ఆహ్వానం : తెలుగు వికీపీడియా సదస్సు 2020 : ఈ శనివారం 08 ఫిబ్రవరి, 2020 న ఉదయం తొమ్మిది గంటలకు ఐఐఐటి గచ్చిబౌలి క్యాంపస్ హైదరాబాద్ లో

43 просмотра
Перейти к первому непрочитанному сообщению

Kaśyap కశ్యప్

не прочитано,
6 февр. 2020 г., 21:48:2406.02.2020
– తెలుగు మాట, తెలుఁగు వికీ గుంపు, telug...@googlegroups.com, telugublog, Telugu Vedika
TeWiki Feb 08 2020_Banner.png

నమస్కారం ,

తెలుగు భాషాభిమానులైన మీ అందరినీ ఈ శనివారం 08 ఫిబ్రవరి, 2020 న ఉదయం తొమ్మిది గంటలకు ఐఐఐటి గచ్చిబౌలి క్యాంపస్ హైదరాబాద్ లో ప్రారంభం అయ్యే తెలుగు వికీపీడియా సదస్సు 2020 కు సాదరంగా ఆహ్వానిస్తున్నాము. మన వికీపీడియాలో మన చరిత్ర, సంస్కృతి, ప్రముఖ వ్యక్తులు, భాష, మన నగరాలు, పట్టణాలు, గ్రామాలు, ఆహారం, పురాణాలు, లలిత కళలు, రచయితలు, విజ్ఞాన శాస్త్రం, సాంఘిక, వైద్య శాస్త్రం, జీవరాశులు, పుస్తకాలు, రాజ్యాంగ వ్యవస్థ ఇలా ఎన్నో విషయాలపై భావితరాల వారికి అందించటానికి తెలుగు వారందరి తోర్పాటు కావాలి మన తెలుగులో సమాచారం ఏది కావాలనుకున్నా తెలుగు వికీపీడియాలో చదువుకోవాలి, ఈ బ్రహాత్తర కార్యక్రమము కోసం అందరి సహకారం కావాలి.


భారతీయ భాషలలో ముఖ్యముగా తెలుగు వికీపీడియా అభివృద్ధికి ఐఐఐటి హైదరాబాద్‌ కూడా కృషిచేస్తోంది, ఇందులో భాగంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నాం , మీ వంటి ఔత్సాహికుల తోర్పాటుతో ఈ సదస్సు మరింత విజయ వంతం కావాలని ఆకాంక్షిస్తున్నాం !

తేదీ & సమయం : శనివారం 8 ఫిబ్రవరి 2020 ఉదయం 9:00 గంటల నుండి మధ్యాన్నం 1:00 గంట వరకు

వేదిక : కే ఆర్ బి ఆడిటోరియమ్ , కోహ్లీ బ్లాక్, ఐఐఐటీ, క్యాంపస్, గచ్చిబౌలి, హైదరాబాద్

ఈ ఉచిత  సదస్సులో పాల్గొనటానికి , ఐఐఐటి  భద్రతా విభాగంవారికి తెలియచేటానికి  దయచేసి ఈ గూగుల్ ఫారం లో మీ వివరాలు ఇవ్వగలరు https://forms.gle/8pnjBV9HeAYMWdFf7

ఈ సదస్సులో ప్రొఫెసర్ రాజ్ రెడ్డి, కార్నిగి మేలోన్ యూనివర్సిటీ ,పిట్స్ బర్గ్, ట్యూరింగ్ అవార్డు గ్రహీత, చైర్మన్ ఐఐఐటి హైదరాబాద్,

డా. జయప్రకాశ్ నారాయణ్ , ప్రొఫెసర్ కె. నాగేశ్వర్, ఉస్మానియా యూనివర్సిటీ, శ్రీ మామిడి హరికృష్ణ (భాష మరియు సంస్కృతిక శాఖ సంచాలకులు, తెలంగాణ ప్రభుత్వం) వక్తలుగా పాల్గొంటున్నారు.

ఫారం లో వివరాలు ఇవ్వటానికి ఏమైనా ఇబ్బంది ఉంటే ,  మీ రాకను తెలియజేస్తూ - RSVP - వాట్సాప్ / ఎస్ యమ్ ఎస్ - 99592 63974 / 93965 33666

ఇమెయిల్ ఐడి : tew...@iiit.ac.in

అందరు ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరని ఆశిస్తున్నాము

మీకు తెలిసిన తెలుగు మిత్రులకు , తెలుగు భాషా ప్రేమికులకు ఈ తెలుగు వికీపీడియా సదస్సు 2020 గురించి దయచేసి తెలియచేయండి .

మీ శ్రేయోభిలాషి 
కశ్యప్
Ответить всем
Отправить сообщение автору
Переслать
0 новых сообщений