9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు-2వ సమగ్ర ప్రకటన

3 views
Skip to first unread message

Raju Vanguri

unread,
Oct 9, 2024, 2:41:52 PM10/9/24
to vangurif...@googlegroups.com, తెలుగు మాట, houstonsahitilokam, TexasTelugu, tksba...@gmail.com, telug...@gmail.com, con...@tauae.org, tksq...@gmail.com, teluguka...@gmail.com, utafk...@gmail.com, Telugu Tarangini, AKV/2019/A003 Venkappa Bhagavatula, Radhika Mangipudi, Ramaraju Vamsee

మిత్రులారా, 

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా మరియు ఆంధ్ర కళా వేదిక, దోహా, ఖతార్ సంయుక్త నిర్వహణలో నవంబర్ 22-23, 2024 (శుక్రవారం, శనివారం) తేదీలలో ఖతార్ దేశ రాజధాని దోహా మహానగరంలో అట్టహాసంగా జరుగుతున్న 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు కు అన్ని ఏర్పాట్లూ ఇంచుమించు పూర్తి అయ్యాయి.  ఖతార్, సౌదీ అరేబియా, కువైట్, బహెరైన్, యునైటెడ్ రబ్ ఎమిరేట్స్, ఒమాన్, అబుదాబి, రాస్ అల్ ఖైమాహ్ మొదలైన మధ్య ప్రాచ్య దేశాల నుంచే కాక అమెరికా, కెనడా, భారత దేశం, ఆఫ్రికా, సింగపూర్ తదితర ప్రాంతాల నుండి సుమారు 100 మంది రచయితలు, కవులు, పండితులు సాహితీవేత్తలే కాక తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల నుండి ప్రముఖ మంత్రివర్యులు, నాయకులు కూడా ఈ సదస్సు ప్రాధాన్యతని గుర్తించి ఆసక్తితో పాల్గొంటున్నారు. 

మధ్య ప్రాచ్య దేశాలలో నివసిస్తున్న వారి సాహిత్య అభిమానానికి మొట్టమొదటిసారి ప్రపంచ స్థాయి గుర్తింపు గా నిర్వహించబడడం  ‘9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు ప్రత్యేకత.

ప్రతిష్టాత్మకమైన ఈ అంతర్జాతీయ సాహితీ సదస్సు కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు భాషా, సాహిత్య అభిమానులు అందరూ ఆహ్వానితులే. 

ప్రేక్షక ప్రతినిధుల నమోదు పత్రం:

ప్రేక్షక ప్రతినిధులుగా ఈ సదస్సులో పాల్గొని రెండు రోజుల పాటు నిష్ణాతుల సాహిత్య ప్రసంగాలు ప్రత్యక్ష వేదిక మీద వీక్షించి తెలుగు సాహిత్య సౌరభాలను ఆస్వాదించి ఆనందించ దలచుకున్న ప్రతినిధుల నమోదు పత్రం లింక్:

https://docs.google.com/forms/d/e/1FAIpQLSel7jY1my2d5pc-K2Du-BaF8XkztlbWibMA8a-whAJRgGLVBw/viewform

ఆర్థిక సహాయానికి విన్నపం:

ప్రతిష్టాత్మకమైన ఈ 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు దోహా మహానగరం లో నిర్వహణ ఎంతో ఖర్చుతో కూడుకున్నది అని మీకు తెలిసినదే! We are requesting generous financial support from supporters worldwide including the Middle East countries, India, USA to help pay for venue, food, hospitality for international delegates and invited guests of honor and related expenses. Please see the attached details on donation options and how to donate. All Donations in USA are tax-deductible. Suggested minimum donation in USA is $100 and Rs. 10,000 in India. All donors will be prominently recognized on and off stage as well as in the Public Publications & Proceedings of the Conference reaching out to thousands of Telugu people worldwide.

పూర్తి వివరాలకు జత పరిచిన సమగ్ర ప్రకటన చూడండి. వీలుంటే ఆసక్తి ఉన్న మీ బంధువులకు, స్నేహితులకు ఈ సమాచారం అందించి సహాయం చెయ్యండి. 

 

భవదీయులు, 

ప్రధాన కార్యనిర్వాహక వర్గం

9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు, దోహా, ఖతార్

అధ్యక్షులు: వంగూరి చిట్టెన్ రాజు, వెంకప్ప భాగవతుల 

సంచాలకులు: విక్రమ్ సుఖవాసి, రాధిక మంగిపూడి 

అంతర్జాతీయ సమన్వయ కర్తలు: డా. వంశీ రామరాజు (భారత దేశం), శాయి రాచకొండ (అమెరికా), లక్ష్మీ రాయవరపు (కెనడా),  రత్న కుమార్ (సింగపూర్), వెంకట్ తరిగోపుల (నార్వే), విక్రమ్ పెట్లూరు (జొహన్నెస్ బర్గ్). 

9వ ప్రపంచ సాహితీ సదస్సు- దోహా- ప్రకటన -2 .pdf
Reply all
Reply to author
Forward
0 new messages