ఆహ్వానం : తెలుగు వికీపీడియా సదస్సు 2020

13 views
Skip to first unread message

kasyap

unread,
Feb 4, 2020, 6:42:55 AM2/4/20
to తెలుగువికీ
నమస్కారం,

తెలుగు భాషాభిమానులైన మీఅందరినీ ఈ శనివారం 08 Feb 2020 న ఉదయం తొమ్మిది గంటలకు ఐఐఐటి గచ్చిబౌలి క్యాంపస్ హైదరాబాద్ లో ప్రారంభం అయ్యే వికీపీడియా సదస్సు 2020 కు సాదరంగా ఆహ్వానిస్తున్నాము. మీకు తెలిసిన తెలుగు మిత్రులకు , తెలుగు భాషా ప్రేమికులకు ఈ సదస్సు గురించి తెలియచేయండి .

ఇందులో పాల్గొనటానికి ఈ గూగుల్ ఫారం లో మీ వివరాలు ఇవ్వగలరు https://forms.gle/8pnjBV9HeAYMWdFf7
Hide quoted text

వికీపీడియా గురించి తెలియని ఇంటర్నెట్ వాడుకదారులు ఉండరు అన్న మాట అతిశయోక్తి అనిపించేంతగా వికీ మనకు దగ్గరయింది. ఆంగ్లంలో ప్రతి వాడుకరి దాదాపు ఏ కొత్త విషయమై తెలుసుకోవాలన్నా వికీ నే సందర్శిస్తారు అయితే తెలుగు వారిలో (తెలుగు వికీపీడియా te.wikipedia.org ) తెవికీ ఇంకా చాలా ప్రాచుర్యం పొందాల్సి ఉంది వికీపీడియా ఒక్క విజ్ఞానసర్వస్వమే కాక ఇంకా మరెన్నో రూపాలుగా మనకు ఉపయోగపడుతుంది. కొందరికి యాత్రాదర్శినిగా, కొందరికి ఏదో ఒక విషయమై ప్రమాణంగా పరిగణించబడుతుంది ఇలా చెప్పుకుంటూ పొతే అన్ని రకాలుగా వికీ ని మనం వాడుకోవచ్చు వికీపీడియా మరియు అనుబంధ కార్యక్రమాలను ఆంగ్ల మాధ్యమం వారు విరివిగా వాడుకుంటారు.

మన తెలుగులో సమాచారం ఏది కావాలనుకున్నా తెలుగు వికీపీడియాలో చదువుకోవాలి, ఈ బ్రహాత్తర కార్యక్రమము కోసం అందరి సహకారం కావాలి.

మనం వికీపీడియాలో చేరి మన చరిత్ర, సంస్కృతి, ప్రముఖ వ్యక్తులు, భాష, మన నగరాలు, పట్టణాలు, గ్రామాలు, ఆహారం, పురాణాలు, లలిత కళలు, రచయితలు, విజ్ఞాన శాస్త్రం, సాంఘిక, వైద్య శాస్త్రం, జీవరాశులు, పుస్తకాలు, రాజ్యాంగ వ్యవస్థ ఇలా ఎన్నో విషయాలపై భావితరాల వారికి అందించటానికి భారత భాషలలో ముఖ్యముగా తెలుగు వికీపీడియా అభివృద్ధికి ఐఐఐటి హైదరాబాద్‌ కూడా కృషిచేస్తోంది.


ఈ కార్యక్రమము లో భాగంగా “తెలుగు వికీపీడియా సదస్సు 2020” ను ఉదయం 9 గంటల నుండి మధ్యాన్నం 1:00 గంట వరకు నిర్వహిస్తున్నాము. ఈ సదస్సులో ప్రొఫెసర్ రాజ్ రెడ్డి, కార్నిగి మేలోన్ యూనివర్సిటీ ,పిట్స్ బర్గ్, ట్యూరింగ్ అవార్డు గ్రహీత, చైర్మన్ ఐఐఐటి హైదరాబాద్,

డా. జయప్రకాశ్ నారాయణ్ , ప్రొఫెసర్ కె. నాగేశ్వర్, ఉస్మానియా యూనివర్సిటీ, శ్రీ మామిడి హరికృష్ణ (భాష మరియు సంస్కృతిక శాఖ సంచాలకులు, తెలంగాణ ప్రభుత్వం) వక్తలుగా పాల్గొంటున్నారు.
మీ రాకను తెలియజేస్తూ -

RSVP - వాట్సాప్ / ఎస్ యమ్ ఎస్ - 99592 63974 / 93965 33666

ఇమెయిల్ ఐడి - tew...@iiit.ac.in

Reply all
Reply to author
Forward
0 new messages