ప్రధాన విభాగం – 30వ సారి పోటీ
ఉత్తమ కథానిక విభాగం విజేతలు
“కాంతా విరహగురుణా”- పాణిని జన్నాభట్ల, Boston, MA,)
$116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం
కాళిదాసు మేఘదూత పద్యం నుంచే ఎన్నుకున్న సందర్భోచితమైన పేరు, ఆసక్తికరమైన కథా గమనం, వాక్యాలలో మెరుపు, అలవోకగా సాగిన అందమైన శైలి,
అనూహ్యమైన ముగింపుతో అల్లిన కథ.
“నల్లమల్లె చెట్టు” - గౌతమ్ లింగా (Johannesburg, South Africa)
$116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
సంఘం చట్రం నిర్ధేశించిన ఒక్కో మెట్టు ఎక్కుతూ, ఒకటి ఏ కారణంతో నయినా ఎక్కని వారిని పొడిచి, పొడిచి సాధించే లోకరీతి
బాగా చూపించి, ముగింపు అకస్మాత్తుగా కాకుండా, వాస్తవానికి దగ్గరగా చూపించిన కథ.
ప్రశంసా పత్రాలు
‘లూసఫర్’ -నిర్మలాదిత్య (భాస్కర్ పులికల్), Tampa, FL
గడియారం మీదుగా తిరుగుతూ తాత్వికంగా సాగిన ఓ మనీషి కథ. విభిన్న వ్యక్తిత్వాలని, భావనలలో వైరుధ్యాలని, వైయుక్తమైన పరిణతితో కూడిన దృక్కోణాలని సమాంతరంగా చూపిన ఈ కథ అర్థవంతమైన ముగింపుతో చదువరులను ఆకట్టుకునే కథ.
‘తెలివి’ - మురళీశ్రీరాం టెక్కలకోట, Frisco, TX
ఏఐ (AI) దరిమిలా మనల్ని ముంచెత్తుతున్న తరుణంలో అంతర్లీనంగా లేవనెత్తిన సందేహాలు, భయాలు, తులనాత్మకంగా సూచించిన పరిష్కారాలతో ఈనాటి అవసరాలని ప్రతిబింబించే కథ.
ఉత్తమ కవిత విభాగం విజేతలు
“వర్ణాక్షరం” - గౌతమ్ లింగా, (జొహానెస్ బర్గ్, దక్షిణ ఆఫ్రికా)
($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
“నిశ్శబ్దంలో మహాశబ్దాన్ని వినగలిగే కవిత్వ నిర్వచన, నిర్దేశం చేసిన కవిత”
“కృత్రిమ మేధా వికూజనము” – స్వాతి శ్రీపాద (Detroit, MI),
($116నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
“ఊహ ఉనికిని స్కాన్ చేసి నగ్నంగా ఊరేగిస్తున్న సంబరం”, డిజిటల్ రాక్షస విలాస కేళి” అంటూ చొచ్చుకు పోతున్న
కృత్రిమ మేధ విస్ఫోటనానికి అద్దం పట్టిన కవిత.
ప్రశంసా పత్రాలు
“డయాస్పోరా ఉగాది పచ్చడి”- సావిత్రి మాచిరాజు, Edmonton, Canada
“డయాస్పోరా జీవితం లోని షడ్రుచుల మేళవింపు, అనునిత్యం ఉగాది పచ్చడి సేవింపు” అని చమత్కరించిన కవిత”.
“చెప్పిన మాట వింటా!”- అమృత వర్షిణి, Parker, CO, USA
“తూర్పున ఉదయించే సూర్యుడు నా కోసం పడమరలో ఉదయించడు ఎందుకని?” - ఒక ఆడ పిల్ల ఆవేదనకి కవితావేశం
“మొట్టమొదటి రచనా విభాగం” -17వ సారి పోటీ
“నా మొట్టమొదటి కథ” విభాగం విజేతలు
‘ప్రత్యూష రాగం -కైలాస్ పులుగుర్త’ – హైదరాబాద్,
($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
“మొదటి కథలోనే సున్నితమైన కథాంశాన్ని అనువైన భాష, సరైన వాక్యనిర్మాణం, నిర్మాణాత్మక ముగింపుతో చదివించే కథ”
“మనో నిశ్చలత” – సీతా సుస్మిత, మద్దిపాడు గ్రామం,ఒంగోలు - ప్రశంసా పత్రం
“బామ్మ పాత్ర ద్వారా సానుకూల దృక్పథం, నిశ్చలత చూపిన తీరు ఆకట్టుకుంటుంది. ముగింపులోనూ స్థిరత్వం, మూల కథతో సంధానం మెప్పించే కథ”
“మంకెన పూలు” -సుజాత గొడవర్తి, ఆశ్వాపురం, తెలంగాణా - ప్రశంసా పత్రం
“మొదటి కథయినప్పటికీ కుదురుగా సాగిన కథనం, వాక్యనిర్మాణం, ముగింపు ప్రశంసనీయం.”
"నా మొట్ట మొదటి కవిత” విభాగం విజేతలు
“ఇంకెంత కాలమని?” కరిపె రాజ్ కుమార్, ఖానాపూర్, నిర్మల్ జిల్లా, తెలంగాణా ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
“వర్షాగమనానికి ఆశగా ఎదురుచూసే ప్రకృతిని హృద్యంగా, కొంత కరుణాత్మకంగా వర్ణించే కవిత”
“అచ్చం నాలానే” -మళ్ళ కారుణ్య కుమార్, అమ్మవారి పుట్టుగ (గ్రామం), శ్రీకాకుళం- ప్రశంసా పత్రం
నిస్సారమైన మట్టి రేణువులతో కూడిన ధూళిలో తనను అవహేళన చేసే తన ప్రతిరూపం, పారే వాన నీటిలో ఆశావహంగా మారే పరిణామాన్ని వర్ణించే కవిత”
“వయసు ఒక అనిరిర్ధారిత సంఖ్య” - ప్రొఫెసర్ దుర్గా శశికిరణ్ వెల్లంచేటి, Bangalore, India- ప్రశంసా పత్రం
“ప్రతి మనిషకి ఆత్మ నిర్భరతా శిక్షణ అవసరాన్ని సూచిస్తూ, వయసుతో నిమిత్తం లేకుండా దానికోసం నడుం బిగించాలనే నిశ్చయానికి వచ్చిన వనిత పయనాన్ని వర్ణించే కవిత.”
న్యాయ నిర్ణేతలకి అభివాదాలతో, పోటీలో పాల్గొన్న రచయితలకి ధన్యవాదాలతో, విజేతలకు అభినందనలతో,
.