మిత్రులారా,
ఎలా ఉన్నారు?
ఆగస్ట్ 16-17 తేదీలలో హ్యూస్టన్ లో జరుగుతున్న 14వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు తాజా సమాచారంతో సమగ్ర ప్రకటన -3 జత పరిచాం..మీ కోసం.. అందరికీ సాదర స్వాగతం పలుకుతున్నాం.
క్లుప్తంగా....
తొలి సారి భారత దేశం నుంచి అమెరికా..అందునా హ్యూస్టన్ విచ్చేస్తున్న బుర్రా సాయి మాధవ్ (ఆర్.ఆర్.ఆర్, కల్కి, మహానటి, కృష్ణం వందే జగద్గురుం, మొదలైన అత్యంత విజయవంతమైన తెలుగు సినిమాల స్క్రీన్ ప్లే, సంభాషణల అగ్రశ్రేణి రచయిత), ప్రాచీన శాసనాలని వెలికితీసి తెలుగు భాష 3వ శతాబ్దం నాటి అని నిరూపించిన ప్రముఖ చరిత్రకారులు డా. ఈమని శివనాగిరెడ్డి, మాడభూషి సంపత్ కుమార్ (డైరెక్టర్, ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం) మొదలైన ఐదుగురు ప్రముఖులు, తొలి సారి హ్యూస్టన్ విచ్చేస్తున్న ఆచార్య కాత్యాయని విద్మహే, డా. జి. వల్లీశ్వర్ తదితర 15 మంది ప్రముఖ భారత దేశ సాహితీవేత్తలు, స్థానిక నగరాల నుండి ప్రముఖ అమెరికా సాహితీవేత్తలు ఈ సదస్సుకి తరలి వస్తున్నారు. చర్చా వేదికలు, అందరూ పాల్గొనే సాహిత్య పోటీలు, పుస్తకావిష్కరణలు, ఆర్యా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ పురోభివృధ్ధి కి వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా శాశ్వత నిధి ఏర్పాటు వేదిక, కొందరు అమెరికా సాహితీవేత్తల పేరిట ప్రత్యేక వేదికలు, స్వీయ రచనా పఠనం మొదలైనవి ఇతర ఆకర్షణలు.
మీ ఆర్ధిక సహకారానికి ప్రత్యేక విన్నపం
ఉత్తర అమెరికాలో తెలుగు సాహితీవేత్తలు రెండేళ్ళకి ఒక సారి కలుసుకునే ఏకైక, ప్రతిష్టాత్మకమైన ఈ 14వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు ప్రత్యక్ష వేదిక నిర్వహణ ఖర్చుల కోసం మీ ఆర్ధిక సహాయాన్ని అర్ధిస్తున్నాం. Please support us with your generous donation which is our oxygen and inspiration. Please see the information for donation categories and options to send in India also in the attached Samagra Prakatana-3.
భవదీయులు,
వంగూరి చిట్టెన్ రాజు (వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా)
Phone: 1 832 594 9054: Email: vangurif...@gmail.com
శ్రీకాంత్ రెడ్డి (అధ్యక్షులు, హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి)
14వ అమెరికా సాహితీ సదస్సు
కార్యనిర్వాహక వర్గం