Fwd: [Telangana Pilupu] "పులి... పులి... పులి..." అని ఊరవతల మల్లా ఇనవడుతుంది

10 views
Skip to first unread message

Srinivas Reddy

unread,
Dec 1, 2011, 10:44:05 AM12/1/11
to TeNA-...@yahoogroups.com, yuvate...@googlegroups.com


"పులి... పులి... పులి..." అన్నాడంట
ఎనకటికి ఒక గొర్రెలు కాసే పోరడు
ఊరంతా పోగై ఎక్కడ బిడ్డా అని ఆరాదీస్తే...
"ఏ... ఉత్తగనే అన్న... కి కి కి కి"
అని పండ్లన్నీ బైటవెట్టి నవ్విండు...
ఎనకటి ముచ్చట పక్కకువెట్టి
డిల్లి పోయిండు కదా... పార్లమెంటుల కూసోనీకే...
దీని తల్లి... కెసిఆర్ తలకాయనో... లేక తెలంగాణ రాష్ట్రమో...
ఏదో ఒక్కటి తప్పకుండ ఒస్తడి అనుకుంటుండ్రు జనాలు
మల్లోక్క సారి....
"పులి... పులి... పులి..." అని ఊరవతల ఇనవడుతుంది...
"ఈ సారి ఒకేసారి ఆరు వందల మంది తో
స్వయాన అమ్మ గారే ఒస్తున్నారు
శీతాకాల సమావేశాల్లోగా తెలంగాణ ఇస్తదంట
యాటలు కోయ్యిన్డ్రి రా...
పాయ మరిశి పోకుండ్రి రో...
అమ్మ మోకాళ్ళ నొప్పికి మస్తుగ పని జేస్తది
ఈ సారి అమ్మకు తలకాయ కూర రుచి సూపిద్దాం..." 
యాటలకేం కరువే... నా పానమే ఇస్తా తీసుకో అని
ఎంతమంది ఆత్మార్పనల నివేద్యం పెట్టలే...
ఇంకా కావాల్నాయే...
ఏం పెద్దమనిషి... ఇంకా కావల్నాయే...
                                         ---శ్రీనివాస్ రెడ్డి కొంపల్లి







--
Posted By CNU to Telangana Pilupu at 12/01/2011 07:39:00 AM

Reply all
Reply to author
Forward
0 new messages