అంతర్జాతీయ ఉగాది సాహిత్య సమ్మేళనం
సాదర ఆహ్వానం
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, శ్రీ సాంస్కృతిక కళా సారథి- సింగపూర్ & వంశీ ఇంటర్నేషనల్- భారత దేశం సంయుక్త ఆధ్వర్యంలో..
విశ్వావసు నామ సంవత్సర ఉగాది (మార్చ్ 30, 2025) సందర్భంగా
‘విశ్వావసు’ నామ ఉగాది శుభ సందర్భంగా కొత్త సంవత్సరానికి ‘సాహిత్య స్వాగతం’ పలుకుతూ వైవిధ్యభరితమైన సాహిత్యాంశాలతో రోజంతా జరిగే ఈ కార్యక్రమానికి విచ్చేసి ఆనందించమని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు కవులు, పండితులు, రచయితలు, సాహితీవేత్తలు, భాషాభిమానులందరికీ సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. ప్రవేశం ఉచితం.
తేదీ: ఏప్రిల్ 13, 2025, ఆదివారం
సమయం: ఉదయం 9:00 నుంచి రాత్రి 9:00 దాకా
వేదిక: శ్రీ త్యాగరాయ గానసభ, చిక్కడపల్లి, హైదరాబాద్.
పూర్తి వివరాలకు జత పరిచిన ఆహ్వాన పత్రిక, సమగ్ర కార్యక్రమం చూడండి. తప్పకుండా విచ్చేసి ఆనందించండి.
వంగూరి చిట్టెన్ రాజు, వంశీ రామరాజు
రాధిక మంగిపూడి, రత్నకుమార్ కవుటూరు