తుర్లపాటి కుటుంబరావు గారి ఆత్మకథ తెలుగు వికీసోర్స్ లో ప్రథమంగా యూనికోడ్ మరియుఈ-ప్రతి (Epub) విడదల

50 views
Skip to first unread message

Arjuna Rao Chavala

unread,
Mar 4, 2014, 1:05:47 AM3/4/14
to telug...@googlegroups.com, తెవికి telugu wiki, telugublog
నమస్తే,

ప్రఖ్యాత పాత్రికేయుడు పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ తుర్లపాటి కుటుంబరావు గారి ఆత్మకథ నా కలం - నా గళం తెలుగు వికీసోర్స్ లో ప్రథమంగా యూనికోడ్ మరియుఈ-ప్రతి (Epub) విడదలైందని తెలుపుటకు సంతసించుచున్నాము. దీనికి ముఖ్యంగా సహాయపడిన సహ వికీసోర్స్ సభ్యులు రవిచంద్ర, పాలగిరి మరియు రాజశేఖర్ గార్లకు ధన్యవాదాలు. 

పుస్తకం గురించి రచయిత ఏమన్నాడో ఆయనమాటల్లోనే  చదవండి.

"నన్ను ఆత్మ కథ రాయాలని పదే పదే పెద్దలు - డాక్టర్‌ బెజవాడ గోపాలరెడ్డి గారి దగ్గర నుంచి నా సన్మాన సభలలో పాల్గొన్న ప్రముఖు లెందరో ఎప్పటి కప్పుడు నాపై ఒత్తిడి తెస్తూనేవున్నారు. అయితే, 'ఆత్మ కథ రాయడానికి అంత కథ నావద్ద లేదే!' అని ఆ పెద్దలతో వినమ్రతతో చెబుతూ వచ్చాను!

కాని, ఇటీవల జర్నలిస్టు మిత్రులనేకమంది, కొందరు రాజకీయ ప్రముఖులు "ఎందరో రాజకీయ, సినీ, సాహితీ ప్రముఖులతో మీరు కలిసిమెలిసి తిరిగారు. ప్రధానులు, ముఖ్యమంత్రులందరితో మీకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఆ సందర్భంగా మీకు ఎన్నో అనుభవాలు, ఆసక్తికర సంఘటనలు ఎదురై వుంటాయి. మీకు మాత్రమే తెలిసి, ఇతరులకు తెలియని ఎన్నో వింతలు, విశేషాల భాండాగారం మీ వద్ద వున్నది. అవి ఎవ్వరికీ తెలియకూడదనా మీ వుద్దేశం? అవి మీకు మాత్రమే పరిమితం కావాలనా మీ అభిప్రాయం? మీ "తదనంతరం" వాటిని ఎవరు చెప్పగలరు?" అంటూ వచ్చారు.

అటువంటి అభ్యర్ధనలకు పుస్తకంరూపం ఇచ్చిన తుర్లపాటి కుటుంబరావు గారి ఆత్మకథే నా కలం - నా గళం .

వికీసోర్స్ లో చదవండి లేక మరింత పైన గల లింకు వాడి మరింత సౌలభ్యమైన ఈ-ప్రతి (Epub) రూపంలో మీ టేబ్లెట్ లేక కంప్యూటర్ లోకి దించుకొని కాలిబ్రె (సాఫ్ట్వేర్) లాంటి చదువరి సాఫ్ట్వేర్ ఉపకరణంతో చదవండి.

ధన్యవాదాలు.
అర్జున
తెలుగు వికీసోర్స్ సభ్యుడు
Reply all
Reply to author
Forward
0 new messages