మిత్రులారా,
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా మరియు ఆంధ్ర కళా వేదిక, దోహా, ఖతార్ సంయుక్త నిర్వహణలో నవంబర్ 22-23, 2024 (శుక్రవారం, శనివారం) తేదీలలో 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు ఖతార్ దేశ రాజధాని దోహా మహానగరంలో జరుగుతుంది.
ప్రతిష్టాత్మకమైన ఈ అంతర్జాతీయ సాహితీ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు భాషా, సాహిత్యాభిమానులు అందరూ ఆహ్వానితులే.
ఖతార్, సౌదీ అరేబియా, కువైట్, బహెరైన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమాన్, అబుదాబి, రాస్ అల్ ఖైమాహ్ మొదలైన అనేక స్థానిక దేశాల తెలుగు సంఘాలు (సహకార సంస్థలు) పెద్ద ఎత్తున ఈ సదస్సులో పాల్గొంటున్నాయి.
మధ్య ప్రాచ్య దేశాలలో నివసిస్తున్నవారి సాహిత్యాభిమానానికి మొట్టమొదటిసారి ప్రపంచస్థాయి గుర్తింపుగా నిర్వహించబడడం ఈ ‘9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు’ ప్రత్యేకత.
పత్ర సమర్పణ ప్రతిపాదనలకు నమోదు
పత్రం
https://docs.google.com/forms/d/e/1FAIpQLSd6LndANIEpEGrw6iWd6QL4FwTCSdV2hP78R9puMOT356E4DA/viewform
స్వీయ రచనా పఠనం నమోదు పత్రం
https://docs.google.com/forms/d/e/1FAIpQLSd5DtdpYGv7z_BajdEwteUHI7zWGeeo6M2z1KepW1sE6lpBdQ/viewform
ప్రతినిధుల నమోదు పత్రం (Delegate Registration Form)-ప్రేక్షకులు
https://docs.google.com/forms/d/e/1FAIpQLSel7jY1my2d5pc-K2Du-BaF8XkztlbWibMA8a-whAJRgGLVBw/viewform
పూర్తి వివరాలకి జత పరిచిన సమగ్ర ప్రకటన చూడండి. వీలుంటే ఆసక్తి ఉన్న మీ బంధువులకీ, స్నేహితులకీ ఈ సమాచారం అందించి సహాయం చెయ్యండి.
భవదీయులు,
ప్రధాన కార్యనిర్వాహక వర్గం
9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు, దోహా, ఖతార్
అధ్యక్షులు: వంగూరి చిట్టెన్ రాజు, వెంకప్ప భాగవతుల
సంచాలకులు: విక్రమ్ సహవాసి, రాధిక మంగిపూడి