కొమర్రాజు లక్ష్మణరావు తెలుగు వికీమీడియా పురస్కార ఫలితాలు

17 views
Skip to first unread message

తెలుగు వీర

unread,
Dec 29, 2013, 1:28:06 AM12/29/13
to telug...@googlegroups.com, telug...@googlegroups.com

తెలుగు నెజ్జనులందరికీ మళ్లీ నమస్కారాలు,

తెలుగు వికీపీడియా పది సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రారంభించబడిన కొమర్రాజు లక్ష్మణరావు తెలుగు వికీమీడియా పురస్కారానికి[1] వచ్చిన ప్రతిపాదనలను[2] ఎంపిక మండలి పరిశీలించడం పూర్తి అయ్యింది. ముందుగా ప్రతిపాదిత సభ్యులకు, ఆయా ప్రతిపాదనలను ప్రారంభించి, మద్దతు ఇచ్చి, విస్తరించి ఈ ప్రక్రియలో క్రియాశీలకంగా పాల్గొన్న తెలుగు వికీ సభ్యులందరికీ మరియు మీ తోడ్పాటుకి ధన్యవాదాలు.

ఈ పురస్కారానికి 28 ప్రతిపాదనలు రాగా వాటిలో 18కి ప్రతిపాదిత సభ్యులు అంగీకారం తెలిపారు.ఈ పురస్కారపు తొలివిడతగా ఈ సంవత్సరం, గత దశాబ్ది కాలంలో చేసిన కృషిని గుర్తిస్తూ పది పురస్కారాలు ఇవ్వాలని ఎంపిక మండలి నిర్ణయించింది. దీనికి ఎంపికైన అభ్యర్ధులు, మూల్యాంకన వరుసక్రమంలో చదువరి,ఎం.ప్రదీప్, చావా కిరణ్, వీవెన్, పాలగిరి, రవిచంద్ర,అహ్మద్ నిసార్, శశి,జె.వి.ఆర్.కె.ప్రసాద్,మరియు భాస్కర నాయుడు. వీరికి దశాబ్ది ఉత్సవాలలో నగదు బహుమతి మరియు పురస్కారము ఇవ్వబడుతుంది. వీరి చిత్రాలు, పురస్కార ప్రధానాంశాలు తెలుగు మరియు ఆంగ్లములో [3] చూడవచ్చు. కృషి గణాంకాలు మరియు వికీ అభివృద్ధికి దోహదపడిన గుణాత్మక అంశాల విశ్లేషణ[4] మరియు మూల్యాంకనం [5] కూడా చూడవచ్చు.

అంగీకారం తెలపని ప్రతిపాదిత సభ్యులు మరియు వికీమీడియా ప్రాజెక్టుల అభివృద్ధికి తోడ్పడిన ఇతర సభ్యుల కృషిని గుర్తిస్తూ ఎంపిక మండలి ప్రశంసాపత్రమివ్వాలని నిర్ణయించింది. దీనికి ఎంపికైన మొత్తము 30 సభ్యుల వివరాలు[6] చూడవచ్చు. వీరికి ప్రశంసా పతకం (ఎలెక్ట్రానిక్) త్వరలో వారివాడుకరి చర్చాపేజీలలో ఇవ్వబడుతుంది.

ఈ పురస్కారాలను రూపకల్పన దిశ నుండి దాదాపు వేయి గంటల సమయాన్ని వెచ్చించిన ఎంపిక సంఘం సభ్యులు, అర్జునరావు,రాజశేఖర్, రాధాకృష్ణ మరియు సుజాతగార్లకు నా కృతజ్ఞతలు. ఈ పురస్కారాలను రూపకల్పన చేసి, ఎంపిక సంఘం కార్యదర్శిగా కార్యభారాన్నంతా చాలా మటుకు మోసిన అర్జునరావు గారికి ప్రత్యేకకృతజ్ఞతలు. పురస్కారాలకై కావలసిన నిధులు సమకూర్చడానికి అంగీకరించిన తెవికీ దశాబ్ది ఉత్సవ కార్యనిర్వాహక వర్గానికి[7] ధన్యవాదాలు.

వైజాసత్య 

కొలరావిపు ఎంపిక మండలి అధ్యక్షుడు

1. పురస్కార వివరాలు, నియమ నిబంధనలు https://te.wikipedia.org/wiki/WP:KLRWP
2. ప్రతిపాదనల పేజీ https://te.wikipedia.org/wiki/Wikipedia:Komarraju_LakshmanaRao_Wikimedia_Award_Proposals
3. పురస్కార విజేతల వివరాలు https://te.wikipedia.org/wiki/WP:KLRWP/2013/Winners
4. ప్రతిపాదన అంగీకరించిన సభ్యుల కృషి గణాంకాలు మరియు అభివృద్ధికి దోహదపడిన అంశాల విశ్లేషణ https://te.wikipedia.org/wiki/File:KLRWP-2013_Applicants_work_Statistics_and_Factors_Aiding_Growth.pdf
5.మూల్యాంకనం https://te.wikipedia.org/wiki/WP:KLRWP/2013/Scoring
6. ఎంపిక మండలి ప్రశంసాపత్ర విజేతల వివరాలు https://te.wikipedia.org/wiki/WP:KLRWP/2013/Jury_Appreciation_Winners
7. తెవికీ దశాబ్ది ఉత్సవ కార్యనిర్వాహక వర్గం https://te.wikipedia.org/wiki/WP:TEWIKI10/Committee

Reply all
Reply to author
Forward
0 new messages