మిత్రులారా,
మీ అందరి సహకారంతో మా తాజా ప్రచురణ డయాస్పోరా తెలుగు కథానిక -18వ సంకలనం (2024) ఈ వారాంతం..అనగా నవంబర్ 22-23, 2024 తేదీలలో జరుగుతున్న 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు, దోహా, ఖతార్ దేశం లో ప్రధాన అతిథి భారత పూర్వ రాష్ట్ఱపతి గౌ. ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు ఆవిష్కరిస్తారు అని తెలియజేయడానికి సంతోషంగా ఉంది. ఈ గ్రంధం మా 126వ ప్రచురణ.
మా విన్నపాన్ని మన్నించి ఈ డయాస్పోరా కథానిక సంకలనంలో ప్రచురణకి పరిశీలనార్ధం అనేక దేశాల నుండి తమ కథలని సకాలంలో మాకు అందించి సహకరించిన కథకులకి మా వేన వేల ధన్యవాదాలు తెలియ జేసుకుంటున్నాం. అన్ని కథలనీ పరిశీలించి, ప్రచురణ పరిమితులకి లోబడి మా సంపాదకుల బృందం ఎంపిక చేసిన 31 కథల పట్టిక జత పరిచాం. ఎంపిక అయిన ఆయా కథా రచయితలకి అందరి తరఫునా మా అభినందనలు, ధన్యవాదాలు తెలియ జేసుకుంటున్నాం.
భవదీయులు,
వంగూరి చిట్టెన్ రాజు, శాయి రాచకొండ, దీప్తి పెండ్యాల
సంపాదకులు
డయాస్పోరా తెలుగు కథానిక-18వ సంకలనం (2024)