మీరు పద్యాలు, గేయాలు, కథలు, నవలలు రాయాలనుకుంటున్నారా?
అయితే మీకోసం ఆరియా యూనివర్సిటీ (Aria University, Milpitas, CA, USA), 'సృజనాత్మక రచన' (Creative Writing) అనే రెండు ఎన్‌రిచ్‌మెంట్ కోర్సు లని అందిస్తోంది. జనవరి, 2026 మూడో వారంలో అంతర్జాల మాధ్యమం లో ప్రారంభం అయే “పద్యం-గేయం”, “కథ-నవల” అనే ఈ రెండు కోర్సులు వారానికి గంటన్నర సేపు 15 వారాల పాటు కొనసాగుతాయి.
అందులో "పద్యం-గేయం" అనే కోర్సుని వందలాది పద్యాలకు వ్యాఖ్యాత, వ్యాకరణ వేత్త అయిన ప్రొఫెసర్ డాక్టర్ అద్దంకి శ్రీనివాస్ గారు బోధిస్తారు. పద్య నిర్మాణం, శిల్పం, భాషను వ్యాకరణబద్ధంగా ప్రయోగించడం, యతిప్రాసల్లోని వైవిధ్యం, గేయ నిర్మాణంలోని మెలకువలు... ఇలాంటి విషయాలన్నీ సమగ్రంగా నేర్చుకోండి. ఈ కోర్సు ముగిసే నాటికి మీరు పద్యాలు, గేయాలను అలవోకగా రాయగలుగుతారు. అవధానం చేయడానికి సంసిద్ధులవుతారు. మరిన్ని వివరాలకి https://aria.edu/creativewriting-poetry/ చూడండి.
“కథ-నవల” కోర్సుని ప్రముఖ కథ, నవలా రచయిత్రి, కేంద్ర సాహిత్య ఎకాడెమీ తెలుగు విభాగ సంచాలకులు డా. సి. మృణాళిని గారు బోధిస్తారు. కథ, నవల సృజనాత్మకంగా, ఆసక్తికరంగా రాయడానికి ప్రారంభం, వస్తువు, కథనం, సన్నివేశాలు, సంఘర్షణ కూర్పు, సామాజిక స్పృహ, సాంఘిక సమస్యల గుర్తింపు, పరిష్కారం, ముగింపు, పాఠకుల పాత్ర మొదలైన మౌలిక సూత్రాల మీద అవగాహన కలిగి మంచి కథ, నవల రాయడానికి ఈ కోర్సు దోహదపడుతుంది. మరిన్ని వివరాలకి https://aria.edu/creativewriting-novel/ చూడండి.
ప్రపంచంలో ఏ దేశం నుంచి అయినా ఈ రెండు కోర్సులలోనూ చేరి పద్య, గేయ, కథ, నవలా రచనలో మీ నైపుణ్యాన్ని మెరుగు పరుచుకోవడానికి ఈ క్రింది లింక్ లో నమోదు చేసుకోవచ్చు. నమోదు ఆఖరి తేదీ జనవరి 23, 2026.
https://aria.edu/enrichment-courses/
For late admissions and more information, please contact:
1 844 872 8680 లేదా admis...@aria.edu
(Supported
by Vanguri Foundation of
America Endowment Fund for
Telugu Studies)