| దక్షిణ భారతదేశం ఆధునిక యుగం |
|
|---|---|
|
తన అనుదిన దర్శన సమయంలో సత్య సాయిబాబా
|
|
| పేరు: | సత్య సాయిబాబా |
| జననం: | నవంబరు 23, 1926 |
| సిద్ధాంతం / సంప్రదాయం: | అద్వైతం |
| ముఖ్య వ్యాపకాలు: | మతం, ధర్మం, సమాజం, ఆధ్యాత్మికం, నీతిబోధ |
| ప్రముఖ తత్వం: | మత సామరస్యం, సకల ప్రాణుల పట్ల ప్రేమ, religious syncretism, ఆహింస |
| ప్రభావితమైనవారు: | ఇస్సాక్ టార్గెట్, నారాయణ కస్తూరి, అబ్దుల్ కలామ్, అటల్ బిహారీ వాజ్‌పేయి, మన్‌మోహన్ సింగ్, టి.ఎన్.శేషన్, సుషీల్ కుమార్ షిండే, దానా గిల్లెస్పీ, ఆర్నాల్డ్ షుల్మాన్, బిల్ ఐట్కిన్, వ్లాడిమిర్ ఆంటొనోవ్, జొవాన్ బ్రౌన్, ఆలిస్ కోల్ట్రేన్, బెంజమిన్ క్రీమె, మేనార్డ్ ఫెర్గూసన్, పీటర్ ప్రుజాన్, గిరిజా ప్రసాద్ కొయిరాలా |
సంబంధిత పేరుగల మరికొన్ని వ్యాసాల కోసం అయోమయ నివృత్తి పేజీ సాయిబాబా చూడండి
సత్య సాయి బాబా (Sathya Sai Baba) 20వ శతాబ్దంలో ప్రసిద్ధి చెందిన మతగురువు[1] ఇతనిని 'గురువు' అనీ, 'వేదాంతి' అనీ, 'భగవంతుని అవతారం' అనీ పలువురు విశ్వసిస్తారు.[2][3] ఇతని మహిమల పట్ల చాలామందికి అపారమైన విశ్వాసం ఉంది.[4]
సత్యసాయి సంస్థ వారి సమాచారం ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 130 దేశాలలో 1200 వరకు సత్యసాయి కేంద్రాలున్నాయి.[5] సత్యసాయి బాబాను అనుసరించే వారి సంఖ్య 60 లక్షలు అని ఒక అంచనా కాగా కొందరు భక్తులు ఈ సంఖ్యను "5 నుండి 10 కోట్ల మధ్య" అని చెబుతారు.[6] ఇతను సాక్షాత్తు భగవంతుని అవతారమనీ, షిరిడీ సాయిబాబాయే మరల సత్య సాయిబాబాగా అవతరించాడనీ విశ్వాసం కలవారు అంటారు.
సత్యసాయిబాబా గురించి తెలుగు వికీపీడియాలో ఒకరు వ్రాసిన ఈ క్రింది విషయాలు ఆయన పట్ల విశ్వాసం కలవారి నమ్మకాలను ప్రతిబింబిస్తున్నాయి.
అయితే సత్య సాయిబాబాను గురించి ఇందుకు పూర్తిగా భిన్నమైన అభిప్రాయాలు కూడా బహుళంగా ఉన్నాయి. అతను ఒక 'సామాన్య వ్యక్తి' అన్న భావం నుండి 'ప్రజలను పెడమార్గం పట్టిస్తున్నాడు' అన్నంత వరకూ వ్యాఖ్యలు ఉన్నాయి.[7][8][9]
సత్య సాయిబాబా ను గురించిన భిన్న అభిప్రాయాలు కొన్ని ఈ వ్యాసంలోని విభాగాలలో ప్రస్తావించబడ్డాయి. అయితే సాయి బాబా స్వయంగా తానెవరో చెప్పినవి క్రింద వ్రాయబడ్డాయి[10]
సత్యసాయి బాబా , సత్యనారాయణ రాజుగా, 1926లో పెద్ద వెంకప్ప రాజు, ఈశ్వరమ్మ దంపతులకి, ఓ నిరుపేద వ్యవసాయ కుటుంబంలో, అనంతపురం జిల్లాలోని, పుట్టపర్తి అనే కుగ్రామంలో జన్మించాడు. సత్యనారాయణ వ్రతం తరువాత పుట్టిన సంతానం కనుక పిల్లవాడికి అలా పేరు పెట్టారు. బిడ్డ పుట్టిన సందర్భంలో ఇంట్లో సంగీత వాద్యాలు వాటంతకు అవే మోగాయి అని చెప్పుకుంటారు. [11]
ప్రొఫెసర్ నారాయణ కస్తూరి
రచించిన జీవిత కధ ప్రకారం వ్రతం తరువాత ఈశ్వరమ్మకు ఒక నీలిరంగు గోళం వంటి
కాంతి తనలో లీనమౌతున్నట్లుగా కల వచ్చింది. తరువాత ఆమె గర్భవతి అయ్యింది.[12] [13] బిడ్డ జననం తరువాత పక్కలో ఒక నాగుపాము దర్శనమిచ్చింది.[14] [15] కొందరు భక్తులు సాయిబాబాను నాగరాజుగా భావిస్తారు.[16] అయితే ఈ అనుభవాలను గురించి ఆ సమయంలో ఉన్న వ్యక్తులనుండే విభిన్న కధనాలు వినబడుతున్నాయి.[17]
దగ్గరలో ఉన్న బుక్కపట్నం గ్రామంలో సాయిబాబా ప్రాధమిక విద్య సాగింది.[18] చిన్న వయసులోనే నాటకాళు, సంగీతం, కవిత్వం, నటన వంటి కళలలో ప్రావీణ్యత కనబరచాడు. తరువాత ఉరవకొండ ఉన్నత పాఠశాలలో చదివాడు. మార్చి 8, 1940న
కొంత విచిత్రమైన ప్రవర్తన (తేలు కుట్టినట్లుగా) కనబరచాడు. ఈ సంఘటన తరువాత
అతని ప్రవర్తనలో మార్పులు కనబడసాగాయి. సమాధి స్థితిలో ఉన్నట్లుగా
ఉండేవాడు. పురాతన శ్లోకాలు చెప్పేవాడు. భోజనం సరిగా చేసేవాడు కాడు. 1940లో
తాను షిరిడీ సాయిబాబా (1838-1918కు చెందిన ఫకీరు) అవతారమని ప్రకటించఅడు. అదే పేరు తనకు పెట్టుకున్నాడు.[19]
కస్తూరి వ్రాసిన జీవిత చరిత్ర ప్రకారం అక్టోబర్ 20, 1940లో, తన 14 యేండ్ల
వయసు అప్పుడు, తన పుస్తకాలు వదిలేసి, "నా భక్తులు నన్ను పిలుస్తున్నారు.
నా పని నాకున్నది" అని చెప్పాడు. తరువాత మూడేండ్లు ఎక్కువ సమయం దగ్గరలోని
ఒక తోటలో చెట్టు క్రింద గడిపాడు. అప్పుడే అతనిచుట్టూ ప్రజలు గుమికూడడం
మొదలయ్యింది. వారితో అతను భజనలు చేయించేవాడు. ఆ సమయంలోనే తాను ఈ కాలానికి
చెందిన అవతారం అని ప్రకటించాడు. అప్పటినుండి సాయిబాబా అదే విషయం చెబుతూ వచ్చాడు. 1942 నాటి బుక్కపట్నం స్కూలు రికార్డులలో అతని పేరు ఉన్నది.[20]
1944లో అనుచరులు (భక్తులు) ఒక గుడిని కట్టారు. ప్రస్తుతం దానిని "పాత మందిరం" అంటారు.[21][22] ప్రస్తుతం ఆశ్రమమైన ప్రశాంతి నిలయం నిర్మాణం 1948లో మొదలయ్యింది.[23]
1963లో తన ప్రవచనంలో తాను శివుడు, శక్తిల అవతారమని ప్రకటించాడు[24] అదే ప్రవచనంలో తాను షిరిడీ సాయిబాబా అవతారమనీ, విష్యత్తులో ప్రేమ సాయిబాబాగా అవతరిస్తాననీ చెప్పాడు. ఇదే విషయాన్ని 1976లో పునరుద్ఘాటించాడు.[25] నారాయణ కస్తూరి వ్రాసిన జీవిత గాధ "సత్యం శివం సుదరం"లో ప్రేమ సాయిబాబా అవతరణ మైసూరు రాష్ట్రంలో జరుగనున్నదని వ్రాయబడింది.[26]
షిరిడీ సాయి బాబా భక్తురాలైన శారదాదేవి కధనం ప్రకారం తన మరణకాలంలో షిరిడీ
సాయిబాబా ఆమెకు "తాను మరో ఎనిమిది సంవత్సరాలలో 'సత్య' పేరుతో
ఆంధ్రప్రదేశ్‌లో అవతరిస్తాను" అని చెప్పాడు.[27]
(సత్యసాయిబాబా పేరు, జన్మదినం, జన్మ స్థలం ఈ కధనానికి సరిపోతాయి.). సత్య
సాయిబాబాకు ఇద్దరు అక్కలు, ఒక అన్న (కీ.శే.శేషమరాజు), ఒక తమ్ముడు
(కీ.శే.జానకి రామయ్య) ఉన్నారు.[28][29] 2003లో జరిగిన ఒక ప్రమాదంలో సత్యసాయిబాబా తొంటి ఎముకకు గాయమయ్యింది. 2005 నాటికి అతను చక్రాలకుర్చీ వాడుతున్నాడు. [30]
1958లో సత్య సాయిబాబా అనుచరులు సనాతన సారధి అనే అధికారిక పత్రికను ప్రచురిచడం ప్రారంభించారు.[31] 1960 నుండి పాశ్చాత్య దేశాలనుండి ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఉన్నవారు సత్యసాయిని సందర్శించడం అధికం అయ్యింది. ఒక్క 1968లో మాత్రమే ఈశాన్య ఆఫ్రికా ప్రాంతానికి సాయిబాబా భారత దేశం దాటి బయటకు వెళ్ళాడు.[32][33] కాని అతని అనుచరులు, భక్తులు, సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి.
1960లో ఒక ప్రవచనంలో తాను ఈ మానవ రూపంలో ఇంకా 59 సంవత్సరాలు ఉంటానని చెప్పఅడు.[34] 1984లో ప్రచురింపబడిన ఒక పుస్తకంలో బాబా ఇలా చెప్పాడని వ్రాయబడింది."నా పాత శరీరంలో నేను ముసలివాడను, బలహీనుడను అయ్యాను గాని ఈ క్రొత్త శరీరంలో అలా కాను."[35]
సాయిబాబాకు 'గీత' అనే పెంపుడు ఏనుగు ఉండేది. గున్నయేనుగుగా అతనికి బహూకరింపబడిన ఆ ఏనుగు ప్రశాంతి నిలయం ఉత్సవాలలో తరచు వాడేవారు. మే 22, 2007లో ఆ ఏనుగు చనిపోయింది. తరువాత 'సత్యగీత' అనే మరో ఏనుగు దాని స్థానంలో ఉంది.
సత్యసాయిబాబా తన జన్మ స్థలమైన పుట్టపర్తిలోనే ఇప్పటికీ నివాసం ఉంటున్నాడు. ఒకప్పటి ఈ చిన్న గ్రామం ప్రస్తుతం బాగా పెరిగిపోయింది. ఇక్కడ ఒక విశ్వవిద్యాలయం, చైతన్యజ్యోతి అనే ఒక పెద్ద మత ప్రదర్శనశాల (దీని డిజైనుకు పలు అవార్డులు లభించాయి)[36]), ఒక ఆధ్యాత్మిక మ్యూజియమ్, ఒక రైల్వే స్టేషను, ఒక కొండ అంచు క్రీడాంగణం, విమానాశ్రయం, ఇండోర్ క్రీడాంగణం వంటి పెక్కు సదుపాయాలు ఆవిర్భవించాయి.[37] పుట్టపర్తి ఆశ్రమంలో భారతదేశపు ప్రముఖ నాయకులు (అబ్దుల్ కలామ్, వాజ్‌పేయి వంటివారు) అతిధులుగా వచ్చారు.[38][39] సత్యసాయిబాబా 80వ జన్మదినోత్సవానికి ప్రపంచం నలుమూలలనుండి 10లక్షలమంది సందర్శకులు వచ్చారని అంచనా. ఇందులో భారత దేశం నుండీ, 180 ఇతర దేశాలనుండీ 13,000 మంది ప్రతినిధులు ఉన్నారు.[40]
సంవత్సరంలో అధికభాగం బాబా నివాసం ప్రశాంతి నిలయంలోనే ఉంటుంది. వేసవికాలం కొన్నిరోజులు బెంగళూరులోని "బృందావనం" ఆశ్రమంలో గడుపుతాడు. ఎప్పుడైనా కొడైకెనాల్‌లోని "సాయి శృతి ఆశ్రమం" వెళతాడు.[41]
సత్యసాయిబాబా మూడు ముఖ్య మందిరాలను స్థాపించాడు - అవి ముంబైలోని "ధర్మక్షేత్రం" లేదా "సత్యం", హైదరాబాదులోని "శివం", చెన్నైలోని "సుందరం"[42]. బాబా ఆశ్రమాలలో దినచర్య ఉదయం ఓంకార స్మరణ, సుప్రభాతాలతో మొదలవుతుంది. తరువాత వేద పారాయణ,
సంకీర్తన, భజనలు జరుగుతాయి. బాబా దర్శనం ఇస్తాడు. ముఖ్యంగా అక్టోబరు,
నవంబరు మాసాలలో బాబా ఇచ్చే దర్శనం పట్ల భక్తులకు ప్రత్యేక ఆకర్షణ ఉంది.
ఎందుకంటే బాబా జన్మ దినం ఈ కాలంలోనే వస్తుంది. [43]
దర్శనం సమయంలో బాబా సందర్శకుల, భక్తుల మధ్య నడుస్తూ వారిచ్చే నమస్కారాలను,
వినతి పత్రాలను స్వీకరిస్తాడు. విభూతిని 'సృష్టించి' పంచుతాడు. కొందరిని
ప్రత్యేక దర్శనానికి, మాట్లాడడానికి అనుమతిస్తాడు. ఇలా ఏకాంతంగా బాబాతో
మాట్లాడి ఆయనకు తమ మనసులోని మాటను విన్నవించుకోవడం భక్తులకు ఎంతో సంతోష
కారణంగా ఉంటుంది. అటువంటి దర్శన సమయాలలో బాబా భక్తుల మనసులోని మాటలను, ఇతర
అనూహ్యమైన విషయాలను వెల్లడిస్తుంటాడని అలా భక్తులు ఆశ్చర్యపడుతారని అంటారు.[44]. తన దర్శనం ఆధ్యాత్మిక ప్రయోజనాలను ప్రసాదిస్తుందని మాత్రమే బాబా చెబుతాడు.
ఇంకా ఆశ్రమం వెబ్‌సైటులో ఇలా వ్రాసి ఉంది. తనకు ఏ విధమైన ఏజెంట్లు లేరని బాబా తన సందేశాలలో స్పష్టంగా చెప్పారు. తనకూ తన భక్తులకూ మధ్య ఉన్న అనుబంధానికి అడ్డంకులు లేవు. అది వారి హృదయాల మధ్య ఉన్న అంబంధం
బాబా మహిమల గురించి విస్తృతమైన నమ్మకాలు, వివాదాలు ఉన్నాయి. కొన్ని పుస్తకాలలోనూ, పత్రికా రచనలలోనూ, ఇంటర్వ్యూలలోనూ బాబా అనుచరులు బాబా మహిమల గురించీ, వ్యాధి నివారణా శక్తిని గురించీ తరచు ప్రస్తావించారు.[46] కొన్ని సార్లు భక్తుల అనారోగ్యాన్ని బాబా తాను గ్రహించినట్లుగా చెప్పబడుతున్నది.[47] అను నిత్యం బాబా విభూతిని, కొన్ని మార్లు ఉంగరాలు, హారాలు, వాచీల వంటి చిన్న వస్తువులనూ "సృష్టించి" భక్తులకు పంచిపెడతాడని చెబుతారు. [48]
ప్రపంచ వ్యాప్తంగా భక్తుల ఇళ్ళలో బాబా పటాలు, పూజా మందిరాలు, విగ్రహాలు, పీఠాలనుండి విభూతి, కుంకుమ, పసుపు, పవిత్ర తీర్ధజలం, శివలింగాలు, చిన్న సైజు (ఇత్తడి, బంగారం) దేవతా మూర్తులు, ప్రసాదాలు (తినుబండారాలు), విలువైన మణులు, దారాలు వంటివి లభించడం జరుగుతున్నట్లు గురించి అనేక కధనాలున్నాయి. [49] [50] [51] [52] [53] [54]
కిర్లియన్ ఫొటోగ్రఫీ ద్వారా కాంతి పుంజాలను పరిశీలించి, విశ్లేషించడంలో నిపుణుడైనఫ్రాంక్ బారొవస్కీ బాబా కాంతిపుంజాన్ని (aura) పరిశీలించి చెప్పిన అభిప్రాయం - అంతకుముందు తాను పరిశీలించిన ఎవరి కాంతిపుంజాలూ బాబా కాంతి పుంజాలలా లేవు. బాబా సామాన్యమైన వ్యక్తి కాదు. దివ్యపురుషుడై ఉండాలి. బాబా కాంతిపుంజం చాలా విశాలమై దిగంతాలకు వ్యాపిస్తున్నది. ఇంతకు ముందెన్నడూ చూడని బంగారు, వెండి (రంగు) ఛాయలు అందులో కనిపిస్తున్నాయి.[55]
ఐస్లాండ్కు చెందిన మనో విజ్ఞాన శాస్త్రవేత్త ఎర్లెండర్ హెరాల్ద్ సన్
'నియంత్రిత పరిస్థితులలో' బాబాను అధ్యయనం చేయడానికి ప్రయత్నించాడు కాని
అందుకు అనుమతి లభించలేదు. అయినా ఆ శాస్త్రవేత్త బాబా మహిమలగురించి
విస్తృతంగా ఇతరులను ఇంటర్వ్యూ చేసి అధ్యనం చేసి తన పరిశోధనలను
ప్రచురించాడు. భక్తులనూ, పూర్వ భక్తులనూ ఇంటర్వ్యూ చేయడం ద్వారా అతనికి
అనేక అసాధారణ విషయాలు తెలియవచ్చాయి. బాబా గాలిలో తేలిపోవడం, ఒకచోటనుండి
మరోచోట ప్రత్యక్షం కావడం, అదృశ్యం కావడం, రాతిని మిఠాయిగా మార్చడం, నీటిని
మరో పానీయం లేదా పెట్రోలుగా మార్చడం, అడిగిన వస్తువులు సృష్టించి ఇవ్వడం,
తన దుస్తుల రంగు ఒక్కసారిగా మార్చడం, వ్యాధి నివారణ, కొంత ఆహారాన్ని
అధికంగా చేయడం, అనూహ్య దృశ్యాలు, స్వప్నాలు, ఒక చెట్టుపై మరొక కాయలు
కాయించడం, ప్రకృతిని నియంత్రించడం, వివిధ దేవతా మూర్తులుగా దర్శనమివ్వడం,
తేజోవంతమైన కాంతిని వెదజల్లడం - ఇటువంటి మహిమలు తమ స్వానుభవంగా కొందరు
భక్తులు చెప్పారు.[56].
ఈ సంఘటనలలో కొన్ని బైబిల్ క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు కనబరచిన మహిమలను
పోలి ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు జీవిత కధలో వ్యాధి నివారణ ఒక ముఖ్యమైన
మహిమ. బాబా కూడా వ్యాధులు నివారించినట్లు కొందరి అనుభవాలుగా చెప్పబడినా
గాని బాబా మహిమలలో ఈ అంశం అంత ప్రముఖమైనదిగా చెప్పబడడం లేదు. [57] [58]
ఈ విధమైన ఘటనలు దివ్య కార్యాలని బాబా చెప్పాడు కాని వాటిని గురించి
శాస్త్రీయమైన ప్రయోగ పరిశోధనలు చేయాలన్న శాస్త్రజ్ఞుల కోరికలను
తిరస్కరించాడు. ఈ 'మహిమలు' చేతివాటం పనులని విమర్శకులు తరచు అంటూ వచ్చారు.
ఏప్రిల్ 1976లో బెంగళూరు విశ్వ విద్యాలయం అప్పటి వైస్ చాన్సలర్ మరియు
భౌతిక శాస్త్రవేత్త, హేతువాది అయిన డా. హెచ్.నరసింహయ్య "మూఢ నమ్మకాలను,
మహిమలను హేతుబద్ధంగా పరిశోధించే సంస్థ"ను స్థాపించాడు. నియంత్రితమైన
(ప్రయోగానుకూలమైన) పరిస్థితులలో తన మహిమలను చూపమని ఈ కమిటీ బాబాకు
మర్యాదపూర్వకంగా లేఖ వ్రాసింది. ఆ పై మరో రెండు లేఖలు వ్రాసినా బాబా
స్పందించలేదు.[59]. వారి విధానం అనుచితంగా ఉన్నదని బాబా అన్నాడు. [60]
"ఇంద్రియాలకు లోబడేది విజ్ఞాన శాస్త్రం. అతీంద్రియమైనది ఆధ్యాత్మికం.
ఆధ్యాత్మిక సాధన ద్వారానే దానిని తెలుసుకోవచ్చును. విశ్వంలో అద్భుతాలలో
కొద్ది విషయాలను మాత్రమే విజ్ఞానశాస్త్ర్రం వెలిబుచ్చగలిగింది" - అని బాబా
అన్నాడు. [60]
"ఈ కమిటీ ప్రతికూల భావాలూ, ఈ పనికి వారిచ్చిన ప్రచారమూ, సాయిబాబా పట్ల
వారికున్న వ్యతిరేక భావమూ స్పష్టంగా ఉన్నాయి. కనుక కమిటీ ప్రయత్నాలు
ముందుకు సాగలేదు.ఠ - అని హెరాల్డ్సన్ వ్రాశాడు. తమ అభ్యర్ధనకు సాయిబాబా
మిన్నకుండడాన్నిబట్టి బాబా మహిమలు బూటకమని తేలుతున్నదని నరసింహయ్య అన్నాడు.[61] మొత్తానికి వార్తా పత్రిలలో ఈ విషయమై చాలా కాలం వాద ప్రతివాదాలు నడచాయి.[62] నరసింహయ్య స్థాపించిన కమిటీ 1977లో రద్దయ్యింది.
1992లో కెనడా దేశపు అసమ్మతి వాది డేల్ బేయర్స్టీన్ సాగించిన అధ్యయనం
ద్వారా బాబాకు అతీంద్రియ శక్తులున్నాయన్న కధనాలలో వాస్తవం లేదని
తెలుస్తున్నది- అని బాబా విమర్శకులలో ఒకడైన అలెక్జాండ్రా నగెల్ 1994లో ఒక
వ్యాసంలో పేర్కొన్నాడు - [63]. 1995 లో "Guru Busters",
అనే యు.కె. "చానల్-4" టెలివిజన్ కార్యక్రమంలో బాబా మహిమలను మోసాలుగా చూపే
విడియోటేపును ప్రదర్శించారు. తరువాత ఈ విడియోటేపులను ప్రత్యేక నిపుణులతో
విశ్లేక్షణ చేయించారు కాని "మోసం" అని ధృవీకరించే ఏ విధమైన ఆధారాలు
నిపుణులకు లభింపలేదు. [64]
2000 డిసెంబరు ఇండియా టుడే పత్రికలో ఐంద్రజాలికుడు పి.సి.సర్కార్ జూనియర్ బాబా చేసేవన్నీ మోసాలు అని ఆరోపించాడు. [65].
అలాగే బసవ ప్రేమానంద్ అనే ఔత్సాహిక ఐంద్రజాలికుడు బాబా ఒక కపటి అని
ఆరోపించాడు. బంగారు వస్తువులు సృష్టిస్తున్నట్లు చెప్పుకొన్నందున బాబా
"గోల్డ్ కంట్రోల్ చట్టాన్ని" ఉల్లంఘిస్తున్నాడని 1986లొ బాబా పై వ్యాజ్యం
కూడా దాఖలు చేశాడు. ఈ కేసు కొట్టివేయబడింది. కాని అతీంద్రియ శక్తి
చట్టప్రకారం గుర్తించబడలేదని మళ్ళీ ప్రేమానంద్ అప్పీలు చేశాడు. [66]
బాబా చూపే కొన్ని "మహిమ"లను తాను కూడా చేయగలనని 2004లో Secret Swami
అనే బి.బి.సి. కార్యక్రమంలో చెప్పాడు (చేతివాటం ద్వారా కొన్ని వస్తువులు
తెప్పించడం, నోట్లోంచి ఒక లింగం తీయడం వంటివి). అయితే కొందరు బాబా
విమర్శకులు కూడా బాబాకు కొన్ని అసాధారణ శక్తులున్నాయని అంగీకరిస్తున్నారని
అదే కార్యక్రమంలో చెప్పబడింది. [67]
సత్యసాయిబాబా 1971లో "వాల్టర్ కొవాన్"ను పునరుజ్జీవింపజేశాడని కధనం ఉంది.
ఇది నమ్మదగినదిగా అనిపించడంలేదని బ్రిటిష్ పాత్రికేయుడు మిక్ బ్రౌన్ తన
1998 రచన The Spiritual Touristలో పేర్కొన్నాడు.[68] [69] [70] [71]
లండన్ లో బాబా పటాలనుండి విభూతి రాలడం గురించి కూడా అదే పుస్తకంలో మిక్
బ్రౌన్ చర్చించాడు. ఈ కధనాలలో ఏమీ మోసం గాని, వాటం గాని లేవని అతను
అభిప్రాయపడ్డాడు.[72]
బాబా సర్వజ్ఞుడనే భావాలగురించి మిక్ బ్రౌన్ చెప్పినది - "బాబా చెప్పిన
భవిష్యత్ విషయాలు, బైబులులో చెప్పిన భవిష్యత్ విషయాలు, అసలు జరిగిన
విషయాలు - వీటిని skeptics పరిశీలించి ఆయా విషయాలలో పొంతన లేకపోవడం
గురించి స్పష్టంగా వ్రాశారు."[73]
అక్టోబర్ 2007లో సత్యసాయిబాబా తాను చంద్రునిలో "విశ్వరూపం" చూపుతానని
అన్నాడు. వేలాది జనం ఆశ్రమంలో గుమికూడారు. బాబా కూడా అక్కడికి వచ్చి ఒక
గంట ఉండి వెళ్ళిపోయాడు. ఏమీ జరుగలేదు. [74]
సత్యసాయిబాబా మంచి వక్త. తెలుగులో బాబా ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, బోధనలు అందరికీ అర్ధమయ్యేలాగా, ఉదాహరణలతో కూడి ఉంటాయి.[75] తాను సకల దేవతా స్వరూపుడనైన అవతారమని బాబా చెప్పాడు.[76] అంతే గాకుండా అందరిలోనూ దేవుడున్నాడనీ, అయితే ఆ సంగతి తనకు తెలిసినట్లు ఇతరులకు తెలియడంలేదనీ, అదే ముఖ్యమైన తేడా అనీ చెప్పాడు. ఈ బోధన అద్వైత సిద్ధాంతానికి దగ్గరగా ఉంది.[60]. మానవులు కామ క్రోధాది వికారాలకు దూరంగా ఉండాలని కూడా బోధించాడు.[60]
సత్యసాయి బాబా బోధనలు సకల మత సమైక్యతను (syncretism వెల్డిస్తాయి. కాని అవి అధికంగా హిందూ మతం సంప్రదాయాలను, విశ్వాసాలను ప్రతిబింబిస్తాయని ఒక పండితుని అభిప్రాయం[77]. తాను అందరిలో విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి, వేదాధ్యయనాన్ని సంరక్షించడానికీ అవతరించానని చెప్పాడు.[78].
సత్య సాయి బోధనలలో తరచు కనుపించే మరొక ముఖ్యాంశం - తల్లిదండ్రుల పట్ల
భక్తి. మాతృమూర్తులే సమాజాన్ని తీర్చి దిద్దుతారని, స్త్రీలను గౌరవించడం
జాతీయ కర్తవ్యమని బోధించాడు.[79]
ప్రపంచ వ్యాప్తంగా సాయి భక్తులు భజనలు చేయడం, ఆయన బోధనలను పఠించడం, సమాజ
సేవ చేయడం, వ్యక్తిత్వ వికాసాన్ని ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు
చేపడుతుంటారు. కాని వారి సంస్థలు "మిషనరీ" వ్యవస్థను పోలి ఉండవు. వాటిలో
భక్తి ముఖ్యమైన అంశం.[80] తన గురించిన పబ్లిసిటీని బాబా ప్రోత్సహించడు.[81] సాయి సత్సంగాలలో అన్ని దేవతల, గురువుల భజనలు సాగుతుంటాయి.
సాయి బోధనలననుసరించి సాయి సంస్థ ఐది మౌలికమైన కర్తవ్యాలను ప్రోత్సహిస్తుంది - అవి సత్యము, ధర్మము, అహింస, ప్రేమ, శాంతి[82]
ఇతర ముఖ్యమైన బోధనలు.[46]
సాయిబాబా బోధనలు ఈ క్రింది నాలుగు ముఖ్య విషయాల ద్వారా అవగతం చేసుకోవచ్చునని అంటారు:
భారత దేశంలో వివిధ వార్తా పత్రికలు సాయిబాబా ఉపదేశాలను తరచు ప్రచురిస్తుంటాయి.[83]
నేరుగా సత్య సాయి బాబా అధ్వర్యంలో గాని, అతని సేవా సంస్థల అధ్వర్యంలో గాని పెక్కు విద్యా, సేవా, దాన కార్యక్రమాలు నడుస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 166 దేశాలలో 10,000 సత్యసాయి సేవా సంస్థలున్నాయి.[84]
ప్రశాంతి నిలయంలోని సత్యసాయి ఉన్నతవిద్యా సంస్థ (Sri Sathya Sai Institute of Higher Learning) భారతదేశం మొత్తంలో జాతీయ విద్యాప్రమాణ తులనా మండలి ద్వారా "A++" రేటింగ్ పొందిన ఒకే ఒక సంస్థ.[85][86] ఇదే కాకుండా ఒక సంగీత విద్యాలయం, అనంతపూర్‌లో ఒక (మహిళా) ఉన్నత విద్యాలయం ఉన్నాయి.[87]
పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ మెడికల్ సైన్సెస్ (Sri Sathya Sai Institute of Higher Medical Sciences) 220 పడకలు గల ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. అప్పటి ప్రధాని పి.వి.నరసింహారావుచే 1991 నవంబరు 22న ప్రారంభింపబడింది. [88] బెంగళూరులోని శ్రీ సత్యసాయి ఇనస్టిట్టూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అన్ని హంగులూ గల 333 పడకల ఆసుపత్రి. [89] ఇది 2001 జనవరి 19న అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయిచే ప్రాంభింపబడింది.[90] ఇవన్నీ పేదవారికి ఉచితంగా వైద్య సదుపాయాలందిస్తున్నాయి. [91] ఏప్రిల్ 2004 నాటికి 2,50,000 మందికి బెంగళూరులో ఉచిత చికిత్స లభించింది. [92] అలాగే బెంగళూరు వైట్‌ఫీల్డ్ల్‌లోని సత్యసాయి జనరల్ హాస్పిటల్ లక్షలాదిమందికి ఉచిత వైద్యం అందించింది.[93] ఇంకా ఎన్నో వైద్యశాలలు గ్రామీణ పేదవారికి వైద్య సదుపాయాలు ఉచితంగా కలుగజేస్తున్నాయి. [84]
సత్యసాయి సంస్థలకు పెద్దమొత్తాలలో విదేశాలనుండి విరాళాలు లభిస్తున్నాయి. [94]
అనావృష్టి ప్రాంతమైన అనంతపురం జిల్లాలో అనేక మంచినీటి ప్రాజెక్టులు లక్షలాది ప్రజలకు త్రాగునీరు అందిస్తున్నాయి.[95][96] చెన్నై నగరానికి కూడా సత్యసాయి సంస్థల అధ్వర్యంలో 200కోట్ల రూపాయల పైన ఖర్చుతొ నిర్మించిన ఎంతో ఉపయోగకరమైన ప్రాజెక్టులు త్రాగునీరు సరఫరా చేస్తున్నాయి[97] [98] [99] [100] [101] [102] గోదావరి నదినుండి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు నీరు సరఫరా చేసే ప్రాజెక్టు నిర్మాణంలో ఉంది.[103] ఇంకా మెదక్, మహబూబ్ నగర్ జిల్లాలలోనూ, మహారాష్ట్ర లోని లాతూర్ జిల్లాలోను పెద్ద ప్రాజెక్టులు నిర్మించబడ్డాయి లేదా ప్రతిపాదనలో ఉన్నాయి. [96] [96]
ప్రపంచంలో అన్ని దేశాలలోనూ వ్యక్తిత్వాన్ని వికసింపజేసే విద్య (Educare, Education in Human Values) నేర్పే విద్యాలయాలను స్థాపించాలని వారి ఆశయం. ఇప్పటికి 33 దేశాలలో పాఠశాలలు ప్రాంభించారు.[104]
దేశ దేశాలలో సాయి సమితులున్నాయి. సత్యసాయి సమితివారి చిహ్నం ఐదు దళాల పద్మం. ఈ ఐదు దళాలు ప్రేమ, శాంతి, సత్యం, ధర్మం, అహింసలకు చిహ్నాలు. (ఇంతకు ముందు ఈ దళాలపై వివిధ మతాల చిహ్నాలుండేవి)
సత్యసాయి పబ్లికేషన్స్ ట్రస్ట్ వారు 'సనాతన సారధి' అనే మాస పత్రికతో బాటు 40 భాషలలో వెయ్యికి పైగా పుస్తకాలు ప్రచురించారు. వివిధ దేశాలలో వారి శాఖలున్నాయి. 2001లో "సాయి గ్లోబల్ హార్మొనీ అనే రేడియో స్టేషన్ ప్రాంభమైంది. [105]
సత్య సాయి బాబా మహిమలు, వాటి గురించిన భిన్నాభిప్రాయాలు, విమర్శల గురించి పై భాగంలో కొంత వ్రాయబడింది. ఇవే కాకుండా కొన్ని ప్రత్యేకమైన ఘటనలు బాబా వ్యక్తిత్వాన్ని గురించి, అతని సంస్థల గురించిన సంచలనాత్మకమైన విమర్శలకు కారణమయ్యాయి. జూన్ 6, 1993న నలుగురు వ్యక్తులు చాకులతో సాయిబాబా గదిలోకి దూరారు. ఇద్దరు అనుచరులను చంపారు. ఆ నలుగురు ఆగంతుకులూ చంపబడ్డారు. ఇది వార్తా పత్రిలలో ప్రముఖంగా వచ్చింది. తన 1993 గురు పూర్ణిమ ఉపన్యాసంలో బాబా 'తన అనుయాయుల మధ్య ఉన్న అసూయ ఈ ఘటనకు కారణం' అని బాబా చెప్పాడు కాని అంతకంటే వ్యాఖ్యానించలేదు.[106]. నలుగురు ఆగంతుకులనూ అక్కడే చంపవలసిన అవుసరం ఉందా అన్న విషయంపై కూడా పలు వాదోపవాదాలు జరిగాయి. [107]
ఇంకా ప్రైవేటుగా తనను సందర్శించ వచ్చిన వారి పట్ల సాయిబాబా లైంగిక ప్రవర్తన గురించిన 'ఫిర్యాదులు' కూడా తరచు వివాదాస్పదమయ్యాయి. [108]) [109] [107] [110] ముఖ్యంగా పాశ్చాత్య దేశాల పత్రికలలోనూ, టివి ఛానళ్ళలోనూ ఈ విషయమై విమర్శనాత్మకమైన కధనాలు వెలువడ్డాయి. [67] ఈ కధనాల గురించిన స్పందనలు కూడా తీవ్రంగానే వచ్చాయి. సాయి బాబాకు పెద్ద పెద్ద వారి అండదండలుండడం వలన అతనిపై ఫిర్యాదులను సరిగా పరిశోధంచడంలేదనేది విమర్శ. సాయిబాబాకు ఉన్న అసాధారణమైన ప్రతిష్ట వల్లనే లేనిపోని అపవాదులు వస్తున్నాయనీ, ఇవి నిష్పాక్షికమైన పరిశోధనలో నిలబడవనీ స్పందన. సాయి బాబా ప్రచారం కోసం ఎప్పుడూ ప్రయత్నించలేదనీ, పాశ్చాత్యులు తమకున్న అపోహలతో ఇలాంటి నిందలకు ఒడిగడుతున్నారనీ ప్రముఖ పాత్రికేయుడు కుష్వంత్ సింగ్ అన్నాడు.[67] [111][107] [112] అలాగే సాయిబాబాను నమ్ముకొన్న ముగ్గురు వ్యక్తులు వివిధ సందర్భాలలో ఆత్మహత్య చేసుకోవడం పై గురించి కూడా పలు వివాదాలున్నాయి. [113]
సాధారణంగా ఇటువంటి విమర్శలకు సాయిబాబా స్పందించడం జరుగలేదు. కాని 2000లో ఒక ఉపన్యాసంలో 'కొందరు ధన ప్రలోభాలకు లోబడి ఇటువంటి అపనిందలు వేస్తున్నారు' అని చెప్పాడు.[114] [115] [107][107]
2001 డిసెంబరులో అటల్ బిహారీ వాజపేయి (అప్పటి ప్రధాన మంత్రి), పి.ఎన్.భగవతి ( సుప్రీం కోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి), రంగనాధ మిశ్రా (జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్‌పర్సన్, సుప్రీం కోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి), నజ్మా హెప్తుల్లా (ఇంటర్-పార్లమెంటరీ యూనియన్ ప్రెసిడెంట్, య.ఎన్.డి.పి. ప్రముఖ మానవ అభివృద్ధి దౌత్యవేత్త), శివరాజ్ పాటిల్ (లోక్ సభ పూర్వ స్పీకర్, కేంద్ర కాబినెట్ మంత్రి) కలసి సంతకం చేసిన అధికారిక లేఖను పబ్లిక్‌గా విడుదల చేశారు. ఇందులో సాయబాబాకు వ్యతిరేకంగా వస్తున్న అపనిందల దాడి "అసంబద్ధం, నిరాధారం, బాధ్యతా రహితం" అని వాటిని ఖండించారు.[116]
బిల్ ఐట్కిన్ అనే సాయి భక్తుడు, ధార్మిక విశ్లేషకుడు, యాత్రికుడు,"Sri Sathya Sai Baba: A life"
అనే పుస్తక రచయిత చెప్పిన ప్రకారం బాబా మీద అపనిందలు అధికంగా బాధ్యతా
రహితమైనవి, దురుద్దేశ్య పూర్వకమైనవి. పరిశిలనకు నిలవనివి. బి.బి.సి. వంటి
ఛానళ్ళు ఈ విషయంపై దృష్టి కేంద్రీకరించడానికి కారణం 'చర్చి' వ్యవస్థకు
పోటీ నిలవ గలిగే ఉద్యమాల పట్ల వారికున్న అనాదరణా భావమే. బాబాను
విమర్శించేవారు ఎక్కువైనప్పుడల్లా బాబాను ఆరాధించే వారు మరింతగా
పెరుగుతున్నారు. [117]
ముఖ్యంగా లైంగిక ప్రవర్తన గురించిన బి.బి.సి.లో వచ్చిన నిందలు పూర్తిగా
ఆధార రహితమని అశోక్ భగాని వివరించాడు. ఎందుకంటే ప్రైవేటు దర్శన సమయంలో
కుటుంబ సభ్యులు గాని, మిత్రులు గాని తప్పక భక్తునికి తోడుగా ఉంటుంటారు.[118] కేవలం ఇద్దరు పాశ్చాత్యుల కధనం ఆధారంగానే Secret Swami అనే బిబిసి డాక్యుమెంటరీ తయారయ్యిందనీ, తన దీర్ఘకాలిక పరిశీలన ప్రకారం అటువంటి ఘటనలకు అవకాశమే లేదనీ మరొక విద్యార్ధి వివరించాడు.[118]
పుట్టపర్తి ఆశ్రమం సెక్రటరీ కె.చక్రవర్తి ఇటువంటి నిందలపై
వ్యాఖ్యానించడానికి నిరాకరించాడు. మహా పురుషుల జీవితాలలో వివాదాలు
రాకపోలేదనీ, ఇదంతా బాబా లీల అనీ, వివాదాలు వచ్చినా బాబా పట్ల ఆరాధన
పెరుగుతూనే ఉన్నదనీ బాబా అనువాదకుడు కుమార్ అన్నాడు .[109].
తాను పరిశీలించిన ప్రకారం బాబా ప్రవర్తనలో ఏ మాత్రం అసభ్యత లేదనీ, తాను
స్వయంగా బాబా అసాధారణ శక్తులను చూచాననీ డెన్మార్క్‌కు చెందిన తోర్‌బ్జార్
మెయెర్ అన్నాడు.[119]
2007 జనవరిలో ఆంధ్ర ప్రదేశ్‌ను విభజించడం, తెలంగాణాను ఏర్పరచడం పాపమని సత్యసాయిబాబా అన్న మాటలు స్థానికంగా రాజకీయ దుమారాన్ని సృష్టించాయి.[120]. ఇందుకు నిరసనగా తెలంగాణా రాష్ట్ర సమితి నాయకుడు కె.చంద్రశేఖరరావు, ఇతర తెలంగాణా వాదులు బాబాను తీవ్రంగా విమర్శించారు. పెద్దపెట్టున నిరసన ప్రదర్శనలు జరిగాయి. బాబా అనుయాయుల ద్వారా ప్రతి ప్రదర్శనలు కూడా జరిగాయి. [121] [122]
<ref> tag; no text was provided for refs named divinedownfall