సంస్కృతంలో "ళ" ఉందా?

322 views
Skip to first unread message

sundar

unread,
Mar 25, 2011, 7:47:13 AM3/25/11
to తెలుగుపదం
సంస్కృతంలో "ళ" ఉందా లేదా?

అచంగ

unread,
Mar 25, 2011, 8:09:28 AM3/25/11
to తెలుగుపదం
సుందర్ గారూ,

సంస్కృతములో ఇప్పటివరకు దొరికిన ఏ వ్రాతప్రతిలోనూ 'ళ' శబ్దం కనిపించలేదు.
సంస్కృతములో ఉన్నది కేవలం 'ల' శబ్దం మాత్రమే.

'ళ', 'ழ்'(ళ, ర కలిపి చదవాలి, 'ళ్ర' కాదు.) అనేవి ద్రావిడభాష సంపద.
తెలుగులో సరళ 'ళ' రూపం క్రీ.శ ౬౦౦ నాటికే అంతరించింది. కారణాలు అలభ్యం.

భవదీయుడు,
అచంగ, ప్రేస్టన్, ఇంగ్లాండ్.

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం

unread,
Mar 25, 2011, 1:35:38 PM3/25/11
to తెలుగుపదం
ఉంది. మొదట్నుంచీ ఉంది. అది ద్రావిడభాషా ప్రభావం కానేకాదు. ఎందుకంటే
ళకారానికి అర్థభేదకత ఉంది. అంటే ళకారరూపాలు వాస్తవానికి లకార రూపాలకంటే
వేఱైన అర్థాన్ని బోధిస్తాయి. మొదటి వేదమైన ఋగ్వేదంలో తొట్టతొలి మంత్రమైన

(ऒम्) अग्निमीळॆ पुरॊहितं
हॊतारं रत्नधातमम्
अस्य यज्ञस्य सुक्रतुम्....

(ఓమ్) అగ్నిమీళే పురోహితమ్
హోతారం రత్నధాతమమ్
అస్య యజ్ఞస్య సుక్రతుమ్...

అనే శ్లోకంలో నాలుగో అక్షరం ళకారమే. ఇలా వేదాల్లో ళకారం అనేకసార్లు
ఉచ్చరించబడుతుంది.

ఏదో ఒక దశలో ఉత్తర భారతీయులు దాని ఉచ్చారణ మర్చిపోయి, పలకలేక తమ
లిపిలోంచి దాన్ని ఏకమొత్తంగా బహిష్కరించారు. ళకారంతో కూడుకొని ఉన్న అన్ని
పదాల్నీ తమ సౌలభ్యార్థం లకార పదాలుగా మార్చేశారు. మఱికొన్నింటినేమో డకార
పదాలుగా మార్చారు. అలా మార్చేసి ముద్రించిన నాగరలిపిగ్రంథాల్ని మనవాళ్ళు
తెలుగులిపిలోకి మార్చుకునేటప్పుడు ఆ పాఠమే కరెక్ట్ అనుకొని వారిచ్చిన
లకార/ డకార రూపాల్నే తెలుగులోకి యథాతథంగా లిప్యంతరణ చేసి
ముద్రిస్తున్నారు.అందుకనే మీకు ఈ సందేహం కలగడానికి అవకాశం ఏర్పడింది.
హిందీని వ్రాయడానికి ఉపయోగించే నాగరలిపిలో ళ ఉన్నట్లు చెప్పరు. కానీ
మరాఠి వ్రాయడానికి ఉపయోగించే నాగరలిపిలో ళకారాన్ని బోధిస్తారు. దాన్ని ळ
అని వ్రాస్తారు. నిజానికి ళకారం లేకుండా మరాఠీ వాక్యాలు వ్రాయలేం.
మరాఠీభాష ప్రస్తుతం పంచద్రావిడ దేశాల్లో మాట్లాడబడుతున్నప్పటికీ దాని
మూలభాష మట్టుకు ఉత్తరాదికి చెందిన సంస్కృతమే కనుక మూలభాషకు చెందిన
ళకారోచ్చారణనే అది కొనసాగిస్తున్నదనీ, ఉత్తరాదిన మాత్రం పారశీక ప్రభావంతో
ళకారం లుప్తమయిందనీ భావించాల్సి ఉంటుంది.

ఔత్తరాహులు ళకారంతో కూడుకొని ఉన్న అన్ని ప్రాచీన సంస్కృత పదాల్నీ లకార
పదాలుగా మార్చేశారు కనుకనే అవీ, ఇవీ ఒకే పదంలా ధ్వనిస్తూండి ఆ పదాలకు
ఈరోజున నానార్థాలు చెప్పాల్సి వస్తోంది. ళకారంతో వ్రాసిన/ పలికిన
రోజుల్లో ఈ నానార్థాలు లేవు.

ఉదాహరణకు :-

వ్యాళ: - ఏనుగు
వ్యాలః - పాము

కాల: - సమయం
కాళః - నలుపు

ఇలాంటివి ఇంకొన్ని ఉంటాయని నేను ఊహిస్తున్నాను.

శూలః - ఈటె
శూళః - నొప్పి

కోలః - అడవిపంది
కోళమ్ - తెప్ప మొ||

అచంగ

unread,
Mar 25, 2011, 2:29:58 PM3/25/11
to తెలుగుపదం
ఇప్పటివరకు పూర్తిగా నిర్థారణ కానప్పటికీ మరాఠి, ఒడియా, బెంగాలి, అస్సామి
భాషలు ద్రావిడజన్యమై సంస్కృత ప్రభావానికిలోనైనాయని వాదనలున్నాయి.

ళ శబ్దం మరాఠిలో
బహువచన అత్యం 'గాల్' బెంగాలిలో ('గళ్' అనేది అత్యంత సమీప పదం ద్రావిడం
నుంచి) కొన్ని బలపరిచే ఉదాహరణలు.

నాకు ఒక సందేహం " సుబ్రహణ్యం గారు ఉదహరించిన వేద శ్లోకం రాత ప్రతి
దొరికుతుందా అని"

నేను నా పరిమితికిలోబడి చాలా వెతికాను అంతర్జాలం అంతా, నాకెక్కడా 'ళ'
శబ్దం సంస్కృతములో అగుపించలేదు.
ఈ లంకెను పరిశీలించగలరు. http://te.wikipedia.org/wiki/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81
http://poddu.net/?q=p/190
దేవనాగరి లిపి బ్రాహ్మీ లిపి నుంచే ఉద్భవించింది. కానీ మౌర్యకాలపు నాటి
బ్రాహ్మీ లిపిలో 'ళ' శబ్దం లభించలేదు. తెలుగు మూల లిపి అయిన భట్టిప్రోలు
లిపి నుంచి మాత్రమే 'ళ' శబ్దం మనకు అగుపిస్తుంది.

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం

unread,
Mar 26, 2011, 12:59:28 AM3/26/11
to తెలుగుపదం
ఔత్తరాహులు ళకారాన్ని తమ లిపిలోంచి తొలగించి వందలాది సంవత్సరాలవుతోందంటే
అది ఇప్పుడు అంతర్జాలంలో ఎలా కనిపిస్తుంది ? అంతర్జాలం ఎప్పటిది ?
ఇటీవలిదే కదా ? అందులోకి ఎక్కించిన పత్రాలన్నీ ఇటీవలివే కదా ? ఇప్పటి
స్థితిని ఒకప్పటి స్థితిగా భావించరాదు. ఇది క్ఎకువమంది చేసే పొఱపాటు.

మీరు చెప్పిన గాల్ బహువచనం కాదు. అది ఒక ప్రత్యయం.

వేదానికి ఉచ్చారణే ప్రమాణం. విని పలికి నేర్చుకునేది వేదం. అందుకే దానికి
శ్రుతి (వినేది) ఆమ్నాయం (పలికేది) అని పేర్లు. దానికి
లిఖితరూపాలున్నాయి. కానీ వాటిని ప్రమాణంగా తీసుకోరు.

జాలంలో వేదం లభించదు. ముద్రిత ప్రతులు ఉన్నాయి.

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం

unread,
Mar 26, 2011, 1:14:18 AM3/26/11
to తెలుగుపదం
మళ్ళీ చూశాను. వేదం మహాఋషి మహేష్ యోగిగారి వెబ్‌సైటులో లభిస్తోంది. ఈ
క్రిందిలంకె మీద నొక్కి, క్రిందికి scroll చేసి, PDF Files అనే శీర్షిక
కింద Mandala 1 అనే పత్రాన్ని తెఱవండి :

http://is1.mum.edu/vedicreserve/rk_veda.htm

ANANDASWARUP GADDE

unread,
Mar 26, 2011, 2:25:11 AM3/26/11
to telug...@googlegroups.com
2011/3/26 తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం <subtad...@gmail.com>:
Pl. check here for a version in Telugu script and translation:
http://www.vedamu.org/Veda.aspx

sundar

unread,
Mar 26, 2011, 7:53:47 AM3/26/11
to తెలుగుపదం
నాకు సంస్కృతంలో ళ ఉందా లేదా అని అనుమానం ఎందుకు వచ్చింది అంటే:
౧. చాలా సంస్కృత పుస్తకాల్లో (దేవనాగరి లిపిలో ఉన్నవి, తెలుగు లిపితో
సంస్కృతం నేర్పేవి) ళ లేదు (అక్షర మాలలో)
౨. ప్రఖ్యాత అగ్నిమీళే పురోహితమ్ అగ్నిమీడే పురోహితమ్ గా పుస్తకాల్లో
చూశాను

మరి కొన్ని విషయాలు:
౧. మరొక లంకె: http://www.sanskritweb.net/rigveda/rv01-001.pdf
౧. ౧. ౧ (అగ్నిమీళే..... ) ౧. ౬. ౫ కూడా చూడండి (వీళు.....)
౨. బాల వ్యాకరణం (చిన్నయసూరి) మొదటి సూత్రం ప్రకారం సంస్కృతంలో ళ ఉంది,
రెండవ సూత్రం ప్రకారం ప్రాకృతంలో ళ ఉంది.
౩. అగ్నిమీళే(డే) పురోహితమ్
యఙ్ఞ్యస్య దేవమృత్విజమ్


హోతారం రత్నధాతమమ్

తి.తి.దే. వారి "ఆర్ష విఙ్ఞాన సర్వస్వము, మొదటి సంపుటి" ప్రస్తావన
పుటల్లో అగ్నిమీళే పురోహితమ్ అని, తర్వాత పుటల్లో అగ్నిమీడే పురోహితమ్
"డ ళ యోర్ న భేదః" అని పాణిని సూత్రం ఉందిట. దాని ప్రకారమా పై తేడా?

ఏది ఏమైనా, నాకు అనిపించేది అతి త్వరలో సంస్కృతంలో అంతటా ళ ఎగిరిపోతుంది
అని. .
[ క్షమించాలి ఈ పిడకల వేటని: పై తి.తి.దే. పుస్తకం రచయితల పేర్లల్లో శ్రీ
ఎమ్. వి. రామనాథ ఘనాపాఠి, శ్రీ వి. సుబ్రహ్మణ్య ఘనపాఠి (దీర్ఘం లేదు) అని
ఉన్నాయి ఏది సరి అయినది? పక్క పక్క పుటల్లొనే ఈ తేడా ఉంటే ఏమనుకోవాలి?
కంపోజర్ల కంపా?]

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం

unread,
Mar 26, 2011, 11:02:16 AM3/26/11
to తెలుగుపదం
ప్రాకృతానికి సంస్కృతమే మూలం. కనుక ప్రాకృతంలోని ళకారానిక్కూడా సంస్కృత
ళకారమే మూలం అని నేను భావిస్తున్నాను. ఒక అక్షరాన్ని హిందీవాళ్ళలా కొన్ని
కోట్లమంది కొన్నివందల సంవత్సరాల పాటు వ్రాతలోంచి పరిహరిస్తే అనంతర కాలంలో
ఆ ఆక్షరాన్ని వాడేవాళ్ళంతా ఏదో పొఱపాటు చేస్తున్నట్లు చూడబడడం, అసలా
అక్షరం ఒరిజినల్ గా ఉందా లేదా ? అనే అనుమానాలకు లోను కావడం సహజం.
సాధారణంగా గతానికి అక్షరాలు సాక్ష్యం. ఆ అక్షరాలనే తీసేస్తే ఆ అక్షరాలకే
సాక్ష్యమేది ? అదొక మూలచ్ఛేద కృత్యం. ళకారం విషయంలో జఱిగింది అదే.
ళకారానికి సంబంధించిన అన్ని సాక్ష్యాల్నీ ఉత్తర భారతీయులు నిర్మూలించారు,
తాము పలకలేక ! అందుచేత పూర్వం సంస్కృతంలో ళకారం ఎక్కడెక్కడ ఉండేదనేది
తెలుసుకోవడానికి ఈరోజు మనకు దక్షిణ భారత గ్రంథాలే దిక్కయ్యాయి. ఆ మాట
చెబితే "అది ద్రావిడ ప్రభావం కావచ్చు" అని వాదిస్తూ మళ్ళీ సాక్ష్యాల
నిర్మూలనకు ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఒక ఆటంకం ఏమొచ్చిపడిందంటే -
ఉత్తర భారతీయులు దేశంలో మెజారిటీ. మనమేమో మైనారిటీ. అందుచేత వాళ్ళ
తప్పుడు పాఠాలే పరమప్రమాణంగా భ్రమ కల్పిస్తున్నాయి. పరమప్రమాణంగా చెలామణి
అవుతున్నాయి. ఆ భ్రమకీ, చెలామణికీ మనం కూడా లోనవుతున్నాం.

ఒక అక్షరాన్ని పలకలేనివాళ్ళు పలకలేకపోతున్నామని నిజాయితీగా ఒప్పుకోకుండా,
అలా ఒప్పుకుని తమను తాము సరిదిద్దుకోకుండా ఆ అక్షరాన్నే ఏకమొత్తంగా
భాషలోంచి నిర్మూలించి పారేయడం వల్ల తదనంతర కాలంలో ఉప్పతిల్లే తిప్పలివి.
ఇప్పుడు మన రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో కూడా జనాలు ళకారం పలకలేరు. ఱేపు
వాళ్ళు కూడా ళకార పదాలన్నింటినీ లకార పదాలతో ప్రతిక్షేపిస్తారనుకోండి.
అప్పుడు కూడా ఇదే ప్రశ్న తలెత్తుతుంది. "తెలుగులో ళకారం మొదట్నుంచీ
ఉందా ? లేదా ?" అని ! "ఉంది" అని సమాధానం చెప్పి మనం కోస్తా, రాయలసీమలకు
చెందిన వ్రాతల్ని సాక్ష్యంగా చూపిస్తామనుకోండి. అప్పుడు కూడా ఇదే వాదన
చేయడానికి అవకాశం ఉంది. తెలుగులో ఒరిజినల్ గా ళకారం లేదనీ, కోస్తా-
రాయలసీమ వ్రాతల్లో కనిపిస్తున్నది బహుశా ద్రావిడ ప్రభావం కావచ్చుననీ !

ళడయో రభేదః మొదలైన సూత్రాలు ప్రాకృతానికీ సంస్కృతానికీ మధ్య ఏర్పడిన
అగాధాన్ని పూడ్చడం కోసం ఒకనాటి ప్రాకృత వ్యాకర్తలు నిబంధించినవి. వాటి
అన్వేయత (applicability) ప్రాకృతానికే. వాటిని సంస్కృత పదాలకు చెందిన
అక్షరాల మధ్యలో అన్వయించకూడదు. అలా అన్వయిస్తే అది అపభాష్యం అవుతుంది.
ఉదాహరణకు ళడయో రభేదః లాగానే ళలయోరభేదః అనే సూత్రం కూడా ఉంది. దాని
ప్రకారం జలమ్, జడమ్ రెండూ ఒకటే అవుతాయా ? కావు గదా ?

అగ్నిమీళే పురోహితమ్ అనే మంత్రానికి ళకార రహితమైన పాఠాంతరాల్ని
నేనింతవఱకు చూడలేదు. అది ళకారంగా మార్చబడిన డకారం కాదు. ముందునుంచీ
ఉన్నదే. మాధవాచార్యుడి కాలం నుంచీ దయానందసరస్వతిగారి కాలం దాకా అందఱూ
అగ్నిమీళే.... అనే పాఠాన్నే ప్రమాణంగా స్వీకరించారు. ఈళ (పొగడు) అనే
ధాతువు ఈడ గా మారడం పాణిని కాలానికి జఱిగింది. పాణినికి ముందున్న
సంస్కృతపాఠాల్ని పాణిని సూత్రాలకు అనుగుణంగా దిద్దడం చాలా దోషం.
వేదపాఠాల్ని అలా దిద్దడమైతే క్షమార్హం కాని మహాపాపం కూడా, అది
టి.టి.డి.వారు చేసినా, మఱొకఱు చేసినా ! అలా చేసేవాళ్ళు నరకానికి పోతారు.
అలాగే ప్రాకృత వ్యాకరణ సూత్రాల్ని, పాణిని వ్యాకరణ సూత్రాల్నీ వేదాలకు
అన్వయించడం కూడా చాలా చాలా తప్పు.

ఏతావతా సంస్కృతంలో ళకారం ఉన్నది. తప్పనిసరిగా ఉన్నది. ఉత్తర భారతీయులు
లకార పదాలని చెబుతున్నటువంటి చాలా పదాలకు రెండు-మూడర్థాలు ఉండడం ఇందుకు
నిదర్శనం. అంటే వాటిల్లో ఒక అర్థానికి ఒకప్పుడు ళకార పదరూపమే ఉండేదనీ, ఆ
ళకారాన్ని తొలగించి దాన్ని లకారంతో ప్రతిక్షేపించి, ఆ రూపాన్ని
నిర్మూలించడం చేత అలాంటివి లకార రూపాలతో విలీనమై నానార్థాల్ని
సంతరించుకున్నాయనీ అర్థం. ఆ స్వరూపాల్ని దిగ్దర్శనప్రాయంగా నేను పైన
ప్రదర్శించాను. అంత సీరియస్ విషయం గుఱించి ఇక్కడి చర్చాకారులెవ్వఱూ
దృష్టి సారించకపోవడం విచారకరం.

ఉదాహరణకు :-

కలా - చంద్రుడిలోని భాగం
కళా - Art

వేలా - సముద్రపు చెలియలికట్ట
వేళా - సమయం

ఆలిః - వంతెన
ఆళిః - వరుస మొ||

ANANDASWARUP GADDE

unread,
Mar 26, 2011, 6:47:26 PM3/26/11
to telug...@googlegroups.com
2011/3/27 తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం <subtad...@gmail.com>:

> ఏతావతా సంస్కృతంలో ళకారం ఉన్నది. తప్పనిసరిగా ఉన్నది. ఉత్తర భారతీయులు
> లకార పదాలని చెబుతున్నటువంటి చాలా పదాలకు రెండు-మూడర్థాలు ఉండడం ఇందుకు
> నిదర్శనం.
ఉచ్చారణ ముఖ్యమైన భాషలో ఇలాంటివి పొయినవంతే ఆచ్చరయంగా ఉంది. వెదికితే ఇది
కనపడింది. మీరు చెప్పుతున్నది దీనినిగురించేనా?
From http://www.worldwizzy.com/learn/index.php/Sanskrit (under
Principal Differences)

"Vedic Sanskrit had a retroflex lateral approximant (/ɭ/) (ळ) as well
as its aspirated counterpart /ɭʰ/ (ळ्ह), which were lost in Classical
Sanskrit, to be replaced with the corresponding plosives /ɖ/ (ड) and
/ɖʰ/ (ढ). (Varies by region; vedic pronunciations are still in common
use in some regions, e.g. southern India, including Maharashtra.)
The pronunciations of syllabic /ɻˌ/ (ऋ), /lˌ/ (लृ) and their long
counterparts no longer retained their pure pronunciations, but had
started to be pronounced as short and long /ɻi/ (रि) and /li/ (ल्रि).
(Varies by region; vedic pronunciations are still in common use in
some regions, e.g. southern India, including Maharashtra)"

అచంగ

unread,
Mar 27, 2011, 4:54:40 AM3/27/11
to తెలుగుపదం
సుబ్రహ్మణ్యం గారూ, స్వరూప్ గారూ,

ఇక్కడ మీరు ఉదహరించిన అన్ని లంకెలు (ఆధారాలు) అన్నీ పరిశీలించాను.

సుబ్రహ్మణ్యంగారూ, " ప్రాకృతం/పాళీ/పైశాచీ ప్రాకృతం" ఇవన్నీ కేవలం
సంస్కృత జన్యాలు కావు.. ఈ లంకెను పరిశీలించగలరు.
http://te.wikipedia.org/wiki/%E0%B0%A4%E0%B0%BF%E0%B0%B0%E0%B1%81%E0%B0%AE%E0%B0%B2_%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%9A%E0%B0%82%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0

ప్రాకృత మూలధాతువులకు, సంస్కృత మూలధాతువులకూ సంబంధం లేదని గాధాసప్తశతి
వివరిస్తోంది. అలాగే తమిళులు తమదిగా, తమ గొప్పగా చెప్పుకునే సంగ సాహిత్యం
అంతా వర్ణించేది తెలుగు రాజులు, తెలుగు ప్రజల ఆచార వ్యవహారాల గురించే.
అలాగే దీనిలో వాడిన భాషలో అనేకానేక తెలుగు మూలపదాల ఉనికి దీన్ని ఋజువు
చేస్తోంది. దీని గురించిన సత్యాలు భద్రిరాజుగారు ఆధారాలతో నిరూపించారు.

ఏతావాతా నేను చెప్పొచ్చేదేమిటంటే తెలుగు-సంస్కృత బంధం అనేది ఆలుమగల బంధమే
కానీ రక్త సంబంధం కాదు. అలాగే ఆధునిక సంస్కృత లిపిలో 'ళ' శబ్దానికి చోటు
లేదు. అది ప్రస్తుతానికి తెలుగు, కన్నడ, తుళు, తమిళ, మలయాళీ మరియు
మరాఠీయుల సొంతం.

ANANDASWARUP GADDE

unread,
Mar 27, 2011, 9:00:32 PM3/27/11
to telug...@googlegroups.com
Achanga garu,
My only acquintance with these topics is trying unsuccessfully to read
Wendy Doniger's translation of Rig Veda. According to the latest
reports I see, this seem to be fraught with difficulties:
http://www.utexas.edu/cola/centers/lrc/eieol/vedol-0-X.html
From what I can gather from googling,
http://en.wikipedia.org/wiki/Vedic_Sanskrit
http://en.wikipedia.org/wiki/Retroflex_lateral_approximant
I think that Tadepalli garu is correct but mine is google knowledge
and not real research or knowledge.

Regards,
Swarup
2011/3/27 అచంగ <mail2a...@gmail.com>:

> --
> ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.
>
>  * ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
>  * ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
>  * మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
> గుంపును చూడండి
>

phani deep prayaga

unread,
Mar 28, 2011, 2:08:46 AM3/28/11
to తెలుగుపదం
>అలాగే ఆధునిక సంస్కృత లిపిలో 'ళ' శబ్దానికి చోటు
>లేదు. అది ప్రస్తుతానికి తెలుగు, కన్నడ, తుళు, తమిళ, మలయాళీ మరియు
>మరాఠీయుల సొంతం.

ఒడి*యా మఱియు గుజరాతీ లిపుల లో కూడా ళ ఉంది.
పంజాబీ లిపి లో ప్రత్యేక అక్షరం లేదు కాని పంజాబీలు ళ పలుకుతారు

అచంగ

unread,
Mar 28, 2011, 3:07:25 AM3/28/11
to తెలుగుపదం
ఫణిదీప్ గారూ,

కింద లంకెలను పరిశీలించగలరు

గుజరాతి: http://utopianvision.co.uk/gujarati/alphabet/consonants.php?char=l0
ఒడియా: http://en.wikipedia.org/wiki/Oriya_script

గుజరాతి, ఒడియా వారు పలికే 'ళ;కార శబ్దం 'డ'కార శబ్దంతో కలుషితభరితం.

ఆధునిక సంస్కృతములో 'ళ' శబ్దానికి చోటులేదు.

పంజాబి భాషతో నాకేమాత్రం పరిచయములేదు.

phani deep prayaga

unread,
Mar 28, 2011, 3:45:35 PM3/28/11
to తెలుగుపదం
> గుజరాతి, ఒడియా వారు పలికే 'ళ;కార శబ్దం 'డ'కార శబ్దంతో కలుషితభరితం.
> ఆధునిక సంస్కృతములో 'ళ' శబ్దానికి చోటులేదు.
మీరు చెప్పదలచుకున్నది నాకు పూర్తి గా అర్థం కాలేదు.
References:
1)http://www.youtube.com/watch?v=JRIat9kHb7c - ఒడి*శా రాష్ట్ర గీతం
వందే ఉత్కళ జనని (కొందరు స్పష్టంగా తెలుగు లో ళ కి మల్లే పలుకుతున్నరు.)
2)http://www.youtube.com/watch?v=-jf6pwtPqCsfeature=related సుప్రసిద్ధ
మిలే సుర్
4:07-4:15 స్పష్టంగా మళే సూర్ జో తారో మారో బనే ఆప్ణో సూర్ నిరాళో
దగ్గర వినగలరు (గుజరాతీ ళ ).
ప్రశ్నలు:
1) 'ళ అని వ్రాయడం లో మీ ఉద్దేశ్యం తెలుగు ళ ఒడి*యా ళ వేఱు అనా ?
2) నా తరం వారు నూటికి 90 మంది ళ ని ల లాగ పలుకుతున్నరు దీనికి అర్థం
తెలుగు ళ ల తో కలుషితమైంది అనా, అధునిక (21వ శతాబ్దపు)తెలుగు లో ళ లేదు
అనా?
3) ఆధునిక సంస్కృతం అంటే ? ఎప్పటిది?

తేఱుగడ--1(Gist)::
కొందరు పలకలేనంత మాత్రన ఆ శబ్దమే లేదనకూడదు.

> పంజాబి భాషతో నాకేమాత్రం పరిచయములేదు.

Reference2:
http://www.youtube.com/watch?v=4pjl6IOW-jg
ఇది ఒక పిచ్చి పాట అయినందున కనికరించండి , ఇందులో తేను కాళా చచ్‌మా అని
వస్తుంది (నీ నల్లటి కళ్ళ జోడు)
అక్కడ ళ వినచ్చు (తాడేపల్లి గారు సంస్కృతం లో కాళః గుఱించి చెప్పరు;
హిందీ వాళ్ళు కాలా అని పలికినా పంజాబీ వాళ్ళు కాళా అనే పలుకుతారు.)/*
ప్రస్తుతం మాకు సెలవలు ఒక వారం ఆగితే మేకు పంజబి, ఒడి*యా వారు పలికిన
దస్తరాలు .wav కవిలె లో ఎక్కింౘగలను. */
తేఱుగడ--2:
పంజాబి మీద ద్రావిడ ప్రభావం (నేను విన) లేదు (ఉంటే తెలిసిన వాళ్ళు
తెలుపగలరు) కాబట్టి ఆ శబ్దం సంస్కృతం నుండి వచ్చి ఉండాలి.

lha luptam gu~rinchi modaleTTaam kaabaTTi migataa moordhanyaala
sangatii cooddaam :
1)బెంగాలి, ఒహొ*మీ(అస్సామీ) భాషలు:
ఇ)----> బెంగాలీ లో మూర్ధన్యాలు(Retroflexes ట ఠ డ ఢ ణ ష ళ) లు
దంతమూలీయోత్తరాలు( Post-Alveolar) లేదా దంతమూలీయలు(Alveolar) ఇక్కడ ట
ఎంగ్లిష్ టి కి మల్లే పలక బడుతుంది ;
-----> ణ(మూర్ధన్యం)/న(దంత్యం) లు అబేధకాలు, అవి రెండూ దంతమూలియ
'నా గ పలకబడతాయి.
Reference: http://people.w3.org/rishida/scripts/bengali/ ;see tta
murdho na ; confirmed by native speaker today
గమనిక: అ)బెంగాలీ లో మూర్ధన్యాల శాతమే చాలా తక్కువ
ఆ) వికీపీడియా లో ట వర్గలు మూర్ధన్యాలు గానే చూపబడ్డయి
అంటే, బెంగలీ phonology అనే వ్యాసం చూడండి అక్కడ వివరణ ఇచ్చారు. మధుర
వసంతాన్ని కాసేపు ఆస్వాదించి ముందుకెళదాం http://www.youtube.com/watch?v=8kCsAK1L2n4
(సాహిత్యం: మొధురొ బొషొంతొ ఏషె ఛె మొధురొ మిలనొ ఘొటతె అమదేర్ ..... ట ని
గమనించంది అధి ఖచితంగా మూర్ధన్యం కాదు.)
ఈ) ఒహొ*మీ(అస్సామీ) ఐతే మూర్ధ్యన్య-దంత్య భేదకత పూర్తి గా
కోల్పోయింది, అన్నీ దంతమూలీయలు గా పలకబడుతాయి.(ట-త డ-ద ణ-న లకి ఇక్కడ
తేడా ఉండదు)
Reference:http://en.wikipedia.org/wiki/Assamese_language
ఈ భాషలు తమ పరిణామక్రమ లో మూర్ధన్యలన్నీ కొల్పొతున్నప్పుడు ; మరో
మూర్ధన్యమైన ళ లుప్తం అయ్యే అవకాశాలు మెండు.

2) హిందీ::
->మనకి తెలుసు హిందీ ఒక సాతత్య మాండలికం(Dialect-Continuum,
http://en.wikipedia.org/wiki/Dialect_continuum ) అని
--->కాబట్టి దాన్ని మధ్య, తూర్పు, పస్చిమ హిందీల కలయిక అనుకుంటే . మధ్య,
మఱియూ తూర్పు హిందీ ల లో ళ కారం ఉండదు, తరాల పాటు ముస్లిం ఏలుబడి లొ పోయి
ఉండచ్చు, ( ఇక్కద ఉచ్చరణ లో, శ ష ల భేదం పూర్తి గాను, న-ణ ల భేదం చాల
మట్టుకూ పొయింది. ట పలుకుతారు బానే, మళ్ళీ ఠ ని దంతమూలీయోత్తరంగ
పలుకుతారు, తియ తీయని నొప్పిని వినండి http://www.youtube.com/watch?v=yz0sYTgmxVAfeature=related
డ మళ్ళీ ప్రత్యేకం పదాది డ మూర్ధన్యమే పదం మధ్యలో కాని చివరిన కాని చాలా
డ లు డ* లు ఐపొతాయి flaps as opposed to plosives అనునాసికం తర్వాతవి,
మఱి కొన్ని తప్పితే, వీటికన్న కొంచం ఎక్కువ నష్ట పోయింది ళ, మొత్తానికి
మాయం అయిపోయింది).
---> రాజపుత్రుల స్థానం ఐన రాజస్థాన్ లో మాట్లాడే పశ్చిమ హిందీ లో ళ కారం
ఉంది మళ్ళీ ( http://en.wikipedia.org/wiki/Rajasthani_language
)
3) సింహళ భాష లోనూ ళ కారం ఉంది.

పై విషయాలు ఒక చోటికి చేరిస్తే :
--> హిందీ, బెంగాలీ వంటి వాటిలో తప్ప అన్ని సంస్కృత జన్యాల లోనూ ళ కారం
ఇప్పటికీ ఉంది, ఇవి కాక వేదం లో ఉన్న నిరూపణ అతి పెద్ద నిరూపణ ఇప్పటికే
పెద్దలు చూపించారు.
--> కాబట్టి ళ కారం సంస్కృతం లో కూడ ఉండి తీరాలి.

తెలుగు కపిత్వాన్ని క్షమించి సాంకేతిక(technical ) పదాలు తప్పు గా
అనువదిస్తే సరి దిద్ద గలరు

నెనరులు,
ఫణి దీప్ ప్రయాగ.

phani deep prayaga

unread,
Mar 28, 2011, 3:48:43 PM3/28/11
to తెలుగుపదం
>>>తాడేపల్లి గారు సంస్కృతం లో కాళః గుఱించి చెప్పరు;

దీనిని
తాడేపల్లి గారు సంస్కృతం లో కాళః గుఱించి చెప్పారు
గా ౘదువుకోవలసింది గా మనవి

ANANDASWARUP GADDE

unread,
Mar 29, 2011, 2:08:12 AM3/29/11
to telug...@googlegroups.com
ఫణిదీప్ గారూ,
ఇవి మీరు చెప్పుతాంటే కొంచెము అర్థమవ్వుతున్నటుంది. ఎప్పుడైనా వీలైతే ఒక
వ్యాసం రాయనండి.

2011/3/29 phani deep prayaga <phanidee...@gmail.com>:

ramanarao muddu

unread,
Apr 12, 2011, 11:20:24 AM4/12/11
to telug...@googlegroups.com
సాంస్క్రిట్ లో ల ఏ గాని ళ్ అక్షరం లేదని నా మిత్రులు కీ. సే తూమాటి దోణప్ప ,మాజీ వైసే చాన్సేల్లెర్ నా తో ఒక్క సారి చెప్పారు .ద్రావిడ భాషల్లోనే వుందట. 
2011/3/25 అచంగ <mail2a...@gmail.com>

Sri Raghava Kiran Mukku

unread,
Apr 12, 2011, 12:55:24 PM4/12/11
to telug...@googlegroups.com
అయ్యా,

పతంజలి మహర్షి వ్రాసిన సంస్కృత వ్యాకరణ మహాభాష్యంలో ళ కూడా కనబడుతుంది. ౬౮వ కంచి పరమాచార్యులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరసరస్వతీస్వాములవారు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు.

ఇంతకు మించి నేను చెప్పనవసరం లేదు.

నమస్సులతో
రాఘవ

kv ramana

unread,
Apr 13, 2011, 9:09:43 PM4/13/11
to telug...@googlegroups.com
సంస్కృతంలో బ-వలకు, ల-ళకు భెదం లేదు అని చాలామంది పండితులు చెప్పారు.
ఉచ్చారణ సాధించలేని ఉత్తరాదివాళ్ళు అందునా హిందీవాళ్ళు ముందుకు తెచ్చిన
సూత్రాన్ని మన పెద్దలు అనుసరించారు. పూర్వం సంస్కృత విద్యాభ్యాస మంతా
కాశీలో జరిగేది. అక్కడివాళ్ళు ళ పలకలేరు; కొంతమంది వ కూడా పలకలేరు. ఈ
గందరగోళంలో పడి బృందావనాన్ని వృందావనంగా మార్చినవాళ్ళున్నారు.
సంస్కృతంలో ళ లేదనడంలో ఔచిత్యం కనబడదు. సభ్యులు తగిన రుజువులు
చూపించారు -అవి మన సందేహాలను దూరం చేస్తాయి. వారికి నెనర్లు.
- kv ramana

ANANDASWARUP GADDE

unread,
Apr 14, 2011, 12:35:38 AM4/14/11
to telug...@googlegroups.com
2011/4/14 kv ramana <kvje...@gmail.com>:

> సంస్కృతంలో బ-వలకు, ల-ళకు భెదం లేదు అని చాలామంది పండితులు చెప్పారు.
> ఉచ్చారణ సాధించలేని ఉత్తరాదివాళ్ళు అందునా హిందీవాళ్ళు ముందుకు తెచ్చిన
> సూత్రాన్ని మన పెద్దలు అనుసరించారు. పూర్వం సంస్కృత విద్యాభ్యాస మంతా
> కాశీలో జరిగేది. అక్కడివాళ్ళు ళ పలకలేరు;

ఇది అంతకుముందే జరిగిందేమో. తాడేపల్లి గారు ఇంతకుముందు అన్నారు


"ఈళ (పొగడు) అనే
ధాతువు ఈడ గా మారడం పాణిని కాలానికి జఱిగింది. పాణినికి ముందున్న
సంస్కృతపాఠాల్ని పాణిని సూత్రాలకు అనుగుణంగా దిద్దడం చాలా దోషం.
వేదపాఠాల్ని అలా దిద్దడమైతే క్షమార్హం కాని మహాపాపం కూడా, అది
టి.టి.డి.వారు చేసినా, మఱొకఱు చేసినా ! అలా చేసేవాళ్ళు నరకానికి పోతారు.
అలాగే ప్రాకృత వ్యాకరణ సూత్రాల్ని, పాణిని వ్యాకరణ సూత్రాల్నీ వేదాలకు
అన్వయించడం కూడా చాలా చాలా తప్పు."

From
http://en.wikipedia.org/wiki/Vedic_Sanskrit
it appears that there are differences between 'vedic sanskrit' and
'classical sanskrit'. It seems to me that ళ was in vedic sanskrit and
it is not clear when it disppeared from usage in some regions but it
seems to have remained in south Indian languages and marathi,
including in the recitation of vedas.
This is just my impression.

kv ramana

unread,
Apr 14, 2011, 6:33:56 AM4/14/11
to telug...@googlegroups.com
టీటీడీ చేసిన పనిలో తప్పుండొచ్చు లేదా దోష మనిపించొచ్చు. అందుకు నరకానికి
పోతారో దోషం చుట్టుకుంటుందో అనడం హుందాగా లేదు. ఏదో ఉక్రోషంతో
అన్నట్ట్టు తోస్తుంది. తాడేపల్లివారి లెక్కన పాణిని కూడా పాతకానికి
ఒడిగట్టినవాడే. నరకం వంటి భాషను వాడకుండా తప్పా ఒప్పా చెప్పండి -
బావుంటుంది.

Sri Raghava Kiran Mukku

unread,
Apr 14, 2011, 7:54:53 AM4/14/11
to telug...@googlegroups.com
రమణగారూ,

తాడేపల్లివారు అన్నదానిలో ఉక్రోషపూరితమైన మాటలు ఉన్నట్టుగా నాకు తోచటం లేదు. ఉదాహరణకు, ఈ రెండు వాక్యాలూ గమనించండి. నిప్పును ముట్టుకోవటం తప్పు. నిప్పును ముట్టుకుంటే కాలుతుంది. రెంటిలో ఏది వాడటం సబబంటారు?

ANANDASWARUP GADDE

unread,
Apr 14, 2011, 8:06:44 AM4/14/11
to telug...@googlegroups.com
2011/4/14 kv ramana <kvje...@gmail.com>:

> టీటీడీ చేసిన పనిలో తప్పుండొచ్చు లేదా దోష మనిపించొచ్చు. అందుకు నరకానికి
> పోతారో దోషం  చుట్టుకుంటుందో అనడం హుందాగా లేదు. ఏదో ఉక్రోషంతో
> అన్నట్ట్టు తోస్తుంది. తాడేపల్లివారి లెక్కన పాణిని కూడా పాతకానికి
> ఒడిగట్టినవాడే. నరకం వంటి భాషను వాడకుండా తప్పా ఒప్పా చెప్పండి -
> బావుంటుంది.
నాకు అర్థమైనంతవరకు: వేదాలలో ఉచ్చారణ ముఖ్యం. ఏదో అథారిటీ
(authority)లేకుండా మార్పులు వచ్చి ఉండవేమో. ఇది పాణిని నుంచో ఆయనను
వ్యాఖ్యానించినవాళ్ళ నుంచో వచ్చివుండవచ్చు. అదీగాక పూర్వం పండితులు
అన్నిప్రాంతాలకు తిరుగుతూ ఉండేవారు. కాబట్టి ఉచ్చారణ వాళ్ళకి కష్టమని
అనుకోను. కాని చాలామంది తెలిసివాళ్ళు 'ళ' లేదంటున్నారు. అందుకని ఎప్పుడో
మార్పులు వచ్చినవేమోనని అనుమానము వచ్చింది. వ్యాకరణ శాస్త్రాలు కాకుండా,
కావ్యాలలో చూస్తే ఎప్పుడినుంచీ మార్పులు వచ్చినవో తెలుస్తుందేమో.
This is only a guess. for a previous discussion, see
https://groups.google.com/group/telugu-unicode/tree/browse_frm/month/2004-12/07ee320450920feb?rnum=291&start=250&scoring=d&hl=pt
The comment 13 gives a link to Vedic alphabet:
"--- seshavadapalli <seshavadapalli@y...> wrote:

> Vedic alphabet has "La".

You're right. For the complete description
of Vedic Sanskrit alphabet as well as accents,
please visit
http://tdil.mit.gov.in/prop_uni/Vedic.pdf

Regards! - J K Mohana Rao "

Pulikonda

unread,
Apr 14, 2011, 10:07:14 AM4/14/11
to telug...@googlegroups.com
అవును ళ ఉందా లేదా అనే తర్జన భర్జనల గురించి చాలా రోజులనుండి దీనిలో చూస్తున్నాను. అందరికీ తెలిసిన ఇంత విషయాన్ని గురించి జోక్యం చేసుకోవడం ఎందుకని ఊరుకున్నాను. ళ ద్రావిడ భాషలదే సంస్కృతంలో లేదు. దీనిపైన ఇకనైనా టపాలు రావని ఆశిద్దాం.

సుబ్బాచారి

2011/4/12 ramanarao muddu <ramanar...@gmail.com>



--
Prof. P.  Subbachary
Department of Folklore & Tribal Studies
Dean, School of Human and Social Sciences
Dean, Academic Affairs (Principal)
Dravidian University
Kuppam 517425
A.P

ANANDASWARUP GADDE

unread,
Apr 14, 2011, 5:27:22 PM4/14/11
to telug...@googlegroups.com
2011/4/15 Pulikonda <psubb...@gmail.com>:

> అవును ళ ఉందా లేదా అనే తర్జన భర్జనల గురించి చాలా రోజులనుండి దీనిలో
> చూస్తున్నాను. అందరికీ తెలిసిన ఇంత విషయాన్ని గురించి జోక్యం చేసుకోవడం ఎందుకని
> ఊరుకున్నాను. ళ ద్రావిడ భాషలదే సంస్కృతంలో లేదు. దీనిపైన ఇకనైనా టపాలు రావని
> ఆశిద్దాం.
>
> సుబ్బాచారి
Can you please give some references. May be it depends on which
Sanskrit. The concensus seems to be that there is ళ in vedic sanskrit
but disappeared later in classical sanskrit. From the thread I
mentioned before:
"--- In racchaba...@yahoogroups.com, "J. K. Mohana Rao" <jkmrao@y...>
wrote:

> In Sanskrit, there is no La, period.
> Regards! - mOhana

Correct.

Vedic alphabet has "La".

----
Regards,
V.S.T.Sayee. "

ANANDASWARUP GADDE

unread,
Apr 14, 2011, 9:01:34 PM4/14/11
to telug...@googlegroups.com
2011/4/15 Pulikonda <psubb...@gmail.com>:

> అవును ళ ఉందా లేదా అనే తర్జన భర్జనల గురించి చాలా రోజులనుండి దీనిలో
> చూస్తున్నాను. అందరికీ తెలిసిన ఇంత విషయాన్ని గురించి జోక్యం చేసుకోవడం ఎందుకని
> ఊరుకున్నాను. ళ ద్రావిడ భాషలదే సంస్కృతంలో లేదు. దీనిపైన ఇకనైనా టపాలు రావని
> ఆశిద్దాం.
Another reason I thought that was important in this topic is since we
adopt so many sanskrit words, how do we know when to use ళ or ల;
whether there are any rules. May be you are right. It may be just
tradition and there are no prescriptions.

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం

unread,
Apr 15, 2011, 9:09:31 AM4/15/11
to తెలుగుపదం
ళకార ప్రయోగానికి రూల్స్ ఏమీ విధించలేం కానీ దక్షిణాది భాషల లేఖన
సంప్రదాయాన్ని బట్టి గ్రహించడమే. దక్షిణమంటే మహారాష్ట్ర కూడా వస్తుంది.

kv ramana

unread,
Apr 15, 2011, 9:23:49 PM4/15/11
to telug...@googlegroups.com
తాడేపల్లివారు అన్నదానిలో ఉక్రోషపూరితమైన మాటలు ఉన్నట్టుగా నాకు తోచటం
లేదు. ఉదాహరణకు, ఈ రెండు వాక్యాలూ గమనించండి. నిప్పును ముట్టుకోవటం
తప్పు. నిప్పును ముట్టుకుంటే కాలుతుంది. రెంటిలో ఏది వాడటం సబబంటారు?

reply
రాఘవగా రిచ్చిన ఉదాహరణలకీ నేనన్నదానికీ లంకె ఏవిటో అర్థం చేసుకోలేను.
నిప్పు ముట్టుకోవడం తప్పు అనడం సరికాదు. ప్రమాదకర మనాలి - కాదా?

నరకానికి పోతారనడంలో నాకు అలాగ ఉక్రోషమే కనిపించింది - అనిపించిందల్లా
అనెయ్యడం మాత్రం తప్పే - క్షంతవ్యుణ్ణి.

- కె వి రమణ

ramanarao muddu

unread,
Apr 19, 2011, 9:18:12 AM4/19/11
to telug...@googlegroups.com
ద్రావిడ భాషల నుంచి  సాంస్క్రిట్ లోకి ఆ అక్షరం అరువు తెచ్చు కున్నారు అందుకే హిందీ లో "ళ" లేదు 
రమణ రావు 

2011/4/12 Sri Raghava Kiran Mukku <msrk...@gmail.com>
--

RangaMannar Vadigepalli

unread,
Apr 19, 2011, 1:47:21 PM4/19/11
to telug...@googlegroups.com
Dear all,
As far as I believe Sanskrit is a voice based language and not a script based language. Sanskrit is a language with no specific script. Hence, all these kind of issues appear. When we are writing sanskrit in telugu script, we always use "La" wherever it is appropriate. Perhaps "Do we have 'La' in sanskrit?" is not the right question. The question could be, when we write Sanskrit in Hindi style Devanagari (Not Marathi style devanagari), why dont we write "La" but write "la"?. The reason being, in the hindi style devanagari alphabet (varNamAla) (as on date), there is no representation for the "La" sound. Sanskrit always has "La" sound. Whether we represent that sound when writing sanskrit text in our chosen script is up to us, but we cannot cheat with the sound. There are a lot of people who cannot pronounce vowel "RRi" (ITrans 5.32). That does not mean that that sound does not exist. If you try to represent a sound from one language in the script not native to the language, all these issues arise. Please do not say that "La" is not there in Sanskrit. That is a very naive statement. May be we do not write similarly in different scripts. Do not cheat on the sounds. Tadepalli Subrahmanyam garu is very correct in what he has posted. I am not endorsing someone, but I know that it is correct.

regards,
V. Rangamannar

2011/4/19 ramanarao muddu <ramanar...@gmail.com>

Varma Alluri

unread,
Apr 19, 2011, 2:53:32 PM4/19/11
to telug...@googlegroups.com

సంస్కృతంలో "ళ" తో పాటు కొన్ని దీర్ఘపు అచ్చులు (ఏ, ఓ) కూడా ప్రస్తుతం లేవు కదా! మరి వాటి సంగతి ఏమిటి? "ళ" లాగే ఇవి కూడా ద్రవిడ భాషల్లో ఉన్నాయి కానీ చాలా ఉత్తరభారత భాషల్లో లేవు. విఞ్జులు కాస్త వివరిస్తారా?

భవదీయుడు,

వర్మ

2011/4/19 RangaMannar Vadigepalli <ugg...@gmail.com>

sundar

unread,
Apr 19, 2011, 4:08:44 PM4/19/11
to తెలుగుపదం
కొమఱ్ఱాజు వేంకట లక్ష్మణరావు గారి తెలుఁగు భాషా తత్వము ౨వ అధ్యాయము (వర్ణ
విచారము) లో ఇలా ఉంది:
"హ్రస్వ ఎ, ఒ లు ద్రావిడ భాషలలో మాత్రము గలవని గౌడాదులలో లేవనియు.
నిదివఱకుఁ గొందఱు తలంచిరి. కాని హిందీ భాషలోను, మఱి యితర గౌడ భాషలలోను ఈ
స్వరము కలదు. సంస్కృతము నందును, సామవేదమున, నిది యున్నది. కాని పతంజలి తన
మహాభాష్యములో దీనిని గ్రహించుటకు వీలు లేదని చెప్పినందునఁ దరువాతి
సంస్కృత వైయాకరణులు గ్రహింపరైరి. వారిని చూచి మోదట హిందీ మరాఠీ వ్యాకరణము
వ్రాసినవారు 'ఎ, ఒ' లకు హ్రస్వత్వము లేదని వ్రాసిరి. ఇంతియ కావున దీని
హ్రస్వత్వ మన్నిభాషలకును సమానమే."

On Apr 19, 11:53 pm, Varma Alluri <aprd.va...@gmail.com> wrote:
> సంస్కృతంలో "ళ" తో పాటు కొన్ని దీర్ఘపు అచ్చులు (ఏ, ఓ) కూడా ప్రస్తుతం లేవు
> కదా! మరి వాటి సంగతి ఏమిటి? "ళ" లాగే ఇవి కూడా ద్రవిడ భాషల్లో ఉన్నాయి కానీ
> చాలా ఉత్తరభారత భాషల్లో లేవు. విఞ్జులు కాస్త వివరిస్తారా?
>
> భవదీయుడు,
>
> వర్మ
> 2011/4/19 RangaMannar Vadigepalli <ugg...@gmail.com>
>
>
>
> > Dear all,
> > As far as I believe Sanskrit is a voice based language and not a script
> > based language. Sanskrit is a language with no specific script. Hence, all
> > these kind of issues appear. When we are writing sanskrit in telugu script,

> > we always use "La" wherever it is appropriate. Perhaps *"Do we have 'La'
> > in sanskrit?"* is not the right question. The question could be, *when we


> > write Sanskrit in Hindi style Devanagari (Not Marathi style devanagari), why

> > dont we write "La" but write "la"?*. The reason being, in the hindi style


> > devanagari alphabet (varNamAla) (as on date), there is no representation for
> > the "La" sound. Sanskrit always has "La" sound. Whether we represent that
> > sound when writing sanskrit text in our chosen script is up to us, but we
> > cannot cheat with the sound. There are a lot of people who cannot pronounce
> > vowel "RRi" (ITrans 5.32). That does not mean that that sound does not
> > exist. If you try to represent a sound from one language in the script not
> > native to the language, all these issues arise. Please do not say that "La"
> > is not there in Sanskrit. That is a very naive statement. May be we do not
> > write similarly in different scripts. Do not cheat on the sounds. Tadepalli
> > Subrahmanyam garu is very correct in what he has posted. I am not endorsing
> > someone, but I know that it is correct.
>
> > regards,
> > V. Rangamannar
>

> > 2011/4/19 ramanarao muddu <ramanarao.mu...@gmail.com>


>
> >> ద్రావిడ భాషల నుంచి  సాంస్క్రిట్ లోకి ఆ అక్షరం అరువు తెచ్చు కున్నారు అందుకే
> >> హిందీ లో "ళ" లేదు
> >> రమణ రావు
>

> >> 2011/4/12 Sri Raghava Kiran Mukku <msrki...@gmail.com>


>
> >>> అయ్యా,
>
> >>> పతంజలి మహర్షి వ్రాసిన సంస్కృత వ్యాకరణ మహాభాష్యంలో ళ కూడా కనబడుతుంది.
> >>> ౬౮వ కంచి పరమాచార్యులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరసరస్వతీస్వాములవారు కూడా ఈ
> >>> విషయాన్ని ధృవీకరించారు.
>
> >>> ఇంతకు మించి నేను చెప్పనవసరం లేదు.
>
> >>> నమస్సులతో
> >>> రాఘవ
>
> >>> --
> >>>  ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో
> >>> సభ్యత్వం ఉంది కాబట్టి.
>
> >>> * ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి:
> >>> telug...@googlegroups.com
> >>> * ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి:
> >>> telugupadam...@googlegroups.com

> >>> * మరిన్ని విషయాలకై,http://groups.google.com/group/telugupadam?hl=teవద్ద ఈ


> >>> గుంపును చూడండి
>
> >>   --
> >> ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం
> >> ఉంది కాబట్టి.
>
> >> * ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి:
> >> telug...@googlegroups.com
> >> * ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి:
> >> telugupadam...@googlegroups.com

> >> * మరిన్ని విషయాలకై,http://groups.google.com/group/telugupadam?hl=teవద్ద


> >> ఈ
> >> గుంపును చూడండి
>
> > --
> > ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం
> > ఉంది కాబట్టి.
>
> > * ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి:
> > telug...@googlegroups.com
> > * ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి:
> > telugupadam...@googlegroups.com

> > * మరిన్ని విషయాలకై,http://groups.google.com/group/telugupadam?hl=teవద్ద
> > ఈ
> > గుంపును చూడండి- Hide quoted text -
>
> - Show quoted text -

kv ramana

unread,
Apr 19, 2011, 9:35:57 PM4/19/11
to telug...@googlegroups.com
సంస్కృతంలో ఏకార-ఓకారాలలో హ్రస్వ-దీర్ఘాల భేదం ఉందాలేదా అన్న ప్రశ్న
బావుంది. ఐతే దక్షిణాది భాషల్లో ఈ భేదం ఉన్నా ఎవరూ సంస్కృత పదాలను
ఉచ్చరించడంలో భేదం చూపడంలేదు. దీర్ఘాచ్చుగానే గ్రహిస్తున్నారు. ఏ-ఓలను
హిందీ వాళ్ళు కూడా దీర్ఘంగానే పలుకుతున్నారు.
ఎవరైనా ఏ-ఓలను హ్రస్వంగా పలికినా రాసినా ఈ ప్రశ్న లేవదీయొచ్చు.
ఉదాహరణకు వెంకట అనీ వేంకట అనీ రెండు రకాలుగా కనిపిస్తుంది. ఇది
సంస్కృతశబ్దం కాకపోయినా తత్సమంగా వాడటంలో వేంకట వినిపిస్తుంది. ఇలాంటి
ఉదాహరణలు ఇంకా ఉండొచ్చు.

> * మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ

Reply all
Reply to author
Forward
0 new messages