భావిభారత పౌరులను విశిష్ట వ్యక్తులుగా ప్రతిష్ఠిస్తూ నిర్వహిస్తున్న చారిత్రక కార్యక్రమానికి ఇదే మా ఆహ్వానం...
ఒక ఆశయం... వేయి ఆకృతులు...
వెలుగు నింపాలన్న కోరిక.. నీడనివ్వాలన్న ఆకాంక్ష... జ్ఞానం పంచాలన్న తపన....
వీటన్నిటి మధనంతో రూపుదిద్దుకున్న సమగ్ర విద్యావికాస కేంద్రమే అక్షరవనం…
ఒక్కో మొక్కా వేయి పూలనివ్వాలని…
ఇక్కడ వికసించిన ఒక్కో విద్యార్థీ వేయి జ్ఞానదీపాలు వెలిగించాలని…
అలా వెలిగిన ఒకో దీపం వేయి యోజనల వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ….
వేయిమంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల చేతులమీదుగా “అక్షరవనాన్ని” ఆవిష్కరిస్తున్నాం...
ఆశిర్వాదించాల్సిందిగా కోరుతూ....
తేది: 28, నవంబర్ (శనివారం) - ఉదయం 10 గం!! లకు...@ అక్షరవనం, సిబిఎం కాలేజీ పక్కన, దేవరకొండ రోడ్, కల్వకుర్తి, మహబూబ్ నగర్ జిల్లా..
(Please consider this as personal invitation and grace the occasion with your presence and blessings)