Workshop on
"The Art of Parenting"
(13 Jan to 17 Jan (Monday - Friday), 2020 at Aksharavanam, Kalwakurthy)
మానవ జీవితంలో మధురాతి మధురమైనది బాల్యదశ..
"తొలి తొలి గోరి కోనన్ బాలునికి దగుం బాడిమేయిన్"
ఎంత మనం పిల్లలకు బాలశిక్షలు నూరిపోసినా, చదువులు వంటపట్టక పోవచ్చు. స్వతహాగా తెలివితేటలున్నా, పిల్లలలో దాగిన ఆ తెలివితేటల్ని, చురుకుదనాన్ని తెలిసేలా చెయ్యడమే మనం వారికి అందించే అసలైన విద్య.
విద్య అంటే తరగతులు, స్థాయిలు..చదువు అంటే మార్కులు, గ్రేడ్ లు ఎంతమాత్రం కానేకావు.
ప్రకృతి గురించిన అవగాహన, పరిసరాల గురించిన ఆలోచన, తోటి మనిషిని ప్రేమించే గుణం వారికి అందించాలనే ఉద్దేశంతో మన సంస్కృతికి తగ్గట్లుగా - తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు, మేనమామలు, అత్తలు, బాబయ్యలు, చిన్నమ్మలు పెదనాన్నలు, అమ్మక్కలు, అక్కల్లు, అన్నలు - చెప్పినట్టుగా కాస్త, నడత, సంస్కారం, సంప్రదాయం, సంస్కృతి వైపు తీసుకువెళ్లే దిశగా మనం సింహావలోకనం చేసుకొని, పిల్లల భావిబాటకు సోపానాల్ని నిర్మిస్తూ జీవితాలని పునర్మూల్యాంకనం చేసుకుందాం.
తమ పిల్లలు సమర్ధంగా అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో వందేమాతరం విద్యాపరిశోధన శిక్షణ కేంద్రంగా చేసిన విస్తృత శోధన ఆధారంగా ఈ జనవరి 13 నుండి 17 జనవరి వరకు కల్వకుర్తిలోని 'అక్షరవనం' లో ఐదురోజుల "The Art of Parenting" శిబిరం..
విమానంలో ఎగరటం కన్నా పిల్లలతో గాలిపటం ఎగిరించటం ఎంతో ఆనందదాయకమో.. ఈ సంక్రాంతి సందర్బంగా శిబిరంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తూ...
-మీ
వందేమాతరం ఫౌండేషన్
రిజిస్ట్రేషన్: https://forms.gle/Nm3V5NxuVS96LtpD8