Re: [racchabanda] ఖదీర్ బాబు దర్గామిట్ట కతల గురించి నాలుగు ముక్కలు

8 visualizações
Pular para a primeira mensagem não lida

Nasy Sankagiri

não lida,
6 de out. de 2000, 08:11:0506/10/2000
para racch...@egroups.com
Well, there are a couple of ways one can do this.
1) Best way perhaps is via www.telupu.com
This book is not listed on their site, but if you
email the webmaster anyway, I think they can place
your order with Navodaya.

2) Email Navodaya, Vijayawada directly at
booklink@m...

3) snail mail for Navodaya is Navodaya Publishers,
Karl MArx (Eluru) Road, Vijayawada - 520002.

Regards,
Nasy
--- "Ari@o..." <ari@O...> wrote:
>
> Nasy garu:
>
> Please give the address where people can write to
> buy copies if they wish
> to.
>
> Thanks.
>
> Regards,
> Ari Sitaramayya.


__________________________________________________
Do You Yahoo!?
Yahoo! Photos - 35mm Quality Prints, Now Get 15 Free!
http://photos.yahoo.com/

Courtesy: http://www.kanneganti.com/

Nasy Sankagiri

não lida,
6 de out. de 2000, 08:25:1306/10/2000
para racch...@egroups.com

--- NaChaKi <nachaki@y...> wrote:

> మంచి review కి కృతజ్ఞతలు,
> 'నచకీ

మీకు నా సమీక్ష నచ్చినందుకు సంతోషం. రొన్ని,
కువ్వ పదాల వాడుక గురించి చెప్పినందుకు కూడా. ఈ
పుస్తకంలో ఈ వాడుకలు విరివిగానూ,
consitentగానూ ఉన్నాయి - అచ్చుతప్పు ఐతే ఒకటి
రెండు చోట్ల వస్తుంది కానీ అన్ని చోట్లా రాదు గదా
అన్న అనుమానం పీడిస్తూనే ఉంది నన్ను మీరు నొక్కి
చెప్పే వరకూ.

ఇక కథనంలో మాండలికం సంగతి. కొంత కాలం
క్రితం తెలుసాలో ఈ విషయం గురించి
మాట్లాడుకున్నాం. పూర్తిగా మాండలికాలఓ
చెప్పుకొచ్చిన కథలూ నవలలూ కొన్ని నేను చదివాను.
ఈ పుస్తకంలో సరైన బేలెన్స్ సాధించారని నాకు
అనిపించింది. పోయిన వారమో ఈ వారమో
ఆంధ్రప్రభ వీక్లీలో ఒక కథ వచ్చింది - కథ
అంత గొప్పగా లేదు గానీ చెప్పిన భాష నాకు
చాలా నచ్చింది.

With regards,
Nasy

NaChaKi

não lida,
5 de out. de 2000, 18:16:2105/10/2000
para racch...@egroups.com
నాసీ గారూ,

నమస్తే!

మీ రివ్యూ చాలా బాగుంది, ఇలా వ్రాయటం నాకు అలవాటు లేని పని,
చేతకాని పని అవటం చేత, పుస్తకం నా దగ్గర ఉన్నా
(thanks to Srinivas Atluri) రివ్యూ వ్రాయమన్నప్పుడు
కిమ్మనలేదు!! :) ంఈ రివ్యూ చదివాక ఆ కథలన్నీ మళ్ళీ
గుర్తొచ్చి గిలిగింతలు పెట్టాయ్! మీరన్నట్టు ముస్లిం
సంప్రదాయాలైన పండుగలు, "కార్యాలు", మతపరమైన
అడ్డుగోడలు తొలగించే 'రొట్టెల పండుగా, ఇవన్నీ చదివి
తెలుసుకోవలసినవే! సరళమైన భాష కూడా దోహదపడింది,
కానీ కాస్త నెల్లూరి మాండలికంతో పరిచయముంటే ఇంకా చాలా
త్వరగా ఎక్కుతుంది. ఈ సందర్భంలో, ఒక చిన్న విషయం -
రొన్ని, రొంత, కువ్వ (?) అచ్చుతప్పులు కాదు!, అవి రాయలసీమ
(నెల్లూరు రాయలసీమలో ఎందుకు లేదో నాకు ఇప్పటికీ అర్థం
కాదు, ఆ భాష, ఆ SVU...) మాండలికంలో నిత్యం వాడే
పదాలే!

మంచి review కి కృతజ్ఞతలు,
'నచకీ


=====
____________________________________________________________

Visit http://www.reformindia.com to discuss, decide, and IMPLEMENT solutions to problems in India. We all can do it, together, with Unity of Thought. Come, let's join thoughts.

MY PERSONAL WEBSITE: http://dotc.iwarp.com

Nasy Sankagiri

não lida,
5 de out. de 2000, 17:18:2405/10/2000
para racch...@egroups.com
సాహిత్యం జీవితాని ప్రతిబింబించాలి అన్నారు. నిజ
జీవితంలోనే బోలెడు కథ లుండగా వేరే కొత్తగా
కల్పించడ మెందుకూ? ప్రపంచమంతటా ప్రజల జీవన
విధానం అతి వేగంగా మార్పు చెందుతోంది. భారత
దేశంలో ముఖ్యంగా మధ్య తరగతి ప్రజల
జీవితాల తీరు తెన్నులు గత ముప్ఫై యేళ్ళలోనూ
గుర్తు పట్టలేనంతగా మారి పోయాయంటే అతిశయోక్తి
కాదేమో. ఆ రోజుల్లో సామన్యంగా ఉండే వస్తువులూ,
కుటుంబ సన్నివేశాలూ, ఆటలూ, కాలక్షేపాలూ
ఇప్పుడు మచ్చుకి కూడా కనబడకుండా పోయాయి,
పోతున్నాయ్. వీటిని బట్టి మనుషులూ మారిపోతున్నరు.

మార్పు సహజమే. మారాలి, తప్పదు. కానీ మార్పుకి
ముందు పరిస్థితి ఇలా వుండేది, మనుషులూ, వాళ్ళ
పద్ధతులూ ఇలా వుండేవి అని రికార్డు చేసి
పెట్టుకోవలసిన బాధ్యత ప్రతి సంఘానికీ ఉన్నదని
నేను నమ్ముతాను. ఇవి చక్కగా మలచిన కథల
రూపంలో ఉంటే మరీ మంచిది. ఇటువంటి రికార్డు
కథల వల్ల మహదాశయం ఏదైనా నెరవేరుతుందా
అనడిగితే నేను జవాబు చెప్పలేను. మహదాశయం
ఏదైనా ఉన్నా లేక పోయినా, అది నెరవేరినా
నెరవేరక పోయినా ఈ కథలు, చక్కగా తీసి,
పేర్చి, అతికించుకున్న "పెళ్ళి ఫొటో ఆల్బం"
లాగానైనా ఉపయోగ పడతాయి. భవిష్యత్తులో
వచ్చే ఈ ఉపయోగాలకంటే ఇప్పటి కిప్పుడు జరిగే
ముఖ్యమైన ఉపయోగం ఇంకొకటి ఉంది - మనకంటే
భిన్నమైన కుల మత ప్రాంతాలకి చెందిన వాళ్ళు ఎలా
బతుకుతున్నారు, వాళ్ళని నడిపించే ఆశ లేమిటి,
దైనందిన జీవితంలో వాళ్ళు ఎదుర్కుంటున్న సమస్య
లేమిటి - ఇటువంటివి తెలుస్తాయి మనకి. మనిషిని
మనిషి అర్థం చేసుకోవటానికి ఇది చాలా ముఖ్యమని
నా అభిప్రాయం.

చాలా మంది హిందువులకి ముస్లిము పరిచయస్తులూ
స్నేహితులే ఉన్నా వారి దైనందిన జీవితాల గురించి
ఎక్కువగా తెలియదు. ఆ లోటుని ఈ పుస్తకం
కొంతవరకైనా తీరుస్తుంది. మత సంబంధమైన
జాత్యహంకారం వెర్రి తలలు వేస్తున్న సమయంలో ఈ
అవగాహన మనందరికీ సదుపాయమే కాదు, అవసరం
కూడా.

పుస్తకం గురించి:
ఇందులో ఇరవై ఐదు కథలున్నాయి నూట నలభై
పేజీల్లో. అన్నీ చిన్న చిన్న కథలే. పుస్తకం
కవరు అక్బరు వేసిన వర్ణ చిత్రంతో ముచ్చటగా
వుంది. ప్రతి కథకీ ముందూ చివరా మోహన్ గీసిన
రేఖా చిత్రాలు గిలిగింతలు పెట్టిస్తాయి. ఈ
కతహలన్నీ 1998-99 మధ్యన ఆంధ్రజ్యోతి వార
పత్రికలో అచ్చయ్యాయి. పుస్తకం ప్రతులు 25
రూపాయలకు నవోదయ మొదలైన బుక్ షాపుల్లో
దొరుకుతాయి.

కథా వస్తువులు:
ముఖ్య వస్తువు నెల్లూరు జిల్లా కావలి పట్నంలో
కసాబ్ గల్లీలో ఉండే మధ్యతరగతి ముస్లిముల
జీవితం. పనిలో పనిగా ఖదీర్ బాబు పుట్టటం,
పెరగటం, ఇస్కూలుకి పోవటం ఇత్యాదివి జరుగుతూ
వుంటాయి. కథాకాలం సుమారు 1970 నించీ 85 దాకా.
తెలుగు ముస్లిముల పేర్లూ, ఉర్దూ భాష పైనా
మాంసాహారం పైనా వారి మక్కువా, వాళ్ళ పెళ్ళిళ్ళూ,
రంజాన్ పండగా, పీర్ల పండగా, ముస్లిము బాలకులకి
తప్పని సరైన "కార్యం", ఇవన్నీ కథా వస్తువులే.
మధ్య మధ్యలో ఇస్కూల్లో జరిగే విశేషాలు కొన్ని.
పాత్రలంటారా, రచయిత అమ్మా, నాయినా,
నాయినమ్మా, తోబుట్టువులూ, బంధువులూ, స్నేహితులూ,
బళ్ళో మేష్టర్లూ, ఇరుగూ పొరుగూ అందరూనూ.
బహుశా రచయిత వయసు వాణ్ణే కావటం వల్లనేమో
కొన్ని కథలు చదువుతుంటే నా అనుభవాలనే
చదువుతున్నట్టుగా అనిపించింది. దానికి తోడు
ఎలిమెంటరీ స్కూల్లో నా బెస్ట్ ఫ్రెండ్ ముస్తఖీం అని
వుండేవాడు. పలావు తినడం నాకు నిషేధం కానీ,
రంజాన్ రోజు సేమియా తినేందుకైనా రమ్మని ప్రతి
యేడూ పిలిచేవాడు. మా అమ్మ ఎప్పుడూ వెళ్ళనివ్వ
లేదు. హైస్కూలుకి వచ్చి కొంచెం స్వతంత్రం
వచ్చేప్పటికి వాళ్ళు విజయవాడ వదిలి ఏలూరికి
వెళ్ళిపోయారు. అప్పటికీ ఇప్పటికీ రంజాన్ సేమియా
తినడం కుదరనే లేదు నాకు!

భాష:
అక్కడక్కడా సంభాషణలలో తప్పించి కథలు
చెప్పిన భాష సరళంగా ఉంది. అలాగని పూర్తి
శిష్ట వ్యావహారికం కాకుండా కొంత వరకూ నెల్లూరి
మాండలికాన్ని తగు పాళ్ళలో ఉపయోగించారు.
అవసరమైన చోట్ల మాట వెంటనే బ్రాకెట్లలో అర్థం
రాయటం వల్ల కూడా అర్థం చేసుకోవటం సుళువైంది.
"క్లెవర్లు", "అయవోరు" లాంటి మాటలూ, ఉప్మాలో
జీడిపప్పు ముక్కల్లా అక్కడక్కడా తగిలే ముచ్చటైన
బూతు మాటలూ నవ్విస్తాయి. "కిండలు, ముక్కాలు" లాంటి
తమిళ పదాలు అక్కడక్కడా ఉన్నై, నెల్లూరి భాషలో
అరవ పదాలు ఇంతకంటే ఎక్కువగానే వాడతా
రనుకుంటా. కొన్ని, కొంత అనడానికి రొన్ని, రొంత
అనిన్నూ, కుప్ప కి కువ్వ అనీ రాయడం అచ్చు తప్పేమో
అనిపిస్తుంది నాకు. సంభాషణల తీరు చెప్ప
నక్కర్లేదు - ఆ మనుషులే మన ముందు నిలబడి
మట్లాడు తున్నారా అనిపిస్తుంది. పెళ్ళాన్ని ఎప్పుడూ
ప్రేమగా పిలవని కరీం సాయిబు పొట్టేలు తల కూర
వొండమని చెప్పేందుకు "అమ్మలాల" అని లాలన గా
పిలవడం మర్చిపోలేము.

తుది పలుకు:
సజీవ మైన పాత్రలతో నిజ జీవితాన్ని సెంటిమెంట్ల
లాంటి చీప్ ట్రిక్కులేవీ లేకుండా సూటిగా, కొంత
హాస్యంతోనూ, కొంత ఆర్ద్రతతోనూ కలిపి
చెప్పుకొచ్చిన చక్కటి కథలు. మీకు మధ్య తరగతి
తెలుగు ముస్లిముల జీవితం గురించి ఆట్టే తెలియక
పోతే పుస్తకం తెరవగానే ఏదో కొత్త
ప్రపంచంలోకి అడుగు పెట్టినట్టే ఉంటుంది. కంగారు
పడకుండా రెండడుగులు లోపలికి వచ్చారనుకోండి,
అక్కడ ఉన్న వాళ్ళందరూ మనకి బాగా తెలిసిన
వాళ్ళే.

Regards,
Nasy

PS: Just to pique the curiosity of the people without
immediate access to the book, I have scanned a couple
of stories. If you are interested in receiving them,
please send me a personal mail. Thanks to Sri Ari
Sitaramayya gaaru for sharing this book with me and
giving me this opportunity.

Ari@o...

não lida,
5 de out. de 2000, 17:43:5005/10/2000
para racch...@egroups.com

Nasy garu:

Please give the address where people can write to buy copies if they wish
to.

Thanks.

Regards,
Ari Sitaramayya.


Courtesy: http://www.kanneganti.com/

Responder a todos
Responder ao autor
Encaminhar
0 nova mensagem