ఆవు నెయ్యి గురించిన చిన్న చిన్న విశేషం

117 views
Skip to first unread message

శ్రీ అయ్యగారి సూర్య నాగేంద్ర కుమార్

unread,
Dec 28, 2011, 1:04:41 AM12/28/11
to గోమాత (Go Mata)
శ్రీ గురుభ్యోన్నమః

నమస్తే
ఆవు నెయ్యి గురించిన చిన్న విశేషాన్ని గురించిన వివరం..

గోమాత నామావళిలో హవ్య కవ్య ప్రదాయిని అన్న నామమున్నది. గోఘృతం లేదా ఆవు
నెయ్యితోనే దేవతలకు హవిస్సులర్పిస్తాము అలానే పితృదేవతలకు కవ్యమూ.. ఇది
అందరకూ తెలిసినదే, ఐతే నిత్యమూ యజ్ఞ యాగాదులు జరిగేచోట, ఆవు నెయ్యి ఇతర
సమిధలతో కాలి ఆవిరి అయ్యిన చోట రేడియోధార్మిక పదార్థాల యొక్క విషపు
గాలులయొక్క ప్రభావం నామమాత్రం లేదా అసలు ఉండదని రష్యన్ శాస్త్రజ్ఙ్యులు
డా శిరోవిచ్ తమ పరిశోధనలో తెలిపి నిరూపించారు. మనవాళ్ళు చెప్తే నమ్మని మన
వారు ఇతరులు చెప్పినా కొన్ని సార్లు సనాతన ధర్మ గొప్పదనాన్ని
ఒప్పుకోలేరు. ఈ విషయం 1980వ దశకంలో జరిగిన అత్యంత ఘోర ప్రమాదమైన భోపాల్
గ్యాస్ విషవాయువులు, రేడియోధార్మికశక్తిల వలన ఆ ప్రాంత చుట్టూ ఐదారు
మైళ్ళ వరకూ అత్యంత ఉపద్రవంతో కూడిన వ్యాధులు సోకాయి, ఎందరో చనిపోయారు,
కొందరికి చర్మం కాలిపోయింది, ఇప్పటికీ ఆ ప్రాంతం వారిలో కొంతమందికి ఆ
రసాయనాల వల్ల కలిగిన రోగాలను పోగొట్టుకోలేని స్థితిలో ఉన్నారు.

ఇంత అత్యంత దారుణ బాధాకరవిపత్కర పరిస్థితులలో ఈ ప్రమాదం సంభవించిన
కర్మాగారానికి ఒక మైలులోపు ఉన్న రెండు కుటుంబాలకు మాత్రం ఎటువంటి హానీ
జరగలేదు, ఎవరి ప్రాణాలకీ ముప్పు కలగలేదు, కనీసం ఎవరూ అనారోగ్యం పాలు
కాలేదు. కారణం ఈ రెండు కుటుంబాలు నిత్యాగ్నిహోత్రీకులు అగ్నిహోత్రంలో
రోజూ ఆజ్యంవేసి హవిస్సులర్పిస్తారు. వారి పేర్లు వివరాలతో సహా ఆంగ్ల దిన
పత్రిక "ద హిందూ" 4-May-1985 నాడు "Vedic way to Beat Pollution" అన్న
శీర్షికన ఈ కథనాన్ని ప్రచురించింది. ఆ ఇద్దరు ఇంటి యజమానులు శ్రీ సోహన్
లాల్ ఎస్.ఖుశ్వాహ, శ్రీ ఎమ్ ఎల్ రాథోర్ గార్ల పేర్లను ప్రస్తావిస్తూ ఆ
ఆర్టికల్ ప్రచురించబడింది.

సనాతన ధర్మంలో ఏ కార్యం చేసినా ప్రకృతి ప్రసాదాన్ని చెడగొట్టుకునేలా
ఉండవు అన్నీ ప్రకృతికి అనుగుణంగానే చేయబడతాయి, ప్రకృతియొక్క
అనుగ్రహంకోసమే చేయబడతాయి, యజ్ఙ యాగాదులు కాలుష్యాన్ని పెంపొందించవు, పైగా
అవి వాతావరణంలో ఉన్న కాలుష్యాన్ని తగ్గిస్తాయి అని మన పూర్వీకులు
చెప్పినదే పాశ్చాత్య ఇతర దేశాల శాస్త్రవేత్తలూ తమ పరిశోధనలచేత
నిర్ధారించారు. ఐనప్పటికీ వీటిమీద అధ్యయనం చేసే వైపుగా కానీ, చక్కని
ప్రచారం కల్పించడం కానీ మనవారికి చేయడం చేతకాదు.

ఏది ఏమైనప్పటికీ... మన సనాతన ధర్మపు విలువలను నిత్య విధులను పట్టుకుని
నిత్యాగ్నిహోత్రీకులై భోపాల్ గ్యాస వంటి దురదృష్టకర ప్రమాదాన్ని తేలికగా
ఎదుర్కుని మన వైదిక సంస్కృతి గొప్పదనాన్ని చాటిని ఆ ఇద్దరు కుటుంబీకులకు
వారి వంశానికి ఆ పరాదేవత గోమాత అనుగ్రహం ఎప్పటికీ ఉండుగాక అదే ధృతి,
ధర్మమునందు నిర్భయంగా చరించే శక్తి మనకు అనవరతమూ ఉండుగాక అని
ప్రార్థిస్తూ

గోమాతా విజయతామ్

Chakravarthy DSK

unread,
Dec 28, 2011, 1:15:22 AM12/28/11
to gom...@googlegroups.com
ఈశ్వరస్వరూపులైన నాగేంద్ర కుమార్ గారు,
 
మీ మొదటి పేరా చదువుతున్నంత సేపు ఏదైనా మిరాకిల్ (అద్బుతం) జరిగి ఉంటే బాగుండును కదా అనిఅనుకునేంతలో రెండొవ పేరాలో విషయాన్ని వివరించి నన్ను సంబ్రమాశ్చర్యాలలో ముంచెత్తారు. నిజమేనండి. కొన్ని కొన్ని అర్దం చేసుకోవడానికి మన మేధస్సుకి అందకపోయినా, పాటించడం అనేది మంచిది అని చెప్పిన పెద్దల మాటలను మనం పట్టించుకోం. ఆధారాలు కావాలి అని అడిగే వారికి ఇవి చూపిస్తే ఏవో కుంటి సాకులు చెప్పి దాటేస్తారు.
 
ఓ మంచి విషయాన్ని తెలియజేసినందులకు / తెలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది.

2011/12/28 శ్రీ అయ్యగారి సూర్య నాగేంద్ర కుమార్ <nagendra...@gmail.com>



--
ధన్యవాదములతో,
భవదీయుడు,
చక్రవర్తి
-------------------------------
 
సంధ్యారంభ విజృంభితం శ్రుతిశిర స్థానాంతరాధిష్టితం
సప్రేమ భ్రమరాభిరామ మసకృ త్సద్వాసనా శోభితం
భోగీంద్రాభరణం సమస్తసుమనః పూజ్యం గుణావిష్కృతం
సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితమ్ ||

Reply all
Reply to author
Forward
0 new messages