కాముని పున్నం...
అదొక సంబరం...
ఊరంతా కేరింత...
రంగులల్ల మునిగి తేలే జనమంతా...
మోదుగ పూల ముదురు పసుపు రంగు,
సిల్వర్ సునేర్, గులాబీ గులాల్,
మట్టి పోయ్యిల్లోని మసి,
చిలక పచ్చ రంగు, చిరిగిన బట్టలు,
చెదిరిన జుట్లు, రంగు రంగుల చెంపలు,
ఇగిలిచ్చిన పండ్లకు బండిరుసు కందెన,
కోడిగుడ్డ్లు పగిలిన నెత్తులు,
పాట చాట డప్పులు, దరువులు,
రంగయిపోయిందని ఏడ్చే పోరగాండ్లు,
రంగు పోసిండ్రని దుమ్మెతి పోసేటోల్లు,
పాటలు, తిట్లు, ఏడుపులు, పెడబొబ్బలు
మాకేం తక్కువ అని...
పెయ్యి నిండ రంగు రుద్దిచ్చుకున్న ఊరి మద్య బోరింగు పంపు,
బర్రెలు, గొర్రెలు, మేకలు, కుక్కలు...
దుకునాల కాడ గుంపులు
పిల్ల, జెల్ల, ముసలి, ముతక,
ఆడ, మొగ అందరు బాజార్లనే...
హోలీ హోలీల రంగ హోలీ
చెమ్మకేలిల హోలీ...
-- శ్రీనివాస్ రెడ్డి కొంపల్లి
--
Posted By CNU to
Telangana Pilupu at 3/07/2012 11:45:00 AM