దిగ్విజయంగాముగిసిన 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు & విజయోత్సవాలు- దోహా, ఖతార్

2 views
Skip to first unread message

Raju Vanguri

unread,
Dec 1, 2024, 10:26:22 PM12/1/24
to vangurif...@googlegroups.com, AKV/2019/A003 Venkappa Bhagavatula, VIKRAM, Radhika Mangipudi, Sai Rachakonda, Ramaraju Vamsee
మిత్రులారా,

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా & ఆంధ్ర కళా వేదిక, దోహా సంయుక్త నిర్వహణలో ఖతార్ దేశ రాజధాని దోహా లో నవంబర్ 22-23, 2024 తేదీలలో జరిగిన 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు, నవంబర్ 30, 2024 న అంతర్ జాలం లో జరిగిన విజయోత్సవాలు అఖండ విజయాన్ని సాధించాయి.

వివరాలు జత పరిచిన ప్రకటనలో చూడండి. ఆసక్తి, సమయం ఉన్నవారు రెండు రోజుల 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు ఫొటోలు, భారత పూర్వ ఉపరాష్ట్రపతి గౌ. వెంకయ్య నాయుడు గారు, కవి జొన్నవిత్తుల,  ఆచార్య యార్లగడ్డ మొదలైన సాహితీ నిష్ణాతుల 60 పైగా సాహిత్య ప్రసంగాలు, డా. అద్దంకి శ్రీనివాస్ గారు సంచాలకులుగా, శ్రీమతి బులుసు అపర్ణ గారు అవధానిగా (తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డ్ గ్రహీత), మధ్య ప్రాచ్య దేశాలలో మొట్టమొదటి అష్టావధానం   ప్రొ. రామా చంద్రమౌళి గారి జీవన సాఫల్య పురస్కార సభ ..ఇలా ఎన్నో, ఎన్నెన్నో...ఈ క్రింది లింక్స్ లో చూసి, విని ఆనందించండి.

9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు, నవంబర్ 22, 2024 (మొదటి రోజు) చిత్ర మాలిక లింక్

https://drive.google.com/drive/folders/1oiuBeg8aKfqNjZaq0apGEvhq-Ez9e0fj

రెండవ రోజు 23 నవంబర్, 2024

https://drive.google.com/drive/folders/1pDuVa7kLOlllmAw8NRtOjKCzT6He6FEe

సదస్సు ప్రత్యక్ష ప్రసారం వీడియో లింక్స్:

https://tinyurl.com/VanguriTeluguSadassu

https://tinyurl.com/AKVTeluguSadassu



 

భవదీయులు,

వంగూరి చిట్టెన్ రాజు, భాగవతుల వెంకప్ప,

విక్రమ్ సుఖవాసి, రాధిక మంగిపూడి, శాయి రాచకొండ, వంశీ రామరాజు 

 

 

 

 

E-mail 11.28.2024 పత్రికా ప్రకటన ఫొటోలతో .pdf
Reply all
Reply to author
Forward
0 new messages