మిత్రులారా,
ఈ వారాంతంలో .....అనగా నవంబర్ 22-23, 2024 తేదీలలో మధ్య ప్రాచ్య దేశాలలో మొట్టమొదటి సారిగా ఖతార్ దేశ రాజధాని దోహా మహానగరంలో భారత పూర్వ ఉప రాష్త్ర పతి “పద్మవిభూషణ్” గౌ. ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు కుటుంబ సమేతంగా ప్రధాన అతిధిగా విచ్చేస్తున్న 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుకు రంగం సిధ్దం అయింది. స్థానిక చిన్నారుల స్వాగత నృత్యం, ఉపాధ్యాయుల సత్కారంతో సదస్సు ప్రారంభం అవుతుంది. ఖతార్ దేశం లో భారత రాయబారి ప్రత్యేక అతిధిగా విచ్చేస్తున్నారు.
మధ్య ప్రాచ్య దేశాల అధ్యక్షులు, భారత దేశం, అమెరికా, ఆఫ్రికా మొదలైన అనేక ప్రాంతాల నుండి సుమారు 75 మంది వక్తలు, 250 మంది సాహిత్య ప్రతినిధులు, తెలుగు రాష్త్రాల మంత్రి వర్యులు, సినీ గేయ రచయితలు, కవులు, పండితులు ఇప్పటికే చాలా మంది దోహా మహానగరం చేరుకున్నారు.
ప్రతిష్టాత్మకమైన ఈ 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు ప్రత్యక్ష ప్రసారం వంగూరి ఫౌండేషన్, ఆంధ్ర కళా వేదికల ఈ క్రింది You Tube Links లో ప్రపంచవ్యాప్తంగా ప్రసారం అవుతుంది. రెండు రోజుల సమగ్ర కార్యక్రమం జత పరిచాం.
Live You Tube Telecast Links
9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు, దోహా, ఖతార్ - నవంబర్ 22-23, 2024 (శుక్రవారం, శనివారం)
https://tinyurl.com/VanguriTeluguSadassu
https://tinyurl.com/AKVTeluguSadassu
ప్రపంచవ్యాప్తంగా ప్రసార సమయాలు: (నవంబర్ 22 -23, 2024)
Zone 1: 8:45 AM (Doha-Qatar); Zone 2: 11:15 AM (Hyderabad-India)
Zone 3: 1:45 PM (Singapore-Singapore): Zone 4: 4:45 PM (Melbourne-Australia)
Zone 5: - 5:45 AM (London-UK): Zone 6: 7:45 AM (Johannesburg-South Africa)
Zone 7: 11:45 PM Mid night of 21Nov24 (Houston-United States)
ఈ ప్రత్యక్ష ప్రసారం లో అందరి సాహిత్య ప్రసంగాలూ విని, రామా చంద్రమౌళి గారి జీవన సాఫల్య పురస్కార సభని వీక్షించి ఆనందించమని కోరుతున్నాం.
భవదీయులు,
ప్రధాన నిర్వాహకులు
వంగూరి చిట్టెన్ రాజు, భాగవతుల వెంకప్ప,
విక్రమ్ సుఖవాసి, రాధిక మంగిపూడి, శాయి రాచకొండ, వంశీ రామరాజు