ఈనాడు 6 మార్చి 2012 హైదరాబాదు ఎడిషన్లో తెవికీ గురించిన వ్యాసం "అంతర్జాలంలో తెలుగు విజ్ఞానం"

16 views
Skip to first unread message

Arjuna Rao Chavala

unread,
Mar 6, 2012, 12:57:47 PM3/6/12
to telug...@googlegroups.com

అంతర్జాలంలో తెలుగు విజ్ఞానం

* వికీపీడియా అభివృద్ధిలో నగర వాసులు
న్యూస్‌టుడే, కవాడిగూడ
మీరు చిన్నపుడు కోతికొమ్మచ్చి... వామనగుంటలు... అష్టాచెమ్మా.. గిల్లీదండ ఆడుకున్నారా.. అయితే మీరు అదృష్టవంతులే. నేటి తరం పిల్లలకు ఆటల సంగతి సరే కనీసం వాటిపేర్లు కూడా చాలామందికి తెలియవు. ఆవకాయ నుంచి అంతరిక్షం దాకా అటుకుల నుంచి అణుబాంబు దాకా ఇలా ప్రపంచంలో అనేక రంగాలకు సంబంధించిన అనేకానేక విషయాలు ఉంటాయి. వాటిని భవితరాలకు అందించాలంటే కొందరు పూనుకుని రాసిపెట్టాలి. రాసినవన్నీ క్రోడీకరించి విజ్ఞాన సర్వస్వంగా తయారుచేయాల్సిన అవ

గమనిక: తెవికీ కి సంబంధించిన వార్తని సమాచారనిమిత్తం పంచుకొనడమైనది.

ఈ ప్రచురణకు  ఈనాడు పాత్రికేయులకు సహకరించిన వికీపీడియన్ రాజశేఖర్ గారికి ధన్యవాదాలు.

అర్జున

సరం ఉంటుంది. తెలుగులో విజ్ఞాన సర్వస్వాలు అరుదు. అందులోనూ ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా లాంటి బృహత్తర విజ్ఞాన సర్వస్వాలు అసలే లేవు. ఆధునిక సమాచారం విప్లవ యుగంలో ఎలాంటి సమాచారం కావాల్సి వచ్చినా... వెంటనే అంతర్జాలం మీట నొక్కుతాము. అయితే అంతా ఆంగ్లమయం అయిందని నొచ్చుకునే మనసులు ఉంటాయి. సరిగ్గా ఇలాంటి వారికి ఊరడించేందుకే తెలుగు వికీపీడియా(తెవికీ) విజ్ఞాన సర్వస్వం అందుబాటులోకి వచ్చింది. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. టీఈ. వికీపీడియా. ఓఆర్‌జీలోకి ప్రవేశిస్తే చాలు ప్రపంచవ్యాప్త సమాచారంతో పాటు కొన్నివేల వ్యాసాలు అందులో దర్శనం ఇస్తాయి. ఇందులో ప్రధాన భూమిక పోషిస్తున్నది హైదరాబాదీయులే.

అమెరికాకు చెందిన జిమ్మీవేల్స్‌ 2001 సంవత్సరంలో ఒక ఆలోచన వచ్చింది. ప్రపంచంలో ఎవరికి తెలిసిన సమాచారాన్ని వారు పొందు పర్చగలిగే, దిద్దుబాటు చేయగలిగే, ఉచితంగా చదువుకోగలిగే విజ్ఞాన సర్వస్వం తేవాలని ఆశించారు. వికీపీడియా అని నామకరణం చేసి ఆచరణలో అక్షరాకృతులను దిద్దటం ఆరంభించారు. తొలుత ఆంగ్ల భాషలో వికీపీడియా సైట్‌ను ప్రారంభించారు. సభ్యులుగా చేరిన వారు స్వచ్ఛందంగా ఎవరికి వారు తెలిసిన సమాచారాన్ని వ్యాసాల రూపంలో చేర్చటం మొదలుపెట్టారు. అనతికాలంలోనే విపరీత ఆదరణ లభించింది. ప్రపంచవ్యాప్త సమాచారాన్ని సేకరించి భద్రపర్చగలమనే విశ్వాసం కలిగిన మీదట ఇతర భాషలకు విస్తరించారు. రష్యా, చైనా, జర్మనీ, జపనీస్‌, స్పానిష్‌, ఫ్రెంచి, ఇటలీ దేశభాషల్లో సైట్లు వచ్చాయి. విపరీత ఆదరణ లభించింది. అదే స్పూర్తితో భారతీయ భాషల్లో సైతం అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం 200 పైగా ప్రపంచ భాషలలో వికీపీడియా ఉందంటే ఆశ్చర్యం కలుగుతుంది.

ఆలస్యంగా వెలిగిన ీతెలుగు'
* అమెరికా బోస్టన్‌ నగరంలో సమాచారం సాంకేతిక నిపుణుడుగా పనిచేస్తుండే వెన్న నాగార్జున అనే ప్రవాసభారతీయుడు ీపద్మ' అనే లిప్యాంతరీకరణ సాఫ్ట్‌వేర్‌ తయారు చేసి అందించటంతో నిర్వాహకులు 2003 డిసెంబరు 10 న తెలుగులో వికీపీడియాను అందుబాటులోకి తెచ్చారు. 2004 వరకు కనీసం ఒక్కవ్యాసం కూడా అందులోకి చేరలేదు. నాగార్జున తిరిగి ీరచ్చబండ' శీర్షికతో విస్త్రత ప్రచారం చేశారు. దాంతో మిచిగాన్‌ విశ్వవిద్యాలయం ఆచార్యులు రావ్‌ వేలూరి, కట్టామూర్తి లాంటి విద్యాధికులు శ్రీనాధుడు రచించిన పద్యాలు, శ్రీకృష్ణదేవరాయలు వర్ణించిన ఊరగాయ రుచులు లాంటి వ్యాసాలను చేర్చారు. కాలిఫోర్నియా నివాసి వాకా కిరణ్‌, హైదరాబాద్‌ వాసి చావా కిరణ్‌, కూకట్‌పల్లికి చెందిన మాకినేని ప్రదీప్‌, తుమ్మల శిరీశ్‌, వైజా సత్యలు పట్టుదలతో వ్యాసాలను రాసి రాయించి చేర్చారు. దాంతో 2005 నాటికి 2000 వ్యాసాలు తెవికీలో చేరాయి. వీరవెంకట చౌదరి, కాజాసుధాకర్‌, కామేశ్వర్‌రావు, శ్రీనివాస్‌రావు, నవీన్‌, బ్లాగేశ్వరుడు, చంద్రకాంత్‌, నిస్సార్‌, సుజాత, రాజశేఖర్‌ ఇంకా అనేకమంది కృషిచేయటంతో ప్రస్తుతం అద్భుతమైన తెలుగులో అన్వేషణ సైటుగా అవతరించింది.

తెలుగు వికీపీడియా(తెవికీ) పండితులే కాదు పామరులు కూడా రాయవచ్చు. ఉచితంగా చదువుకోవచ్చు. ప్రింట్‌ తీసుకోవచ్చు. అంతేకాదు డౌన్‌లోడ్‌ చేసుకుని పుస్తకాలుగా ముద్రించుకుని మార్కెట్‌లో అమ్ముకోవచ్చు. నిర్వాహకులు ఎలాంటి అభ్యంతరాలు చెప్పరు. అయితే వికీపీడియా సౌజన్యంతో అనే మాటను ముద్రించాలని మాత్రమే కోరుతున్నారు.

ఏముందంటే..
చరిత్ర, సంస్కృతి, సంగీతం, సాహిత్యం, రచయితలు, ప్రముఖులు, సినిమాలు, భాష, గ్రామాలు, పట్టణాలు, నగరాలు, మహానగరాలు, రాజకీయాలు, సైన్సు, వైద్యశాస్త్రం, నదులు, క్రీడలు ఇలా అనేకానేక విషయాలు పొందుపర్చి ఉన్నాయి. ఇంత సమాచారం అందిస్తున్న సైటుకు ఎంత ఖర్చు అవుతుందో ఊహించటం కష్టమే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లు సుమారు 13 వేల మంది ఇందులో సభ్యులుగా ఉన్నారు. వారంతా ఉచితంగా రాస్తున్నారు. ఉచితంగానే సాఫ్ట్‌వేర్లు తయారుచేసి ఇస్తున్నారు. 44 వేలకు పైగా వ్యాసాలు అందుబాటులో ఉన్నాయి. పగలనక రేయనక రాస్తూనే ఉన్నారు.

* సభ్యులుగా చేరేవారు ఐదునిముషాల్లో టైపు నేర్చుకోగలుగుతారు.తొలుత ఏం రాయాలి అనుకుంటున్నారా. ముందుగా మీ ఊరి విషయాలు రాయండి. తరువాత మీకు తోచిన విషయాలు రాస్తూ వెళ్లండి. తీరిక సమయాల్లోనే రాయండి. వాటిని సరి దిద్దేందుకు అనుభజ్ఞులైన వారు ఉంటారు.


దీని పిడిఎప్ కాపీ జతచేయబడింది.


గమనిక: తెవికీ కి సంబంధించిన వార్తని సమాచారనిమిత్తం పంచుకొనడమైనది.

ఈ ప్రచురణకు  ఈనాడు పాత్రికేయులకు సహకరించిన వికీపీడియన్ రాజశేఖర్ గారికి ధన్యవాదాలు.

అర్జున

Eenadu20120206HyderabadEdition.pdf

Arjuna Rao Chavala

unread,
Mar 6, 2012, 1:01:39 PM3/6/12
to telug...@googlegroups.com
ఇంతకు ముందు  పంపిన వార్తలో గమనిక మధ్యలో వచ్చినందులకు క్షమించండి. దానిని సరిచేసి మరల పంపుతున్నాను గమనించగలరు.
అర్జున

---------- Forwarded message ----------
From: Arjuna Rao Chavala <arjun...@gmail.com>
Date: 2012/3/6
Subject: ఈనాడు 6 మార్చి 2012 హైదరాబాదు ఎడిషన్లో తెవికీ గురించిన వ్యాసం "అంతర్జాలంలో తెలుగు విజ్ఞానం"
To: telug...@googlegroups.comఅంతర్జాలంలో తెలుగు విజ్ఞానం

* వికీపీడియా అభివృద్ధిలో నగర వాసులు
న్యూస్‌టుడే, కవాడిగూడ
మీరు చిన్నపుడు కోతికొమ్మచ్చి... వామనగుంటలు... అష్టాచెమ్మా.. గిల్లీదండ ఆడుకున్నారా.. అయితే మీరు అదృష్టవంతులే. నేటి తరం పిల్లలకు ఆటల సంగతి సరే కనీసం వాటిపేర్లు కూడా చాలామందికి తెలియవు. ఆవకాయ నుంచి అంతరిక్షం దాకా అటుకుల నుంచి అణుబాంబు దాకా ఇలా ప్రపంచంలో అనేక రంగాలకు సంబంధించిన అనేకానేక విషయాలు ఉంటాయి. వాటిని భవితరాలకు అందించాలంటే కొందరు పూనుకుని రాసిపెట్టాలి. రాసినవన్నీ క్రోడీకరించి విజ్ఞాన సర్వస్వంగా తయారుచేయాల్సిన అవ సరం ఉంటుంది. తెలుగులో విజ్ఞాన సర్వస్వాలు అరుదు. అందులోనూ ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా లాంటి బృహత్తర విజ్ఞాన సర్వస్వాలు అసలే లేవు. ఆధునిక సమాచారం విప్లవ యుగంలో ఎలాంటి సమాచారం కావాల్సి వచ్చినా... వెంటనే అంతర్జాలం మీట నొక్కుతాము. అయితే అంతా ఆంగ్లమయం అయిందని నొచ్చుకునే మనసులు ఉంటాయి. సరిగ్గా ఇలాంటి వారికి ఊరడించేందుకే తెలుగు వికీపీడియా(తెవికీ) విజ్ఞాన సర్వస్వం అందుబాటులోకి వచ్చింది. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. టీఈ. వికీపీడియా. ఓఆర్‌జీలోకి ప్రవేశిస్తే చాలు ప్రపంచవ్యాప్త సమాచారంతో పాటు కొన్నివేల వ్యాసాలు అందులో దర్శనం ఇస్తాయి. ఇందులో ప్రధాన భూమిక పోషిస్తున్నది హైదరాబాదీయులే.
Eenadu20120206HyderabadEdition.pdf
Reply all
Reply to author
Forward
0 new messages