ఆగస్టు 16-17, 2025
హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సంయుక్త నిర్వహణలో
ఆగస్టు 16-17, 2025 తేదీల్లో 14వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు హ్యూస్టన్ మహానగరంలో జరుగుతుంది. జాతీయ స్థాయి లో కేవలం తెలుగు భాషా, సాహిత్యాలకు మాత్రమే పెద్ద పీట వేసి 1998 లో ప్రారంభం అయిన ప్రతిష్టాత్మకమైన అమెరికా తెలుగు సాహితీ సదస్సుల పరంపరలో అట్లాంటా, చికాగో, డిట్రాయిట్, న్యూ జెర్సీ, హ్యూస్టన్, ఫ్రీమాంట్, ఇండియానాపోలిస్, వాషింగ్టన్ డి.సి, ఆర్లాండో, టొరంటో, మిల్పిటస్ ల తర్వాత ప్రత్యక్ష వేదిక మీద జరుగుతున్న ఈ 14వ అమెరికా తెలుగు సాహితీ సదస్సుకు అందరూ ఆహ్వానితులే.
వక్తలకు ఆహ్వానం
ఈ సాహితీ సదస్సులో వక్తలు గా పాల్గొని తమ ప్రసంగాలు వినిపించ దలచుకున్న రచయితలు, కవులు, పండితులు, విశ్లేషకులు, సాహితీవేత్తలు, భాషాభిమానులు వెనువెంటనే ఈ క్రింది లింక్ లో తమ ప్రసంగ ప్రతిపాదనలను పంపించమని కోరుతున్నాం. ప్రసంగాంశాలు ప్రాచీన సాహిత్యం నుంచి ఆధునిక పోకడల దాకా తెలుగు భాష, సాహిత్యాలకు మాత్రమే పరిమితమై ఉండాలి. గడువు తేదీ లోపు పూర్తి ప్రసంగ వ్యాసం పంపిన వారికి మాత్రమే వక్త లు గా అవకాశం ఇవ్వబడుతుంది. స్వీయ రచనా పఠనం (కవిత, చిన్న కథ) విభాగంలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్నవారు కూడా ఈ క్రింది లింక్ లో స్పందించమని కోరుతున్నాం.
https://docs.google.com/forms/d/e/1FAIpQLSfhtp5ZUfYeJrqCYHxMXupalrbSc70hvsN4Ht7ECqB5GuA8Iw/viewform
ప్రసంగ ప్రతిపాదనలు మాకు అందవలసిన ఆఖరి తేదీ: జులై 31, 2025
సంప్రదించవలసిన చిరునామాలు
అధ్యక్షులు
వంగూరి చిట్టెన్ రాజు: vangurif...@gmail.com: WhatsApp: 832 594 9054
శ్రీకాంత్ రెడ్డి pres...@tcahouston.org: WhatsApp: 425 679 1151
సంధాన కర్త
శాయి రాచకొండ: sair...@gmail.com: WhatsApp: (281) 235-6641
సంచాలకులు
సుధేష్ పిల్లుట్ల: sud...@gmail.com: WhatsApp: (281) 773-1017
కావ్య రెడ్డి: cult...@tcahouston.org: WhatsApp: (510) 779-7075