31వ ఉగాది ఉత్తమ రచనల పోటీ- విజేతల ప్రకటన

15 views
Skip to first unread message

Raju Vanguri

unread,
Mar 17, 2026, 1:42:08 PMMar 17
to vangurif...@googlegroups.com, Sai Rachakonda, Deepthi Pendyala, Ravisankar Vinnakota, Ramaraju Vamsee, Radhika Mangipudi, Ratna Kumar
2011 VFA new logo.jpg
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా

(1994 లో సంస్థాపించబడిన లాభాపేక్ష లేని తెలుగు సాహిత్య మరియు ధార్మిక సంస్థ)

vangurio...@gmail.com:  Phone:1 832 594 9054

--------------------------------------------------------------------------------------------------------------------------------------

31వ ఉగాది ఉత్తమ రచనల పోటీ

 విజేతల ప్రకటన

ముందుగా అందరికీ మన తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు

"శ్రీ పరాభవ” నామ సంవత్సర ఉగాది (మార్చ్ 19, 2026) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా నిర్వహించిన 31వ ఉగాది ఉత్తమ రచనల పోటీ లో ఈ క్రింది రచనలు ఉత్తమ రచనలుగా ఎంపిక కాబడ్డాయి. సమగ్ర ప్రకటన జత పరచబడిందివిజేతలందరికీ మా హృదయపూర్వక అభినందనలు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజీలండ్, దక్షిణ ఆఫ్రికా, మధ్య ప్రాచ్య దేశాల నుంచే కాక భారత దేశంలో పలు రాష్ట్రాల నుంచి ఈ పోటీలో పాలు పంచుకుని విజయవంతం చేసిన శతాధిక ఔత్సాహిక రచయితలకు,  లబ్ధప్రతిష్టులు అందరికీ మా వేనవేల ధన్యవాదాలు. అన్ని రచనలకూ ప్రచురణతో సహా సర్వహక్కులూ రచయితలవే. బహుమతి పొందిన రచనలు, ప్రచురణకి అర్హమైన రచనలూ కౌముది.నెట్ అంతర్జాల పత్రికలో వారి నిర్ణయానుగుణంగా ప్రచురించబడతాయి.

ప్రధాన విభాగం-ప్రపంచ రచనల పోటీ - 31వ సారి పోటీ

ఉత్తమ కథానిక విభాగం విజేతలు

మునక - సుంకోజు దేవేంద్రాచారి, కడప, భారత దేశం

 (US$200 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)

కథాంశం: జీవికకి ఆధారమైన పశువులని ఇంటి మనుషులల్లే ప్రేమగా చూసుకున్న సగటు గ్రామీణ రైతు వీరయ్య ప్రధాన పాత్రధారిగా అల్లిన ఈ కథ కొన్ని తరాల రైతు జీవితాలని, వారి మనస్తత్వాలని, ఆలోచనలని అద్దంలో చూపింది. కడపలో బండిలాగుడు పోటీల నేపథ్యంలో సాగిన ఈ కథలో పాత్రల స్వభావ చిత్రీకరణని కథకుడు నేర్పుగా అల్లిన వైనం, ఎక్కడా కృతకంగా సందేశాలు ఇచ్చే ధోరణి కనబడకుండా అత్యంత సహజంగా కథ నడిపించిన విధానం ఆకట్టుకుంటాయి.  ఒక్క క్షణం ఆగి, మరొక్కసారి చదవాలనిపించేలా ప్రభావవంతంగా ఉన్న కొన్ని అర్థవంతమైన వాక్యాలు, కొడుకుతో సంభాషణలో కొన్ని సూటి వాక్యాలు కథకి మరింత బలమయ్యాయి.

అటానమస్ఏజెంట్’- డా॥ కె. గీత- Morgan Hill, CA, USA

(US$200 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)

కథాంశం - ప్రపంచమంతా ఎక్కడ ఏ నలుగురు కలిసినా మాట్లాడుకుంటున్న కృత్తిమ మేధస్సు అంశం క్రమంగా మనిషి ఉద్యోగ జీవితంలో భాగమవుతున్న తరుణంలో  ఓ భారతీయ అమెరికన్ దైనందిన జీవితం చూపుతూ సాగిన ఈ కథలో చివరి మలుపు ఆసక్తికరంగా ఉంటుంది. విపరీతమైన పురుషాహంకారంతో భార్య జీవితాన్ని అదుపు చేస్తూండాలని చూసే యువకుని జీవితాన్ని  అటానమస్ ఏజెంట్ తన చేతిలోకి తీసుకోబోవటం, తనే నిర్ణయాలు తీసుకోవటం చివరి ఒక్క వాక్యంలో అంతర్లీనంగా ఓ ప్రతీకగా మెరిసి సన్నగా నవ్విస్తుంది.

చచ్చేంత ప్రేమ! -  సుగుణా రావు, విశాఖపట్నం, భారత దేశం (ప్రశంసా పత్రం)

కథాంశం: ఈ కథ ఆత్మహత్యలని చర్చిస్తుంది.  ఈ ఆత్మహత్యలలో అదృశ్య  హంతకురాలుగా ఈ సమాజం పాత్ర ఉంటుందని

చెబుతుంది. మానసిక ధృడత్వం, పరిణతి ఉందనిపించిన కౌన్సెలర్ వాసంతి కథ, బలహీన మనస్కురాలయిన రేణుక కథ.

రాజయోగిని ఊర్మిళ’ - డా. సి.యస్.జి. కృష్ణమాచార్యులు, పుదుచ్చేరి, భారత దేశం (ప్రశంసా పత్రం)

కథాంశం: అద్భుతమైన మొదలు, ముగింపు, ఎత్తుగడ, కథనం, అందమైన వాక్యనిర్మాణం, అలనాటి అయోధ్య వాతావరణాన్ని   ప్రతిబింబించిన కథ.

కొన్ని సమయాల్లో కొందరు మనుషులు- దేశరాజు, హైదరాబాద్ (ప్రశంసా పత్రం)

కథాంశం: మహానగరం మహనగరంగా మారడానికి కారణమైన ఒక హై రైజ్ ఎపార్టె మెంట్ లో ఈ నాటి గృహప్రవేశం కథాంశంగా సరదాగా సాగి, చివరలో సన్నటి ఆలోచన వదులుతూ ముగించిన కథ.

============================================================

ఉత్తమ కవితా విభాగం విజేతలు

పునరపి” - ర్యాలి ప్రసాద్- కాకినాడ, అంధ్ర ప్రదేశ్

(US$200 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)

(కవితాంశం: అందీ అందని భావాలతో, తరచిచూడటానికి అవకాశం ఇస్తూ ఏ జన్మ తాళం చెవితోనో తెరిచిన జ్ఞాపకాల పెట్టె)

వెళ్ళిపోయిన మేఘం- పరకపల్లి యాదగిరి- సిధ్ధి పేట, తెలంగాణా

 (US$200 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)

(కవితాంశం: జీవితమంటే ముందుకు సాగిపోవటమే కాదు వెనక్కి నడవటం కూడా అంటూ నిరంతరం వెంటాడే గతాన్ని పలు దృశ్యాలుగా కనులముందు చూపించే కవిత)

భ్రమ- విభ్రమ- గుడిపాటి వెంకట హేమలత- గుంటూరు, ఆంధ్ర ప్రదేశ్ (ప్రశంసా పత్రం)

(కవితాంశం:ఒక సమగ్రమైన వాక్యంతో మొదలై, ఒక సాధారణ గృహిణి జీవితంలోని పలు అంశాలను ఆర్తితో వర్ణించే కవిత)

కృత్రిమ మేధ’ - సతీష్ గొల్లపూడిChrist Church, New Zealand (ప్రశంసా పత్రం)

(కవితాంశం:సమకాలీన అంశమైన కృత్రిమ మేధలో కొరవడే ఆర్తిని, దాని ప్రయోజనాలని, పరిమితులని సంశయాత్మకంగా చర్చించే కవిత)

============================================================

మొట్టమొదటి రచనా విభాగం” -19వ సారి పోటీ

నా మొట్టమొదటి కథవిభాగం విజేతలు

ప్రజ్ఞా నిధి’- పృథ్వి భరద్వాజ్ –దుబాయ్, United Arab Emirates ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)

కథాంశం: తన ఇల్లు ఏది అనే ప్రశ్నకి కళవళపడ్డ ప్రవాస భారతీయుడి కథ. తన ఉనికి అంటే  విడిచివచ్చిన నేలా ? ఏర్పరుచుకున్న బంధాలా? అని తరచిచూసుకుంటూ జీవనగమనంలోనే తేట సమాధానాలు కనుగొన్న డయస్పోరా కథ

 రంగుటద్దాలు - బుద్ధవరపు సూర్యకుమారి, హైదరాబాద్, తెలంగాణా, (ప్రశంసా పత్రం)

కథాంశం:: పిల్లలు వద్దనుకున్న జంట కథ. ప్రారంభం, ముగింపు, సాగే విధానం, శిల్పం అన్నీ సరిగ్గా అమరాయి.

నంది తల తిప్పింది- ఇప్పిలి మధు –విజయనగరం, ఆంధ్ర ప్రదేశ్ (ప్రశంసా పత్రం)

కథాంశం: పనే దైవమనే తాత తర్కంతో పూర్తిగా ఏకీభవించక, మాయల్లో, ఊర్లో జరిగిన వింతల్లో దైవాన్ని చూడబోయిన మనవడి కథ. హేతుబద్ధంగా తాత చెప్పిన మాటలు కథని ఆసాంతం చదివించాయి.

============================================================

నా మొట్టమొదటి కవితవిభాగం విజేతలు

అర్థరాత్రి సూర్యుడు చిందం రమేశ్, జగిత్యాల జిల్లా, తెలంగాణా

($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)

(కవితాంశం: లోలోపల రాచపుండులా తొలిచే మృత్యు భయాన్ని, దానికి లేపనంపూసిన తెల్లవారు కలని లోతైన వ్యక్తీకరణతో వర్ణించే కవిత)

కలం సాక్షిగా - సూర్య ప్రకాష్ – శ్రీకాకుళం, ఆంధ్ర ప్రదేశ్ (ప్రశంసా పత్రం)

(కవితాంశం:మధురమైన బాల్య స్మృతుల్ని తలచుకొంటూ, ఆ రోజులే బావుండేవనుకునే ఒక సగటు రిటైరీ మనోభావాల్ని ఆవిష్కరించే కవిత)

జీవితకాలం ముప్పై సెకన్లే…-- నాగుల దుర్గాభవాని -కరీం నగర్ జిల్లా, తెలంగాణా (ప్రశంసా పత్రం)

(కవితాంశం:వంటను సంకేతంగా తీసుకుని, వేగం పెరిగి, సారం తరిగిన ఆధునిక జీవితాన్ని అభివర్ణించే కవిత)

 

యువతరం విభాగం (5వ సారి పోటీ)

యువతరం కథా విభాగం విజేతలు

అంకురం- ఎం. ప్రణతి-విజయ నగరం, ఆంధ్ర ప్రదేశ్

($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)

కథాంశం: చీమల దాడితో ప్రాణం పోతుందేమో అనే నేరేడు పండు పోరాడి మొలక ఎత్తిన ఉపమానంతో పరీక్షలో ఫైల్ అయి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం విరమించిన ఈనాటి సమాజాన్ని ప్రతిబింబించే ఒక యువకుడి కథ. 

సిరి’ – ఎమ్ శర్వాణి – విశాఖ పట్నం- ఆంధ్ర ప్రదేశ్

($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)

కథాంశం: పెంపుడు జంతువులు కూడా వాటి తరతరాలకీ మనతో అనుబంధం కాపాడుకుంటాయి అనే నేపధ్యంతో వ్రాసిన కథ. 

============================================================

యువతరం కవిత విభాగం విజేతలు

నిశ్శబ్దపు ఒడి- చింతకింది శివశంకర్ - అంబట్ పల్లి గ్రామం, నాగర్ కర్నూల్ జిల్లా, తెలంగాణా 

($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)

(కవితాంశం: ఏ తెల్లారివేళకో గాని దొరకని ఒక సాంత్వన కోసం రాత్రంతా చూసే ఎదురు చూపుల్ని వివిధ పదచిత్రాలతో అనుభవంలోకి తెచ్చే కవిత)

వేకువ కళ్ల లాంతరు- జె.డి. వరలక్ష్మి- గోకవరం, తూ.గో. జిల్లా, ఆంధ్ర ప్రదేశ్

($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)

(కవితాంశం:బ్రతుకంతా కష్టాలు, అవమానాలు,ప్రేమరాహిత్యంతో బాధపడే ఒక మాతృమూర్తి జీవితాన్ని జాలిగా వర్ణించే కవిత)

============================================================

విజేతలు, న్యాయ నిర్ణేతలు, ప్రపంచవ్యాప్తంగా పోటీలో పాల్గొన్న వందలాది రచయితలకు అభివాదాలతో..

భవదీయులు

శాయి రాచకొండ, దీప్తి పెండ్యాల, విన్నకోట రవిశంకర్, వంగూరి చిట్టెన్ రాజు

31 వ ఉగాది ఉత్తమ రచనల పోటీ విజేతల ప్రకటన.pdf

Raju Vanguri

unread,
Apr 1, 2026, 2:22:50 PM (3 days ago) Apr 1
to vangurif...@googlegroups.com, Sai Rachakonda, Deepthi Pendyala, Ravisankar Vinnakota, Ramaraju Vamsee, Radhika Mangipudi, Ratna Kumar, kiran Prabha

మిత్రులారా, 

శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా నిర్వహించిన 31వ ఉగాది ఉత్తమ రచనల పోటీ లో విజేతలుగా ఎంపిక అయిన అన్ని కథలూ, కవితలూ ఈ రోజే విడుదల అయిన కౌముది.నెట్ అంతర్హాల పత్రికలో ప్రచురించబడ్డాయి.  కౌముది సంపాదకులు కిరణ్ ప్రభ & క్రాంతి గార్లకి అందరి తరఫునా ధన్యవాదాలు తెలియజేస్తూ....ప్రధాన విభాగం, "మొట్టమొదటి రచన", యువతరం విభాగాలలో బహుమతి పొందిన ఆయా కథలు, కవితలూ చదివి మీ అభిప్రాయలతో స్పందించమని కోరుతున్నాం. 
రచనలు చదివే లింక్: 



భవదీయుడు,


వంగూరి చిట్టెన్ రాజు

Reply all
Reply to author
Forward
0 new messages