-- శ్రీనివాస్ రెడ్డి కొంపల్లి
తాతా... పొట్టి శ్రీరాములు తాతా...
యాడున్నావో గాని ఈడ నీ మనుమల సూస్తివా...
నువ్వు చేసిన త్యాగాన్ని కూడా మర్శిండ్రు
నువ్వు కలగన్న ఆంధ్ర రాష్ట్రాని ఏనాడో చెడిపిండ్రు
పీతలమ్ముకొస్తామని మా ఊరోచ్చిండ్రు
అప్పటికే పాణం ఎల్లదీస్కుంటున్న అవ్వ గంజికి అర్రులుజాచిండ్రు
పందేంట పంది పిల్లల్లన్నట్లు, వొస్తానే ఉండ్రు... ఇప్పటికీ...
పోనీలే, ఒసార్ల పండుకొని సూరు నీళ్ళు తాగి ఉంటారని జర్రంత జాగ ఇస్తే...
సూరెక్కి ఈ గుడిసె నాది, ఈ గూడెం మాది అన్నట్లు
మా గుండెలల్ల గునపాలతో తొవ్వి మరీ గుంజలు పాతుకున్నరు
ఇయ్యాల మా కుత్కెల మీద కూసోని సవారి చేస్తుండ్రు...
"ఇదేంటయా" అని మీ బాషలనే అడిగినా...
"మాకు ఇంగ్లీషు వచ్చు, మీకు వ్యవసాయం నేర్పిస్తాం,
మీ గేదె పాలతో చేసిన నేతిలో నంజుకోడానికి
మావిడికాయ తొక్కుడు పెట్టిస్తాము..." అని
దొరికిన ఏ తోవనొదలకుండ, తోక్కుతనే ఉండ్రు
మీరు రాకముందు మేమేదో ఆది మానవులమన్నట్టు
మా ఎవుసాన్ని ఎంగిలి బాషల ఎక్కిరిచ్చిండ్రు...
మేము ఎవుసం జెయ్యకుండానే,
మా జీవితాల కన్నా ఎక్కువ పన్ను గట్టందే...
నిజాం రాజు అత్యధిక ధనవంతుడు ఎట్లయ్యి oడో
జర నువ్వన్న జెప్పరాదే...
ఆత్మవై ఒచ్చి... మీ భాషల...
"నేనాడు, నా ప్రాణం అడ్డేసింది
అరవ చేతుల్లోంచి 'ఆంధ్ర' ను మాత్రమే విడిపించడానికి
ఆ ఆంధ్రకు తిరుపతి, మద్రాసు ను కూడా అడగడానికి.
మన పోరు పడలేక...
తిరుపతిచ్చి సల్లగ బతుకుపోండి అని వాళ్ళు వెల్లగోట్టినా...
మీరు నా ప్రాణాలు పొయ్యే దాక, మద్రాసును
కూడా తీసుకురా అని...
నాకిష్టం లేకపోయినా నన్ను చంపినారు..." హవ్వ...! నీ గోసకు నా కండ్లల్ల నీళ్ళు గారుతున్నయ్...
నీ ఆత్మ త్యాగానికి నా జోహార్లు...
త్యాగ ధనులు ఎప్పటికి అమరులే...
ఏమ్రా భాయ్...! జర కండ్లు దెరువుండ్రి...
తాత త్యాగాన్ని గౌరవించి
ఆయన కలగన్న మీ ఆంధ్రను విడిపిచ్చుకొండ్రా భాయ్..!
***
--
Posted By CNU to Telangana Pilupu at 11/01/2011 07:50:00 PM