస్తే బాగుండే అనిపించిన సందర్భాలు చాలా ఉన్నాయని చెప్పక తప్పదు.నాకు
సమయం చాలక(బద్దకం అని మీరు అనుకున్నా తప్పు లేదు) ఆ పని చేయలేక
పోతున్నాను.మరి కొందరు భాష,శైలి విషయాల్లో ఇంకొంత అభ్యాసం,మరి కాస్త
నియంత్రణ పాటిస్తే ఇంకా సారవంతమైన ఆర్టికల్స్ అందించే
అవకాశాలున్నాయి.ఒక్కసారి రాసిన వెంటనే పబ్లిష్ చెయ్యకుండా ఒకటికి నాలుగు
సార్లు చదివి,మార్పులు,చేర్పులూ చేసేందుకు వీలుందేమో చూసి రెండు రోజులాగి
మరీ ప్రచురించేందుకు ఎప్పుడూ ప్రయత్నించాలి.అలా చేయటం వల్ల మరిన్ని కొత్త
అంశాలు,పాత తప్పులూ తెలియటం సరిదిద్దుకునేందుకు వీలవు తుంది.

రాజేంద్ర

On 27 Mar, 05:47, "arjuna rao chavala" <arjunar...@googlemail.com>
wrote:
> నేను తెలుగువికీలో కొత్తగా సభ్యడైనప్పుడు, ఆ వ్యాసాలలో అచ్చు తప్పులు
> దిద్దేవాడిని. అలాంటిది ఉపయోగమే కదా.
>
> అర్జున
>
> 2008/3/26 Sunil Gurrapu <sunil.gura...@gmail.com>:
>
>
>
>
>
> > సమంజసమే...... మేము ఆ వ్యాసాలు చదివి సరిదిద్దేందుకు తగిన కృషి చేస్తాము
>
> > --
> > Sunil Gurrapu
> > Apt 34, 50 - Munroe Place
> > Regina - S4S 4P7, Canada
> > email: sunil_gura...@yahoo.com
Reply all
Reply to author
Forward
0 new messages