సీమాంధ్రలాబీల సొల్లు కబుర్లు వద్దు

7 views
Skip to first unread message

S N Reddy Katanguru

unread,
Oct 11, 2011, 2:50:40 AM10/11/11
to Yuva Telangana
"సీమాంధ్రలాబీల సొల్లు కబుర్లు వద్దు-సోనియమ్మ మౌనం వీడాలి"
తెలంగాణాలో గత 55 యేండ్లుగా విద్యారంగాన్ని, తమ కార్పోరేట్
వ్యాపార నైపుణ్యంతో విచ్చిన్నం జేసిన ఘనత సీమాంధ్ర పాలకులకే దక్కుద్ది.
పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వబళ్లు దాదాపుగా మూతబడ్డయి. టీచర్ల ప్రమోషన్లకు
అవకాశాలు కోల్పోవడమే గాక ఉద్యోగాలకు కరువేర్పడింది. విద్య, వైద్యం,
వ్యవసాయం, రవాణా ఇత్యాది రంగాలన్నీటక్కు-టమార కార్పోరేటీకరణ వ్యాపార
మాయలతో సగటు జీవితం దెబ్బతింది. అందుకే తెలంగాణా యావత్తు "సకల జనుల
సమ్మె" రూపంలో ఉద్యమించడం జరుగుతోంది. ఉద్యోగ భద్రతలేని చదువులెందుకు?
జీవనోపాధి కరువైన యువత ఆత్మాహుతులకు ఎందుకు పాల్పడుతోంది? ఏదారీ దొరుకక
అడవులపాలు ఎందుకవుతున్నారు? అందుకే ఈ సకల జనుల ఆరాటమంతా కాలేకడుపుల
స్వశ్చంద పోరాటం. తెలంగాణా విద్యార్థుల పేరెంట్స్ అంతా "సకల జనుల
సమ్మె"లో భాగస్వాములే. తమ పిల్లల బ్రతుకులు తెలంగాణా రాష్ట్రంలోనే వెలుగు
చూస్తాయనే ఆశలతోనే ఈ సమ్మెకు తమ సంపూర్ణ మద్దతిస్తూ స్వయంగా తామంతా కూడా
పాల్గొంటున్నారు. పేపర్లలో, టీ.వీ. చానళ్లలో వచ్చే పసలేని వాదనలు,
వార్తలు అన్నీ సీమాంధ్రలాబీల, కార్పోరేట్ విద్యా వ్యాపారుల కుతంత్రాల
సృష్టి కాదా? కూకట్ పల్లిలో, NRI Academy విద్యా సంస్థలోకూడా సందట్లో
సడేమియాల్లా అలాంటి కుతంత్రపు సృష్టే జరిగింది ‘అనీల్’.
ఇప్పుడు విద్యార్థులకు మినహాయింపు కావాలనే కుట్రలో,... విద్యా
సంస్థలు తెరువాలి, విద్యార్థులు మరియు టీచర్లు సమ్మె విరమించాలి,
టీచర్లతోపాటు వారితో కలిసి పనిజేసే పంచాయత్ రాజ్ మరియు విద్యాశాఖకు
చెందిన ఉద్యోగుల్లో చీలికలు తేవాలి తద్వారా వారిలో అనైఖ్యత సృష్టించొచ్చు
ఆ తర్వాత విద్యార్థుల కొరకు విద్యుత్ కావాలి, వారికొరకు బస్సులు నడువాలి
తద్వారా విద్యుత్-రవాణా ఉద్యోగులు కూడా సమ్మె విరమించాలి అనే వాదనలను
ముందుకు తేవచ్చు అనే కుట్రపూరిత ఎత్తుగడల్లో అంతర్భాగమే ఈ మినహాయింపుల
సృష్టి. సకల జనుల సమ్మె ఉద్యోగ అవకాశాలకు, ఉద్యోగ భద్రతకు, తెలంగాణా
బ్రతుకుదెరువుకు అందరికీ సంబందించినదే. కానీ కేవలం ఉపాధ్యాయ-ఉద్యోగ
వర్గాలకు సంబందించిన సమస్య కాదు, అనేది కూడా ఓ పెద్ద కుట్ర. ఇప్పుడు
జరిగే నష్టమెంతైనా భవిష్యత్ తెలంగాణా రాష్ట్రంలో పూడ్చుకునే విశ్వాసం
తెలంగాణా వారికుంది. "బోనస్" అనేది కేవలం ఉద్యోగ-ఉపాధ్యాయ వర్గాలకే కాదు
ఏదో ఓ రూపంలో ప్రతి వర్గానికి భవిష్యత్ తెలంగాణా రాష్ట్రంలో లబ్ది
చేకూరుతుందనే విశ్వాసం తెలంగాణా ప్రజానీకానికి వుంది.
ప్రాంతాలకు అతీతంగా టి.డి.పి. ప్రభుత్వమున్నప్పుడు, ఈ తెలంగాణా
సమస్యను సృష్టించింది కాంగ్రెస్ పార్టీ కాదా? 2004 మరియు 2009 ఎన్నికల్లో
తెలంగాణా నినాదంతో లబ్ది పొందింది కాంగ్రెస్ కాదా? సోనియా తెలంగాణా
ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలనే డిమాండు ఇప్పుడు క్లిష్ట సమస్య ఎలా
అయింది? కాంగ్రెస్ తామిచ్చిన హామీనే నేరవేరుస్తారో? లేదో? చెప్పడానికి
ఇంకా ఎన్నేండ్లు కావాలి? ఇంకెందరి ప్రాణాలు బలి కావాలి? మొదట తమ పార్టీ
విధానాన్ని ఇటు రాష్ట్రంలో అటు కేంధ్రంలో అధికారంలోనున్నపార్టీగా
“కాంగ్రెస్” తన వైఖరిని వెల్లడి చేయకుండా సొల్లు కబుర్లు చెప్పడం మోసం
కాదా?

-కటంగూరు సత్యనారాయణ రెడ్డి
టి.ఆర్.టి.యు.వ్యవస్థాపక అధ్యక్షులు,
ఫోన్: 001 (860) 656 6666

Reply all
Reply to author
Forward
0 new messages